ఎల్లకాలం హైదరాబాద్లోనే ఏపీని ఉంచలేం | cannot continue ap capital in hyderabad for ever, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

ఎల్లకాలం హైదరాబాద్లోనే ఏపీని ఉంచలేం

Jun 26 2014 2:31 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఎల్లకాలం హైదరాబాద్లోనే ఏపీని ఉంచలేం - Sakshi

ఎల్లకాలం హైదరాబాద్లోనే ఏపీని ఉంచలేం

ఎల్లకాలం హైదరాబాద్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని కొనసాగించడం సాధ్యం కాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.

ఎల్లకాలం హైదరాబాద్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని కొనసాగించడం సాధ్యం కాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరితగతిన రాజధాని నగరాన్ని నిర్మించుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. రాజధాని ఎక్కడ ఏర్పాటుచేసుకోవాలన్న విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రే నిర్ణయించుకోవాలని తెలిపారు. అయితే రాజధాని నిర్మాణం కోసం మాత్రం కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందని అన్నారు.

రైలు ఛార్జీల పెరుగుదలను ప్రజలు అర్థం చేసుకున్నారని, గత ప్రభుత్వ పాలనలో లోపాల వల్లే రైలు ఛార్జీలు పెరిగాయని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రాబోయే సవాళ్లను కూడా తాము అధిగమించి ముందుకెళ్తామని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement