బీజేపీ సభ్యత్వ నమోదులో ‘గూడెం’ టాప్ | BJP Membership Registration top in Palakollu | Sakshi
Sakshi News home page

బీజేపీ సభ్యత్వ నమోదులో ‘గూడెం’ టాప్

May 5 2015 3:09 AM | Updated on Mar 28 2019 8:41 PM

భారతీయ జనతాపార్టీ సభ్యత్వ నమోదులో జిల్లాలో తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు పట్టణాలు

పాలకొల్లు :భారతీయ జనతాపార్టీ సభ్యత్వ నమోదులో జిల్లాలో తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు పట్టణాలు వరుసగా ఒకటి, రెండు, మూడు స్థానాల్లో నిలిచాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. సోమవారం పాలకొల్లు పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలు పట్టణ కమిటీ వర్మకు అందచేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లిగూడెంలో 62 వేలు, భీమవరంలో 55 వేలు, పాలకొల్లులో 40 వేలు సభ్యులుగా చేరారని శ్రీనివాసవర్మ వివరించారు. సమయం తక్కువగా ఉండడం, మిస్డ్‌కాల్ విధానం కొంత క్లిష్టమైనందున సభ్యత్వ నమోదు సంఖ్య పెంచే అవకాశం దక్కలేదన్నారు.
 
  పాల కొల్లు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జి పార్టీలో చేరిన తరువాత ఎక్కువ మంది సభ్యులుగా చేరారన్నారు. జిల్లాలో మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమం ఈనెల 15వ తేదీన ప్రారంభించనున్నామని దీని ద్వారా పార్టీని గ్రామాల్లో సైతం ప్రజలకు చేరువ చేసే అవకాశం కలుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి(బాబ్జి) మాట్లాడుతూ సభ్యత్వ నమోదుకు గడువు పెంచితే సభ్యులు పెరుగుతారన్నారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మామిడి శివయ్య సభ్యత్వ నమోదు పుస్తకాలను వర్మకు అందచేశారు. పార్టీ జిల్లా నాయకుడు రావూరి సుధ, పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నాళం బాబి, జక్కంపూడి కుమార్, చేగొండి సూర్యప్రకాష్, శిడగం పాపారావు, ఉన్నమట్ల కబర్ధి, కోరాడ సూరిబాబు, వేరుకొండ దుర్గాప్రసాద్, ఆచంట వాసు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement