కార్పొరేట్ శక్తులు, రియల్టర్ల కోసమే 'భూసేకరణ' | B V Raghavulu takes on modi government | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ శక్తులు, రియల్టర్ల కోసమే 'భూసేకరణ'

Dec 30 2014 3:28 PM | Updated on Aug 21 2018 9:38 PM

కార్పొరేట్ శక్తులు, రియల్టర్ల కోసమే 'భూసేకరణ' - Sakshi

కార్పొరేట్ శక్తులు, రియల్టర్ల కోసమే 'భూసేకరణ'

కార్పొరేట్ శక్తులు, రియల్టర్ల కోసమే 2013 - భూ సేకరణ చట్టానికి సవరణలు చేస్తూ నరేంద్ర మోదీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసిందని సీపీఎం పాలిటిబ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ఆరోపించారు.

విజయవాడ: కార్పొరేట్ శక్తులు, రియల్టర్ల కోసమే 2013 - భూ సేకరణ చట్టానికి సవరణలు చేస్తూ నరేంద్ర మోదీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసిందని సీపీఎం పాలిటిబ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ఆరోపించారు. దీని వెనక ఏపీ ప్రభుత్వం ఒత్తిడి ఉందని విమర్శించారు. ఆ ఆర్డినెన్స్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

లేకుంటే ఆందోళన తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధాని కోసం సేకరిస్తున్న 35 వేల ఎకరాల భూసేకరణలో ప్రజా ప్రయోజనాలు ఏమీ లేవన్నారు. రాజధాని అనేది ప్రజల పాలన కోసం తప్పతే రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమో లేక రాజకీయ తాబేదారుల కోసమో ఏర్పాటు చేయకుడదని ప్రభుత్వానికి ఈ సందర్భంగా బి.వి.రాఘవులు హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement