అమ్మా.. బాగున్నారా! 

Asha workers and ANMs and PHC doctors Visiting Everybody in Home Isolation - Sakshi

హోం ఐసొలేషన్‌లో ఉన్న ప్రతిఒక్కరి ఇంటికీ వెళ్లి రోజూ పలకరింపు 

మధుమేహం, గుండెజబ్బులతో ఉన్న వారినీ గుర్తింపు 

దీని ఆధారంగా మరింత జాగ్రత్తలు తీసుకోనున్న సర్కారు 

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన నేపథ్యంలో రెడ్‌ జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో  ఆశా వర్కర్లతో కలసి పర్యటిస్తున్న మంత్రి పేర్ని నాని. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మంత్రి ఎవరూ భయపడవద్దని, కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోందని ధైర్యం చెప్పారు.     

సాక్షి, అమరావతి: విదేశాలకు వెళ్లి వచ్చిన వారు.. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వాళ్లు.. వీరితో సన్నిహితంగా మెలిగిన వాళ్లు.. కరోనా వైరస్‌ అనుమానితులు.. ఇలా గత కొన్ని రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సీ వైద్యులు ఎంతో ఊరట కల్పిస్తున్నారు. వారికి నిత్యం ధైర్యం చెబుతూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ప్రతిరోజూ వారి ఇంటికే వెళ్లి పలకరిస్తున్న తీరు బాధితులకు కొండంత భరోసానిస్తోంది. 

వీరు ఇంటింటికీ వెళ్లి ఏం చేస్తున్నారంటే.. 
► ఉదయం 8 గంటల నుంచి ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు హోం ఐసొలేషన్‌లో ఉన్న వారి ఇంటి వద్దకు వెళ్లి భౌతిక దూరం పాటిస్తూ వారిని పేరుపేరునా పలకరిస్తారు. 
► అమ్మా బాగున్నారా.. అయ్యా బాగున్నారా.. దగ్గు జలుబు ఏమైనా ఉన్నాయా అంటూ వివరాలు సేకరిస్తున్నారు. 
► దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలు ఉంటే తెలుసుకోవడం, ఆ లక్షణాలున్న వారి పేర్లు నమోదు చేసుకుని పీహెచ్‌సీ డాక్టరుకు సమాచారమిస్తారు. 
► చిన్నచిన్న వ్యాధులకైతే ఏఎన్‌ఎంలే మందులు అందజేస్తారు. 
► విదేశీ ప్రయాణీకులకు సంబంధించి రోజూ 29 వేల ఇళ్లకు వెళ్లి వాకబు చేస్తున్నారు. 
► మరో 2500 ఇళ్లకు పైగా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి తరఫు బంధువుల ఇళ్లకు వెళ్లి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. 
► ఇలా రాష్ట్రవ్యాప్తంగా 40వేల మంది ఆశా కార్యకర్తలు, మరో 15వేల మంది ఏఎన్‌ఎంలు పనిచేస్తున్నారు.  
► వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది వీరికి అదనం. 

నేటి సాయంత్రానికి గణన పూర్తి 
రాష్ట్రంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి గణన నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రానికల్లా వయసుల వారీగా అందరి వివరాలు ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు సేకరిస్తారు. మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక రోగాలున్న వారి సమాచారం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. అలాగే, ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా 108, 104కు ఫోన్‌ చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

31-05-2020
May 31, 2020, 21:30 IST
చనిపోయిన కోవిడ్‌ బాధితుడు బతికే ఉన్నాడని చెప్పిన ఆస్పత్రి యాజమాన్యం.. మరోసారి అతను చనిపోయినట్టు చెప్పి పరువు తీసుకుంది.
31-05-2020
May 31, 2020, 19:33 IST
ప్రస్తుతం డింకో సింగ్‌ కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
31-05-2020
May 31, 2020, 18:07 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మొదటితో పోలిస్తే రోజులు గడుస్తున్నా కొద్ది వైరస్‌ వ్యాప్తి...
31-05-2020
May 31, 2020, 16:39 IST
సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదోవిడత లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోనూ...
31-05-2020
May 31, 2020, 16:29 IST
ఈ క్లిష్ట సమయంలో ఢిల్లీ ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా
31-05-2020
May 31, 2020, 15:16 IST
సాక్షి, ముంబై : భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తిపై శివసేన తీవ్ర ఆరోపణలు చేసింది. దేశంలో కరోనా విజృంభణకు గుజరాత్‌లో నిర్వహించిన ‘నమస్తే...
31-05-2020
May 31, 2020, 14:20 IST
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వైరస్‌ కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్‌తో పోరాడి...
31-05-2020
May 31, 2020, 13:33 IST
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 98 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య...
31-05-2020
May 31, 2020, 13:24 IST
డెహ్రాడున్: క‌రోనా వైర‌స్‌కు త‌న ‌త‌మ తార‌త‌మ్య బేధాలు లేవు. సామాన్యుడి నుంచి పాల‌కుల వ‌ర‌కూ ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌కుండా అంద‌రినీ...
31-05-2020
May 31, 2020, 12:30 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో జనవరి 22 నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు 40,184 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి....
31-05-2020
May 31, 2020, 12:05 IST
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు పాతబస్తీ, మలక్‌పేట్, వనస్థలిపురం, జియాగూడ, కుల్సుంపురలకే పరిమితమైన కరోనా వైరస్‌ తాజాగా కొత్త కాలనీల్లోనూ...
31-05-2020
May 31, 2020, 11:41 IST
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌పై పోరులో భారత ప్రజల సేవా శక్తి కనిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆదివారం...
31-05-2020
May 31, 2020, 11:31 IST
భోపాల్‌: క‌రోనా వారియర్‌ స్పృహ తప్పి ప‌డిపోతే ఏ ఒక్క‌రూ చ‌లించ‌లేదు. అరగంట‌కు పైగా రోడ్డు మీద ప‌డి ఉన్న స‌ద‌రు పారామెడిక‌ల్ సిబ్బందికి...
31-05-2020
May 31, 2020, 10:18 IST
చెన్నై:  లాక్‌డౌన్ 5.0 సోమవారం నుంచి ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్రభుత్వం రాష్ట్రంలో రాక‌పోక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో రేప‌టి నుంచి ...
31-05-2020
May 31, 2020, 09:53 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,380 కరోనా కేసులు...
31-05-2020
May 31, 2020, 06:01 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా రోజు రోజుకూ విస్తరిస్తుండడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స అందించడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందంటూ...
31-05-2020
May 31, 2020, 05:37 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల రేటు గణనీయంగా మరింత తగ్గింది. దేశవ్యాప్తంగా సగటు మరణాలు 2.86 శాతంగా ఉంటే.....
31-05-2020
May 31, 2020, 04:57 IST
సాక్షి ముంబై/షిర్డీ: మహారాష్ట్రలో ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా...
31-05-2020
May 31, 2020, 04:38 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ వైరస్‌ వ్యాప్తి వేగంగా పెరిగిపోతోంది. కరోనా పాజిటివ్‌...
31-05-2020
May 31, 2020, 04:26 IST
కరోనా మహమ్మారి భారత్‌ను వణికిస్తోంది. లాక్‌డౌన్‌ని కట్టుదిట్టంగా అమలు చేసినప్పటికీ రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరికొన్ని...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top