
ఢిల్లీ: ఏపీ భవన్ మీడియా వ్యవహారాల ఓఎస్డీగా సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ యాదవ్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారిక జీవో విడుదల చేశారు. మీడియా రంగంలో 24 ఏళ్లుగా విశేష సేవలందించిన అరవింద్ యాదవ్ ఇక మీదట ఏపీ భవన్ కేంద్రంగా విధులు నిర్వర్తించనున్నారు. ఆయన తెలుగు, ఇంగ్లీష్, హిందీ మీడియా సంస్థలలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. జాతీయ మీడియా సంస్థలు ఆజ్ తక్, ఐబిఎన్ 7లో దక్షిణ భారత వ్యవహారాల పాత్రికేయుడిగా పని చేశారు. టీవీ9, సాక్షి, యువర్ స్టోరీ మీడియాల్లోనూ కీలక బాధ్యతలు చేపట్టారు. అరవింద్ పలు హిందీ పుస్తకాలను రచించారు.