
ఆగ్నేయాసియా ముఖద్వారంగా ఏపీ: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలోనే ఆర్థిక కేంద్రంగా మారుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆగ్నేయాసియా ముఖద్వారంగా తీర్చిదిద్దుతాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన విశాఖపట్నంలో మౌలిక సదుపాయాల మిషన్ను శుక్రవారం ప్రారంభించారు. శ్రీకాకుళం గ్యాస్ పైపులైన్ ఏర్పాటుకు జీఎంఆర్, జీవీకే, కోనసీమ పవర్ లాంటి సంస్థలతో ఒప్పందాలు కుదిరినట్లు చెప్పారు.
అలాగే కాకినాడ డీప్ వాటర్ పోర్టు విస్తరణకు కాకినాడ సీపోర్టు లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. దశలవారీగా 18 పోర్టుల నిర్మాణం, సరుకు రవాణా కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతుందని చంద్రబాబు చెప్పారు. మూడు మెగాసిటీలు, 12 స్మార్ట్ సిటీలతో ఆర్థిక కేంద్రంగా రాష్ట్రం రూపొందుతుందని ఆయన వివరించారు. 2029 నాటికి ప్రపంచంలోనే భారత్ ప్రథమస్థానంలో నిలుస్తుందని, తామిప్పుడు 2050 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని అన్నారు.