పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) అమల్లోకి వచ్చిన దాదాపు మూడేళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ అడ్వాన్సులను పెంచింది.
ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్
సాక్షి, అమరావతి: పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) అమల్లోకి వచ్చిన దాదాపు మూడేళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ అడ్వాన్సులను పెంచింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కారు, బైక్, మోపెడ్, సైకిల్, కంప్యూటర్ కొనుగోలు, వివాహానికి, విద్యా సంబంధిత, పండుగ ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి అడ్వాన్స్ తీసుకుని వాయిదాల పద్ధతిలో రుణం తీర్చవచ్చు. కారు కొనుగోలు కోసం రూ.27,700కు పైగా నెలసరి వేతనమున్న ఉద్యోగులు.. 15 నెలల మూల వేతనం లేదా రూ.4.50 లక్షలను అడ్వాన్స్‌గా తీసుకో వచ్చు. అదే రూ.37,000కు పైగా నెలసరి వేతనమున్న అధికారులు 15 నెలల మూల వేతనం లేదా రూ.6 లక్షలను అడ్వాన్స్‌గా పొందవచ్చు. మిగిలిన వాటికి కూడా ఇలాగే అడ్వాన్స్ మొత్తాలు పెరిగాయి.