23 దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులు సీజ్‌

AP RTA Officials Seized 23 Diwakar Travels Buses - Sakshi

సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌ రెడ్డికి రవాణా శాఖ అధికారులు గట్టి షాక్‌ ఇచ్చారు. దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన 23 బస్సులను ఆర్టీఏ అధికారులు గురువారం సీజ్‌ చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడస్తున్న దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులపై రవాణా శాఖ కమిషనర్‌ సీతారామాంజనేయులు, జాయింట్‌ కమిషనర్‌ ప్రసాద్‌ రావు ఆధ్వర్యంలోని అధికారులు పలు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారంగా టికెట్‌ ధరలు వసూలు చేస్తున్న 23 బస్సులను అధికారులు గుర్తించి సీజ్‌ చేశారు. 

అంతేకాకుండా దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన 23 ఇంటర్‌ స్టేట్‌ క్యారియల్‌ బస్సుల పర్మిట్లను కూడా రద్దు చేశారు. అదేవిధంగా నిబంధనలను అతిక్రమించినందుకు పలు కేసులు నమోదు చేశారు. అయితే దివాకర్‌ ట్రావెల్స్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయని అందులో భాగంగానే తనిఖీలు చేశామని, దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని జాయింట్‌ కమిషనర్‌ ప్రసాద్‌ రావు వెల్లడించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top