రాష్ట్రంలో 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాలు

AP Government Has Decided To Start Work On 5000 Health Sub Centres In The State In January - Sakshi

వచ్చే నెలలో పనులు ప్రారంభించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో నిరి్మంచాలని అధికారులకు సూచన

జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి ఆదేశం

2 వేల రోగాలకు ఆరోగ్యశ్రీ ‘పైలట్‌ ప్రాజెక్టు’ పశి్చమ గోదావరి నుంచి అమలు

మిగతా 12 జిల్లాల్లో 1,200 రోగాలకు ఆరోగ్యశ్రీ సేవలు

ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌ రోగులకు పూర్తి స్థాయి వైద్యం

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి జనవరి నుంచి పింఛన్లు

ఆస్పత్రుల్లో పారిశుధ్య కారి్మకుల జీతాలు జనవరి నుంచి రూ.16 వేలకు పెంపు

ఏప్రిల్‌ నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు మందుల సరఫరా

వైద్య, ఆరోగ్య రంగం ‘నాడు–నేడు’పై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాలు(హెల్త్‌ సబ్‌సెంటర్లు) నిర్మించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. మూడు దశల్లో వాటిని నిరి్మంచేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, తొలి విడత టెండర్లు వీలైనంత త్వరగా పిలిచి జనవరి 3 లేదా 4వ వారంలో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. వైద్య, ఆరోగ్య రంగంలో ‘నాడు–నేడు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి  జవహర్‌ రెడ్డి తదితరులు ఈ ఉన్నతస్థాయి సమీక్షలో పాల్గొన్నారు. జనవరి 1 నుంచి కొత్తగా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

వైద్య ఆరోగ్య రంగంపై మేనిఫెస్టోలో ఇచి్చన హామీల్లో ఇంత వరకు అమలు చేసిన, ఇక నుంచి అమలు చేయాల్సిన వాటిపై సీఎంకు అధికారులు వివరించారు. సబ్‌ సెంటర్లు, ఆస్పత్రులు, కొత్త మెడికల్‌ కాలేజీలు, కొత్తగా నిరి్మంచతలపెట్టిన కిడ్నీ, క్యాన్సర్‌ ఆస్పత్రులకు నిధుల సమీకరణ తదితర అంశాలపై సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు.  వైద్య, ఆరోగ్య శాఖలో ఇక నుంచి అమలు చేయాల్సిన కార్యక్రమాలకు ముఖ్యమంత్రి తేదీలు నిర్ధారించారు.  జనవరి 1 నుంచి కొత్త వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కార్డుల జారీని ప్రారంభించాలి. 2 వేల రోగాలకు ఆరోగ్యశ్రీ,ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా జనవరి 3 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అదే రోజు నుంచి మిగిలిన 12 జిల్లాల్లో 1,200 రోగాలకు ఆరోగ్యశ్రీని అమలు చేస్తారు. ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌ రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని సమావేశంలో సీఎం స్పష్టం చేశారు.  

జనవరి నుంచి పెన్షన్లు పొందే లబ్ధిదారులు
►తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా, హీమోఫిలియా, డయాలసిస్‌ రోగులకు రూ.10 వేల చొప్పున పెన్షన్లు  
►బోదకాలు, తీవ్ర అనారోగ్యంతో వీల్‌ చైర్లకు పరిమితమైన వారు, తీవ్ర పక్షవాతంతో బాధపడుతున్నవారికి పెన్షన్లు
►కుష్టు టవ్యాధితో బాధపడుతున్న వారికి నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్‌

వైద్య, ఆరోగ్య రంగంలో ‘నాడు–నేడు’ కార్యక్రమంపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

జనవరి నుంచి జీతాల పెంపు
ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల జీతాలు జనవరి నుంచి రూ.8 వేల నుంచి రూ.16 వేలకు పెంపు   కొత్త అంబులెన్స్‌లు మార్చి 2020 నాటికల్లా 1,060 కొత్త 104, 108 అంబులెన్స్‌ల కొనుగోలు  
పోస్టుల భర్తీ   వచ్చే ఏడాది మే చివరి నాటికి ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని పోస్టుల భర్తీ  

దివ్యాంగులకు వేగంగా సరి్టఫికెట్ల జారీ
దివ్యాంగుల కోసం నిర్వహించే సదరం క్యాంపుల్లో రద్దీని తగ్గించడానికి స్లాట్ల సంఖ్యను పెంచామని సీఎంకు అధికారులు తెలిపారు. గతంలో వారానికి కేవలం 2,715 స్లాట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 8,680 స్లాట్లను అందుబాటులోకి తెచ్చామని, బుక్‌ చేసుకున్న వారం రోజులకే ఇప్పుడు స్లాట్‌ దొరుకుతుందని అధికారులు వివరించారు.   

కంటి వెలుగు పథకం
కంటివెలుగులో ఇంతవరకూ 64,52,785 మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించగా.. 4,33,600 మందికి సమస్య ఉన్నట్టు గుర్తించామని అధికారులు తెలిపారు. వారిలో 3,59,396 మందిని రెండోదశ పరీక్షించగా.. 1,86,100 మందికి వైద్యం అవసరమని నిర్ధారించారు.  1,36,313 మందికి కంటిఅద్దాలు ఇవ్వాలని నిర్ణయించారు. 41,592 మందికి 5 శాతం పైగా దృష్టిలోపం ఉన్నట్టు నిర్ధారించి వారికి మళ్లీ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. 2 నుంచి 3 వేల మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించినట్లు అధికారులు సీఎంకు వెల్లడించారు. వృద్ధులకు కంటి పరీక్షలకు సంబంధించి స్క్రీనింగ్‌ ప్రారంభించాలని సీఎం జగన్‌ ఆదేశించారు.   

సూపర్‌ స్పెషాలిటీల్లో ఆరోగ్యశ్రీ సేవలు
నవంబర్‌ 1 నుంచి హైదరాబాద్‌లో 72, బెంగళూరులో 35, చెన్నైలోని 23 ఆస్పత్రుల్లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద సూపర్‌స్పెషాలిటీ సేవలు అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. డిసెంబర్‌ 2 నుంచి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స చేయించుకున్నవారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నామని తెలిపారు. డిసెంబర్‌ 15 నుంచి ఆస్పత్రుల్లో 510 రకాల మందులను అందుబాటులో ఉంచగా.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సదరం క్యాంపులు ఏర్పాటు చేశామని చెప్పారు.   

లబ్దిదారుల జాబితాను సచివాలయంలో ప్రదర్శించండి
పెన్షన్లు తీసుకుంటున్న, ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం పొందుతున్న లబి్ధదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలని సీఎం జగన్‌ ఆదేశించారు. పెన్షన్లు అందకపోయినా.. ఇతర సాయం రాకపోయినా ఎవరిని సంప్రదించాలి, ఎవరికి దరఖాస్తు చేయాలన్న అంశాల్ని సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. ‘ఏప్రిల్‌ నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం మందులు అందించాలి. నాడు – నేడు కింద చేపట్టే కార్యక్రమాలు నాణ్యంగా ఉండాలి. ఆస్పత్రుల్లో బెడ్లు, బాత్‌రూమ్స్, ఇతర సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి. ఈ విషయంలో ఎక్కడా రాజీపడటానికి వీల్లేదు. తీవ్రవ్యాధులతో బాధపడుతున్నవారికి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే పద్ధతి మరింత సులభతరం చేయాలి. ఏఎన్‌ఎం సాయంతో స్లాట్‌ బుక్‌ చేయించి, వెంటనే పరీక్షలు, సర్టిఫికెట్‌ జారీచేసేలా చూడాలి. దగ్గర్లో ఉన్న ఏరియా ఆస్పత్రుల్లోనే ఈ పరీక్షలు పూర్తికావాలి. రోగుల కోసం ప్రత్యేకంగా వాహన సదుపాయం ఏర్పాటు చేయాలి’ అని సీఎం ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top