ఏప్రిల్ నెల జీతాలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

సాక్షి, అమరావతి : లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్ నెల వేతనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్న పోలీసులు, వైద్య, ఆరోగ్యశాఖ, పారిశుద్ధ్య కార్మికులకు 100 శాతం జీతాలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. మిగిలిన ఉద్యోగులకు గత నెల మాదిరిగానే సగం జీతం చెల్లించనుంది. ఈ మేరకు ఆదివారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రభుత్వ పెన్షనర్లకు కూడా ఈ నెల పూర్తి పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలతో వీరికి 50శాతం పెన్షన్ మాత్రమే చెల్లించిన విషయం తెలిసిందే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి