కేసీఆర్‌కు సీఎం జగన్‌ శుభాకాంక్షలు | AP CM YS Jagan Wishes CM KCR On His Birthday | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

Feb 17 2020 12:47 PM | Updated on Feb 17 2020 1:39 PM

AP CM YS Jagan Wishes CM KCR On His Birthday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌కు దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని..  చిరకాలం ఆయురారోగ్యాలతో ఆయన ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. అదే విధంగా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సీఎం కేసీఆర్‌కు ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో.. ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని.. జాతికి సేవ చేస్తూనే ఉండాలని అభిలషించారు.

కేసీఆర్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రార్థిస్తున్నా- ప్రధాని నరేంద్ర మోదీ

కేసీఆర్‌కు చంద్రబాబు విషెస్‌
‘‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలి హృదయపూర్వకంగా కోరుకుంటున్నా’’ అని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కు ట్విటర్‌ వేదికగా విషెస్‌ తెలిపారు.

తల్లిని కన్న తనయుడికి శుభాకాంక్షలు: కేటీఆర్‌

Advertisement
 
Advertisement
Advertisement