
బాబు దీక్షపై కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ
అనుమతి లేకుండా ఏపీభవన్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నదీక్షపై ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు.
న్యూఢిల్లీ : అనుమతి లేకుండా ఏపీభవన్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నదీక్షపై ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. అదే లేఖను ఎన్నికల కమిషన్, ఢిల్లీ పోలీస్ కమీషనర్కు పంపించారు. మరోవైపు ఏపీభవన్ అధికారులతో టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. అనుమతి లేకుండా దీక్ష చేయకూడదని అధికారులు స్పష్టం చేయటంతో వారు ఆందోళనకు దిగారు.
దాంతో టీడీపీ కార్యకర్తలు బలవంతంగా తాళాలు తీసి లోనికి వచ్చారు. మరోవైపు ఏపీభవన్ నుంచి చంద్రబాబు నాయుడు తరలింపుపై హైదరాబాద్ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకూ ఏమీ చేయలేమని ఏపీభవన్ అధికారులు చెబుతున్నారు. అనుమతి లేకుండా చంద్రబాబు నాయుడు మూడు రోజులుగా ఏపీభవన్లో దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.