Sai Harsita
వర్థమాన తార సాయి హర్షిత కనిపించడంలేదని ఆలస్యంగా పోలీసుల దృష్టికి వచ్చింది.
హైదరాబాద్: వర్థమాన తార సాయి హర్షిత కనిపించడంలేదని ఆలస్యంగా పోలీసుల దృష్టికి వచ్చింది. మూడు నెలల క్రితం సినిమా షూటింగ్కు వెళ్లి ఇప్పటికీ తిరిగిరాలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సాయి హర్షిత 'లవ్ అటాక్' సినిమాలో నటించింది. మే 27న షూటింగ్కు వెళ్లిన తమ అమ్మాయి జాడ తెలియడం లేదని ఆమె తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జూలై 6న ఇంటికి వస్తానని ఫోన్ చేసిందని, కాని ఇంత వరకు రాలేదని వారు తెలిపారు. రాజమండ్రికి చెందిన సాయిహర్షిత కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్ కృష్ణానగర్‌లో ఉంటోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


