టీడీపీకి త్వరలో కవిత రాజీనామా! | Actress Kavitha resign to TDP soon | Sakshi
Sakshi News home page

టీడీపీకి త్వరలో కవిత రాజీనామా!

Aug 23 2017 8:00 AM | Updated on Apr 3 2019 9:11 PM

టీడీపీకి త్వరలో కవిత రాజీనామా! - Sakshi

టీడీపీకి త్వరలో కవిత రాజీనామా!

సినీ నటి కవిత త్వరలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు తెలిసింది.

నామినేటెడ్, ఎమ్మెల్సీ పదవుల భర్తీలో ఆర్యవైశ్యులకు అన్యాయం జరిగిందని అసంతృప్తి
 
సాక్షి, అమరావతి: సినీ నటి కవిత త్వరలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు తెలిసింది. టీడీపీలో ఆర్యవైశ్యులకు అన్యాయం జరుగుతోందని ఆమె తన అనుయాయుల వద్ద మంగళవారం ప్రస్తావించినట్టు సమాచారం. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదని ఆమె ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.
 
నామినేటెడ్, ఎమ్మెల్సీ పదవుల భర్తీలో ఆర్యవైశ్యులకు అన్యాయం జరిగిందని, తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు ఆమె అనుచరవర్గాల సమాచారం. ఎన్టీఆర్‌ నాటి టీడీపీకి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి పోలికే లేదని ఆమె భావిస్తున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.

ఫిరాయింపుదారులను చేర్చుకోవడంతో పార్టీ పరువు మరింతగా దిగజారి పోయిందని ఆమె వ్యాఖ్యానించారని సమాచారం. వైజాగ్‌లో జరిగిన పార్టీ మహానాడులో తనను తీవ్రంగా అవమానించి కన్నీళ్లు పెట్టించిన చంద్రబాబుకు ఆర్యవైశ్య ఆడపడుచుల ఉసురు తగులుతుందని కవిత అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement