కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం కొత్తూరు-బొల్లవరం మధ్య కర్నూలు జాతీయ రహదారిలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
నందికొట్కూరు (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం కొత్తూరు-బొల్లవరం మధ్య కర్నూలు జాతీయ రహదారిలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మకూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన ఆల్విన్ వ్యాన్ ఢీకొనడంతో ఆల్విన్ డ్రైవర్ సహా 9మంది తీవ్రంగా గాయపడ్డారు.
వ్యాన్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్, కండక్టర్‌తో పాటు ఆరుగురు ప్రయాణికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. ప్రమాదం జరిగినపుడు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. నందికొట్కూరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.