
'86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు'
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో 86 మంది రైతులు చనిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు ఆరోపించారు.
ఏలూరు : చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో 86 మంది రైతులు చనిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రెండు రోజుల రైతు దీక్ష కార్యక్రమం శనివారం తణుకు పట్టణంలో ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడారు. మృతుల కుటుంబాలకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాలని సభకు వచ్చిన రైతులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాంతో సభ వేదికపై ఉన్న నాయకులు, రైతులు, ప్రజలు అంతా రెండు నిముషాలు మౌనం పాటించారు.