350 ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణ | 350 MBBS seats in the restoration | Sakshi
Sakshi News home page

350 ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణ

Jul 9 2014 3:50 AM | Updated on Oct 9 2018 5:50 PM

ఎంబీబీఎస్ సీట్ల విషయంలో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయూలు తీసుకుంది.

భారతీయ వైద్య మండలి నిర్ణయం
ఏపీలో 200, తెలంగాణలో 150 సీట్ల పునరుద్ధరణ
ఏపీలో కొత్తగా అందుబాటులో 600 సీట్లు

 
హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్ల విషయంలో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయూలు తీసుకుంది. ఉభయ రాష్ట్రాల్లోని మొత్తం ఎనిమిది ప్రభుత్వ కళాశాలలు వసతుల లేమి కారణంగా ఇటీవల 500 సీట్లు కోల్పోగా.. వీటిలో మూడు కళాశాలలకు మినహా మిగతా అన్ని కళాశాలల్లో కోల్పోయిన 350 సీట్లను పునరుద్ధరిస్తూ మంగళవారం నిర్వహించిన కార్యవర్గ కమిటీ సమావేశంలో ఎంసీఐ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు రెండు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు సీట్ల కేటాయింపునకు అనుమతించింది. దీనితో పాటు కర్నూలు జిల్లాలోని ఓ కొత్త ప్రైవేటు కాలేజీకి సీట్లు కేటారుుంచారు. ఇప్పటికే నడుస్తున్న కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలకు సైతం అదనపు సీట్లను కేటాయించారు. 2014-15 సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి 6,500 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయని అంచనా. వసతులు, అధ్యాపకులు లేని కారణంగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు కొన్ని నెలల క్రితం 500 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. తెలంగాణలోని నిజామాబాద్ కళాశాల 100, గాంధీ వైద్య కళాశాల 50 సీట్లు కోల్పోయూరుు. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, విశాఖపట్నం ఏఎంసీ, కాకినాడ రంగరాయ, విజయవాడ సిద్ధార్థ, తిరుపతి ఎస్వీ కళాశాలలు ఒక్కొక్కటి 50 చొప్పున కోల్పోగా, ఒంగోలు రిమ్స్ 100 సీట్లు నష్టపోరుుంది. మంగళవారం జరిగిన ఎంసీఐ ఈసీ మీటింగ్‌లో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల, ఏఎంసీ, సిద్ధార్థ కళాశాలలు మినహా మిగతా అన్ని కళాశాలలకూ కోల్పోరుున సీట్లు తిరిగి లభించారుు. ఐదొందల సీట్లు కోల్పోగా అందులో 350 సీట్లను పునరుద్ధరించారు. ఏపీ కోల్పోరుున 200 సీట్లు, తెలంగాణ కోల్పోరుున 150 సీట్లను పునరుద్ధరించినట్టరుుంది.

ఏపీకి కొత్తగా 600 సీట్లు

ఆంధ్రప్రదేశ్‌లోని కొత్త ప్రభుత్వ కళాశాలల్లో ఈ ఏడాది 300 ఎంబీబీఎస్ సీట్లు కేటారుుంచారు. నెల్లూరులో నిర్మించిన వైద్య కళాశాలకు 150 సీట్లు, తిరుపతిలోని పద్మావతి కళాశాలకు 150 సీట్ల చొప్పున మొత్తం 300 సీట్లకు అనుమతి లభించింది. మరోవైపు ప్రైవేటు కళాశాలల్లోనూ 300 సీట్లు పెరిగాయి. ఈ ఏడాది కర్నూలులో కొత్తగా నిర్మించిన విశ్వభారతి మెడికల్ కళాశాలకు 150 సీట్లు కేటాయించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement