27, 28 తేదీల్లో షర్మిల ప్రచారం | 27,28, ys sharmila YSR Janabheri | Sakshi
Sakshi News home page

27, 28 తేదీల్లో షర్మిల ప్రచారం

Apr 26 2014 5:16 AM | Updated on Aug 14 2018 4:32 PM

27, 28 తేదీల్లో  షర్మిల ప్రచారం - Sakshi

27, 28 తేదీల్లో షర్మిల ప్రచారం

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో ఈ నెల 27, 28 తేదీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

సాక్షి, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో ఈ నెల 27, 28 తేదీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆమె తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం, పూతలపట్టు, శ్రీకాళ హస్తి నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. 27వ తేదీ ఉదయం 10 గంటలకు తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

అక్కడి నుంచి మదనపల్లె, పుంగనూరు మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు కుప్పం చేరుకుంటారు. కుప్పం సభానంతరం పలమనేరు నియోజకవర్గంలోని వి.కోటలో  ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు. రాత్రి 7గంటలకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళెం చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన సభలో మాట్లాడతారు. రాత్రికి తిరుపతిలో బస చేస్తారు. మరుసటి రోజు 28వ తేదీ ఉదయం శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం వైఎస్‌ఆర్ జిల్లాకు వెళతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement