శ్రీవారి దర్శనానికి 20గంటలు | 20 hours time for Visit Srivari Temple | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 20గంటలు

Jan 19 2014 3:40 AM | Updated on Sep 2 2017 2:45 AM

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వేకువజామున 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 46,555 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వేకువజామున 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 46,555 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. వీరికి 20 గంటల సమయం పడుతోంది. రద్దీ పెరగడంతో రూ. 300 టికెట్ల దర్శనాన్ని మధ్యాహ్నం 2 గంటలకు నిలిపివేశారు. కాలిబాట కాలిబాట భక్తులకు దర్శనానికి పది గంటల సమయం పడుతోంది. కాగా, భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచార్య శ్రీకాంత్ శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి ప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement