నీటిగుంతలో పడి అక్కాతమ్ముళ్ల మృతి | 2 kids died due to fall in water storage | Sakshi
Sakshi News home page

నీటిగుంతలో పడి అక్కాతమ్ముళ్ల మృతి

Aug 8 2015 7:18 PM | Updated on Sep 3 2017 7:03 AM

చిత్తూరు జిల్లా విజయపురం మండలంలో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

విజయపురం(చిత్తూరు): చిత్తూరు జిల్లా విజయపురం మండలంలో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కేవీ శ్రీరామపురం గ్రామానికి చెందిన సురేశ్, సుమతి దంపతులకు సంగీత(11), కుమార్(10) అనే పిల్లలున్నారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వారిద్దరూ మరో స్నేహితురాలితో కలసి ఆడుకుంటూ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు జారి అక్కడున్న నీటి గుంతలో పడిపోయారు. గమనించిన గొర్రెల కాపరి ఒక బాలికను కాపాడగలిగాడు. అక్క, తమ్ముడు మాత్రం మృత్యువాతపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement