సాగర్ కాల్వలో గుర్తు తెలియని మృతదేహాలు | 2 dead bodys found in sagar canal | Sakshi
Sakshi News home page

సాగర్ కాల్వలో గుర్తు తెలియని మృతదేహాలు

Mar 1 2016 12:45 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామం కురువ వద్ద ఎన్‌ఎస్‌పీ ప్రధాన కాల్వలో రెండు మృతదేహాలు స్థానికులకు కనిపించాయి.

బొల్లాపల్లి: గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామం కురువ వద్ద ఎన్‌ఎస్‌పీ ప్రధాన కాల్వలో రెండు మృతదేహాలు స్థానికులకు కనిపించాయి. గోనెసంచిలో మూటకట్టి ఉన్న పురుషుల మృతదేహాలు రెండింటిని మంగళవారం ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాసరావు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.పూర్తిగా కుళ్లిన స్థితిలో గుర్తు పట్టలేని విధంగా ఉన్నమృతదేహాలకు అక్కడే శవపరీక్ష చేపట్టనున్నట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement