breaking news
-
ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ బృందం
విజయవాడ: తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసింది వైఎస్సార్‌సీపీబృందం. ఈ ఎన్నికపై ఏపీలోని కూటమి ప్రభుత్వం అవిశ్వాసం పెట్టి తద్వారా ఎన్నిక వాయిదా వేయాలని కుట్రకు తెరలేపిన నేపథ్యంలో వైఎస్సార్సీపీసభ్యులు మల్లాది విష్ణ/, వైఎస్సార్సీపీఎంప్లాయిస్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీఎస్సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావులు ఎన్నికల కమిసనర్ ను కలిశారు.అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఉపఎన్నిక పై ఈసీని కలిశాం. వెంకటగిరిలో 25 కార్పోరేటర్లను వైఎస్సార్ సీపీ గెలిచింది. ఈ ప్రభుత్వం దౌర్జన్యంగా అవిశ్వాసం ప్రవేశపెట్టింది. దీని ద్వారా మరొకవైపు ఎన్నిక వాయిదా వేసేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోంది. ఈనెల 9వ తేదీన జరగబోయే ఎన్నిక వాయిదా వేయాలని చూస్తోంది. ఎన్నిక వాయిదా పడకుండా చూడాలని ఈసీని కోరాం. 9వ తేదీనే జరిగేలా చూడాలిన కోరాం. భయపెట్టి...బెదిరించి గెలవాలని చూడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కలెక్టర్లకు సరైన ఆదేశాలివ్వాలని కోరాం. సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో ఎన్నిక జరపాలి’ అని ఈసీని కోరామన్నారు మల్లాది విష్ణు. -
మీడియాపై ఊగిపోయిన సీఎం చంద్రబాబు
అమరావతి, సాక్షి: ఆరోగ్యశ్రీ పథకం(Aarogyasri Scheme) కొనసాగింపుపై కూటమి ప్రభుత్వం దాదాపుగా చేతులెత్తేసింది. సోమవారం మీడియాతో పలు అంశాలపై మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(74).. ఆరోగ్యశ్రీ కొనసాగింపు కష్టమన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు తీవ్ర అసహనం వ్యక్తం చేశారాయన.‘‘ఆరోగ్య శ్రీ నిలిపేస్తాం అని ఆస్పత్రుల యజమానులు చెప్పారు. వాళ్లకి డబ్బులు ఇవ్వాలి. వాళ్లకి డబ్బులు ఇమ్మంటే మా ఆర్థిక శాఖ సెక్రెటరీ డబ్బులు ఎక్కడున్నాయని అంటున్నారు?’’ అని సీఎం చంద్రబాబు(CM Chandrababu) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో.. పీ 4 బాగా సక్సెస్ అయ్యింది అని ఆయన అనగానే.. పీ 4 లో మంత్రులు భాగస్వాములయ్యారా..? అని అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో.. మీడియాపై ఎదురుదాడికి దిగారారాయన. మీరు భాగస్వామి అయ్యారా..? మీరు ముఖ్యమంత్రే చెయ్యాలి...మంత్రులే చెయ్యాలి అంటే ఎలా..?. మీ ఆలోచనా విధానం మారాలి. మీరు భాగస్వాములయ్యారా..? మీరు క్రిటిక్స్ గానే మిగిలిపోతారా..? అంటూ ఆవేశంతో సీఎం చంద్రబాబు ఊగిపోయారు. అదే సమయంలో ఆక్వా రంగ సంక్షోభం(Aqua Crisis)పైనా వింత వ్యాఖ్యలు చేశారు. ఈ సంక్షోభానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమన్న సీఎం చంద్రబాబు.. తనకేం చేయాలో అర్థం కావడం లేదని, కేంద్రానికి లేఖ రాయడం మాత్రమే తాను చేయగలిగిందంటూ వ్యాఖ్యానించారు.విజయవాడ: నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఈ ఉదయం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. రూ.3,500 కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్ వర్క్ ఆసుపత్రులు సమ్మెకు దిగాయి. 26 సార్లు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని ఆ ఆస్పత్రులు చెబుతున్నాయి. మరోవైపు.. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. -
‘తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు’
తాడేపల్లి: ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు మంచి నీళ్లకు అల్లాడిపోతుంటే మరొకవైపు మద్యం మాత్రం ఏరులై పారుతోందని మాజీ మంత్రి , వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని విమర్శించారు. 10 నెలల కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నా, మద్యం మాత్రం విచ్చలవిడిగా సరఫరా అవుతుందని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి పేర్ని నాని మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్ సీపీ దిగిపోయే నాటికి గోదాంల్లో ఉన్న మద్యాన్ని టీడీపీ ప్రభుత్వం అమ్మింది. గోదాంల్లో ఉన్న మద్యాన్ని ఎందుకు టెస్టులు చేయించలేదు. వైఎస్సార్ సీపీ హయాంలో మద్యంపై ఆరోపణలు చేసిన మీరు ఆ డిస్టరీలను ఎందుకు రద్దు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటైనా డిస్టలరీను రద్దు చేసిందా?’ అని ప్రశ్నించారు పేర్ని నాని. ఇంకా ఆయన ఏమన్నారంటే..వేలం పాట పట్టుకో.. ఎమ్మెల్యేకి డబ్బు కొట్టుకో.. ‘లెల్ట్’ పెట్టుకో..‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వైఎస్సార్ సీపీకి చెందిన ఆస్తులను ధ్వంసం చేశారు. కేరళ, బెంగళూరు మద్యం ఏపీలో ఎందుకు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ రెడ్ బుక్ రూల్ ప్రకారమే నడుస్తోందా?. వేలం పాట పట్టుకో.. ఎమ్మెల్యే డబ్బు కొట్టుకో.. బెల్ట్ పెట్టుకో అన్నట్లే ఉంది ఏపీలో పాలన. సూపర్ సిక్స్ హామీల అమలు లేదు కానీ.. మద్యం మాత్రం యధేచ్ఛగా సరఫరా అవుతుంది. బెల్ట్ షాపులుంటే తోలుతీస్తానన్న సీఎం.. మద్యం ఆఖరికి బడ్డీ కొట్టుల్లో దొరుకుతున్నా మాట్లాడటం లేదు ఎందుకు?. శుక్రవారం మధ్యాహ్నం డిఫ్యాక్ట్ సీఎం(లోకేష్ ఉద్దేశిస్తూ) ఏపీలో ఉండడు’ అని విమర్శించారు. కొన్నిసార్లు అపరిచితుడు.. మరొకసారి దశావాతారాలుపవన్ కళ్యాణ్ ని చూస్తే అపరిచితుడిలా కనిపిస్తాడు.. కొన్నిసార్లు దశావతారాల్లో కనిపిస్తాడు.తోలు తీస్తా.. తాట తీస్తా అంటాడు. ఊళ్లో మాత్రం ఉండడు.. సమీక్షలు రాడు.. క్యాబినెట్ మీటింగ్ లకు రాడు. కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఈ మూడు నియోజవర్గాల్లో మద్యం విచ్చలవిడిగా దొరకుతోంది. బడ్డీ కొట్టులోని ఫ్రిజ్ లో మద్యం ఉంటుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చురాష్ట్రాన్ని పొడిచేస్తామంటారు.. ఈ ముగ్గురు.. కానీ వీళ్ల నియోజకవర్గాల్లోని మద్యం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. ఇది రాష్ట్రంలో పరిస్థితి’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.ఆ ఐదేళ్లు చంద్రబాబు, పవన్‌లు విషం వైఎస్సార్సీపీ హయాంలో వరుసగా ఐదేళ్లు మదం పాలసీపై చంద్రబాబు, పవన్ విషంకక్కారు. చంద్రబాబు,పవన్,లోకేష్ బూటకపు ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేశారు. గడచిన 10 నెలలుగా అదే మద్యాన్ని గ్రామాల్లో ఏరులైపారిస్తున్నారు, గ్రామాల్లో పచ్చచొక్కాలు మద్యాన్ని పాడికుండలా మార్చుకున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్తీమద్యాన్ని అమ్ముతోందని విషపు ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం నిల్వలను ఈ ప్రభుత్వం రాగానే అమ్ముకుంది. కల్తీమద్యం అయినప్పుడు మీరెందుకు అమ్ముకున్నారు’ అని నిలదీశారు.ఇది కూడా తిరుపతి లడ్డూ కల్తీ మాదిరి తప్పుడు ప్రచారమేనాలడ్డూలో పంది కొవ్వు కలిపారని చేసిన తప్పుడు ప్రచారం లాంటిదేనా?, అధికారంలోకి రాగానే ఆస్తులు ధ్వంసం చేశారు... తగలబెట్టారు...దాడులు చేశారుమద్యం కల్తీదోకాదో ఎందుకు టెస్ట్ లు చేయించలేదని ప్రశ్నిస్తున్నా. ఒక్క డిస్టిలరీ మీదైనా చర్య తీసుకున్నారా ?, రాష్ట్రంలోని 20 డిస్టిలరీలు గతంలో చంద్రబాబు తెచ్చినవే. జగన్ హయాంలో ఒక్క డిస్టిలరీ కూడా తీసుకురాలేదు. కూటమి ప్రభుత్వం రాగానే డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు మారారుకేరళ ,బెంగుళూరు మద్యమే అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు 1500 ఇస్తామన్నారు. చంద్రబాబు మొదటి సంతకానికే దిక్కులేదు. చెప్పిన మాట అమలుకాకపోతే చొక్కాపట్టుకోమన్నాడు డిఫ్యాక్టర్ సీఎం. చొక్కాపట్టుకుందామంటే శుక్రవారం మధ్యాహ్నం నుంచే కనిపించడుఇంకో ఆయన కాలర్ లేని చొక్కాలేసుకుని కనిపించకుండా పోతాడు. సీఎం ,సీఎం కొడుకు..డిఫ్యాక్టర్ సీఎం కనిపించకపోతే వార్తలు రాయడానికి ఈనాడు,జ్యోతికి చేతులు రావా.. ఈ రాష్ట్రానికి లోకేష్ నాయుడు అనధికార ముఖ్యమంత్రి కుప్పం,పిఠాపురం,మంగళగిరిలో మద్యం ఏరులై పారుతోందిప్రతీ బడ్డీ కొట్టులో మద్యం దొరుకుతోంది. ఏపీలో టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్ముతున్నారు. ప్రభుత్వం నిర్ధేశించినదానికంటే 30% శాతం అధికంగా అమ్మాలనేదే ఏపీలో మద్యం పాలసీ’ అని మండిపడ్డారు. -
జనసేన నేతల మధ్య రగడ.. అర్ధరాత్రి ఉమ ఇంటిపై దాడి
సాక్షి, కోనసీమ జిల్లా: ఏపీలో జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీలో రెండు వర్గాల నేతల మధ్య దాడి ఘటన చోటుచేసుకుంది. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన నాయకుడిపై దాడి చేసిన ఘటనలో పార్టీ మండల అధ్యక్షుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన నాయకుడు తొలేటి ఉమకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లిలో జనసేన పార్టీ నేతల మధ్య విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. పార్టీ నాయకుడు తోలేటి ఉమపై జనసన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్, ఆయన అనుచరులు దాడి చేశారు. ఆదివారం అర్ధరాత్రి రాజేష్, అనుచరులు.. ఉమ ఇంట్లోకి చొరబడి కర్రలతో దాడి చేశారు. ఈ దాడి సందర్భంగా ఉమను తప్పించే ప్రయత్నం చేసిన ఆయన భార్యపై కూడా వారు దాడి చేయడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.రాజేష్ వర్గం.. ఉమపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, అర్ధరాత్రి హుటాహుటిన ఉమను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. ఉమపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న అతడి అనుచరులు.. రాజేష్ కారును ధ్వంసం చేశారు. దాడి ఘటన కారణంగా ఉద్రిక్తత నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్, సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆదివారం మధ్యాహ్నం పి.గన్నవరం పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కారణంగానే దాడి జరిగినట్టు పలువురు చెబుతున్నారు. -
రాప్తాడుకు వైఎస్ జగన్.. పోలీసుల ఆంక్షలు!
సాక్షి, అనంతపురం: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అనంతపురం పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వెళ్లనున్నారు. ఇటీవల దారుణ హత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అయితే, వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. చెన్నేకొత్తపల్లిలో హెలిప్యాడ్ ఏర్పాటుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కుంటిమద్ది-పాపిరెడ్డిపల్లి వద్ద హెలిప్యాడ్‌కు అనుమతి ఇచ్చారు. అలాగే, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి రావద్దని పోలీసులు హెచ్చరించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఇది కూడా చదవండి: రెడ్‌బుక్ రాజ్యాంగం.. ఏపీకి గుడ్‌బై! -
రేవంత్ విషయంలో ఒక న్యాయం.. చంద్రబాబుకు మరొకటా?
హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు స్పందించిన తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుండగానే సుప్రీంకోర్టు ధర్మాసనం చెట్ల నరికివేత విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వందల ఎకరాల్లో పచ్చదనంపై గొడ్డలివేటు పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ వేత్తలు, కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థలు ఏపీలో సుమారు 33 వేల ఎకరాలలో ఏటా మూడేసి పంటలు పండే పచ్చటి భూములను బీడులుగా మార్చి పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నా స్పందించకపోవడం ఆశ్చర్యంగానే ఉంది.దేశ ప్రధానితోపాటు, న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాలలో పని చేసిన వారిలో కొందరు కూడా అమరావతి పేరుతో సాగుతున్న పర్యావరణ విధ్వంసానికి సహకరించే విధంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. రాష్ట్రాన్ని బట్టి, నేతలను బట్టి, పార్టీలను బట్టి వ్యవస్థలు స్పందిస్తున్నాయా అన్న సందేహం రావడానికి ఇలాంటి ఘట్టాలు ఆస్కారం ఇస్తుంటాయి. కంచ గచ్చిబౌలి భూముల మీద స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనమే, పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా అసంతృప్తి తెలిపింది. ఈ రెండు ఉదంతాలకు సంబంధం ఉందో, లేదో తెలియదు. అయితే, రేవంత్ చేసిన తప్పిదం వల్ల దాని ప్రభావం న్యాయ వ్యవస్థపై పడి ఉండవచ్చా అన్నది కొందరి డౌటు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఈ స్థాయిలో ఇలాంటి కేసులు తనంతట తానే తీసుకున్నట్లు కనిపించలేదు. అన్ని కేసుల్లోనూ కింది కోర్టుల్లో విచారణ జరుగుతుండగా ఇలా స్పందిస్తుందా? అన్నది కొందరి ప్రశ్న.తెలంగాణ ప్రభుత్వం తొందరపాటు, సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధుల నిరసనలు, బీజేపీ, బీఆర్ఎస్ల విమర్శల హోరు, కేంద్ర ప్రభుత్వం జోక్యం, తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యంపై విచారణ, స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి రావడం వంటి పరిణామాలను విశ్లేషించుకుంటే అన్ని వ్యవస్థలలో ఉన్న మంచితోపాటు లోపాలు కూడా కనిపిస్తాయని చెప్పాలి. కంచ గచ్చిబౌలిలోని ఈ 400 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చింది. దాంతో రేవంత్ సర్కార్‌కు కొత్త ఆలోచనలు వచ్చాయి. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని అమ్మడమో, లేక లీజు పద్దతిపై ఆయా సంస్థలకు కేటాయించడమో, ఇతర అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడమో చేయాలని తలపెట్టి ఆ దిశగా పావులు కదిపింది.అయితే, ఇక్కడే రేవంత్ అనుభవరాహిత్యం వల్ల దెబ్బతిన్నారు. నిజంగానే ఆయన అక్కడ అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో ఉంటే వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండాలి. దానికి ముందు ఈ భూమిని అధీనంలోకి తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలను పసికట్టి ఉండాలి. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో భాగమా? కాదా? ఎవరికి భూములపై హక్కులు ఉన్నాయన్న దానిపై న్యాయపరంగా అభిప్రాయం తీసుకుని ఉండాల్సింది. ఆ తర్వాత తదుపరి చర్యలకు వెళ్లి ఉంటే ఎలా ఉండేదో గాని, అలా కాకుండా, వేగంగా సెలవు దినాలలో పెద్ద సంఖ్యలో జేసీబీలను పంపించి చెట్లు కొట్టి, నేల చదును చేయించడంతో వివాదానికి అవకాశం ఇచ్చినట్లయింది. ఈ భూముల అమ్మకం ద్వారా కనీసం రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కొందరైతే ఇంకా ఎక్కువే వస్తుందని అంటారు. దీంతో ప్రభుత్వ కష్టాలు తీరుతాయని ఆశించి ఉండవచ్చు. సుమారు రెండు దశాబ్దాల పాటు కోర్టులలో ప్రభుత్వమే ఈ భూమిపై పోరాడింది కనుక తమవే అన్న అభిప్రాయం వచ్చినప్పటికీ భవిష్యత్ పరిణామాలపై ఒక అంచనాకు రావడంలో విఫలమైందని అనిపిస్తుంది.1975లో రాష్ట్ర ప్రభుత్వమే 2300 ఎకరాలు కేటాయించినా, సెంట్రల్ యూనివర్శిటీకి అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయలేదు. అయినా వారు వాడుకున్న భూమి పోను మిగిలినది ప్రభుత్వ అధీనంలోనే ఉందట. 2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఈ భూమిని ‘ఐఎమ్జీ భారత’ అకాడమి అనే ప్రైవేటు సంస్థకు కేటాయించింది. ఆ సంస్థకు భూమిని బదలాయించే నిమిత్తం 2004 ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం 534 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్శిటీ నుంచి బదలాయించారు. ఈ మేరకు రికార్డులు ఉన్నాయని మీడియా కథనం. అందులో యూనివర్శిటీ రిజిస్ట్రార్ సంతకం కూడా ఉండడం గమనార్హం. విశేషం ఏమిటంటే చంద్రబాబు ఆపద్ధర్మ సీఎం హోదాలో ఈ భూమిని ఇలా బదలాయించినా ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఏ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు రాలేదు. పైగా ఈ భూమిలో 400 ఎకరాలు పొందిన ప్రైవేటు సంస్థ రెండు దశాబ్దాలుగా ఆ భూమి తనదే అంటూ కోర్టులలో వ్యాజ్యాలు సాగించినా ఏ వ్యవస్థ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించదు.ఇక, 2006లో ఆనాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ భూమి విషయాన్ని పరిశీలించి ఇది ప్రైవేటు వ్యక్తులకు లాభం చేసేందుకే చంద్రబాబు సర్కార్ కేటాయించిందని అభిప్రాయపడి దానిని రద్దు చేసింది. అయినా కోర్టులో అది ప్రభుత్వ భూమి అని ఇంతకాలం పోరాడాల్సి వచ్చింది. ఒక వేళ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఐఎంజీ సంస్థ ఏవైనా నిర్మాణాలు చేపట్టి ఉంటే ఏమై ఉండేది అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. అప్పుడు కూడా ఈ భూమిలో చెట్లు ఉన్నాయి కదా!. అలాంటి ఖాళీ భూమిలోనే కదా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. అప్పుడు పర్యావరణ సమస్యలు రావా? ఇక్కడ రేవంత్ సర్కార్ కరెక్ట్ గా చేసిందా? లేదా? అన్నది చర్చ కాదు. కానీ, పరిణామాలన్నిటిని విశ్లేషించినప్పుడు ఇలాంటి సందేహాలు వస్తాయి కదా!. సుప్రీంకోర్టు ఈ భూమి ప్రభుత్వానిదే అని తేల్చిన తర్వాత ఈ భూమిని అభివృద్ది చేయడం కోసం మౌలిక వసతుల కల్పన సంస్థకు అప్పగించింది. ఈ పనులు చేయడం కోసం ఇదే భూమిని తాకట్టు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థ ద్వారా పదివేల కోట్ల అప్పు కూడా తీసుకుందట. మార్కెట్లో బాండ్లు, వివిధ బ్యాంకులు, ఆర్ధిక సంస్థల ద్వారా ఈ రుణాలు సేకరించి, వడ్డీ కట్టడం కూడా ఆరంభమైందని కథనం.ఈ భూమిని యూనివర్శిటీకే ఇవ్వాలని, అక్కడ ప్రహరి గోడ కట్టించడం వల్లే వృక్షాలు పెరిగాయని చెబుతూ విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగడం, తదుపరి విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ ఎంటర్ అవ్వడంతో అది పెద్ద దుమారంగా మారింది. ఈలోగా కేంద్రం కూడా స్పందించి ఈ భూమిపై నివేదికను కోరింది. తెలంగాణ హైకోర్టు కూడా విచారణ చేపట్టి నోటీసులు జారీ చేసింది. ఇంతలో సుమోటోగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నివేదిక తెప్పించుకుని చెట్లు కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులు ఆపాలని ఆదేశించింది. దీంతో విద్యార్దులు తామే గెలిచామని సంబరాలు చేసుకుంటే, రేవంత్ సర్కార్‌కు పెద్ద షాక్ తగిలినట్లయింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ఇప్పుడు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. కాగా అక్కడ పర్యావరణ అనుకూల పార్కు ఏర్పాటు చేస్తామని, యూనివర్శిటీ కూడా అదే భూమిలో ఉంది కనుక దానిని ఫ్యూచర్ సిటీకి తరలిస్తామని కొత్త కండీషన్ పెట్టడం విశేషం. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ ద్వారా కల్పిత వీడియోలు సృష్టించారని తెలంగాణ సర్కార్ ఇప్పుడు వాపోతున్నా పెద్దగా ఫలితం ఉంటుందా అన్నది సందేహం.కాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావని రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సీఎంకు సంయమనం పాటించడం తెలియదా అని ప్రశ్నించింది. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసిన రోజునే ఆయన అనవసర వివాదంలో చిక్కుకున్నారని అనుభవజ్ఞులు అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థను సవాల్ చేసేలా ఆయన మాట్లాడడం వారికి ఎలా నచ్చుతుంది. గతంలో ఫిరాయింపులపై కోర్టులు గట్టి చర్యలు తీసుకోలేదన్నది ఆయన అభిప్రాయం కావచ్చు. అయినప్పటికీ శాసనసభలో అలా మాట్లాడి దెబ్బతిన్నారు. ఆ క్రమంలో ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం గందరగోళంగా మారింది. విశేషం ఏమిటంటే యూనివర్శిటీకి చెందిన భూములలో కొంత భాగం ఆక్రమణలకు గురైందని చెబుతున్నారు. తన అధీనంలో ఉన్న భూములను ఏం చేయాలన్నది నిజానికి ప్రభుత్వ అభీష్టం ప్రకారం జరగాలి. అయితే స్థానిక ప్రజలు పర్యావరణ వేత్తలు, యూనివర్శిటీ విద్యార్ధులు చేస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయాలు చేసి ఉండవచ్చు. అవేవి జరగలేదు. దానిని సహజంగానే విపక్షాలు తమకు అనుకూలంగా మలచుకుంటాయి.ప్రభుత్వ ఆస్తులు, భూములు అమ్మడం కొత్త కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల కారణం చూపి అమ్ముతున్నారు. తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వం కూడా పలు చోట్ల భూములను అమ్మి వేల కోట్ల ఆదాయం పొందింది. ఇప్పుడేమో బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తాము అధికారంలోకి వస్తే ఈ భూములను యూనివర్శిటీకి అప్పగిస్తామని చెబుతున్నారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ సర్కార్ భూముల అమ్మకాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పుడు ఆయన అదే బాటలో ఉన్నారు. ఇదంతా ఒక గేమ్‌గా మారింది. ప్రతిపక్షంలో ఉంటే ఒకరకం, అధికారంలోకి వస్తే మరో రకంగా వ్యవహరిస్తున్నారు.ఇక ఏపీ సంగతి కూడా చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. కృష్ణానది పక్కన 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించి రాజధాని కడుతున్నారు. అది పర్యావరణానికి నష్టమని పలువురు చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అక్కడ భూమి స్వభావ రీత్యా మామూలు వ్యయం కన్నా ఒకటిన్నర రెట్ల అధికంగా నిర్మాణ ఖర్చు అవుతుందట. రిషికొండపై జగన్ ప్రభుత్వం మంచి భవనాలు నిర్మిస్తే, ప్యాలెస్‌లని ప్రచారం చేసిన తెలుగుదేశం, జనసేన నేతలు ఇప్పుడు అమరావతిలో అంతకన్నా పెద్ద ప్యాలెస్‌లు నిర్మించాలని తలపెట్టారు. వాటికి మాత్రం ఐకాన్ భవనాలని, అదని, ఇదని బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబు స్వయంగా కృష్ణా నది తీరాన నదీ చెంత సీఆర్‌జెడ్ నిబంధనలతో నిమిత్తం లేకుండా ఒక భవనంలో నిర్మిస్తున్నా ఏ వ్యవస్థ ఆయన జోలికి వెళ్లలేకపోయింది.రిషికొండపై అంతా కలిపి 400 కోట్లతో భవనాలు నిర్మిస్తే తప్పట. అదే అమరావతిలో ఏభై వేల కోట్ల అప్పులు తెచ్చి మరీ ప్యాలెస్‌లు నిర్మిస్తే రైటట. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యవస్థలే లేవా?. రాజధాని కోసం ఎంత భూమి అవసరమో అంత తీసుకోవచ్చు. అలా కాకుండా మహానగరం నిర్మిస్తామంటూ శివరామకృష్ణన్ నివేదికకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఇలా చేస్తుంటే ఏమనాలి?. తెలంగాణకు ఒక న్యాయం, ఏపీకి ఒక న్యాయం ఉంటుందా?. ఇదంతా మన ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థతో సహా వివిధ వ్యవస్థలలో ఉన్న లోపమా?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అంగన్వాడీ టీచర్‌పై టీడీపీ నేత లైంగిక వేధింపులు
సాక్షి, పల్నాడు జిల్లా: కూటమి సర్కార్ వచ్చిన తర్వాత టీడీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుపోతున్నాయి. తామేమి చేసినా చెల్లుబాటు అవుతుందని ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. తాజాగా సత్తెనపల్లి మండలంలోని కంకణాలపల్లిలోని అంగన్వాడీ టీచర్‌పై టీడీపీ నాయకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.పదే పదే ఫోన్ చేసి తన కోరిక తీర్చమంటూ టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు వేధింపులకు గురిచేస్తున్నారని అంగన్వాడీ టీచర్ స్వర్ణలత తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా పౌష్టికాహారం ఇవ్వాలంటూ వెంకటేశ్వరరావు హుకుం కూడా జారీ చేశాడంటూ ఆమె వాపోయారు.పోలీస్ స్టేషన్లో వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసిన కానీ.. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మీరు దళితులు.. మా పార్టీ అధికారంలో ఉంది.. నన్నేమీ చేయలేరంటూ వెంకటేశ్వరరావు వార్నింగ్ ఇచ్చాడంటూ స్వర్ణలత తెలిపింది.తన భర్త చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు ఐదు లక్షలు ఇప్పిస్తానని వెంకటేశ్వరరావు లక్ష రూపాయలు డిమాండ్ చేశారన్న స్వర్ణలత.. తనకు ఇద్దరు చిన్న పిల్లలని.. తనకు ఆత్మహత్య తప్ప మరో దారికి లేదన్నారు. న్యాయం చేయాలంటూ బాధితురాలు స్వర్ణలత కన్నీరు మున్నీరవుతున్నారు. -
‘ఆక్వారంగం సంక్షోభంలో ఉంటే ప్రభుత్వం మొద్దునిద్ర’
పశ్చిమగోదావరి జిల్లా : రాష్ట్రంలో ఆక్వారంగం సంక్షోభంలో ఉంటే ప్రస్తుత ఏపీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు విమర్శించారు. మత్యం ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉన్న ఏపీలో ఆక్వారంగం సంక్షోభంలో ఉందన్నారు. దీన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతుందంటూ మండిపడ్డారు.‘అమెరికా సుంకాల పెంపు సాకుతో కొన్ని కంపెనీలు సిండికేట్ గా మారి దోపిడీకి పాల్పడుతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే కౌంట్ కి20 నుండి 40 రూపాయలు తగ్గించేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఒక సాధికారత కమిటీ వేశారు. రాష్ట్రంలో 75 శాతం ఆక్వా రంగంలోనే ఆదాయం వస్తుంది. హయాంలో ఒక సాధికారత కమిటీ వేశారు. కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. జగన్ హయాంలో రూపాయిన్నరకే పవర్ సబ్సిడీ ఇచ్చి రైతుకు అండగా నిలిచారు. ఫీడ్ కంపెనీలు ఎక్స్ పోటర్ సిండికేట్ గా మారిపోయారు. కూటమి ప్రభుత్వంలో నాయకులే ఎగుమతిదారులుగా చాలా మందే ఉన్నారు. అమెరికా దిగుమతి సుంకాలను సాకగా చూపి.. ఇక్కడ రొయ్య ధరలు తగ్గించడం దుర్మార్గం.కేవలం రూ. 20, రూ. 30, రూ. 40 కౌంటర్ రొయ్య మాత్రమే అమెరికాకు ఎక్స్ పోర్ట్ అవుతాయి. 70 కౌంట్ గానీ, 100 కౌంట్ గానీ అమెరికా లాంటి ఎక్స్ పోర్ట్ చేసుకోదు. గతంలో ఫీడ్ రేట్లు పెరిగితే అప్సడా(Andhra Pradesh State Aquaculture Development Authority) ద్వారా రేట్లు నియంత్రించారు. అప్పుడు సోయా కేజీ 85 రూపాయలు ఉంది. ఇప్పుడు కేజీ 25 రూపాయలు ఉన్నా ఫీడ్ రేటు తగ్గించడం లేదు. చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చి రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చారు.జగన్ హయాంలో ఇంటిగ్రేటెడ్ ఆక్వాలాబ్ లో పెట్టి.. రైతులకు అండగా నిలిచారు. ఫీడ్ గానీ, సీడ్ కానీ కల్తీ లేకుండా చట్టాలను తీసుకొచ్చారు. జగన్ చైర్మన్ గా ఉండి అప్సడా ద్వారా మానిటరింగ్ చేసేవారు.’ అని పేర్కొన్నారు. ముడిసరుకులు తగ్గించినప్పుడు ఫీడ్ రేటు తగ్గించాలి కదా.. ప్రభుత్వ పెద్దల సహకారంతో రైతులు నడ్డివిరుస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రైతులకు జగన్ అండగా నిలిచారు. ఎగుమతుదారులతో కో ఆర్డినేషన్ చేసి రైతులను ఆదుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల పక్షాన ఉండాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం ఆక్వా రైతులలో ఉన్న ఆందోళన తొలగించాలి’ అని ఆయన పేర్కొన్నారు. -
‘పవన్ కల్యాణ్‌కు ఆ స్క్రిప్ట్ రాసిచ్చినోడు ఎవడో కానీ..’
సాక్షి, విజయవాడ: పిల్లి కళ్లుమూసుకుని పాలుతాగుతూ ఎవరూ చూడటం లేదనుకునే రకం చంద్రబాబు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఏపీని శ్రీలంక చేసేశాడని చంద్రబాబు ప్రచారం చేశారు.. అధికారంలోకి వచ్చి 10 నెలల కాలంలో మీ ప్రభుత్వ ట్రాక్ రికార్డ్ ఏంటో చెప్పాలి’’ అంటూ చంద్రబాబును నిలదీశారు.‘‘గతేడాది 90 వేల కోట్లు అప్పులు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదలు కాగానే 5750 కోట్లు అప్పుతెచ్చారు. అన్ని కార్పొరేషన్ల పేరుమీద అప్పులు తెచ్చి ఏపీని అప్పులు పాలు చేస్తున్నావ్. అమరావతి రాజధాని పేరుతో 31 వేల కోట్లు అప్పు తెచ్చావ్. ఒక్క అమరావతి రాజధాని కోసమే 62 వేల కోట్లు అప్పు తేవాలని చూస్తున్నారు. అమరావతికి కేంద్రం గ్రాంట్ ఇస్తుందని జబ్బలు చరిచారు. గ్రాంట్ ఎక్కడిచ్చారో సమాధానం చెప్పాలి’’ అంటూ రామకృష్ణ దుయ్యబట్టారు.అప్పులపై సీఎం చంద్రబాబు తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలి. బీజేపీ అధికారంలోకి వచ్చి పదకొండేళ్లయ్యింది. ఈ పాలనలో ఒక్క సమస్యనైనా పరిష్కరించారా?. హిందువుల గురించి మాట్లాడే మీరు వారికి ఏం మేలు చేశారో సమాధానం చెప్పాలి. 2014 ఎన్నికల్లో ప్రస్తావించిన అంశాల్లో ఒక్కటైనా చేశారా?. ఈ దేశంలో రైతులకు ఏమైనా మేలు చేశారా?. 2014 నుంచి 2022 వరకూ మోదీ పాలనలో లక్షా 474 మంది రైతులు, కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు, కూలీలు ఆత్మహత్యలపై మీ దగ్గర సమాధానం లేదు’’ అని రామకృష్ణ ధ్వజమెత్తారు.‘‘పేదరికం తగ్గించలేక పోయారు. ధరలు తగ్గించలేకపోయారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఇవ్వలేకపోయారు. విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ తెప్పిస్తామని వారితో లాలూచీ పడ్డారు. ముస్లింలకు వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టడమే అజెండాగా పెట్టుకున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు ఓటేసి ముస్లింలకు టీడీపీ ద్రోహం చేసింది. పేద ముస్లింల అభివృద్ధి కోసం వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చారని పవన్ మాట్లాడుతున్నాడు. ఆయనకు స్క్రిప్ట్ రాసిచ్చినోడు ఎవడో తెలియడం లేదు?. పవన్‌ను ఢిల్లీ తీసుకెళ్లి వక్ఫ్ సవరణ బిల్లుపై స్పీచ్ ఇప్పించాలి’’ అంటూ రామకృష్ణ ఎద్దేవా చేశారు.‘‘ఇప్పుడు ముస్లింలపై దాడి చేశారు. తర్వాత క్రిస్టియన్లు, దేవాలయాల స్థలాలపై పెత్తనం చేస్తారు. భారతదేశంలోని అన్ని మత సంస్థలపై పెత్తనం కోసమే ఈ వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సీపీఐ పెద్ద ఎత్తున పోరాటం చేపడుతోంది. ఈనెల 13వ తేదీన విజయవాడలో భారీ సదస్సు నిర్వహిస్తున్నాం’ అని రామకృష్ణ వెల్లడించారు. -
కూటమిలో కుంపట్లు రాజేస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు.. టీడీపీ శ్రేణులపై కేసులు
కాకినాడ జిల్లా,సాక్షి: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమెల్సీ నాగబాబు పర్యటన కూటమిలో కుంపట్లు రాజేస్తోంది. పిఠాపురంలో వరుస పర్యటనలు చేస్తున్న నాగబాబును టీడీపీ శ్రేణులు అడుగడునా అడ్డుకుంటున్నారు. ఈ తరుణంలో పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.శనివారం ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో భాగంగా గొల్లప్రోలు మండలం, చిన్న జగ్గంపేటలో టీడీపీ కార్యకర్తలు జనసేనకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఆహ్వానించడం లేదంటూ ఆయన అభిమానులు,టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఈ తరుణంలో తనను అడ్డుకుని మోటార్ సైకిల్ అద్దాలు పగలగొట్టారని టీడీపీ కార్యకర్తలపై జనసేన నేత మొయిళ్ళ నాగబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సంఘటనలో తమ విధులకు ఆటంకం కల్పించారని టీడీపీ కార్యకర్తలపై పిఠాపురం అడిషనల్ ఎస్సై జానీ భాష మరో ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై గొల్లప్రోలు పోలీసులు వేరు వేరుగా కేసులు నమోదు చేశారు.అంతకుముందు పిఠాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుమారపురంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్సీ నాగబాబు రాగా.. టీడీపీ, జనసేన కార్యకర్తలు బలాబలాలు ప్రదర్శించుకున్నారు. జై వర్మ, జై టీడీపీ అంటూ తెలుగుదేశం కార్యకర్తలు నినాదాలు చేయగా.. ప్రతిగా జై జనసేన, జై పవన్ అంటూ జనసైనికులు నినాదాలు చేశారు. సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలకు వర్మకు ఆహ్వానం లేదంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ తరుణంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంతో పిఠాపురం కూటమిలో నాగబాబు పర్యటన కుంపట్లు రాజేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
కూటమి కుట్ర.. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అరెస్ట్
సాక్షి, వైఎస్సార్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్ చేరుకున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసిన చంద్రబాబు సర్కార్.. అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లు చేస్తోంది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో అరెస్ట్‌కు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అరెస్ట్ చేసింది. అహ్మద్ బాషా ముంబై ఎయిర్‌పోర్టు నుంచి వస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే, అహ్మద్ బాషా గతంలో రాజీ పడిన ఓ కేసును కూటమి ప్రభుత్వం తిరగదోడింది. ఆ కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక, సదరు కేసులో ఇరు వర్గాలు ఇప్పటికే రాజీపడటం గమనార్హం. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా అహ్మద్‌ను ఇప్పుడు అరెస్ట్ చేసింది. -
అడుగడుగునా ఆధిపత్య పోరు
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నేత, ఎమ్మెల్సీ కె.నాగబాబు రెండో రోజు శనివారం నిర్వహించిన కార్యక్రమాలు రసాభాసగా జరిగాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అనుచరులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గెలుపు టీడీపీ నేత వర్మ వల్లే అయ్యిందని, తన నియోజకవర్గాన్ని, తనకు రావాల్సిన సీటును త్యాగం చేసిన ఆయనే లేకపోతే పవన్‌కు పదవి ఎక్కడిదని టీడీపీ వర్గాలు బాహాటంగా విమర్శిస్తూ నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతల తీరును దుయ్యబడుతూ జనసేన వర్గాలూ పోటీగా నినాదాలు చేశాయి. టీడీపీ నేతలను బయటకు గెంటేసే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా నాగబాబు మీడియాతో మాట్లాడుతూ, తాము అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తామని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి చేసి తీరుతామని చెప్పారు. నినాదాలు... ప్రతి నినాదాల హోరు పిఠాపురం మండలం కుమారపురంలో సీసీ రోడ్లు ప్రారంభించడానికి వచ్చిన నాగబాబు కాన్వాయ్‌ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. జై వర్మ అంటూ నినదిస్తూ నాగబాబుకు తమ నిరసన తెలిపేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ప్రతిగా జనసేన వర్గాలు నాగబాబుకు అండగా నినాదాలు చేశారు. ఇరు వర్గాలూ నినాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు దూసుకు వచ్చే ప్రయత్నం చేయడంతో కుమారపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా, గొల్లప్రోలు మండలంలో తమను అడ్డుకుని దౌర్జన్యానికి దిగారంటూ టీడీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు గొల్లప్రోలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఫొటో లేకుండా ఫ్లెక్సీలు, శిలాఫలకాలా? కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు కొత్త మాయాపట్నంలో తమ పార్టీ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో లేకుండా ఫ్లెక్సీలు, శిలాఫలకాలు పెట్టారంటూ టీడీపీ నేతలు నిరసన తెలిపి, నాగబాబును అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు నిలువరించారు. తమను కార్యక్రమాలకు ఆహా్వనించి అవమానించారంటూ టీడీపీ నేతలు జనసేన నేతలపై మండిపడ్డారు. అయితే కార్యక్రమాలకు వచ్చిన వారు హుందాగా వ్యవహరించాలి తప్ప దౌర్జన్యాలు, నిరసనలకు దిగడం ఏమిటని జనసేన వర్గాలు ఎదురు దాడికి దిగాయి. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. పోలీసులు వారిని వారించి, టీడీపీ వర్గాలను దూరంగా తరిమేశారు. ఈ వివాదాల నేపథ్యంలో నాగబాబు పర్యటనను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ నేతలు ప్రకటించి, అక్కడి నుంచి వెనుదిరిగారు. మీ పార్టీయే ఎమ్మెల్సీ ఇవ్వలేదు... మాకేంటి సంబంధం: జనసేన వర్గాలు వర్మకు అనుకూలంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంపై జనసేన వర్గాలు మండిపడుతూ.. ‘మీ పార్టీయే వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. దానితో జనసేనకు ఎటువంటి సంబంధం లేదు. అలాంటప్పుడు ఇక్కడ వర్మకు జిందాబాద్ కొడితే ఉపయోగం ఏమిటి’ అని టీడీపీ నేతలను పలుచోట్ల ఎద్దేవా చేయడం గమనార్హం. -
‘ఇసుక పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం’
తూర్పుగోదావరి జిల్లా: కూటమి ప్రభుత్వంలోని నేతలు ఇసుక పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామంలో కూటమి నేతల ఇసుక దందాపై తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు.అడ్డగోలుగా బాటలు వేసుకుని ఉచిత ఇసుక పేరుతో కూటమి నేతలు దందా సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక కోసం తీసిన గోతుల్లో పడి ఒక అమాఇయకుడు మృతి చెందడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన త్రిమూర్తులు.. ఇసుక పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమన్నారు.స్నానానికి దిగి యువకుడు గల్లంతుడాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం కేదార లంక గ్రామంలో స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఉచిత ఇసుక పేరిట గోదావరిలో భారీ గోతులు తీయడంతో యువకుడు గల్లంతయ్యాడు. ఐదుగురు స్నానానికి దిగగా, నీటిలో ఉన్న గోతులు పసిగట్ట లేక రొట్టె దుర్గాప్రసాద్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని వెలికి తీసి కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మోసం చేశావ్ చంద్రబాబూ.. అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్ బిల్లును అడ్డుకుంటామని చెప్పి చంద్రబాబు మోసం చేశారంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకునే రకం కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘పిల్లనిచ్చిన మామనే మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. గుజరాత్ అల్లర్ల సమయంలోనూ బాబు ముస్లింలను మోసం చేశారు’’ అని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.‘‘ఆ తర్వాత పదేళ్ల పాటు చంద్రబాబు అధికారానికి దురమయ్యాడు. ఇప్పటికే చంద్రబాబుకు 74 ఏళ్లు.. ఆయనకు భవిష్యత్ లేదు. చంద్రబాబు పాపాలకు లోకేష్ మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.కాగా, సీఎం చంద్రబాబు వక్ఫ్ సవరణకు బిల్లుకు మద్దతివ్వడం పట్ల టీడీపీకి చెందిన మైనార్టీ నేతల్లో కూడా తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. బిల్లుకు అనుకూలంగా ఓటేయడం ద్వారా ముస్లిం సమాజానికి టీడీపీ ఎంత ద్రోహం తలపెట్టిందో పార్లమెంట్ సాక్షిగా తేటతెల్లమైందనే చర్చ జరుగుతోంది. దీంతో పలువురు నేతలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు గ్రహించడంతో ఒత్తిడి పెరిగిన సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారు. ఈ క్రమంలో ఏమాత్రం ఉపయోగం లేని మూడు సవరణలను ప్రతిపాదించి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. -
చంద్రబాబు అసహనం.. జనానికి మళ్లీ క్లాస్ పీకేశారు..!
ఎన్టీఆర్ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ముప్పాలలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో భాగంగా చంద్రబాబు ప్రసంగం మొదలవ్వగానే జనం వెళ్లిపోయిందేకు సిద్ధమయ్యారు. ఇది చూసి చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తూ, అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ క్రమంలోనే చంద్రబాబు వారికి క్లాస్ పీకారు.‘ మిమ్మల్ని చూస్తుంటే ఒక సామెత గుర్తుకొస్తుంది.. గుర్రాన్ని తొట్టె దగ్గరగా తీసుకువెళ్లగలం కానీ నీరు తాగింలేం కదా’ అంటూ సామెత చెప్పుకొచ్చారు. ఇప్పుడు మీ తీరు కూడా ఇలానే ఉందన్నారు. ‘మీకోసం నేను అన్ని పనులు వదిలేసుకుని 2:30 అవుతున్నా భోజనం కూడా చేయకుండా ఉన్నా. నేను చెప్పేది అర్ధం చేసుకోండి. నేను చెప్పేది మీరు అర్ధం చేసుకోవాలి. ఆపై కార్యాచరణ స్పూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది’ అంటూ ప్రసంగించారు. -
ఆ డబ్బంతా ఎక్కడకు వెళ్లినట్టు? ఎవరి జేబుల్లో పడినట్టు?: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం తాజాగా పిలిచిన టెండర్లలో భారీ దోపిడీకి కూటమి ప్రభుత్వం సిద్ధమైందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపైకి రాజధాని అభివృద్ది మంత్రంను జపిస్తున్నా, దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి కుతంత్రం దాగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెబుతూనే వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి, దానిలోంచి కమీషన్ల రూపంలో జేబులు నింపుకునేందుకు చంద్రబాబు స్కెచ్ వేశారని ఆరోపించారు. సొమ్ము చంద్రబాబు జేబుల్లోకి, తెచ్చిన అప్పుల భారం ప్రజల నెత్తిన రుద్దే దుర్మార్గమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..అమరావతి నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తోంది. పైగా ఈ అప్పులన్నీ కూడా ఎఫ్ఆర్బీఎం పరిధిలో లేనివి. అంటే ఎఫ్ఆర్బీఎం పరిధిలో చేస్తున్న అప్పులకు, ఇవి కలిపితే రాష్ట్రం రుణాంధ్రప్రదేశ్‌గా మారిపోతుంది. అంతిమంగా ప్రజల నెత్తిమీద అప్పులు, వారి చేతిలో చిప్పలు పెట్టే కార్యక్రమంను చంద్రబాబు విజయవంతంగా ప్రారంభించారు. రాష్ట్ర అప్పులు రికార్డులు బద్ధలు కొట్టాయి. గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో అప్పు చేయలేదు. ఈ 11 నెలల కాలంలోనే చేసిన అప్పులు అక్షరాల రూ.1,47,655 కోట్లు.ఇందులో ఇప్పటికే అమరావతి కోసం నిర్ధారించుకున్న అప్పులు రూ.26,000 కోట్లు. ఈ రూ.26వేల కోట్లు కలుపుకుని అమరావతికి తెచ్చిన, తేవబోతున్న అప్పులు రూ.52 వేల కోట్లు. ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లు. జర్మనీ కెఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు. హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు. సీఆర్డీఏ కమిట్ అయిన అప్పులు మరో రూ.21 వేల కోట్లు. ఇలా రాజధాని పేరుతో చేసిన, చేస్తున్న అప్పులు రూ.52 వేల కోట్లు. ఇవన్నీ ప్రజలనెత్తిమీద వేస్తున్న భారం. మరి ఈ అప్పులతో ప్రజలకు అవసరమైన అంశాలకు కాకుండా, ఆర్భాటాలు పేరు చెప్పి, హంగులు పేరుచెప్పి, తమ పెద్దపెద్ద బొమ్మలు చూపించి భారీగా దుబారా చేయబోతున్నారు. ఈ దుబారాలో కొన్ని వేల కోట్ల రూపాయలు కమీషన్ల రూపంలో జేబుల్లో వేసుకుంటున్నారు.పెట్టుబడి వ్యయాలకు మొండిచేయిరాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కట్టడానికి, పోర్టులు కట్టడానికి, ఫిషింగ్ హార్బర్లు కట్టడానికి వీళ్లకు డబ్బులు లేవంటారు. వాటిని ప్రైవేటుకు తెగనమ్ముతున్నారు. కాని, అమరావతి కోసం మాత్రం అప్పు పరిమితి చట్టం దాటి మరీ అప్పులు చేసి ప్రజల చేతిలో చిప్ప పెట్టాలని చూస్తున్నారు. అంతేకాదు వీళ్లకు ఆరోగ్య శ్రీ నడపడానికి డబ్బుల్లేవంటారు, ఫీజు రియింబర్స్‌మెంట్ కోసం డబ్బుల్లేవంటారు, రైతుకు పెట్టుబడి సాయం చేయడానికి డబ్బుల్లేవంటారు.. చివరకు వాళ్లిచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అమలు చేయడానికీ డబ్బుల్లేవని అబద్ధాలు చెప్తున్నారు.ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు నిర్వహించడానికి డబ్బుల్లేవంటారు. మరి ఈ అమరావతి కోసం అప్పులు ఎక్కడనుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? ఇప్పటికే అమరావతి పేరు చెప్పి తాత్కాలికం పేరుమీద చంద్రబాబు వందలకోట్లు తగలేశారు. వెలగపూడిలో తాత్కాలిక గవర్నమెంటు కాంప్లెక్స్‌లో కేవలం ఆరు బిల్డింగుల కోసం చదరపు అడుగుకు సుమారు రూ.11వేల రూపాయలకుపైనే తగలబెట్టాడు. దాదాపు 6 లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణం చేసి ఇప్పుడు వాటి అసరం లేదు, మరొకటి కడతానని చెప్తున్నారు. ఈ ఆరు భవనాల నిర్మాణంలోనే అతిపెద్ద అవినీతి జరిగిందని, పెద్ద ఎత్తున కమీషన్లు వచ్చాయని, నిర్మాణాలు చేసిన కాంట్రాక్టు కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారని చంద్రబాబుకు ఎదుర్కొంటున్న ఐటీ కేసుల్లోనే బయటపడిందితాత్కలిక భవనాలకూ భారీ ఖర్చుతాత్కాలిక భవన నిర్మాణంలో ప్రభుత్వం తన సొంత బడ్జెట్ నుంచి కేటాయించిన నిధులకు తోడు, అదనంగా రూ.353 కోట్లు అప్పు చేసి హైకోర్టు సహా తాత్కాలిక అసెంబ్లీ భవనానలు నిర్మించింది. ఇంత డబ్బు తాత్కాలిక భవనాలకోసం ఖర్చు చేయడం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? ఈ భారం ఇప్పుడు ఎవరు మోస్తారు? ప్రజలు కాదా? ఇప్పుడు మళ్లీ శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాల కోసం సుమారు రూ.1650 కోట్లు ఖర్చుచేస్తున్నారు.మరి ఇంత డబ్బు ఖర్చు చేయాలనుకున్నప్పుడు గతంలో ఎందుకు తాత్కాలిక భవనాల పేరిట అంత డబ్బు ఖర్చు చేశారు? ఆరోజు ఆ ఆలోచన చేసిందీ చంద్రబాబే… ఇవాళ మళ్లీ కొత్త భవనాల పేరిట ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నదీ చంద్రబాబే? ఏమిటీ అరాచకం, ఏమిటీ దుర్మార్గం అడివారు లేరనే టెంపరితనమా? లేక అహంకారమా? ప్రజల భవిష్యత్తును ఆర్థిక అంధకారంలో నింపే ఇలాంటి దుర్మార్గపు చర్యలను కచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు.పార్లమెంట్, సుప్రీంకోర్ట్ కంటే పెద్ద నిర్మాణాలా...?హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులకు వేర్వేరుగా పిలిచిన టెండర్లలో ఎల్ అండ్ టీ, ఎన్సీసీ సంస్థలు రెండే బిడ్లు దాఖలు చేయడం ఇందులో గమ్మత్తైన విషయం. అంతా సిండికేట్. హైకోర్టు భవనానికి రూ.924.64 కోట్లు, అసెంబ్లీ భవన నిర్మాణ పనులను రూ.724.69 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఎక్కడైనా సరే.. రెండు బిల్డింగులు మీద ఇంత ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ప్రజల సొమ్మును ఇలా మీ కమీషన్లకోసం ధారపోస్తున్నారా? మీరు కట్టేవి సిమెంటు, ఇటుకలు కాకుండా బంగారపు ఇటుకలతో కడుతున్నారా? మన అవసరాలు ఏంటి? మీరు పెడుతున్న ఖర్చులు ఏంటి? ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని రూ.180 కోట్లతో, తాత్కాలిక హైకోర్టు భవనాన్ని రూ.173 కోట్లతో ప్రభుత్వం నిర్మించింది.ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టడంతో తాత్కాలిక భవనాలకు వెచ్చించిన రూ.353 కోట్లు వృథా అవుతాయి. అది కూడా అప్పు తెచ్చిందే కావడం గమనార్హం. ప్రస్తుతం శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్నది కూడా అప్పుగా తెచ్చిన నిధులతోనే. సుప్రీంకోర్టు కంటే పెద్దగా హైకోర్టు.. పార్లమెంటు కంటే పెద్దగా అసెంబ్లీ భవనాలను నిర్మిస్తుండటం వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఇదంతా దుబారా వ్యయమేనని, అప్పుగా తెచ్చిన నిధులను వృథా చేయడమే. సుప్రీంకోర్టు కంటే పెద్దగా, పార్లమెంటు కంటే పెద్దగా కట్టాల్సిన అవసరం మనకు ఉందా? అనే ఇంగితం కూడా అవసరం లేదా?దేశరాజధాని ఢిల్లీల్లో అత్యున్నత శానస వ్యవస్థ ఉండే పార్లమెంటు కొత్త భవనానికి పెట్టింది రూ.970 కోట్లు. కాని 175 మంది సభ్యులున్న కొత్త అసెంబ్లీకోసం చంద్రబాబు పెడుతున్నది రూ.724 కోట్లు. ఇది దోపిడీ కాదా? హైదరాబాద్‌లో కేసీఆర్‌గారు అద్భుతంగా సెక్రటేరియట్ కట్టారు. దాదాపు 10.5 లక్షల చదరపు అడుగుల స్థలంలో కట్టారు. దీనికోసం పెట్టిన ఖర్చు సుమారుగా రూ.600 కోట్లు. ఇవన్నీ శాశ్వత నిర్మాణాలు. ఇప్పుడు సెక్రటేరియట్ కోసం చంద్రబాబు పెడుతున్న ఖర్చు రూ.724 కోట్లు. అంతకన్నా గొప్పగా ఏముంటుంది? బంగారం వేసి కడుతున్నాడా? ఇప్పటికే తాత్కాలిక హైకోర్టుకు రూ.173 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు మళ్లీ పర్మినెంట్ హైకోర్టు పేరిట రూ.924.64 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కోర్టు కడుతున్నారా? లేక మరేమైనా కడుతున్నారా? ఈ భారం అంతా ప్రజల మీద కదా?రాజధాని నిర్మాణంలో అవినీతి పరుగులుఇప్పటికే అమరావతి నిర్మాణంలో చంద్రబాబు సర్కార్ అవినీతి కథలు రికార్డులమీద రికార్డులు సృష్టిస్తున్నాయి. అమరావతి హైవేల నిర్మాణంలో ఒక కిలోమీటర్ నిర్మాణానికి గరిష్టంగా రూ.53.88 కోట్లు చేస్తున్నారు. మీరేమైనా బంగారంతో రోడ్డు వేస్తున్నారా? చెప్పాలి. మంత్రులు, న్యాయమూర్తుల ఇళ్ల నిర్మాణాల్లో చదరపు అడుగుకు దాదాపు రూ.10వేలకు పైగా ఖర్చుచేస్తున్నారు. దేశంలో ఏ బంగ్లా అయినా సరే చదరపు అడుగుకు రూ.10 వేలు ఖర్చు చేశారా? హాపీ నెస్ట్ వెంచర్ కోసం ఇదివరకు చేసిన ఖర్చులకన్నా మరో రూ.818 ఖర్చు చేస్తున్నారు.చదరపు అడుగుకు అయ్యే ఖర్చు రూ.4500 నుంచి 3000 పెడితే ఫైవ్‌స్టార్ లగ్జరీ సదుపాయాలు వస్తాయి. ఇది దోపిడీ కాదా? ఫైవ్ స్టార్ కన్నా.. ఎక్కువ సదుపాయాలు హ్యాపీ నెస్ట్‌లో ఇస్తున్నారా? మరే కాంట్రాకర్టర్ రాకుండా బిడ్ వాల్యూను అకస్మాత్తుగా పెంచేసి కేవలం మీ సన్నిహితులకు మాత్రమే ఇచ్చుకున్నారు. రాజధానిలో ముంపు నివారణ, రహదారుల నిర్మాణం కోసం దాదాపు రూ.10,700 కోట్లకు పనులు పిలిస్తే అందులో చంద్రబాబు సన్నిహితుడైన బీఎస్సార్ ఇన్ఫ్రాకు, ఈనాడు ఎండీ కిరణ్‌కు బందువైన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌కు పనులు కట్టబెట్టారు. ఇది దోపిడీ కాదా? రాజధాని ప్రాంతంలో ముంపు లేదంటూనే ఐదు లిఫ్ట్‌లు పెడుతున్నారు.దీనికోసం పెడుతున్న ఖర్చు అక్షరాల రూ.1404 కోట్లు ఖర్చుచేస్తున్నారు. ముంపు లేకపోతే ఇంత ఎందుకు ఖర్చుచేస్తున్నారు? దీనికితోడు మరో ఆరు రిజర్వాయర్లుకూడా కడతానంటున్నారు. ఇంత డబ్బులు ఎవరికి ధారపోస్తున్నారు.11 నెలల్లో చంద్రబాబు సర్కార్ అప్పు రూ.1,47,655కళ్లార్పకుండా ఒక క్షణంలో వేయి అబద్ధాలు చెప్పేలా పోటీ పెడితే అందులో ఎలాంటి పోటీ లేకుండా చంద్రబాబుగారు వరల్డ్ ఛాంపియన్ అవుతారు. అబద్ధాలు, మోసమే ఆయన రాజకీయాలకు ప్రధాన పెట్టుబడి. అప్పులపై కూడా చంద్రబాబు చెప్పిన అబద్ధాన్ని పదేపదే చెప్తూ, తానిచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలనుంచి తప్పించుకునే ప్రయత్నంచేస్తున్నారు. కాని ఏరోజూ వాటికి ఆధారాలు కూడా చూపడంలేదు. మరోవైపు తాను ఎన్నడూలేని రీతిలో అప్పులు చేస్తూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. వాస్తవంగా రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంతంటే.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన, ప్రభుత్వ గ్యారంటీతో చేసిన, ప్రభుత్వ గ్యారంటీ లేకుండా ప్రభుత్వరంగ సంస్థలు చేసిన అప్పులతో కలిపి 2019 మార్చి నెలాఖరు నాటికి మొత్తం రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ.3,90,247 కోట్లు.2014-19లో ఆ ఐదేళ్లలో అప్పుల్లో పెరుగుదల 22.63శాతం. 2024 మార్చి నెలాఖరు నాటికి అప్పులు రూ.7.21 లక్షల కోట్లు. 2019-24 మధ్య ఐదేళ్లలో అప్పుల్లో పెరుగుదల 13.57 శాతం మాత్రమే. కోవిడ్‌లాంటి సంక్షోభాల ఉన్నాకూడా అన్ని పథకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంది. 2.73లక్షల కోట్లను డీబీటీ ద్వారా ప్రజలకు అందించింది. కాని, చంద్రబాబుగారు తన మొదటి ఆర్థిక సంవత్సరంలో చేసిన అప్పులు రూ.1,47,655 కోట్లు. ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. వైఎస్ జగన్ హయాం నాటి పథకాలను కూడా రద్దుచేశారు. మరి ఈ డబ్బంతా ఎక్కడకు వెళ్లినట్టు? ఎవరి జేబుల్లో పడినట్టు? -
‘ఆస్తులపై అందుకే షర్మిల దుష్ప్రచారం’
అనంతపురం, సాక్షి: ఆస్తుల పంపకాల విషయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై షర్మిల చేస్తున్న ఆరోపణలను మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి ఖండించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే చంద్రబాబు ఆమెను తెరపైకి తీసుకొచ్చారని అన్నారాయన. హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని ఈ నెల 8వ తేదీన వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైఎస్సార్సీపీ నేతలు శనివారం భేటీ నిర్వహించారు. అనంతరం సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘షర్మిల చెబుతున్న ఆస్తులు దర్యాప్తు సంస్థల నియంత్రణ లో ఉన్నాయి. ఆ ఆస్తులు ఇవ్వలేదంటూ వైఎస్ షర్మిల దుష్ర్పచారం చేస్తున్నారు. జగన్ - షర్మిల మధ్య కుదిరిన ఒప్పందం క్లియర్‌గా ఉంది. ఈనాడు ద్వారా కావాలనే జగన్‌పై దుష్ర్పచారం చేస్తున్నారు. టీడీపీ గ్రాఫ్ రోజురోజుకూ తగ్గుతోంది. ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఆమెను తెరపైకి తీసుకొచ్చారు. చంద్రబాబుకు మేలు చేసేందుకే షర్మిల అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని సతీష్ రెడ్డి అన్నారు.టీడీపీ నేతల డైరెక్షన్లోనే పోలీసులుటీడీపీ నేతల డైరెక్షన్ లోనే పోలీసులు పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఎస్పీ ఆదేశాల కన్నా టీడీపీ ఎమ్మెల్యే మాటకే సీఐలు, ఎస్సైలు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వర్యం చేసిందని ఆయన ధ్వజమెత్తారు.లింగమయ్య హత్యను ఖండిస్తున్నాంవైఎస్సార్ సీపీ నేత కురబ లింగమయ్య దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి శంకర్ నారాయణ. కురబ లింగమయ్య హత్యకు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తగిన మూల్యం చెల్లించోకతప్పదన్నారు. టీడీపీ హింసా రాజకీయాలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేస్తామన్నారు శంకర్ నారాయణ.పరిటాల సునీతవి హింసా రాజకీయాలురాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత హింసా రాజకీయాలు తీవ్రమవుతున్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎంపీపీ ఎన్నికల్లో బలం లేదంటూనే హింసకు పాల్పడ్డారని విమర్శించారు తోపుదుర్తి. ఈనెల 8వ తేదీన వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లిలో పర్యటిస్తారన్నారని, జగన్ పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హత్యకు గురైన వైఎస్సార్ సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారని ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో పోలీసుల నిర్లక్ష్యం వల్లే లింగమయ్య హత్య జరిగిందని,. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత రాజకీయ హత్యలను ప్రేరిపిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ గూండాల ఆగడాలపై నిరంతర పోరాటం చేస్తామన్నారు తోపుదుర్తి -
ముస్లింలకు చంద్రబాబు వెన్నుపోటు: ఖాదర్ బాషా
సాక్షి, తాడేపల్లి: దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా చంద్రబాబు చరిత్రహీనుడిగా నిలిచిపోతున్నారని వైఎస్సార్సీపీ ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ ఖాదర్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్దమైన బిల్లు ఆమోదం పొందేందుకు పూర్తి సహకారాన్ని అందించిన చంద్రబాబు ముస్లింల పట్ల తన వ్యతిరేక వైఖరిని చాటుకున్నారని మండిపడ్డారు. వక్ఫ్ భూములను కాజేసే కుట్రలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయ్యిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశానని గొప్పులు చెప్పుకునే చంద్రబాబు ముస్లింలు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోలేకపోవడం ఘోరం. ముస్లిం సమాజం మొత్తం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. ఒకపక్క బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లుకు ఏకపక్షంగా మద్దతు తెలిపిన చంద్రబాబు, సవరణలు సూచించామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ముస్లిం సమాజంలో వక్ఫ్ భూమి అంటే అల్లాకు చెందిన భూమి అని అర్థం. గడిచిన వందేళ్లుగా ఎంతోమంది దాతలు ముస్లింల సమాజ ఉద్ధరణ కోసం మంచి మనసుతో సేవాభావంతో దానమిచ్చిన భూమి అది. ఇది ప్రభుత్వ భూమి కాదు. ఈ భూమితో ప్రభుత్వానికి సంబంధం లేదు.వైఎస్సార్సీపీపై బురదచల్లాలని..వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలపడం పట్ల టీడీపీపై రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలలో తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో వైఎస్సార్సీపీ మీద బురదజల్లాలని సోషల్ మీడియా ద్వారా టీడీపీ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. లోక్‌సభలో ఈ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించిందని ఒకరోజు, రాజ్యసభలో మద్దతు తెలిపారని ఇంకోరోజు ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారానికి దిగింది. ఈ విధంగా ఇక్కడ కూడా చంద్రబాబు తన రెండు నాలుకల ధోరణి ప్రదర్శించారు.వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీలు మాట్లాడారు. లోక్‌సభలో ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేయగా, రాజ్యసభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విప్ కూడా జారీ చేశారు. బిల్లుకి వ్యతిరేకంగా ఓటేశారు. కానీ కొన్ని ఊరూపేరు లేని పత్రికల్లో పత్రికల్లో జగన్ ముస్లింలకు వెన్నుపోటు అంటూ టీడీపీ పెయిడ్ కథనాలు రాయించి ముస్లింలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు మద్దుతుగా వైయస్సార్సీపీ ఓటేసిందని రుజువు చేయాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరితే ఇంతవరకు టీడీపీ నుంచి సమాధానం లేదు. -
కొలికపూడిని అవమానించిన చంద్రబాబు!
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఏపీలో టీడీపీ దళిత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును అవమానించిన చంద్రబాబు ఘోరంగా అవమానించారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి రోజునే కొలికపూడికి అవమానం జరగడం గమనార్హం. చంద్రబాబుకు తాను నమస్కారం పెట్టి పలకరించినా అదేమీ బాబు పట్టించుకోలేదు.. కొలికపూడికి కరచాలనం కూడా చేయకుండానే వెళ్లిపోయారు.బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లలో పర్యటనకు వచ్చారు. ముప్పాళ్లలో హెలికాప్టర్ దిగిన చంద్రబాబు.. అక్కడున్న టీడీపీ నేతలను పలికరిస్తూ కరచాలనం చేస్తూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి కూడా చంద్రబాబుకు నమస్కరించారు.. ఆయన్ను చూసిన బాబు ముఖంలో సీరియస్‌నెస్ కనిపించింది. దీంతో, కొలికపూడిని పట్టించుకోకుండా.. చూసీచూడనట్టుగా బాబు ముందుకు సాగారు. ఇక, పక్కనే ఉన్న టీడీపీ ఇతర నేతలు కూడా ముందుకు రావడంతో కొలికపూడి వెనక్కి వెళ్లిపోయారు.టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడిని చంద్రబాబు కనీసం పట్టించుకోలేదు. కరచాలనం కూడా ఇవ్వలేదు. మరోవైపు.. ప్రజావేదిక స్టేజ్‌పైన కూడా కొలికపూడికి అవకాశం దక్కలేదు. చంద్రబాబు సెక్యూరిటీ.. కొలికపూడిని దూరంగా పంపించేసినట్టు తెలుస్తోంది. అయితే, బాబు జగజ్జీవన్ రామ్ జయంతి నాడే దళిత ఎమ్మెల్యేకు ఘోర అవమానం జరగడంతో ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన వ్యక్తి వైఎస్ జగన్’
సాక్షి, తాడేపల్లి: భారతదేశం గర్వించదగిన మహానాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని ప్రశంసించారు వైఎస్సార్సీపీ నాయకులు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగాయి. ఈ వేడుకల్లో మాజీమంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు అరుణ్ కుమార్, రమేష్ యాదవ్ , మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..‘అంటరానితనం , అస్పృశ్యతను ఎదుర్కొని స్వాతంత్ర పోరాటంలో బాబు జగజ్జీవన్ రామ్ పాల్గొన్నారు. ఆయన ఆశయాలు దేశమంతా కొనసాగాలి. ఆయన ఆలోచనలను భుజాన వేసుకున్న నాయకుడు వైఎస్ జగన్. అధికారం వస్తే బడుగు బలహీన వర్గాలను పైకి ఎలా తీసుకురావాలో చేసి చూపిన వ్యక్తి జగన్. గొప్ప ఆలోచనతో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ఏర్పాటు చేశారు. కానీ, ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద కరెంట్ లేని పరిస్థితి నెలకొంది. అంబేద్కర్ విగ్రహానికి దండేసే పరిస్థితి లేదు. ప్రైవేట్ వ్యక్తులతో వ్యాపారం చేయిస్తున్నారు. బాబు జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ ఆలోచనలకు తిలోదకాలిచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దళితులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎంతో మంది దళితులు ఊరు వదిలి వెళ్లిపోవడానికి కారణం ఈ ప్రభుత్వం కాదా. వైఎస్ జగన్ వెంట మనమంతా నడిస్తేనే భావితరాల ఆశయాలు నెరవేరతాయి. మా పార్టీ నాయకులను అన్ని రోజులు జైళ్లలో పెట్టాల్సిన అవసరం ఏముంది?. టీడీపీ నాయకులు తప్పులు చేయడం లేదా?.మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ..‘బాబు జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన వ్యక్తి వైఎస్ జగన్. గత ఐదేళ్లు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జగన్ కృషి చేశారు. ఐదేళ్ల పాలనలో ఎక్కడా రక్తం చిందిన పరిస్థితి లేదు. రాష్ట్రంలో కూటమి పది నెలల పాలనలో విధ్వంసం జరిగింది. ఎస్పీ, బీసీ, మైనార్టీ, ఎస్టీలపై అక్రమ కేసులు పెట్టారు. దాడులుఉ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోంది.ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ..‘బాబు జగజ్జీవన్ రామ్ రాజకీయంగా ఎన్నో అత్యున్నత పదవులు అలంకరించారు. ఆ స్థాయిలో దళితులకు అన్ని పదవులు ఇచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్. దళితులను హోంమంత్రి చేసిన ఘనత జగన్‌కే చెల్లింది. దళితులను ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరిగేలా చేశారు. ఆకాశమే హద్దులా దళితులకు జగన్ అవకాశం కల్పించారు. జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్. అందుకు ఉదాహరణే విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు. ఈ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహానికి కనీసం దండ కూడా వేయలేని పరిస్థితిలో ఉంది. ఈ ప్రభుత్వం దళితుల పట్ల చూపుతున్న వివక్షకు చరమగీతం పాడాలి. మాజీ ఎమ్మెల్యే, టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. ‘దళితులు, బలహీనవర్గాలు సముచితమైన స్థానం సాధించేందుకు బాబు జగజ్జీవన్ రామ్ కృషి చేశారు. జగజ్జీవన్ రామ్ అడుగుజాడల్లో వైఎస్ జగన్ నడుస్తున్నారు.మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ..‘సమాజంలో వెనుకబడిన వర్గాల కోసం పాటుపడిన మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్. చరిత్ర ఉన్నంత వరకూ ఈ సమాజం బాబు జగజ్జీవన్ రామ్ గుర్తుండిపోతారు. జగజ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం జగన్ పనిచేశారు అని అన్నారు. -
చంద్రబాబు తీరు రాష్ట్రప్రయోజనాలకే ప్రమాదకరం: చెల్లుబోయిన వేణు
రాజమహేంద్రవరం, సాక్షి: రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ను బ్యారేజీగా మార్చే కుట్రకు చంద్రబాబు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(Chelluboyina Venugopala Krishna) మండిపడ్డారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ఎత్తు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం వద్ద చంద్రబాబు రాజీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా కేంద్రం ముందు తాకట్టు పెడుతున్న చంద్రబాబు చరిత్రలో ద్రోహిగా మిగిలిపోవడం ఖాయమని అన్నారు. ‘‘రాష్ట్ర విభజన సమయంలో పోలవరం(Polavaram)ను జాతీయ ప్రాజెక్ట్‌గా కేంద్రమే నిర్మించి ఇస్తుందని, ఏపీకి ప్రత్యేకహోదాను ఇచ్చి ఆదుకుంటుందని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. విభజన తరువాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు ఏపీకి తీరని అన్యాయం చేశాడు. తన కమీషన్ల కోసం రాష్ట్రమే పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుందని కేంద్రాన్ని ఒప్పింది, అందుకు బదులుగా ప్రత్యేకహోదా హామీని వదులుకున్నారు. పోలవరంను అయినా నిర్మించారా అని చూస్తే ఆయన పాలనలో ఒక ప్రణాళిక లేకుండా, అస్తవ్యస్త విధానాలతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సర్వనాశనం చేశారు. .. పోలవరం కంటే ముందుగా స్పిల్‌వేను నిర్మించాల్సి ఉంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Govt) ఎటువంటి చొరవ తీసుకోలేదు. కేవలం తనకు కలిసి వస్తుందనే ఆలోచనతో అప్పర్, లోయర్ కాఫర్ డ్యాంలను చేపట్టాలని ప్రయత్నించారు. వాటిని పూర్తి చేయకుండా గ్యాప్‌లను ఉంచి, డయాఫ్రంవాల్ ను నిర్మించారు. అప్పర్ కాఫర్ డ్యాంలో స్పిల్ వే లేకపోవడం వల్ల కాఫర్ డ్యాంపై ఒత్తిడి పెరిగి వరదతో అవి దెబ్బతిన్నాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు తన నిర్వాకాన్ని కప్పిపుచ్చుకుంటూ అధికారంలో ఉన్న వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపైనే నిందలు మోపేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కేంద్రంలోని పోలవరం అథారిటీ దెబ్బతిన్న డయాఫ్రంవాల్ను పరిశీలించి నివేదిక అందించడంలో జాప్యం జరిగింది. అప్పటి వరకు పోలవరం పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎం కాగానే పోలవరంపై కొత్త అబద్దాలను తెర మీదికి తీసుకువచ్చారు. వైయస్ జగన్ కారణంగానే పోలవరం ఆలస్యమైందంటూ పచ్చి అబద్దాలను చెబుతున్నారు. పోలవరం నిర్మాణం 78 శాతం పూర్తయ్యిందని ఒకవైపు చంద్రబాబు ఊదరగొడుతుంటే, కాదు కేవలం 53 శాతం మాత్రమే పూర్తయ్యిందని కేంద్రం స్పష్టం చేసింది.కేంద్రంపై ఒత్తిడి తేవడంతో నిర్లక్ష్యంతాజాగా పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ, దానికి గానూ రూ.12,157.53 కోట్లు మాత్రమే కేంద్రప్రభుత్వం నుంచి చెల్లించడం జరుగుతుందని కేంద్ర జలశక్తి సంఘం వార్షిక నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. అంటే ముందు నుంచి భావిస్తున్న 45.72 మీటర్ల మేర పోలవరం నిర్మాణం ఉండదూ అనేది స్పష్టమవుతోంది. ఎత్తు తగ్గించడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన రూ.25వేల కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇందుకు గానూ పోలవరంను ఒక బ్యారేజీ స్థాయికి కుదించివేస్తున్నారు. ఇలా చేయడం వల్ల 164 టీఎంసీలకు బదులుగా కేవలం 115 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరిజిల్లాల ఆయకట్టు స్థిరీకరణకు కూడా నీటిని ఇవ్వలేని దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయి. వీటిపైన చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోకుండా ఎత్తు తగ్గింపుపైన కేంద్రంతో రాజీ పడ్డారు. టీడీపీ ఎంపీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. కీలకమైన పోలవరంపై చంద్రబాబు చిత్తశుద్దితో నిలబడితే కేంద్రం ఖచ్చితంగా దిగివచ్చి పోలవరంకు అవసరమైన నిధులు అందిస్తుంది. కానీ చంద్రబాబు మాత్రం ఆ పనిచేయడం లేదు. పోలవరంకు పట్టిన గ్రహణంలా చంద్రబాబు మారారు. గతంలో కూడా పోలవరంను ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తు ప్రధాని చేసిన వ్యాఖ్యలు నిజం చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యారో తెలియదు.చంద్రబాబు.. అబద్దాలపైన అబద్దాలుఎన్నికలకు ముందు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసింది, ఈ రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తోందని ఇదే చంద్రబాబు ఆరోపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అప్పులు ఒక సారి 12.5 లక్షల కోట్లు అని, మరోసారి రూ.10 లక్షల కోట్లు అని, ఆ తరువాత రూ.9 లక్షల కోట్లు అని తగ్గించుకుంటూ వచ్చారు. ఒక్కోసారి మీ అబద్దం ఒక్కో అంకెను చెబుతూ వచ్చింది. రాష్ట్రం మొత్తం అప్పులు చూస్తే రూ.5.62 కోట్లు అని కేంద్రం తేల్చి చెప్పింది. మొత్తం మీద మీరు ఎన్నికలకు ముందు చెప్పిన రూ.14 లక్షల కోట్ల అప్పులు లేవని మీరే అంగీకరించారు. ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే భయమేస్తోంది, రాష్ట్ర అప్పులు చూస్తే ఎలా ఈ పథకాలు ఇవ్వాలో అర్థం కావడం లేదు అంటూ చంద్రబాబు కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. రాష్ట్ర అప్పులు ఎన్ని ఉన్నాయో చాలా స్పష్టంగా తెలిసే కదా మీరు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు. అంతకన్న తక్కువ అప్పులే ఉన్నప్పుడు చాలా సులభంగానే సూపర్ సిక్స్‌ను అమలు చేయవచ్చు కదా? అంటే పేదలకు మేలు చేయాలనే మంచి ఆలోచనకు చంద్రబాబు ఎప్పుడూ వ్యతిరేకమే. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు సాకులు వెతుక్కుంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. పీ4 ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తానంటూ కొత్త డ్రామాలు చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రంలోని ఎనబైశాతం పేదలను ఇరవై శాతం ధనవంతులు దత్తత తీసుకుని, వారిని పేదరికం నుంచి విముక్తి చేస్తారంటూ రంగుల కలలను చూపిస్తున్నారు. అలాగే వక్ఫ్ సవరణ బిల్లుపైన కూడా వైయస్ఆర్సీపీపై తన సోషల్ మీడియా మూకను ప్రయోగించి తప్పుడ ప్రచారంకు తెగబడ్డారు. బిల్లుకు వైయస్ఆర్సీపీ రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటు వేయడానికి విప్ జారీ చేయలేదంటూ అబద్దాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే దిగజారుడు రాజకీయం చేస్తున్నారు అని వేణుగోపాలకృష్ణ అన్నారు. -
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు కుట్ర.. ఢిల్లీకి ఏపీ సీఐడీ
సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్‌కు ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి.మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ సీఐడీ.. ఇటీవలే హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని కోర్టుకు ఏపీ సీఐడీ తెలిపింది. దీంతో, మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. మిథున్ రెడ్డి అరెస్ట్ కోసం ప్లాన్ చేస్తున్నాయి. మరోవైపు.. మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక, మద్యం వ్యవహారంలో ఆది నుంచీ ఏపీ సీఐడీ పోలీసుల తీరు వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాజకీయ వేధింపులు, కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వ్యక్తులను బెదిరించి సీఐడీ తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంది. తప్పుడు వాంగ్మూలాల్లో తమకు కావాల్సిన వారి పేర్లను చెప్పించారు సీఐడీ అధికారులు. ఈ క్రమంలో తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా వారి అరెస్టుకు ముందడుగులు వేస్తున్నారు. అలాగే, తప్పుడు వాంగ్మూలాల్లో పేర్కొన్న వ్యక్తుల ఇళ్లలో సీఐడీ సోదాలు చేసింది. నిన్న హైదరాబాద్‌లో పలువురి ఇళ్లల్లో సోదాలు కొనసాగాయి. ఈ సోదాల సందర్భంగా ఇళ్లల్లో ఉన్న మహిళలను బెదిరింపులకు గురిచేసినట్టు సమాచారం. పోలీస్ స్టేషన్లకు రప్పిస్తామంటూ మహిళలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. -
నాగబాబు రాక.. పిఠాపురంలో మళ్లీ ఉద్రిక్తత
కాకినాడ, సాక్షి: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు(Nagababu) పర్యటన పిఠాపురం నియోజకవర్గంలో మరోసారి కాకరేపింది. వర్మ పేరిట ఆయనకు తెలుగు తమ్ముళ్లు మరోసారి షాక్ ఇచ్చారు. జై వర్మ(Jai Varma) నినాదాలతో నాగబాబుకు ఝలక్ ఇచ్చారు. ఈ క్రమంలో పసుపు జెండాలతో టీడీపీ బలప్రదర్శనకు దిగగా.. జనసేన కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పిఠాపురంలో తన సీటు త్యాగం చేసి మరీ పవన్ కల్యాణ్‌ను గెలిపించారని టీడీపీలో ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఎస్పీఎస్ఎన్ వర్మ మీద సానుభూతి ఏర్పడింది. అలాంటి వ్యక్తిని జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు తక్కువ చేసి మాట్లాడారని టీడీపీ శ్రేణులు, ఆయన అనుచరులు మండిపడుతున్నారు. పైగా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానికంగా వర్మకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోయింది. దీని వెనక కూడా నాగబాబు కుట్ర ఉందనే అభిప్రాయం వాళ్లలో బలంగా ఏర్పడింది. ఈ క్రమంలో నిన్న గొల్లప్రోలులోనూ అన్నాక్యాంటీన్ ప్రారంభ కార్యక్రమంలో రసాభాసా సృష్టించారు. తాజాగా కుమారపురంలోనూ వర్మకు మద్ధతుగా నినాదాలు చేస్తూ నాగబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇదీ చదవండి: వర్మ అవుట్.. ఇక పిఠాపురం జమీందార్‌గా కొణిదెల నాగబాబు -
చంద్రబాబు కొత్త రాగం.. ఏప్రిల్ ఫూల్ జోక్ ఇదేనేమో!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ కొత్తపాట ఎత్తుకున్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నొక్కిన బటన్లు అన్నీ తామిస్తున్న పెన్షన్‌తో సమానమని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ ఫూల్ జోక్ ఇదే కావచ్చు. ఏం చెబుతున్నానన్న దానితో నిమిత్తం లేకుండా చెప్పుకుంటూ పోవడమే ఆయన నైజంగా కనిపిస్తోంది ఇలాంటివి చూస్తూంటే. చంద్రబాబు తాలూకూ గొప్పలు ఇంకొన్నింటి గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి.ఒక కుటుంబానికి లేదా కొన్ని కుటుంబాలకు రూ.నాలుగు వేల చొప్పున ఇచ్చే పెన్షన్ల పంపిణీ చేయడానికి ఆయన లక్షలు ఖర్చు చేయడానికి వెనుకాడరు. అంతేకాదు.. ఈ నెల మొదటి తేదీన చంద్రబాబు పర్యటనలో మరో విచిత్రమూ కనిపించింది. తన సభకు రావాలని ఆయన దారిలో కనిపించిన వారినల్లా కోరుకున్నారు. దేశంలో మరే ముఖ్యమంత్రికి ఇలాంటి రికార్డు ఉండదేమో. ముఖ్యమంత్రి ప్రజల వద్దకు వెళ్లడం తప్పు కాదు కానీ పిడుక్కి, బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లు చిన్న, పెద్ద కార్యక్రమాలన్నింటికీ హెలికాఫ్టర్ వేసుకుని రాష్ట్రం అంతటా పర్యటించడం మాత్రం అంత హర్షణీయమైన విషయం కాదు.వృద్ధాప్య ఫించన్లున్ల పంపిణీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ దశాబ్దాలుగా సాగుతున్న విషయమే. గత ఎన్నికల్లో ఇచ్చిన అనేకానేక హామీలను ఎగ్గొట్టిన బాబుగారు ఫించన్ మొత్తాన్ని వెయ్యి రూపాయలైతే పెంచారు. అయితే, పెంచిన మొత్తాన్ని పంపిణీ చేసేందుకు నెల నెలా ముఖ్యమంత్రి వెళ్లడం ఏమిటో? హెలికాప్టర్ ఖర్చుతోపాటు సీఎం పర్యటన ఖర్చులు తడిసి మోపెడవుతాయి. సూపర్ సిక్స్ ఎగ్గొట్టిన విషయాన్ని మరపించేందుకు ఇలా చేస్తున్నారేమో మరి!.వైఎస్ జగన్ హయాంలో వలంటీర్లు మాత్రమే ఫించన్లు పంపిణీ చేసేవారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ప్రతినెల ఒకటవ తేదీన తెల్లవారుజామునే ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేవారు. ఇది వృద్ధులకు ఎంతో సౌకర్యంగా ఉండేది. జగన్‌కూ మంచి పేరు తెచ్చింది. 2019లో చంద్రబాబు ప్రభుత్వం ముగిసేనాటికి ఫించన్ల మొత్తం రూ.రెండు వేలు ఉంటే, జగన్ ఏటా రూ.250 చొప్పున పెంచుకుంటూ రూ.మూడు వేలకు తీసుకెళ్లారు. అది కూడా ఇంటివద్దే అందేది. అంతకుమునుపు మాదిరిగా మండల కార్యాలయాల చుట్టూ లేదా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన ఖర్మ వృద్ధులకు తప్పింది. ఇలాంటి సువ్యవస్థితమైన వ్యవహారాన్ని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేనలు చెడగొట్టాయి. జగన్‌కు మంచిపేరు రాకూడదన్న ఉక్రోశంతో వలంటరీ వ్యవస్థలపై అవాకులు చెవాకులు మాట్లాడారు.అయితే, జనం నుంచి వచ్చిన నిరసన చూసిన తరువాత మాటమార్చారు. తాము అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని కూడా నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాటలోనే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఫించన్లయితే ఇస్తున్నారు కానీ.. కొన్నిచోట్ల ఇది సరిగా జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా ఫించన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా బాపట్ల జిల్లాలో చంద్రబాబు చేసిన ప్రసంగం అందరిని నివ్వరపోయేలా చేస్తుంది. జగన్ ను ఉద్దేశించి గతంలో బటన్లు నొక్కేవారని, ఆ బటన్లు అన్నీ కలిపి తామిచ్చే ఫించన్లకే సమానం అని కొత్త అసత్యాన్ని సృష్టించారు. మొత్తం 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, దేశంలో మరే రాష్ట్రంలో ఇలా ఇవ్వడం లేదని తన గొప్పగా ప్రచారం చేసుకున్నారు. నిజానికి జగన్ టైమ్‌లో ఫించన్ల సంఖ్య 66 లక్షలకు చేరింది. ఇప్పుడు రెండు లక్షలు తగ్గింది.2019 వరకు చంద్రబాబు టైమ్‌లో అందిన ఫించన్లు సుమారు 44 లక్షల మందికే. ఇప్పుడు పెరిగిన పెన్షన్లు అన్ని తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు తాపత్రయ పడ్డారన్నమాట. అప్పట్లో బటన్లు నొక్కితే ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత తాను అంతకన్నా ఎక్కువ బటన్లు నొక్కుతానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చేశారు. అయినా జగన్ కన్నా సంక్షేమానికి తానే ఎక్కువ మొత్తం ఇస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడానికి యత్నించారు. జగన్ టైమ్ కన్నా రూ.వెయ్యి ఎక్కువ ఇస్తే, ప్రభుత్వానికి అయ్యే అదనపు వ్యయం సుమారు 640 కోట్లే. మరి దీంతోనే జగన్ కన్నా ఎక్కువ సంక్షేమం అందించినట్లు ఎలా అవుతుంది?. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఏభై ఏళ్లకే ఫించన్ ఇస్తామని ఇచ్చిన హామీ గురించి మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మాట్లాడరు.జగన్ తను ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి రూ.ఏభై వేల కోట్ల స్కీములకు అమలు చేశారు. చంద్రబాబు యథాప్రకారం వీటిపై అసత్యాలను ప్రచారం చేసి వచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అట. గత ప్రభుత్వం నుంచి పది లక్షల కోట్ల రూపాయల అప్పులకు వడ్డీ కట్టాలట. ఇవి ఎంత నిజమో ఇప్పటికే ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలియచేసింది. జగన్ టైమ్‌లో కరోనా రెండేళ్లు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించినా, ఏ నెలా జీతాలు ఆపలేదు. ఇప్పుడేమో జీతాలకు డబ్బులు లేవంటున్నారు. 2019లో చంద్రబాబు దిగిపోయినప్పుడు ప్రభుత్వ ఖజానాలో కేవలం వంద కోట్లే మిగిల్చి వెళ్లారు. కానీ, 2024లో జగన్ ప్రభుత్వం తప్పుకునే నాటికి ఖజానాలో ఏడు వేల కోట్ల రూపాయలున్నాయి. పోనీ, చంద్రబాబు చెప్పినట్లు పది లక్షల కోట్ల అప్పు ఉందని అనుకున్నా, దానిలో ఆయన 2014-19 మధ్య చేసిన అప్పు ఎంత? 2024లో అధికారంలోకి వచ్చాక చేసిన అప్పు ఎంత? విభజన ద్వారా వచ్చిన అప్పు వాటా ఎంత? అన్నది చెప్పకుండా మొత్తం జగన్ ఖాతాలో వేసి దుష్ప్రచారం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పింది చంద్రబాబే, బడ్జెట్లో అది ఆరున్నర లక్షల కోట్లేనని తేల్చిందీ చంద్రబాబు ప్రభుత్వమే. అయినా పది లక్షల కోట్ల అప్పు అని అబద్దాలు చెబుతున్నది ఆయనే. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఇప్పటికే లక్ష ముప్పై వేల కోట్లకు పైగా అప్పు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది చంద్రబాబే. 14 లక్షల కోట్ల అప్పు ఉందంటూనే, తాను అధికారంలోకి వస్తే అప్పు చేయకుండా సంపద సృష్టించి పేదలకు స్కీములు అమలు చేస్తానని బొంకింది కూటమి పెద్దలే కదా!. ఇప్పుడేమో ఆరున్నొక్క రాగం ఆలపిస్తున్నది వారే. అంతేకాక అమరావతి రాజధానిని నిర్మించడం ద్వారా సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమం అందిస్తానని ఈ విడత చెప్పారు. అంటే ఏమిటి దీని అర్ధం. ఇప్పట్లో సూపర్ సిక్స్ అమలు చేయనని అనడమా?. అదే టైమ్ లో మేలో కొన్ని స్కీములు అమలు చేస్తామని అంటారు.ఈ సభకు అంతా రావాలని దారిలో కనిపించిన వారినల్లా కోరుతూ ముఖ్యమంత్రిగా ఆయన మరో సంప్రదాయం నెలకొల్పారు. ప్రజలు తన సభకు రావడం లేదనో, లేక వచ్చినా వెళ్లిపోతున్నారనో ఇలా దండోరా వేసినట్లుగా చెప్పి ఉండాలి. అలా వచ్చిన వారిలో ఒక యువకుడు తన అర్జీని ఇవ్వబోతే మాత్రం అతనిని వేరే రాజకీయ పార్టీ వ్యక్తి అని, అతని సంగతి తమ వాళ్లు చూసుకుంటారని బెదిరించడం ఏమిటో అర్థం కాదు. ఏది ఏమైనా చంద్రబాబు ప్రభుత్వ కాలం పూర్తి అయ్యే సరికి ప్రజలు ఇంకెన్ని అసత్యాలను వినాలో!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కీచకులకు చంద్రబాబు సర్కార్ అండదండలు: కాకుమాను
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందని వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే మైనర్ బాలికపై లైంగికదాడి జరిగితే, కారకుడైన నిందితుడికి అధికారపార్టీ అండగా నిలవడం దారుణమన్నారు. తమ పార్టీకి చెందిన వ్యక్తులు ఎటువంటి ఘాతుకాలకు పాల్పడినా వారికి రక్షణ కల్పించాలన్న రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే..సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈనెల 2వ తేదీన 12 ఏళ్ల మైనర్ బాలికపై గిడ్డెగానిపెంట గ్రామానికి చెందిన ఆర్.రమేష్ అనే టీడీపీ కార్యకర్త లైంగిక దాడి చేశాడు. పోలీస్ విచారణలో ఆ బాలికపై నిందితుడు రమేష్ అత్యాచారం చేసినట్టు నిర్ధారణ కావడంతో పోక్సో కేసు నమోదు చేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో వెంటనే అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనితో నిందితుడు పరారయ్యాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం చూసి రాష్ట్రమంతా నివ్వెరపోయింది.ఈ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకుంటారని భావిస్తున్న తరుణంలో ఏకంగా కేసును రాజీ కుదిర్చేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు రంగంలోకి దిగడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. తమ పార్టీకి చెందిన కార్యకర్తను కాపాడుకునేందుకు తెలుగుదేశం నేతలు ఏకంగా బాలిక తండ్రిని బెదిరించి, బలవంతంగా లక్ష రూపాయలకు రాజీకి రావాలని ఒత్తిడి చేశారు. దీనిలో భాగంగా రూ.20 వేలు కూడా అడ్వాన్స్‌గా చెల్లించారు. తన నియోజకవర్గంలోనే ఇటువంటి దారుణం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదు? అంటే తన పార్టీకి చెందిన వారు ఏది చేసినా అది సమంజసమేనని సమర్థిస్తున్నారా?గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహించే పిఠాపురం నియోజకవర్గంలో బాలికపై తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కార్పోరేటర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆడబిడ్డలపై దాడులు చేసే వారికి అదే వారి ఆఖరి రోజు అంటూ గొప్పగా ప్రకటనలు చేసిన చంద్రబాబు తమ పార్టీ వారే కీచకులుగా మారి మహిళలు, బాలికలపై లైంగికదాడులకు పాల్పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మహిళల రక్షణ అంటూ మాట్లాడే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంలో జరిగిన ఇటువంటి దారుణాలపై నోరు మెదపడం లేదు.దిశయాప్‌ను నిర్వీర్యం చేశారురాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. వ్యవసనాల బారిన పడిన ఆకతాయిలు బాలికలపైనా, మహిళలపైనా దాడులకు తెగబడుతున్నారు. గతంలో మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన దిశయాప్‌ను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎంతో గొప్పగా శక్తీయాప్ను తీసుకువచ్చామని ప్రచారం చేసుకుంది. అయినా కూడా రాష్ట్రంలో ప్రతిచోటా మహిళలపై ఈరకమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటిని నివారించే చిత్తశుద్ది కూటమి ప్రభుత్వంలో కనిపించడం లేదు