breaking news
-
చీరాలలో హత్యాచారం!
చీరాల: బహిర్భూమికి వెళ్లిన యువతి(21)పై లైంగిక దాడికి పాల్పడి పాశవికంగా హతమార్చిన ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. కొన్నేళ్ల క్రితం నెల్లూరు జిల్లా గూడూరు నుంచి వలస వచ్చిన బాధితురాలి కుటుంబం చీరాల రూరల్ మండలం ఈపూరుపాలెంలోని సీతారామపురంలో నివసిస్తోంది. ఇంటర్ పూర్తి చేసిన బాధితురాలు రెండేళ్లుగా ఇంటి వద్ద టైలరింగ్ పనులతో కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు చేనేత మగ్గం పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. బాధితురాలు పెద్ద కుమార్తె. శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు బహిర్భూమికి వెళ్లిన బాధితురాలు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అనుమానంతో తండ్రి వెళ్లి చూడగా శరీరంపై దుస్తులు లేకుండా నిర్జీవంగా పడి ఉండటం చూసి భీతిల్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తును ముమ్మరం చేసేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. కొందరు యువకులు మద్యం తాగుతూ బహిర్భూమికి వెళ్లే మహిళల పట్ల ఆ ప్రాంతంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గంజాయి ముఠా పనే! సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హోంమంత్రి వంగలపూడి అనిత సాయంత్రం ఘటనా స్థలానికి చేరుకుని కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోయిన ప్రాణాన్ని తీసుకురాలేమని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని మృతురాలి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అనంతరం చీరాల ఏరియా వైద్యశాలలో యువతి మృతదేహాన్ని పరిశీలించారు. బాధితురాలిపై గంజాయి ముఠా అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన ఘటన కలిచివేసిందన్నారు. చేనేత మగ్గం పనులపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబంలో యువతి హత్యకు గురికావడం దారుణమన్నారు. 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలో నార్కోటెక్ సెల్ ఏర్పాటుకు పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు. గంజాయి ఆగడాలను అడ్డుకట్ట వేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేíÙయాను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అందజేశారు. -
సర్పంచ్ కుమారుడి కారు ధ్వంసం
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత వరి శ్రీదేవి కుమారుడి కారును గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈనెల 5వ తేదీరాత్రి ప్రసాదంపాడుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కొమ్మా కోట్లు కారు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే మళ్లీ అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ టీడీపీ నాయకులు ఇటువంటి దాడులకు తెగబడుతున్నారని ఆరోపిస్తున్నారు. సేకరించిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ సీపీకి చెందిన రామవరప్పాడు గ్రామ సర్పంచ్ వరి శ్రీదేవి కుమారుడు గణేష్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల రామవరప్పాడుకు తన కుటుంబంతో కలిసి కారులో వచ్చారు. తన కారును రైవస్ కాలువ వంతెన సమీపంలోని కృష్ణుడి బాల ఆలయం (కోర్టులో వేయడంతో నిర్మాణం ఆగింది) వద్ద పార్కింగ్ చేశాడు. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగకుండా కృష్ణుడి బాల ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహాలను దొంగిలించారు. తెల్లారిన తర్వాత కారుపై దాడి విషయాన్ని గమనించి పటమట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనలు బయటకు రాకుండా పోలీసులు గోప్యంగా ఉంచడానికి గల కారణాలు ఏమిటని ప్రశి్నస్తున్నారు. పటమట సీఐ మోహన్‌రెడ్డిని వివరణ కోరేందుకు ప్రయతి్నంచగా ఫోన్‌కు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. -
కొనసాగుతున్నవిధ్వంసం
ద్వారకాతిరుమల/తాడేపల్లిగూడెం/గోపాలపురం: అధికారమే అండగా టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా శిలాఫలకాలను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. పలు ప్రాంతాల్లో గురువారం కూడా యథేచ్ఛగా విధ్వంసం సాగించారు. ఏలూరు జిల్లాలో సీసీ రోడ్డు శిలాఫలకం ధ్వంసంఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. అంతేకాకుండా విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం కిటికీ అద్దాలను పగులగొట్టాయి. ఇలా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఏమిటని గ్రామస్తులు మండిపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ..పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 14వ వార్డు సత్యనారాయణపేటలో టీడీపీ కార్యకర్తలు సిమెంటు రోడ్డు, డ్రెయిన్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. సత్యనారాయణ పేటలో రెండేళ్ల క్రితం రూ.9 లక్షల నిధులతో సిమెంటు రోడ్డు, డ్రెయిన్ నిర్మించారు. తాజాగా ఈ శిలాఫలకాన్ని నాశనం చేశారు. ‘తూర్పు’లో శిలాఫలకం పగులకొట్టి.. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటాయపాలెంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు సచివాలయ నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని పగులకొట్టారు. అంతేకాకుండా సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన వెంకటాయపాలెం – గౌరీపట్నం రోడ్డు శిలాఫలకాన్ని ధ్వంసం చేసి తుప్పల్లో పడేశారు. దీంతో వెంకటాయపాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పికెట్ ఏర్పాటు చేశామని ఎస్సై సతీష్‌కుమార్ తెలిపారు. -
వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై హత్యాయత్నం
రాయచోటి: ఎన్నికల ముందురోజు వరకు ప్రశాంతంగా ఉన్న అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో టీడీపీ నేతలు వరుస దాడులతో అరాచకం సృష్టిస్తున్నారు. కౌంటింగ్ ముగిసిననాటి నుంచి టీడీపీ రౌడీలు వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని హత్యాయత్నాలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి రాయచోటి టీడీపీ నేత సయ్యద్ ఖాన్ కొంతమంది రౌడీలతో వైఎస్సార్సీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాత్రి 11.30 గంటల సమయంలో నాలుగో వార్డు కౌన్సిలర్ హారూన్ బాషా ఇంటి వద్దకు వెళ్లి ఇంట్లో నుంచి బయటికి రావాలని, చంపుతామంటూ టీడీపీ రౌడీలు కేకలు వేశారు. ఆ సమయంలో హారూన్ ఇంటిలో లేకపోవడంతో ఆయన తల్లి బయటకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారిని ప్రాధేయపడ్డారు. అయినా వినని టీడీపీ రౌడీలు పెద్ద బండరాళ్లతో ఇంటి ఆవరణలో ఉన్న బైక్‌ను ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పీఏ నిస్సార్ అహ్మద్‌ను కూడా చంపుతామంటూ కేకలు పెడుతూ వెళ్లిపోయారు. ఆ తర్వాత వీధుల్లో బైకులపై కేకలు వేసుకుంటూ 7వ వార్డు కౌన్సిలర్ మున్నీసా ఇంటికి వెళ్లి ఆమె భర్త ఇర్ఫాన్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. టీడీపీ రౌడీల దాడిలో ఇర్ఫాన్ కత్తిపోట్లకు గురయ్యారు. ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి. ఆయనను కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు టీడీపీ నేత సయ్యద్ ఖాన్, బాబ్జీ, ఫిరోజ్ ఖాన్, శివారెడ్డి, అఫ్రోజ్, అబూజర్లను అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి, డీఎస్పీ రామానుజులు టీడీపీ నేతలపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కౌంటింగ్ నాటి నుంచే వరుస దాడులు..ఈనెల నాలుగో తేదిన ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాగానే అదే రోజు రాత్రి రాయచోటి రూరల్ మండలం ఎండపల్లి పంచాయతీ బోయపల్లిలో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో సుబ్బారెడ్డి సోదరుడు, మరొకరు గాయాలపాలయ్యారు. ఇంటి ముందు ఉన్న కారును కూడా ధ్వంసం చేశారు.అలాగే వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిగా ఉన్న ఆర్టీసీ కండక్టర్ రామ్మోహన్ ఇంటిపై దాడులకు తెగబడి ఆయన బైకును తగులబెట్టారు. ఇలా రాయచోటిలో టీడీపీకీ చెందిన రౌడీ మూకలు, గ్యాంగ్‌లు దాడులు చేయడమే కాకుండా ఫోన్ల ద్వారా తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపుతామని బెదిరిస్తున్నారు.టీడీపీ రౌడీమూకల దాడులు దారుణంరాయచోటిలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపైన టీడీపీ రౌడీ మూకలు దాడి చేయడం దారుణమని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశాంత వాతావరణానికి అలవాటుపడిన రాయచోటి ప్రజలను ఈ రకమైన దాడులు చేసి భయాందోళనలకు గురి చేయడం సరికాదన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. అధికారమనేది ఎవరికీ శాశ్వతం కాదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరిపైనా కక్షపూరిత రాజకీయాలు చేయ లేదని గుర్తు చేశారు. టీడీపీ రౌడీలు అర్ధరాత్రి వేళ మద్యం తాగి గుంపులుగా వచ్చి తమ పార్టీ కౌన్సిలర్లపై దాడులు చేయడం దారుణమన్నారు.రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు ఆయన ఫోన్ చేసి పరామర్శించారు. ప్రస్తుతం తాను విజయవాడలో ఉన్నానని, త్వరలో బాధితులను కలుస్తానని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
రైలు పట్టాలపై ఇనుప స్తంభాలు.. ధర్మవరంలో తప్పిన ప్రమాదం
శ్రీసత్యసాయి, సాక్షి: జిల్లాలో గత అర్ధరాత్రి లోకో పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఇనుప స్తంభాలు ఉంచారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆకతాయిల పనిగా భావిస్తున్న రైల్వే పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
కొనసాగుతున్న టీడీపీ విధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తల విధ్వంసం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ జెండా దిమ్మ, ప్రగతిపనుల శిలాఫలకాలను ముక్కలు చేశారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండల కేంద్రంలోని గమేషన్ మిల్లు సెంటర్లో వైఎస్సార్సీపీ మండల కార్యాలయం సమీపంలోని ఆ పార్టీ జెండా దిమ్మను సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బుద్ధాం గ్రామంలో సచివాలయ శిలాఫలకాన్ని సోమవారం తెలుగుదేశం కార్యకర్త పొలుగుతో పొడిచి ధ్వంసం చేశాడని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. వైఎస్సార్సీపీ జెండా దిమ్మను, సచివాలయ శిలాఫలకాన్ని ధ్వంసం చేసినవారిని అరెస్టుచేసి చట్టప్రకారం శిక్షించాలని వైఎస్సార్సీపీ కర్లపాలెం మండల అధ్యక్షుడు యల్లావుల ఏడుకొండలు, నల్లమోతువారిపాలెం సర్పంచ్ మాడా సుబ్రమణ్యం, బాపట్ల ఏఎంసీ మాజీ చైర్మన్ దొంతిబోయిన సీతారామిరెడ్డి డిమాండ్ చేశారు. వారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం కర్లపాలెం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ రహీమ్రెడ్డికి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా సీతారామిరెడ్డి మాట్లాడుతూ గణపవరం పంచాయతీ వార్డు మెంబరైన పి.నాగరాజురెడ్డిపై ఇటీవల దాడిచేసిన వారిమీద కూడా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లినవారిలో కర్లపాలెం ఎంపీటీసీ సభ్యుడు ఎస్కె ఆసిఫ్ అలీ, పేరలి సర్పంచ్ మల్లెల వెంకటేశ్వర్లు, పెదగొల్లపాలెం సర్పంచ్ యల్లావుల సురేష్, వైఎస్సార్సీపీ నాయకులు ఆట్ల నాగేశ్వరరెడ్డి, సమ్మెట వెంకటేశ్వరరెడ్డి, దొంతిరెడ్డి జయభారత్‌రెడ్డి, సలగల ధర్మేంద్ర, తాజుద్దీన్, షంషీర్, మనోహర్, మహేష్, నాగరాజురెడ్డి తదితరులున్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు ఓ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఎంపీ ఆర్.కృష్ణయ్య ఎంపీ కోటా నిధుల నుంచి గ్రామాభివృద్ధికి రూ.20 లక్షలు మంజూరు చేయగా.. తిమ్మాపురం నుంచి గ్రామంలోకి వచ్చే రహదారిలో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మించారు. అప్పట్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సోమవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు మద్యం తాగి ఈ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేట పంచాయతీ కొమిరేపల్లికి వెళ్లే రోడ్డులో ఉన్న శిలాఫలకాన్ని టీడీపీ కార్యకర్తలు సోమవారం ధ్వంసం చేశారు. ఆ శిథిలాలను మంగళవారం వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి పులవర్తి సంతోష్, పార్టీ నాయకులు రాజు, గంటా పండు, దిలీప్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా గుండుగొలను రోడ్డు నుంచి కొమిరేపల్లి గ్రామానికి రాకపోకలకు నరకాన్ని చవిచూశామని చెప్పారు. గత ఎన్నికల్లో కొఠారు రామచంద్రరావు పల్లె నిద్ర సమయంలో కొమిరేపల్లికి తారురోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కొఠారు అబ్బయ్యచౌదరి ఎమ్మెల్యేగా గుండుగొలను రోడ్డు నుంచి కొమిరేపల్లి గ్రామానికి కిలోమీటరున్నర మేర రూ.కోటికిపైగా వ్యయంతో తారురోడ్డు నిర్మించారని చెప్పారు. మాజీ సీఎం, మాజీ ఎమ్మెల్యే ఫొటోలున్న శిలాఫలకాన్ని కూల్చివేయడం, అగౌరవపర్చడం బాధాకరమని పేర్కొన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన శిలాఫలకం ఫొటోలను పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏపీ ఆయిల్ ఫెడ్ మాజీ చైర్మన్ కొఠారు రామచంద్రరావుకు పంపించారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలోని గ్రామ సచివాలయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రంతో ఉన్న శిలాఫలకాన్ని తెలుగుదేశం కార్యకర్త మంగళవారం ధ్వంసం చేశాడు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి పాలా శారదా శ్రీనివాస్‌ను అడగగా.. తాను కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఈ దుశ్చర్య జరిగినట్టు తెలిసిందన్నారు. దీనిపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. -
ఆన్లైన్ మోసాలకు అంతేలేదు
దేశంలో ఆర్థిక మోసాలు పెచ్చరిల్లుతున్నాయి. వినియోగదారుల ఆర్థిక డేటా వివరాలు అంగట్లో సరుకులా అమ్ముడవుతున్నాయి. గడిచిన మూడేళ్లలో పట్టణ భారతీయుల్లో అధిక శాతం మంది క్రెడిట్ కార్డు మోసాలకు గురయ్యారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతుంది. ఆ తర్వాత.. నిత్యం లావాదేవీలకు కోసం వాడే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా సరికొత్త చోరీలు తెరపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలోని వేలాది మంది డేటా విక్రేతల ద్వారా దేశీయ వినియోగదారుల క్రెడిట్ కార్డు సమాచారం మార్కెట్లో సులభంగా లభిస్తోందని సోషల్ మీడియా రీసెర్చ్ ఫ్లాట్‌ఫారం సంస్థ లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది. సాక్షి, అమరావతిక్రెడిట్ కార్డుల ద్వారా 43శాతం మోసాలు..దేశవ్యాప్తంగా గడిచిన 36 నెలల్లో ఏకంగా 47 శాతం మంది పట్టణ భారతీయులు, వారి కుటుంబ సభ్యులు ఆర్థిక మోసాల బారినపడినట్లు నివేదిక పేర్కొంది. 43 శాతం మంది తమ క్రెడిట్ కార్డు ద్వారా.. 30 శాతం మంది యూపీఐ లావాదేవీల ద్వారా మోసపోయారు. క్రెడిట్ కార్డు ద్వారా జరిగిన మోసాల్లో దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు దేశీయ, అంతర్జాతీయ వ్యాపారులు వెబ్సైట్ల ద్వారా అనధికారిక చార్జీల మోతను భరించాల్సి వచి్చంది. బ్యాంకర్ల పేరుతో ఫోన్లుచేసి ఓటీపీలు ద్వారా డెబిట్ కార్డు వివరాలు అప్డేట్ చేయాలంటూ ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు. ఇక యూపీఐ ద్వారా ఆన్లైన్ దోపిడీ విషయంలో ప్రతి పదిమంది బాధితుల్లో నలుగురు చెల్లింపునకు అంగీకరించడానికి పంపించే లింక్‌ను క్లిక్, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా డబ్బులను పోగొట్టుకున్నారు. ఇక యూపీఐ, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆ అధ్యయనం అభిప్రాయపడింది. ఆర్బీఐ, యూపీఐ.. క్రెడిట్ కార్డులు జారీచేసే బ్యాంకులు ఇలాంటి ఆరి్థక మోసాలను నిరోధించేందుకు మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని తేల్చిచెప్పింది. సైబర్ క్రైం పోలీసుస్టేషన్లు, నిమిషాల వ్యవధిలో ఆన్లైన్ ఫిర్యాదును ఫైల్‌చేసే వ్యవస్థ అందుబాటులోకి రావాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.ఇక యూపీఐ, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆ అధ్యయనం అభిప్రాయపడింది. ఆర్బీఐ, యూపీఐ.. క్రెడిట్ కార్డులు జారీచేసే బ్యాంకులు ఇలాంటి ఆర్థిక మోసాలను నిరోధించేందుకు మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని తేలి్చచెప్పింది. సైబర్ క్రైం పోలీసుస్టేషన్లు, నిమిషాల వ్యవధిలో ఆన్లైన్ ఫిర్యాదును ఫైల్‌చేసే వ్యవస్థ అందుబాటులోకి రావాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.అమ్మకానికి క్రెడిట్ కార్డు డేటా.. మరోవైపు.. దేశంలోని వినియోగదారుల క్రెడిట్ కార్డు డేటా సులభంగా అమ్మకానికి అందుబాటులో ఉందని ఈ అధ్యయనం చెబుతోంది. పాన్‌కార్డు, ఆధార్, మొబైల్ నంబర్, ఈమెయిల్, చిరునామా వంటి వ్యక్తిగత సమాచారంతో పాటు మొబైల్ నంబర్, ఈమెయిల్, ఇతర చిరునామాతో క్రెడిట్ కార్డుల వివరాలు కూడా అందుబాటులో ఉండటం సమాజానికి శ్రేయస్కరం కాదని పేర్కొంది. ఒక్క ఏడాదిలో రూ.13,930 కోట్ల దోపిడీ.. ఆర్బీఐ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 36వేల కంటే ఎక్కువ ఆర్థిక మోసాలు నమోదైనట్లు తెలుస్తోంది. ఇది గత ఆరి్థక ఏడాదితో పోలిస్తే 166 శాతం మేర గణనీయంగా పెరిగింది. బ్యాంకింగ్ రంగంలో ఈ మోసాల కేసులు 2022–23లో 13,564 నుంచి 2023–24లో 36,075కి చేరుకున్నాయి. అయితే, ఈ మోసాల విలువ 2023–24లో రూ.13,930 కోట్లకు చేరాయి. అయితే, ఇక్కడ ప్రతి పది మంది బాధితుల్లో ఆరుగురు ఎటువంటి ఫిర్యాదులు చేయడానికి ముందుకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని నివేదిక పేర్కొంది. -
చికెన్ పాయా ఇవ్వనందుకే హతమార్చా
రాయదుర్గం: ‘చికెన్ పాయా (చారు), మద్యం కొనుగోలుకు డబ్బు అడిగా... ఇవ్వలేదు. దీంతో హత్య చేశాను’ అంటూ తాను చేసిన నేరాన్ని పోలీసుల సమక్షంలో నిందితుడు అంగీకరించాడు. రాయదుర్గం పీఎస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను రూరల్ సీఐ ప్రసాద్‌బాబు, డి.హీరేహాళ్ ఎస్ఐ గురుప్రసాదరెడ్డితో కలసి డీఎస్పీ బి.శ్రీనివాసులు వెల్లడించారు. డి.హీరేహాళ్ మండలం మురడి గ్రామంలో ఆదివారం మురుడప్ప హత్యకు గురైన విషయం తెలిసిందే. హతుడి చిన్నమ్మ హరిజన పెన్నక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటలు గడవక ముందే నిందితుడిని గుర్తించి, సోమవారం సాయంత్రం 5 గంటలకు కల్యం బస్టాప్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో వాస్తవాలను నిందితుడు బహిర్గతం చేశాడు. అనాథగా ఉంటున్న మురడప్ప చుట్టుపక్కల ఇళ్లతో పాటు ఆంజనేయస్వామి ఆలయంలో స్వీపర్‌గా పనిచేస్తుండేవాడు. ఆదివారం కావడంతో చికెన్ దుకాణం నిర్వాహకుడి వద్ద కోడి కాళ్లను ఉచితంగా తీసుకున్నాడు.ఆలయానికి దూరంగా ఉండే వంకలో సొంతంగా చికెన్ రసం (పాయా) వండుకుని భోజనం చేస్తుండగా అక్కడికి యేసురాజు చేరుకున్నాడు. చికెన్ చారుతో పాటు మద్యం కొనుగోలుకు డబ్బు కావాలని యేసురాజు అడగడంతో మురడప్ప నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఆ సమయంలో చేతికి అందిన రాయి తీసుకుని మురడప్ప తలపై యేసురాజు మోది హతమార్చాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కాగా, హత్య కేసులో నిందితుడిని 24 గంటల్లోపు అరెస్ట్ చేసిన సిబ్బందిని ఎస్పీ గౌతమి శాలి ప్రత్యేకంగా అభినందించారు. -
మంగళసూత్రం పోయిందని వస్తే...
వెంగళరావునగర్: మంగళసూత్రం దొంగిలించారని ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళను పోలీసులు నాలుగు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిన సంఘటన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బర్కత్‌పురలో నివాసం ఉంటున్న శ్రీరేఖ ఈ నెల 15న స్థానిక మధురానగర్‌లోని తన బంధువుల వద్దకు వచ్చింది. 16వ తేదీ తన సోదరునితో కలిసి రైతుబజార్‌కు వెళ్లి కూరగాయలు తీసుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి చూసుకోగా తన మంగళసూత్రం కనిపించలేదు. హుటాహుటిన రైతుబజార్‌కు వెళ్లి విచారించినా ఫలితం లేదు. ఆమె సమీపంలోని సనత్‌నగర్ పీఎస్‌కు వెళ్లగా అది తమ పరిధి కాదని ఎస్‌ఆర్‌నగర్‌కు పంపారు. ఎస్ఆర్నగర్ పీఎస్‌కు వెళ్లగా ఆ ఏరియా బోరబండ పీఎస్ పరిధిలోకి వస్తుందని వెనక్కు పంపారు. తిరిగి బోరబండకు వెళ్లి ఫిర్యాదు చేయగా అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఆ పీఎస్‌లో కూడా ఫిర్యాదు తీసుకోకుండా మధురానగర్‌కు పంపారు. చివరకు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అసలే మంగళసూత్రం పోగొట్టుకుని బాధలో ఉన్న మహిళను నాలుగు పీఎస్‌లకు తిప్పడం ఎంతవరకు సబబని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. -
విశాఖ కేజీహెచ్‌లో అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ కింగ్ జార్జి ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. సీఎస్ఆర్ బ్లాక్ మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే దట్టంగా పొగ అలుముకోవడంతో వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. సిబ్బంది రోగులను హుటాహుటిన పక్క వార్డుకు తరలించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. సీఎస్ఆర్ బ్లాక్ ఐసీయూ వార్డులోని వెంటిలేటర్ బ్యాటరీ పేలడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. రాత్రి విధుల్లో ఉన్న వైద్యులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వార్డులో ఉన్న ఏడుగురు రోగులను పిల్లలు, సర్జికల్ ఐసీయూకి తరలించారు. తర్వాత వెంటిలేటర్‌కు విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చే సరికి మంటలు అదుపులోకి వచ్చాయి. కేజీహెచ్ పర్యవేక్షక వైద్యాదాధికారి డాక్టర్ శివానంద ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై విచారణ జరిపిస్తామన్నారు. రాత్రి 12గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని, 1గంట సమయానికి పూర్తిగా అదుపులోకి వచ్చిందని తెలిపారు. -
దర్శిలో అర్ధరాత్రి టీడీపీ రౌడీల వీరంగం
దర్శి: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రకాశం జిల్లా దర్శిలో ప్రజలు భయంతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు వచ్చి పడతారోనని ప్రజలు ఆందోళనతో బతుకుతున్నారు. ఆదివారం రాత్రి వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. 30మందికి పైగా నరసరావుపేట నుంచి తెచ్చిన రౌడీలతో కలిసి వైఎస్సార్సీపీ నాయకుడు కుందురు నరసింహారెడ్డి ఇంటి విధ్వంసం సృష్టించారు. బాధితుడు నరసింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 11.40 సమయంలో కాలింగ్ బెల్ మోగడంతో ఇంటి తలుపు తీశారు.ఇంటి బయట ఉన్న రౌడీలు నరసింహారెడ్డి నువ్వేనా అంటూ ప్రశ్నించి దర్శిలో మేం ఓడిపోవడానికి కారణం నువ్వేనంటూ దుర్భాషలాడారు. ఈవీఎంలు ఎత్తుకెళుతుంటే అడ్డుకుంటావా అని బూతులు తిట్టారు. కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఇంటి దిమ్మెలను బాది పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ గేటుకు ఉన్న లైట్లు పగులగొట్టి వీరంగం వేశారు. నరసింహారెడ్డి వరండా గేటు తీయకుండా పోలీసులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. బయట రౌడీలు దాడి చేయడంతో ఇంట్లో ఉన్న నరసింహారెడ్డి భార్య, పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు.నీతో పాటు మరో 30 మంది మా టార్గెట్‌లో ఉన్నారని, మీ అందరి అంతు చూస్తామంటూ నరసింహారెడ్డిని బెదిరించారు. ఈ లోగా పోలీస్ వాహనం రావడం, చుట్టుపక్కల వారు అక్కడకు రావడంతో వారంతా పారిపోయారు. ఈ ఘటనతో నియోజకవర్గం ఉలిక్కిపడింది. దర్శిలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదని, ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి వచ్చి కొత్తగా రౌడీ సంస్కృతిని తెచ్చిందని మండిపడుతున్నారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదుటీడీపీ శ్రేణుల దాడిపై నరసింహారెడ్డి భార్య కుందురు సునీత స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఎన్నికల్లో తన భర్త నరసింహారెడ్డి బూత్ ఏజెంట్‌గా ఉన్న బూత్‌లో ఈవీఎంలు ఎత్తుకెళ్లనీయలేదని, అందుకే తమపై కక్ష కట్టి ఇంటిపైకి వచ్చి దాడి చేసి దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు.బూచేపల్లి పరామర్శ..టీడీపీ నాయకుల దాడి విషయం తెలుసుకున్న దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సోమవారం నరసింహారెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి ఆపద రాకుండా అండగా ఉంటానని ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. -
పెనుమూరులో టీడీపీ కార్యకర్తల బరితెగింపు
కార్వేటినగరం: చిత్తూరు జిల్లా పెనుమూరు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కామసాని విజయకుమార్‌రెడ్డి ఇంటిపై ఆదివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. ఇంటి ఆవరణలోని రెండు కార్లను ధ్వంసం చేశారు. విజయకుమార్‌రెడ్డిని చంపుతామని బెదిరించారు. విజయకుమార్‌రెడ్డి పెనుమూరు హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో నివాసం ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో ఇంట్లో నిద్రపోతుండగా పెనుమూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలు పి.సుబ్రమణ్యంరెడ్డి కుమారుడు పి.అనంత్‌రెడ్డి, పి.హేమాద్రినాయుడు కుమారుడు పి.ప్రదీప్, కె.బాబు కుమారుడు కె.రాజేష్ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మద్యం తాగి ఆ ఇంటిపై దాడిచేశారు. ఇంటి ఆవరణలో ఉన్న కారు అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశారు.వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలున్న కారు నంబరు ప్లేట్లను పెరికి ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న పెనుమూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి కమలాకరరెడ్డి కారు నంబర్ ప్లేటు తీసి పగులగొట్టారు. అనంతరం ఇంట్లో నిద్రపోతున్న విజయకుమార్‌రెడ్డికి ఫోన్‌చేసి బయటకు రమ్మని పిలిచారు. నిద్రలో ఉన్న విజయకుమార్‌రెడ్డి భార్యాపిల్లలతో బయటకు రాగా చంపుతామంటూ బెదిరించారు. భయంతో విజయకుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులతో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. వీరి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన సోమవారం ఉదయం పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెనుమూరు ఎస్ఐ లోకేష్ సంఘటన స్థలానికి వెళ్లి విచారించారు.నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి అర్ధరాత్రి ఇంటి పైకి వచ్చి కార్లు ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్‌రెడ్డి డిమాండ్ చేశారు. వారు సోమవారం విజయకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన నారాయణస్వామి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. -
పెళ్లిళ్ల పేరయ్య పేరిట టోకరా!
ఆలమూరు: పెళ్లి సంబంధాలు కుదుర్చుతానంటూ అమాయక ప్రజలను నమ్మించి రూ.కోటి వరకూ ఓ వ్యక్తి టోకరా వేసిన ఘటన ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో జరిగింది. పెళ్లిళ్ల పేరయ్య అవతారమెత్తి వయసుకు వచ్చిన యువతకు, కొంచెం లోపాలు ఉన్నవారికి పెళ్లి సంబంధాలు చూస్తానంటూ రూ.లక్షల విలువైన బంగారం, నగదు స్వాహా చేసిన వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకూ ఆరుగురు బాఽధితులు వెలుగులోకి రాగా అనేక మంది మోసపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మూలస్థాన అగ్రహారానికి చెందిన యర్రంశెట్టి దుర్గయ్య దివ్యాంగుడు. అతను పెళ్లి సంబంధాలు చూసే దళారీగా అవతారమెత్తాడు. ఇదే క్రమంలో గ్రామంలో దొడ్డా రాంబాబు, వరలక్ష్మి దంపతుల కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తానంటూ నమ్మబలికాడు. వధువు కుటుంబానికి కొంత నగదు అవసరమంటూ దశల వారీగా రూ.20 లక్షల వరకూ తీసుకున్నాడు. దీంతో పాటు రాంబాబు కుటుంబ సభ్యుల వద్ద సుమారు రూ.12 లక్షల విలువైన 20 కాసుల బంగారాన్ని కూడా తన మాయమాటలతో స్వాహా చేశాడు. ఆ బంగారం ఆ ఆశ చూపి, తక్కువకు వస్తుందంటూ గ్రామానికి చెందిన విజయ, నవాబుపేటకు చెందిన సింగంశెట్టి సురేష్‌ను నమ్మించాడు. విజయ వద్ద రూ.5.5 లక్షలు, సురేష్ వద్ద రూ.4.10 లక్షలు తీసుకుని మాట మార్చేశాడు. దీంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనేక మంది వద్ద రూ.లక్షలు తీసుకోవడంతో స్వాహా చేసిన సొమ్ము రూ.కోటి పైనే ఉంటుందని సమాచారం. పెళ్లి సంబంధాలకు సంబంధించి అవతలి వారు ఒప్పుకున్నారని ఇతరులతో డమ్మీ ఫోన్లు చేయించేవాడు. జల్సాలకు అలవాటు పడిన దుర్గయ్య స్వాహా చేసిన సొమ్మును అంతా విలాసాలకు ఖర్చు చేశాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్నానంటూ కాలయాపన చేస్తున్న దుర్గయ్య ప్రవర్తనపై బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో వారంతా సోమవారం దుర్గయ్య ఇంటికి వెళ్లి అతని భార్య రాణి, తల్లి వెంకాయమ్మ, సోదరుడు మురళీని నిలదీయగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులంతా ఆలమూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్సై ఎల్.శ్రీను నాయక్‌కు ఫిర్యాదు చేశారు.జల్సాలకు అలవాటు పడి..మాయమాటలతో బాధితులను నమ్మించి స్వాహా చేసిన సొమ్మును అనతికాలంలోనే దేశమంతా తిరిగి జల్సాలకు, విలాసాలకు ఖర్చు చేశాడని భార్య రాణి పోలీసులకు వివరించింది. తన భర్త పెళ్లి సంబంధాల పేరిట డబ్బులు తీసుకున్నది వాస్తవమేనన్నారు. సోదరుడు మురళీ, తల్లి వెంకాయమ్మ ప్రోద్భలంతో స్వాహా చేసిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేశాడని తెలిపింది. ఇలాంటివి వద్దని పలుమార్లు చెప్పినా పట్టించుకోకుండా చేతిలో ఉన్న డబ్బును చూసి విచ్చలవిడిగా ఖర్చు చేశాడంది. ఈ సొమ్ము దుర్వినియోగంలో కొంత భాగం సోదరుడు, తల్లి ప్రమేయం ఉందని ఆరోపించింది. భార్య, ఇద్దరు పిల్లలను పట్టించుకోకుండా పెళ్లి సంబంధాల పేరిట తీర్థయాత్రలు, విలాసవంతమైన ప్రాంతాలకు వెళ్లేవాడంది. ఇప్పటి వరకూ తమకు సొంత ఇల్లు కూడా లేదని, అద్దె ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నామని ఆమె పేర్కొంది. ప్రస్తుతం తన భర్త దుర్గయ్య ఒక్క పైసా కూడా లేకుండా ఖర్చు చేశాడని వివరించింది.బాధితులకు న్యాయం చేస్తాం..పెళ్లి సంబంధాల పేరిట మోసపోయిన బాధితులందరికీ తగిన న్యాయం చేస్తామని ఎస్సై శ్రీను నాయక్ భరోసా ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేస్తున్నామని, విచారణ జరిపి నిందితుడు దుర్గయ్యతో పాటు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుంటామన్నారు. స్వాహా చేసిన నగదు, బంగారాన్ని రికవరీ చేసేందుకు చర్యలు తీసుంటామని అన్నారు. -
మహిళను కాటేసిన అత్యంత విషపూరితమైన పాము
నెల్లూరు(అర్బన్): నెల్లూరు దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో రత్నమ్మ అనే అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికురాలిని అత్యంత విషపూరితమైన రక్తపింజరి పాము కాటేసింది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. సిబ్బంది కథనం మేరకు.. రోజులాగే రత్నమ్మ సోమవారం విధులకు వచ్చింది. సంబంధిత సూపర్వైజర్ మెడికల్ కళాశాల ఆవరణలో గడ్డిని తొలగించే పనిని ఆమెకు అప్పగించారు. దీంతో గడ్డిని తొలగిస్తుండగా పాము ఆమె చేతి వేలిపై కాటువేసింది. రత్నమ్మ కేకలు వేయగా సహచర సిబ్బంది వచ్చి ఆమెను ఆస్పత్రి క్యాజువాలిటీలో చేర్చారు. డాక్టర్ ప్రాథమిక వైద్యం అనంతరం ఐసీయూకి తరలించారు. ఈసీజీ తీశారు. అనంతరం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అయిన ఎజైల్ గ్రూపు మేనేజర్ కొండయ్య మరికొన్ని రక్తపరీక్షలను బయట ల్యాబ్‌లో చేయించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.గతంలో ఓ కార్మికురాలి మృతిగతంలో ఓపారిశుద్ధ్య కార్మికురాలు పెద్దాస్పత్రి ఆవరణలో గడ్డి కోస్తుండగా పాము కాటు వేసింది. తర్వాత భయాందోళనకు, ఒత్తిడికి లోనైంది. రెండో రోజు మృతి చెందింది. ఈ ఘటన అప్పట్లో ఆస్పత్రిలో సంచలనం రేకెత్తించింది. ఆమె మృతితో కుటుంబం వీధిన పడింది. ఏజెన్సీ ఎజైల్ సంస్థ తదితరులు సుమారు రూ.లక్ష సాయం అందించారు.పెస్ట్ కంట్రోల్ వైఫల్యంఆస్పత్రిలో పాములు లేకుండా, చెదపురుగులు పట్టకుండా, ఎలుకలు లేకుండా చూసే బాధ్యత పెస్ట్ కంట్రోల్ది. దీనికి సంబంధించి కాంట్రాక్ట్‌ను పొందిన వ్యక్తికి ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.50 లక్షలు చెల్లిస్తోంది. అయితే ఆ సంస్థ నిబంధనలు గాలికొదిలేశారని ఆరోపణలున్నాయి. మందును స్ప్రే చేయడం మినహా మిగతా పనులు చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలుకలు పట్టేందుకు బోనులు పెట్టాలి. పాములు నివసించేందుకు అనువైన పుట్టలు, బొరియలుంటే తొలగించాలి. బొద్దింకలు, ఇతర చెదపురుగులు చేరకుండా మందులు వాడాలి. ప్రతి నెలా రూ.లక్షలో బిల్లులు తీసుకుంటున్నా నిబంధనల మేరకు పని చేయడంలేదని విమర్శలున్నాయి. సరిపడా ఉద్యో గులను నియమించలేదని తెలుస్తోంది. అయినా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆ ఏజెన్సీకి ఫుల్ మార్కులు వేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి లోపాలు సరిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. -
మహిళా వలంటీర్‌పై దాడి
వేమూరు: గ్రామ వలంటీర్‌పై టీడీపీ కార్యకర్తలు మహిళలతో దాడి చేయించి కొట్టిన ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం చంపాడులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన పమిడిపాగుల జ్యోతి అనే మహిళ గ్రామ వలంటీర్‌గా పని చేస్తోంది. వలంటీర్లపై కూటమి నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎన్నికల ముందు ఆమె రాజీనామా చేశారు. కాగా.. ఎన్నికల్లో గెలిచాక టీడీపీ కార్యకర్తలు జ్యోతిని లక్ష్యంగా చేసుకుని వేధించటం మొదలుపెట్టారు. నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిపై ఇటుక రాళ్లతో దాడి చేశారు. ‘మీ వైఎస్సార్సీపీ పార్టీ గెలవాలని ఓట్లు వేయించి తెగపాకులాడావుగా గొప్ప వాలంటీరు. ఇప్పుడు మాది రాజ్యం. నీ అంతు చూస్తాం. జై టీడీపీ, జై కూటమి’ అంటూ ఆ ఇంటి గోడపై పోస్టర్ అతికించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. మరుసటి రోజునుంచి స్కూల్‌కెళ్తున్న జ్యోతి పిల్లలను దూషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బజారు నుంచి ఇంటికెళ్తున్న జ్యోతిపై కొందరు మహిళలతో టీడీపీ నాయకులు దాడి చేయించి కొట్టించారు. కిందపడిపోయిన జ్యోతిని వేమూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె స్పృహ కోల్పోవటంతో 108 అంబులెన్స్‌లో తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ వేమూరు ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు హుటాహుటిన వేమూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జ్యోతిని పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం ఆమె ఇంటిపై రాళ్లురువ్వి పోస్టర్ అతికించినట్టు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవటంపై పోలీసులను ప్రశ్నించారు. ఆ కేసుతో పాటు ఆదివారం జరిగిన దాడిపై కేసులోనూ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తేనే పోలీస్ స్టేషన్ నుంచి వెళతానని పట్టుబట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటిపై జరిగిన రాళ్ల దాడిపై ఎఫ్ఐఆర్ తర్వాత ఇస్తామని ఎస్ఐ నాగరాజు వెల్లడించారు. వరికూటి అశోక్‌బాబు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడైనా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడితే సహించబోమన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, తనతోపాటు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతపై దాడి.. వేటపాలెం: బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలోని బచ్చులవారిపాలెంలో వైఎస్సార్సీపీ నేత బచ్చుల బంగారు బాబు పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలో శనివారం రాత్రి గంగమ్మ తల్లి కొలుపులు జరుగుతున్నాయి. అదే అదునుగా గ్రామంలో టీడీపీకి చెందిన ప్రధాన నాయకుడు వారి అనుచరులు నలుగురికి మద్యం తాగించి బంగారుబాబుపై దాడికి తెగబడ్డారు. దీంతో బంగారుబాబు తలకు తీవ్రగాయం అయ్యింది. అక్కడే ఉన్న కొంతమంది మహిళలు దాడిని అడ్డుకోవడంతో అతడిని వదిలేశారు. కాగా, బంగారుబాబు వైఎస్సార్సీపీ తరఫున గ్రామంలో ప్రచారం చేసి ఓట్లు వేయించాడు. టీడీపీ చెందిన ఒక నాయకుడు గ్రామంలో టీడీపీ తరఫున పోటీ చేసిన మన సామాజిక వర్గం నాయకుడు కొండయ్యకు గ్రామం మొత్తం ఓట్లు వేద్దామని బంగారు బాబును అడిగారు. అందుకు అతను ఒప్పుకోకపోగా వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో టీడీపీ ఓట్లు చీలుస్తావా అని చెప్పి వారికి సంబంధించిన కొంత మందికి మద్యం తాగించి బంగారు బాబుపై దాడి చేయించాడు. తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు వాపోయాడు. తనకు, తన వర్గం వారికి రక్షణ కల్పించాలని కోరుతూ వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
తాగునీటిలో విష ప్రయోగం
కణేకల్లు: ప్రజలు తాగే నీళ్లలో విషాన్ని కలిపారు.. ఆ నీరు తాగినోళ్లు ప్రాణాలతో ఉండకూడదనుకున్నారో.. లేక వాంతులు, విరేచనాలొచ్చి నిర్వహణ చేసే వారికి చెడ్డపేరు రావాలనుకున్నారో గానీ అత్యంత అమానుష ఘటనకు ఒడిగట్టారు. వాటర్‌ప్లాంట్ నిర్వాహకులు సకాలంలో గుర్తించడంతో ముప్పు తప్పింది. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం తుంబిగనూరులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. తుంబిగనూరులో సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్.. రెండేళ్ల క్రితం మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీకి అప్పగించింది. గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు ఫణీంద్ర గౌడ్ వాటర్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు తన తండ్రి తిప్పయ్యను ప్లాంట్ వద్దే ఉంచారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పంచాయతీ ఆధ్వర్యంలో రూ.5కే రెండు బిందెల నీటిని పంí³ణీ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దుప్పటి కప్పుకుని మినరల్ వాటర్ ప్లాంట్ వద్దకు వచ్చారు. కిటికీలు తీసి నీటి ట్యాంకులో టెర్మినేటర్ పురుగుల మందు కలిపారు. అదే సమయంలో బహిర్భూమి కోసం లేచిన తిప్పయ్య ప్లాంట్ వద్ద వ్యక్తులు ఉండటాన్ని గమనించి.. ఎవరక్కడ అంటూ గద్దించాడు. దీంతో పొరుగున ఉండే తలారి హనుమంతు, కొట్రేగౌడ్ నిద్ర లేచి అక్కడికి వచ్చారు. ఇంతలోనే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వాటర్‌ప్లాంట్‌ను పరిశీలించగా.. అందులో పురుగుల మందు కలిపినట్టు తేలింది. ఈ ఘటనను అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి సీరియస్‌గా తీసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారిని ఉపేక్షించొద్దని పోలీసు అధికారులను ఆదేశించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు, కణేకల్లు ఎస్ఐ శ్రీనివాసులు డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్‌ను రంగంలో దింపి ఆధారాలను సేకరించారు. జరిగిన ఘటనపై తిప్పయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎల్లో మీడియాలో దుష్ప్రచారం ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మెజార్టీ రాలేదన్న ఉద్దేశంతో నేనే కొందరితో తాగునీటిలో విషం కలిపించానంటూ ఎల్లో మీడియాలో ప్రసారం చేయడం దుర్మార్గం. గ్రామ సర్పంచ్‌గా నేను 365 ఓట్ల మెజార్టీతో గెలిచాను. గ్రామంలో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 494 ఓట్లు రాగా.. టీడీపీకి 512 ఓట్లు వచ్చాయి. ఓట్లు వేయలేదని ప్రజలను బెదిరించడం, దౌర్జన్యం చేయడం లాంటివి నేను ఏరోజూ చేయలేదు. ఎల్లో మీడియా నాపై నింద వేయడంబాధాకరం.– ఫణీంద్ర గౌడ్, గ్రామ సర్పంచ్, తుంబిగనూరు -
వైఎస్సార్సీపీ నేతల దుకాణాలు, ఇళ్లు ధ్వంసం
సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరుల ఇళ్లు, వాహనాలు, కార్యాలయాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. అజిత్‌సింగ్‌నగర్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్త జహీర్‌బాషాకు చెందిన టైలరింగ్ దుకాణాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కుట్టుమెషిన్లు, ఎల్ఈడీ టీవీ, ఇతర ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెద్దిరెడ్డి శివారెడ్డి కారు అద్దాలను పగులగొట్టారు. ఇంటిపై రాళ్లు రువ్వు శివారెడ్డిని దుర్భాషలాడారు. ఇటీవల వైఎస్సార్సీపీలో చేరి ఎన్నికల్లో పనిచేసిన నగర మాజీ డెప్యూటీ మేయర్ గోగుల రమణ కారు అద్ధాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిపై ఏకంగా దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లలో సామగ్రి దహనంవెల్దుర్తి: వైఎస్సార్సీపీ నాయకులకు చెందిన రెండు గృహాలపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడి ఇళ్లల్లోని సామగ్రిని దహనం చేసిన ఘటన పల్నాడు జిల్లా గొట్టిపాళ్లలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిన్నెబోయిన బాలగురవయ్య యాదవ్, పల్లపాటి వీరనారాయణ యాదవ్ గృహాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుంపులుగా వచ్చి దాడి చేశారు. ఆ రెండు గృహాల్లో ఉన్న విలువైన సామగ్రి, పత్రాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. టీడీపీ శ్రేణులు దాడులు చేస్తారనే భయంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఊరు వదిలి వెళ్లిపోగా.. మహిళలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే అదనుగా భావించిన టీడీపీ శ్రేణులు ఆ రెండు ఇళ్లపై దాడులకు పాల్పడి మొత్తం సామగ్రిని దహనం చేశారు. రూ.10 లక్షల విలువైన వస్తువులు కాలిపోయినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ నేత ఇల్లు కూల్చివేతఆక్రమణల నెపంతో విజయవాడలో టౌన్‌ప్లానింగ్ అధికారుల హడావుడిపాయకాపురం (విజయవాడ రూరల్): విజయవాడ ప్రకాష్‌నగర్‌లోని వైఎస్సార్సీపీకి చెందిన కోఆప్షన్ సభ్యుడు నందెపు జగదీశ్‌కు చెందిన భవనాన్ని వీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం కూల్చి వేశారు. 12 ఏళ్ల క్రితం మంజూరు చేసిన ప్లాన్ ప్రకారం సర్వే నంబర్ 89లో జగదీశ్ 3 పోర్షన్ల భవనాన్ని నిర్మించారు. ప్లానింగ్ అధికారులు శుక్రవారం భవన యజమానులకు సమాచారం ఇవ్వకుండా కొలతలు తీసి భవనానికి నోటీసులు అంటించారు. శనివారం కూల్చివేత చేపట్టారు. జగదీశ్ భార్య సౌభాగ్యలక్ష్మి భవనం కూల్చివేస్తున్నారని తెలుసుకొని భవనం దగ్గరకు వచ్చి ఎందుకు కూల్చి వేస్తున్నారని అధికారులను అడుగుతున్నా ఎలాంటి సమాధానం చెప్పకుండా భవనం వెనుకవైపు కూల్చి వేశారు. భవనం పక్కనే ఉన్న రేకుల షెడ్డును కూడా ఆక్రమణలో ఉందని, వీఎంసీ స్థలంలో నిర్మించినట్లుగా గుర్తించామని చెబుతూ కొంత కూల్చివేశారు. దీనిపై కోర్టు స్టే ఉండ టంతో అధికారులు కూల్చివేతను నిలిపివేశారు.రాజకీయ కక్షలే కారణం.. రాజకీయ కక్షలతోనే భవనం కూల్చివేత జరిగిందని సౌభాగ్యలక్ష్మి పేర్కొన్నారు. హరిబాబు అనే వ్యక్తి నుంచి 214 గజాల స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. 12 ఏళ్ల క్రితం విజయవాడ కార్పొరేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు తీసుకొని భవనం నిర్మించామని, భవనం నిర్మాణంలోని ఆక్రమణలను అధికారులు ఇప్పుడే గుర్తించడం ఏమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో అధికారులు భవనం కూల్చివేత చేపట్టగా..ఆ విషయం తెలుసుకుని వచ్చిన వైఎస్సార్సీపీ నగర ప్రధాన కార్యదర్శి విజయకుమార్ ఆకస్మికంగా ఎందుకు కూల్చుతున్నారని ప్లానింగ్ అధికారి కృష్ణను ప్రశ్నించారు. ఫిర్యాదు ఇప్పుడే అందింది కాబట్టి కూల్చివేస్తున్నామని అధికారులు సమాధానమిచ్చారు. -
యథేచ్ఛగా టీడీపీ దాడులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో అధికార మత్తుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన ప్రభుత్వ ఆస్తులను, అభివృద్ధి పథకాల శిలాఫలకాలను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఈ విధ్వంసం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కూడా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పలుచోట్ల విధ్వంసానికి దిగారు. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లిలో పట్టపగలు అందరూ చూస్తుండగానే రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. వీటి పక్కనే ఉన్న జగనన్న పాలవెల్లువ ‘నేమ్ బోర్డు’ను తొలగించారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం చింతలచెర్వు గ్రామ సచివాలయం శిలాఫలకాన్ని పగులకొట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల సచివాలయం, ఆర్బీకే, హెల్త్ క్లినిక్ భవనాలపై దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్ హెల్త్‌క్లినిక్ పేరుతో వేసిన శిలాఫలకంపై ఉన్న వైఎస్ జగన్, మేకపాటి విక్రమ్‌రెడ్డి చిత్రాలను బండరాయితో తుడిచే ప్రయత్నం చేశారు. రైతు భరోసా కేంద్రం, సచివాలయం భవనాలకు ఉన్న కిటికీ అద్దాలను పగులగొట్టారు. అలాగే ఏఎస్‌పేట మండలం చౌటభీమవరంలో జగనన్న లేఔట్‌ను టీడీపీ నాయకుడు రాంబాబు జేసీబీతో తవ్వేశారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో సచివాలయాలు, ఆర్బీకే భవనాల శిలాఫలకాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేశారు. కీలపల్లిలో గ్రామ సచివాలయం, ఆర్బీకే భవనాలకు అమర్చిన శిలాఫలకాలు, బోర్డు దిమ్మెలను గునపాలు, సమ్మెటతో పగులకొట్టారు. అలాగే గండ్రాజుపల్లి పంచాయతీ ఆలకుప్పంలో బీఎంసీ సెంటర్‌కు అమర్చిన శిలాఫలకాన్ని ఆ గ్రామ టీడీపీ నాయకులు తొలగించారు. శ్రీరంగరాజపురం మండలం నెలవాయి సచివాలయం, రైతుభరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ వద్ద, జీఎంఆర్ పురం పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నవరత్నాలు, డిజిటల్ లైబ్రరీ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల మెట్ట సమీపంలో ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. -
గిరిజన పాఠశాల భూమి కబ్జా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారం చేపట్టిన గంటల వ్యవధిలోనే టీడీపీ నేతలు బరి తెగించారు. ప్రభుత్వ స్థలాల కబ్జాకు తెర తీశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి అండతో స్థానిక నేతలు చెలరేగిపోతున్నారు. వెంకటాచలం మండలం గొలగమూడిలో టీడీపీ నాయకులకు ప్రభుత్వ భూమిపై కన్ను పడింది. అనుకున్నదే తడవుగా పట్ట పగలే జేసీబీ యంత్రంతో ఆ భూమిని చదును చేశారు. వెంకటాచలం మండలం గొలగమూడిలో ప్రభుత్వ ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలకు ఆనుకుని సీజేఎఫ్ఎస్ భూములున్నాయి. ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాల కోసం మరింత స్థలం కేటాయించాలని పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది కోరడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీకి చెందిన వ్యక్తికి గతంలో సీజేఎఫ్ఎస్ పథకం కింద కేటాయించిన 1.25 ఎకరాల భూమిని పాఠశాల కోసం అప్పగించింది. వాస్తవానికి సీజేఎఫ్ఎస్ పథకం కింద కేటాయించిన భూమిపై ఏ వ్యక్తికీ అధికారం లేదు. ఈ భూమికి ఆర్డీవో హక్కుదారుగా ఉంటారు. సదరు వ్యక్తికి ప్రత్యామ్నాయంగా మరోచోట భూమిని కేటాయిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు. అయితే ఇంతలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ ఎన్నికల్లో సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గెలవడం, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ టీడీపీ నేత అది తన భూమేనంటూ దౌర్జన్యపూరితంగా ఆక్రమించేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఒక గిరిజన పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని ఆక్రమించే సాహసం చేయడం చూస్తే టీడీపీ నేతలు ఏ విధంగా బరి తెగించారో అర్థమవుతోంది. ఈ భూఆక్రమణను ఆశ్రమ గిరిజన పాఠశాల ఉపాధ్యాయినులు అడ్డుకోబోతే వారిని సైతం బెదిరించారు. ఈ భూమి పాఠశాలకు కేటాయించారని చెప్పినా వినకుండా చదును చేశారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరేందుకు సాక్షి ప్రయతి్నంచగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
కృష్ణా, సాక్షి: రోడ్డు ప్రమాదంతో వేకువ ఝామున జిల్లా రహదారి నెత్తురోడింది. శుక్రవారం ఉదయం కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రొయ్యల ఫీడ్‌తో వెళ్తున్న కంటెయినర్‌ను బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. మృతుల్లో ఐదుగురు కోనసీమ అంబేద్కర్ జిల్లా తాళ్లరేవుకు చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. వీళ్లంతా మునిపెడలో చేపల వేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో మృతదేహం కంటెయినర్ డ్రైవర్‌ది కాగా.. అతని పేరు, ఇతర వివరాలు తెలియరావాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రొయ్యల ఫీడ్‌తో పాండిచ్చేరి నుంచి భీమవరం ఆ కంటెయినర్ వెళ్తోంది. ఇక బొలెరో వ్యాన్ అమలాపురం మండలం తాళ్లరేవు నుంచి కృత్తివెన్ను మండలం మునిపెడ వెళ్తోంది. అయితే పుల్లల లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ను బొలెరో డ్రైవర్ అతివేగంగా ఓవర్ టేక్ చేసే క్రమంలో కంటెయినర్‌కు ఢీ కొట్టినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించుకున్నారు.పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతికృష్ణా జిల్లా సీతనపల్లి ఘోర రోడ్డు ప్రమాద ఘటన పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆమె.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కోరారు. అలాగే ఘటన తర్వాత.. గాయపడిన వాళ్లను బయటకు తీసిన స్థానికుల చొరవకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. -
ఆగని టీడీపీ ఉన్మాదం
సాక్షి నెట్వర్క్: ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత టీడీపీ శ్రేణుల్లో చెలరేగిన ఉన్మాదం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై దాడుల రూపంలో కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే మొదలైన ఈ దాడుల నియంత్రణకు ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయడంలేదు. దీన్ని ఆసరా చేసుకొని టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోతున్నాయి. గురువారమూ టీడీపీ శ్రేణులు పలు సచివాలయాలు, ప్రభుత్వ స్థలాలపై దాడులు చేశాయి. శిలాఫలకాలు ధ్వంసం చేశాయి. బోర్డులు విరగ్గొట్టాయి.» చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో బైరెడ్డిపల్లె, నగరి మండలాల్లోని పలు సచివాలయాల్లో ఉద్యోగులు విధి నిర్వహణలో ఉండగానే టీడీపీ నాయకులు శిలాఫలకాలను ధ్వంసం చేశారు. పుంగనూరు మండలంలోని పాలెంపల్లి, భీమగానిపల్లి, బోడేవారిపల్లె సచివాలయాలకు, వెల్నెస్ సెంటర్లకు, ఆర్బీకెలకు, ఆర్వో ప్లాంటుకు, నాడు–నేడు స్కూల్ ప్రారంభించేందుకు వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోలు ఉన్న శిలాఫలాకాలను గునపాలతో ధ్వంసం చేశారు. దీంతో సచివాలయ కార్యదర్శులు భయంతో పరుగులు తీశారు.» బైరెడ్డిపల్లె మండలం లక్కనపల్లెలో సచివాలయంలోని శిలాఫలకాలు, సంక్షేమ పథకాల బోర్డులను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. శిలాఫలకాలు తొలగించాలని ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేవని ఎంపీడీవో రాజేష్ చెప్పారు. కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో రెచ్చగొడుతూ శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.» నగరి మండలం తెరణి గ్రామంలో సచివాలయ భవనంపై ఉన్న నవరత్నాల ఫలకాన్ని గురువారం టీటీడీ నాయకులు, కార్యకర్తలు తొలగించారు. భవనం ముందు ఉన్న ప్రారంభోత్సవ శిలాఫలకంపై పెయింట్ పూశారు. ఈ ఘటనపై స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు సమాచారం అందించారు.» శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నం గ్రామ సచివాలయం భవనంపై ఉన్న నవరత్నాల బోర్డును టీడీపీ కార్యకర్తలు బుధవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. » నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కల్వటాలలో టీడీపీ నాయకులు మినరల్ వాటర్ ప్లాంట్ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఎస్సీ కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు పెసల ఏసోబు, యాడికి ఏబులపై కర్రలతో దాడి చేశారు.» బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వలాపల్లి గ్రామంలో 2017–2018లో ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు. 2019లో దానిపై మొదటి అంతస్తు నిర్మించి, సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ సచివాలయం శిలాఫలకాన్ని టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. గ్రామస్తులందరూ గ్రామాభివృద్ధికి బాటలు వేసుకోవాలే తప్ప శిలాఫలకాలు ధ్వంసం చేయడం సరికాదని గ్రామ సర్పంచ్ మందా మోహన్‌రావు అన్నారు. -
పెళ్లికి నిరాకరించిందని యువకుడి ఆత్మహత్య
బద్వేలు అర్బన్/అట్లూరు: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని కలసపాడు గ్రామానికి చెందిన బాలిరెడ్డి, వెంకట సుబ్బమ్మకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడైన పామూరి సాయికుమార్‌రెడ్డి (27) గోపవరం మండలంలో 108 వాహనానికి డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. కలసపాడు మండలం సిద్ధమూర్తిపల్లెకు చెందిన ఓ యువతి, సాయికుమార్‌రెడ్డి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమె అట్లూరు మండలం తంబళ్లగొంది రైతు భరోసా కేంద్రంలో ఉద్యోగం చేస్తోంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో తంబళ్లగొందికి వెళ్లిన సాయికుమార్‌రెడ్డి తనను పెళ్లి చేసుకునేది, లేనిదీ తేల్చాలని.. లేదంటే ఇద్దరం ఆత్మహత్య చేసుకుని చనిపోదామని ఉమామహేశ్వరిని నిలదీశాడు. దీనికి ఆమె ససేమిరా అనడంతో మనస్తాపానికి గురైన అతను అక్కడి నుంచి నేరుగా పట్టణంలోని సిద్దవటం రోడ్డులో ఉన్న తన అక్క ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటికి ఆమె సమీపంలోని వారి ఫ్యాన్సీ స్టోర్‌కు వెళ్లిపోగా ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇంటినుంచి దట్టమైన మంటలు, పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి లోపలికి వెళ్లి చూడగా సాయికుమార్‌రెడ్డి తీవ్రమైన గాయాలతో మృతి చెంది ఉన్నాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
అటు ప్రమాణం.. ఇటు విధ్వంసం
సాక్షి నెట్వర్క్: ఒకవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, కూటమి శ్రేణులు మరింత రెచ్చిపోయి విధ్వంసాలకు దిగాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల పేర్లు మార్చేశారు. ప్రగతి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. విగ్రహాలను నేలకూల్చారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై టీడీపీ జెండాలు కట్టారు. వైఎస్సార్సీపీ జెండాదిమ్మెల్ని ధ్వంసం చేశారు. అనంతపురం రూరల్ మండలం కాటిగానికాలువ గ్రామంలో రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు కాటిగానికాలువ రైతుభరోసా కేంద్రంలోకి కేక్ తీసుకొచ్చి కట్ చేశారు. అనంతరం బయటకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఒక మహిళ చేతికి సుత్తి ఇచ్చి పగులగొట్టించారు. తర్వాత ఇద్దరు కార్యకర్తలు ఆ శిలాఫలకాన్ని బయటకు తీసుకెళ్లి పూర్తిస్థాయిలో ధ్వంసం చేశారు. సచివాలయ భవనంపైకెక్కి టీడీపీ జెండా కట్టారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రభుత్వ కార్యాలయ భవనంపై కట్టిన టీడీపీ జెండాను పీకేయించారు. ఈ ఘటనపై మహిళా పోలీసు మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన కేసులో వీడియో ఆధారంగా అదే గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, రామాంజనేయులు, చంద్రమౌళినాయుడుపై కేసు నమోదు చేసినట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే కొందరు బెదిరింపులకు దిగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఎవరైనా బెదిరిస్తే బాధితులు నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. బెదిరించేవారిపట్ల పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. » కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం ఉలిమేశ్వరం గ్రామంలో విధ్వంసానికి పాల్పడ్డారు. మంత్రివర్గ ప్రమాణస్వీకారాన్ని ప్రజలు చూసేందుకు పంచాయతీ అధికారులు రైతుభరోసా కేంద్రంలో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాజీ సభ్యుడు పేకేటి దొరబాబు, తదితరులు అక్కడున్న ఆర్బీకే ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయంలోని కరపత్రాలు, అధికారిక పత్రాలను తగులబెట్టారు. ఇదెక్కడి దౌర్జన్యం అంటూ సర్పంచ్ భర్త ఆకుల వీరబాబు నిలదీశారు. దీంతో దొరబాబు, వీరబాబు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఐ రవికుమార్, ఎస్ఐ వెలుగుల సురేష్ అక్కడికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశారు. » చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలోని అగరం గ్రామ పంచాయతీలో సచివాలయం భవనం ప్రారంభోత్సవం నాడు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అప్పటి మంత్రి రోజా పేరిట ఉన్న శిలాఫలకాన్ని పగులగొట్టారు. ఈ విషయమై బుధవారం స్థానికులు అధికారులకు ఫిర్వాదు చేశారు. » తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) కార్యాలయానికి ఉన్న డాక్టర్ వైఎస్సార్ పేరును దౌర్జన్యంగా తొలగించారు. ఆ స్థానంలో ఎన్టీఆర్ పేరు ఏర్పాటు చేశారు. కార్యాలయం లోపల ఉన్న వైఎస్సార్ ఫొటో అక్కడి నుంచి తొలగించారు. » కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ఈడేపల్లిలో శిశు విద్యామందిర్ వద్ద ఉన్న 45వ డివిజన్ సచివాలయానికి పసుపు పచ్చని నూతన బోర్డు ఏర్పాటు చేశారు. ఆ డివిజన్ టీడీపీ నాయకుడు పి.వి.ఫణికుమార్‌తో కలిసి నాయకులు, కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి పవన్‌కళ్యాణ్, ఎంపీ వల్లభనేని బాలశౌరి చిత్రాలతో తయారు చేసిన సచివాలయం బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు ఏర్పాటుకు సచివాలయ సిబ్బంది సహకరించారు. ఫణికుమార్ కేక్ కట్ చేశారు. » శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని 54వ డివిజన్ జనార్దన్‌రెడ్డికాలనీలో వైఎస్సార్సీపీ జెండాను, స్థూపాన్ని, శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఘటనా స్థలాన్ని నెల్లూరు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు, వైఎస్సార్సీపీ నాయకుడు ఎస్కే జమీర్‌అహ్మద్, పలువురు పార్టీ నాయకులు పరిశీలించారు. » చిత్తూరు జిల్లా కుప్పం మండలం కొత్తయిండ్లు గ్రామంలో వైఎస్సార్సీపీ జెండాను ధ్వంసం చేశారు. మొదటి నుంచి టీడీపీకి పట్టున్న గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను గెల్చుకున్న వైఎస్సార్సీపీ వర్గీయులు జెండా ఎగురవేసారు. అప్పటి నుంచి వైఎస్సార్సీపీపై అక్కసు వ్యక్తంచేస్తున్న టీడీపీ నాయకులు మంగళవారం రాత్రి జెండా పీకేసి స్థూపాన్ని ధ్వంసం చేశారని స్థానికులు తెలిపారు. » శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఆర్.హెచ్.పురంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మంగళవారం రాత్రి కూల్చివేశారు. గ్రామంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన అనంతరం విద్యుత్ సరఫరా నిలిపేసి సుమారు 15 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించి పొదల్లో పడేశారు. దీనిపై కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు.» ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో తెలుగుదేశం, జనసేన నాయకులు బుధవారం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు సచివాలయం–2 భవనం ప్రారంభ సమయంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల వద్ద బాణసంచా కాలుస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ మణికుమార్ చెప్పారు. » తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపుసావరం గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ శృతితప్పింది. మోటారు సైకిళ్లపై ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు గ్రామంలోని జక్కంపూడి గ్రామ మోహన్‌రావు మల్టీపర్పస్ సెంటర్ గేట్లు తెరుచుకుని గ్రౌండ్లోకి ప్రవేశించారు. అక్కడున్న ఫ్లెక్సీలను చించేశారు. కళ్యాణ మంటపం గోడపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరుల పేర్లున్న శిలాఫలకాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు రాళ్లు విసిరారు. దీంతో పలు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. శిలాఫలకం పాక్షికంగా దెబ్బతింది. -
రైల్వే సిగ్నల్స్ ట్యాంపర్..రెండు రైళ్లలో దోపిడీ
బిట్రగుంట: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని కావలి– శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు రెండు రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే సిగ్నల్స్‌ను ట్యాంపర్ చేయడం ద్వారా రెడ్ సిగ్నల్ వేసి రైళ్లను నిలిపి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే జీఆర్పీ అధికారుల సమాచారం మేరకు.. కావలి–శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో తెల్లవారుజామున 1.50 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి రెడ్ సిగ్నల్ పడేలా చేశారు. ఆ సమయంలో నరసాపురం నుంచి ధర్మవరం వెళుతున్న ధర్మవరం ఎక్స్‌ప్రెస్ (నంబరు 17247)ను నిలిపివేసి ఎస్–11, ఎస్–13 బోగీల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు, బ్యాగులు చోరీ చేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత అదే మార్గంలో వచి్చన షిర్డిసాయినగర్ నుంచి తిరుపతికి వెళ్తున్న తిరుపతి స్పెషల్ (07638) ట్రైన్‌ను ఇదే తరహాలో నిలిపి ఎస్–3, ఎస్–5 కోచ్‌ల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోని 38 గ్రాముల బంగారు గొలుసులు, బ్యాగులు అపహరించారు. ఈ క్రమంలో దోపిడీని అడ్డుకునేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం పక్కనే ఉన్న కొండబిట్రగుంట అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రైల్వే పోలీసులు దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
జగన్ ఓటమిని జీర్ణించుకోలేక..
కొవ్వూరు : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలుకావడం ఆ వీరాభిమాని జీర్ణించుకోలేకపోయాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. మొన్నటి ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉంటారని.. తన ఆవేదనను రాష్ట్రపతి దృష్టికి వెళ్తే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తూ మిత్రులకు పంపిన వీడియో సందేశంలో వివరించాడు. తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిపై ఉన్న గామన్ బ్రిడ్జిపై మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఏమిటంటే.. తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన తాళ్లూరి రాజు, తన భార్య నాగలక్ష్మి, కుమార్తె హర్షిత, కుమారుడు మోక్షిత్‌తో కలిసి మంగళవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య కోవాలని నిర్ణయించుకున్నాడు. కొవ్వూరు–కాతేరు మధ్య గోదావరిపై ఉన్న గామన్ బ్రిడ్జి పైకి వేకువజామునే చేరుకున్నాడు. తాను, తన కుటుంబమంతా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నామని మిత్రులకు వీడియో సందేశం పెట్టాడు. పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, రాజు కుటుంబ సభ్యులు, కొవ్వూరు పట్టణ పోలీసులు ఈ సమాచారం తెలుసుకుని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రిడ్జిపై రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై ఉన్న రాజుకు, ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్సార్సీపీ కార్యకర్త చిన్నం హరిబాబు, కొవ్వూరు పట్టణ సీఐ వి. జగదీశ్వరరావు, ఇతర సిబ్బంది నచ్చజెప్పి బయటకు తీసుకుకొచ్చారు.ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉంటారు..అనంతరం.. రాజు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడిగినా వైఎస్సార్సీపీకే ఓటు వేశామంటున్నారని, కానీ, జగన్ ఎలా ఓటమి పాలయ్యారో తెలీడంలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. తన కుటుంబ చావుతోనైన ఎన్నికల్లో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ చేస్తారని ఆశిస్తున్నానన్నాడు. ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి ఉంటారని, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని రాజు చెప్పాడు. తన ఆవేదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకువెళ్తే రీపోలింగ్‌కు ఆదేశిస్తారన్న ఉద్దేశంతో వీడియో ద్వారా తన సందేశాన్ని తెలిపి కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానన్నాడు. తన కుటుంబం చావు ద్వారా జగనన్నకు మేలు చేకూరితే చాలని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంత మంచి చేసిన జగన్ ఓడిపోతారనుకోలేదు..తనకు రెండుసార్లు యాక్సిడెంట్ అయితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేశారని.. కాలులో స్టీల్‌రాడ్లు వేసి, వైద్యం చేసి, ఇంటికి పంపించారని రాజు తనకు జరిగిన మేలును వివరించాడు. మంచంపై ఉన్న రెండునెలలూ తన కుటుంబ పోషణకు వైఎస్సార్ ఆసరా పేరిట ఆర్థిక సాయం చేశారని.. అలాగే, తనకు ఏళ్ల తరబడి సొంతిల్లు లేదని, జగనన్న దయతో ఇంటి స్థలం ఇచ్చారని, ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పాడు. ఈ ఏడాది తన కుమార్తె చదువుకు అమ్మఒడి సొమ్ము పడుతుందని ఆశపడ్డానని, తన తమ్ముడికీ అమ్మఒడి సాయం అందుతోందని తెలిపాడు. అలాగే, నాన్నమ్మకు రూ.3 వేల పింఛను అందిస్తున్నారని, అందరికీ ఇంత మంచి చేసిన జగన్ ఘోరంగా ఓటమి పాలవుతారని కలలో కూడా ఊహించలేదని కన్నీటితో చెప్పాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ తనకు కంటి మీద కునుకులేదని, జగనన్న ఓటమి నిరంతరం తనను కలచివేస్తోందని ఆవేదన చెందాడు. ఏదో మోసం జరిగిందనేదే తన బాధ అని, ఈ ఎన్నికలపై విచారణ చేయిస్తే వాస్తవాలు బయటపడతాయన్నాడు.ఇక బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తే ఎన్నికలపై విచారణకు అవకాశం ఉండదన్నారు. అందుకనే తెల్లవారుజామున 5.30 గంటలకు భార్యాపిల్లల్ని తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు బ్రిడ్జిపైకి వచ్చానని చెప్పాడు. రాజు, ఆయన భార్యకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.