breaking news
-
పోసానిపై ‘పచ్చ’ పగ
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి దగ్గర్నుంచి ఈరోజు(శనివారం) రిమ్స్ ఆస్పత్రి తరలించే విషయంలోనూ పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది పోసాని అనారోగ్యంతో ఉన్నా పోలీసుల వేధింపుల పర్వం మాత్రం కొనసాగుతోంది. అరెస్టు సమయంలో తన అనారోగ్యం సమస్యలను పోసాని, ఆయన కుటుంబ సభ్యులు.. పోలీసులకు చెప్పారు. అరెస్ట్ చేసేటప్పుడు తనకు రేపు ఎంఆర్ఐ స్కాన్ ఉందని పోలీసులకు స్పష్టం చేశారు. అయినా వినిపించుకోకుండా పోసానిని అరెస్ట్ చేశారు. తమ వద్ద మంచి డాక్టర్లు ఉన్నారంటూ జీపులో ఎక్కించుకుని పోసానిని తీసుకువెళ్లారు సంబేపల్లి ఎస్ఐ.తెల్లారిదాకా జీప్‌లో తిప్పుతూ..ఇలా తెల్లారిదాకా జీపులోనే తిప్పుతూ పోసానిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు ఖాకీలు. 27వ తేదీ మధ్యాహ్నం ఓబులవారి పల్లె పీఎస్ కు తరలించారు. అప్పుడు కూడా పోసానిని 9 గంటల పాటు విచారించారు. కోర్టుకు తరలించే ముందు పీహెచ్ సీ వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. గొంతు, చేయి నొప్పితో ఉన్న పోసానికి బీపీ, షగర్ చెక్ చేసి కోర్టుకు తరలించారు. రెండు రాత్రిళ్లు నిద్ర, ఆహారం లేకుండా పోసానిని ఖాకీలు ఇబ్బంది పెట్టారు. రాజంపేట జైలుకు తరలించిన తర్వాత ఛాతి నొప్పితో పోసాని తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇక జైలు నుంచి ఆస్పత్రికి తరలింపులోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడింది. తీవ్రంగా నొప్పితో బాధపడుతున్నా మధ్యాహ్నం వరకూ ఆస్పత్రికి తరలించకుండా వేధింపులకు గురిచేశారు. ఈసీజీ పరీక్షల్లో హార్ట్ బీట్ తేడా కనపించడంతో కడప రిమ్స్ కు తరలించారు. రిమ్స్ కు పోసానిని తరలించే విషయంలో కూడా అలక్ష్యం ప్రదర్శించారు. చాతి నొప్పితో బాధపడుతున్న పోసానిని అంబులెన్స్ లో కాకుండా పోలీస్ వ్యాన్ లో తరలించడం పోలీసుల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయి అనే దానికి అద్దం పడుతోంది. -
తెలుగు తమ్ముళ్ల ఘరానా మోసం
సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం కేంద్రంగా మొదలై.. హైదరాబాద్ వరకు ఇద్దరు టీడీపీ నేతలు చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చిoది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట 350 మందికి టోకరా వేసి సుమారు రూ.6 కోట్లతో పరారైన వైనం బయటపడింది. ఇచ్ఛాపురానికి 70 కిలోమీటర్ల దూరంలోని ఒడిశా చీకటి బ్లాక్ పార్వతీపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొచ్చెర్ల ధర్మారావురెడ్డి పోలెండ్‌లో వలస కూలీగా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఏజెంట్‌గా అవతారం ఎత్తి స్థానిక యువకులకు ఉద్యోగాల ఎర వేశాడు. దగ్గర బంధువుల్లో నిరుద్యోగులుగా ఉన్నవారినే లక్ష్యంగా చేసుకున్నాడు. ఇటలీలో అదిరిపోయే ఉద్యోగాలున్నాయని ఊరించాడు. ధర్మారావురెడ్డి తన బంధువులైన ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు కాయి దిలీప్(తేలుకుంచి), శ్రీను(బెజ్జిపద్ర)తో ప్రచారం ఊదరగొట్టించాడు. ఇటలీలో ఫ్రూట్స్ కటింగ్, ప్యాకింగ్, వైన్, బీర్ల కంపెనీలు, ప్యాకింగ్ మొదలైన సంస్థల్లో మంచి ఉద్యోగాలు, కష్టం లేని పని, రూ.లక్షల్లో జీతం అంటూ నమ్మించాడు. ఎంత వీలైతే అంతమందికి ఉద్యోగాలున్నాయని.. ఎక్కువ మందిని తీసుకొస్తే ఫీజులో కొంత తగ్గిస్తానంటూ ఆశ చూపించాడు. టీడీపీ నేతల మాటలు నమ్మిన నిరుద్యోగులు.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ప్రకాశం, గుంటూరు తదితర ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న బంధువులు, స్నేహితులను సంప్రదించారు. వారిని కూడా ఈ ఉచ్చులోకి తీసుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ధర్మారావురెడ్డి, దిలీప్ కలిసి ప్లాన్ వేసినట్లు పక్కాగా స్పష్టమవుతోంది. ఇచ్ఛాపురం ఎమ్మెల్యేతో ఉన్న అనుబంధం.. ఏం జరిగినా పార్టీ కాపాడుతుందన్న తెగింపుతో.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 350 మందిని ఎంపిక చేశారు. ఇచ్చాç³#రంలో లాడ్జిని తీసుకొని మొదటి విడతలో 2024 ఏడాది జూలై 26న 75 మందిని ఇంటర్వ్యూ చేసి రూ.20 వేలు అడ్వాన్స్, తర్వాత రూ.1.35 లక్షలు వసూలు చేశారు. ఆగస్టులో హైదరాబాద్‌లో మరో 175 మందిని ఇంటర్వ్యూ చేసి రూ.1.35 లక్షలు చొప్పున తీసుకున్నారు. జనవరిలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 120 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి రూ.50 వేలు వంతున వసూలు చేశారు. అందరి దగ్గర విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్‌లు, ఫొటోలు తీసుకున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి మొదటి వారంలో ఇటలీ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సమాచారం ఇచ్చారు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నారని చెప్పి ఇచ్ఛాపురంలోని ఓ ప్రైవేట్ మెడికల్ ల్యాబ్‌లో 350 మంది నిరుద్యోగులకు వారి సొంత డబ్బు తోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ వెళ్లాక బట్టబయలైన మోసంఇటలీ ప్రయాణానికి మొదటి విడతలో 30 మంది పాస్‌పోర్టు చెకింగ్, స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ధర్మారావు, దిలీప్ రెండు వారాల క్రితం చెప్పడంతో.. ఢిల్లీ వెళ్లిన యువకులకు అసలు విషయం తెలిసింది. వాళ్లు చెప్పిన అడ్రస్‌లు, పాస్‌పోర్టు చెకింగ్లు అంతా మోసమని గ్రహించారు. 350 మందితో ఒక వాట్సప్ గ్రూప్ పెట్టిన టీడీపీ నేతలు.. ’’మీతో పాటు మేము కూడా మోసపోయాం.. అందరూ క్షమించాలి‘‘ అంటూ వాయిస్ మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్చాఫ్ చేసేశారు. బాధితులంతా లబోదిబోమంటూ రోడ్డున పడ్డారు. పోలీసుల్ని ఆశ్రయించినా పట్టించుకోవడం లేదు.! ధర్మారావురెడ్డి బాధితులు ఫిబ్రవరి 17న ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పరిశీలిస్తామని చెప్పారు తప్ప.. విచారణకు సాహసించలేదు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి.. విచారణను ఆపుతున్నట్లు బాధితులు గ్రహించారు. చేసేదిలేక విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్‌కు వచి్చనా పట్టించుకోలేదంటూ బాధిత నిరుద్యోగులు వాపోతున్నారు. రాజకీయ పలుకుబడితో.. కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.సీఎం కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాం టీడీపీ నేతల బాధితులు ధర్మారెడ్డి మంచివాడు అని నమ్మబలికిన దిలీప్ మధ్యవర్తిత్వంతో అందరం డబ్బు చెల్లించాం. మోసపోయామని చివరి నిమిషంలో తెలిసింది. దిలీప్‌ను నిలదీసినా స్పందించలేదు. ఇచ్ఛాపురం పోలీసులు పట్టించుకోలేదు. సీఎం ఆఫీస్‌కు వెళ్లాం. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్లారని చెప్పడంతో.. సీఎం కార్యాలయంలోనూ, మంత్రి లోకేష్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాం. మా ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడును కలిసి ఫిర్యాదు చేస్తే.. రెండు రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పారు. వారం దాటినా ఎలాంటి స్పందన లేదు. చాలామంది ఉన్న ఉద్యోగం వదిలి డబ్బులు కట్టాం. రోడ్డున పడ్డాం. డబ్బు తిరిగి చెల్లించాలి. -
హెచ్ఐవీ దాచి.. వివాహం చేసుకోబోయిన వరుడు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్‌పేటలోని ఓ చర్చిలో తాళికట్టే సమయానికి ఏపీ ఎన్జీవోస్(AP NGOs) ప్రతినిధులు వచ్చి మంగళవారం ఓ వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా హెచ్ఐవీ డిస్ట్రిక్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్యామ్సన్ అందించిన వివరాలు.. 2013లో హెచ్ఐవీ పాజిటివ్(HIV Positive) నిర్ధారణ అయి, ప్రస్తుతం 35 సంవత్సరాల వయసు ఉన్న ఓ యువకుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే ఓ యువతిని వివాహం చేసుకుంటున్నాడని తెలియడంతో ఆరోగ్యంగా ఉన్న యువతిని అనారోగ్యం బారిన పడకుండా కాపాడేందుకు ఏపీ ఎన్జీవోస్(AP NGOs) మహిళా ప్రతినిధులు క్రిస్టియన్‌పేట వచ్చి చర్చి పాస్టర్కు వివరించారు. అమ్మాయి బంధువులతో పెళ్లి కొడుకుకు హెచ్ఐవీ(HIV Positive) ఉందని చెప్పడంతో వారు వివాహాన్ని నిలిపివేశారు. వివాహం నిలిపివేయడంతో పెళ్లికొడుకు బంధువులు పెళ్లికూతురు బంధువులతో గొడవకు దిగారు. వివాహం చేసే పాస్టర్, హెచ్ఐవీ పాజిటివ్ ఉంటే ఎలా వివాహం జరిపిస్తామని మాట్లాడడంతో పెళ్లికొడుకు బంధువులు అక్కడ ఉన్నవారిపై దాడికి పాల్పడ్డారు. ఏపీఎన్జీవోస్ అధికారులు మేము బహిరంగం చేయాలను కోవడం లేదని, ఇక్కడ గొడవ చేయవద్దని మా వారు వేడుకుకున్నప్పటికీ వినకుండా వీరిపై దాడి చేశారని హెచ్ఐవీ డిస్ట్రిక్ ప్రాజెక్ట్ మేనేజర్ తెలిపారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు, ఘటనా స్థలానికి వచ్చారు. మా సిబ్బందిపై దాడిచేసి ఫోన్లు లాక్కున్నారని, మా ఎన్జీవోస్ ఫోన్లు ఇప్పించాలని ఆయన పోలీసులను కోరారు. -
పుణ్యస్నానాలకు వెళ్లి ఏడుగురి మృతి
కొవ్వూరు/తాళ్లపూడి/శ్రీశైలం ప్రాజెక్ట్/కొళ్లికూళ్ల (పెనుగంచిప్రోలు): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం నదీ స్నానాలకు వెళ్లిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఐదుగురు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువకులు కాగా, ఇద్దరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తండ్రి, కుమారుడు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన 12 మంది యువకులు బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో మోటారు సైకిళ్లపై సమీపంలోని చింతలపూడి పంప్‌హౌస్ వద్ద గోదావరి నదిలో స్నానాలకు వెళ్లారు. అక్కడి ఇసుక ర్యాంపు వద్ద నీరు మూడు అడుగులే ఉండటంతో స్నానాలకు దిగారు. కేరింతలు కొడుతూ ఉత్సాహంగా స్నానాలు చేస్తూ నీరు ఎక్కువగా ఉన్న వైపు వెళ్లారు. కొద్ది దూరం వెళ్లేసరికి ప్రవాహం పెరగడంతో తిరుమలశెట్టి సాయిపవన్ (17), పడాల దుర్గాప్రసాద్ (19), అనిశెట్టి పవన్ గణేష్ (18), పడాల దేవదత్త సాయి (19), గర్రే ఆకాశ్ (19) కొట్టుకుపోయారు. వెంటనే స్థానిక జాలర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు పడవలతో గాలించారు. మృతులంతా పేద కుటుంబాలకు చెందినవారే. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి తలారి వెంకట్రావు ఘటనా స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. శ్రీశైలం వద్ద తండ్రి, కుమారుడు మృతి ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొళ్లికూళ్ల గ్రామానికి చెందిన పెరుగు చిన్న గురవయ్య (35), ఆయన కుమారుడు వాసు (11) శ్రీశైలం లింగాలగట్టు వద్ద కృష్ణా నదిలో మునిగి మరణించారు. శివ దీక్ష తీసుకున్న గురవయ్య, భార్య తిరుపతమ్మ, కుమారుడు వాసు, ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 40 మంది భక్తులు మంగళవారం బస్సులో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లారు. బుధవారం ఉదయం స్నానాలు చేసేందుకు లింగాలగట్టు వద్దకు వెళ్లారు. కృష్ణా నదిలో స్నానం చేస్తుండగా వాసు కాలు జారి నీటిలో పడిపోయాడు. కుమారుడిని కాపాడబోయిన చిన్న గురవయ్య కూడా నీటిలో మునిగిపోయాడు. ఒడ్డున ఉన్న తిరుపతమ్మ పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని మత్స్యకారులు నదిలో దూకి వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. గురవయ్య, వాసు మృతదేహాలను పోలీసులు సున్నిపెంట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
ఆటగదరా శివ!
పలమనేరు: కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుందని గుర్తు చేసే ఘటన సోమవారం పలమనేరులో వెలుగు చూసింది. ఓ వివాహిత భర్తను, పిల్లలను కాదనుకుని ప్రియుడితో వెళ్లేందుకు ప్రయత్నించింది. అనూహ్యంగా.. ఆరు నెలలపాటు జైలు జీవితం గడిపింది. బయటకు వచ్చిన ఆమెను భర్త పెద్ద మనసుతో స్వీకరించాడు. అయితే చిన్నపాటి గొడవకే ఇప్పుడు ఆమె బలవన్మరణానికి పాల్పడింది. గత ఏడాది.. ఈ ఏడాది.. శివరాత్రి సందర్భంలోనే ఈ ఘటన జరగడం ఇక్కడ గమనార్హం. మున్సిపాలిటీ పరిధిలోని బోడిరెడ్డిపల్లికి చెందిన జగన్నాథం భార్య కోమల (36) బలవన్మరణానికి పాల్పడింది. సోమవారం ఉదయం ఇంట్లో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె జల్లిపేట చెరువులో ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో శివరాత్రి పూట ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత శివరాత్రి నాడు ఏం జరిగిందంటే... గడ్డూరుకు చెందిన కోమలకు జగన్నాథంతో ఏడేళ్ల కిందట వివాహమైంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. కిందటి ఏడాది.. శివరాత్రి పర్వదినాన జాగరణ పేరిట గుడి వెళ్తున్నానని చెప్పి.. కొలమాసనపల్లికి చెందిన గౌతం(26)తో వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. బైక్‌పై గడ్డూరు శివారులోని జగమర్ల అడవి వైపుగా వెళ్లారు. అయితే అప్పటికే జంటలను టార్గెట్ చేసే సైకో వినయ్ కంట వీళ్లు పడ్డారు.పెద్దపంజాణి మండలం శివాడికి చెందిన వినయ్.. ఏకాంతం కోసం అడవుల్లోకి, పార్క్‌ల్లోకి వచ్చే జంటను బెదిరించి బంగారం, డబ్బులు, స్మార్ట్ఫోన్లు చోరీ చేసేవాడు. అంతటితో ఆగకుండా బ్లాక్మెయిల్ చేసి అత్యాచారాలు చేసేవాడు. అలా.. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో సైకో వినయ్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో.. కోమల, గౌతంలను వినయ్ బెదిరించాడు. అందుకు వాళ్లు ఒప్పుకోకపోవడంతో రాడుతో దాడికి పాల్పడబోయాడు. అయితే జరిగిన పెనులాగటలో వినయ్ కింద పడిపోగా.. గౌతం పక్కనే ఉన్న బండరాయి పడేశాడు. దీంతో వినయ్ అక్కడిక్కడే మరణించాడు. ఆపై ఏమీ తెలియనట్లు గౌతం, కోమల అక్కడి నుంచి వెళ్లిపోయారు. మూడు రోజుల తర్వాత ఈ హత్యోదంతం వెలుగుచూసింది. దీంతో భయపడిన ఇద్దరూ అతన్ని చంపింది తామేనని పోలీసులకు లొంగిపోయారు.ఇప్పుడేమైందంటే... ఆరు నెలల తర్వాత కోమలను ఆమె తల్లిదండ్రులు బెయిల్ మీద బయటకు తీసుకొచ్చారు. మళ్లీ తప్పు చేయనని మాట తీసుకుని భర్త ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అప్పటి నుంచి అంతా హాయిగా నడుస్తోంది. ఈ క్రమంలో చిన్నపాటి గొడవకు తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ప్రాణం తీసుకోవడం ఆ ఇంట విషాదం నింపింది. ఇదంతా ఆ శివుడే ఆడించిన ఆట అంటూ గ్రామస్తులు పలువురు చర్చించుకుంటున్నారు. -
ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలు..
అనంతపురం: ఓ యువకుడు ఇద్దరు యువతులను ప్రేమించి మోసం చేశాడు. దీంతో మనస్తాపం చెందిన యువతులు వాస్మాయిల్ తాగారు. ఇందులో ఒకరు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతపురం వన్‌టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం గెరిశనపల్లికి చెందిన దివాకర్ అనంతపురం బళ్లారి రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గతంలో ముదిగుబ్బకు చెందిన రేష్మ అనే యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. పెద్దలు రేష్మకు వివాహం చేయగా.. పెళ్లయిన నెలకే ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. మళ్లీ దివాకర్‌తో ప్రేమాయణం సాగించింది.ఈ క్రమంలో రూ.2 లక్షలకు పైగా డబ్బు ఇచ్చింది. కాగా, కణేకల్లు మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన శారద (23) అనే యువతితోనూ దివాకర్ ప్రేమాయణం సాగించాడు. అటు రేష్మ, ఇటు శారద ఇద్దరితోనూ ఏకకాలంలో ప్రేమ బంధం నడిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసేవాడు. ఇటీవల శారదకు దివాకర్ తీరుపై అనుమానం వచ్చి ఇన్‌స్టాగ్రామ్‌ను పరిశీలించగా.. రేష్మతో అతడి బాగోతం బయటపడింది. ఇదే క్రమంలో రేష్మ కూడా దివాకర్‌ను నిలదీసింది. విషయం తెలుసుకున్న రేష్మ కుటుంబ సభ్యులు ఆమెను కదిరిలో ఉన్న తమ బంధువుల ఇంటికి పంపారు.అయితే, శనివారం దివాకర్‌తో మరోమారు రేష్మ ఫోన్లో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో దివాకర్ కదిరికి వెళ్లి ఆమెను బైక్‌పై అనంతపురం తీసుకొచ్చాడు. శారద ఉంటున్న హాస్టల్లోనే ఆమెను వదిలాడు. ఆదివారం సాయంత్రం రేష్మ, శారదలు దివాకర్‌ను తామున్న చోటుకు పిలిచి ఇద్దరినీ పెళ్లిచేసుకోవాలని కోరారు. అయితే, తానెవరినీ పెళ్లి చేసుకునేది లేదంటూ దివాకర్ వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరు యువతులు ఆర్టీఓ కార్యాలయం వద్దకు వెళ్లి వాస్మాయిల్ తాగారు.విషయాన్ని దివాకర్‌కు ఫోన్లో తెలియజేయగా.. వెంటనే అతను అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో ఇద్దరినీ ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించాడు. ఆస్పత్రిలో చికిత్స ఫలించక శారద మృతి చెందింది. రేష్మ పరిస్థితి నిలకడగా ఉంది. శారద వాస్మాయిల్ ఎక్కువ తాగిందని, రేష్మ కొంచెమే సేవించినట్లు గుర్తించిన పోలీసులు ఇందులో రేష్మ పాత్రపైనా ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’ -
‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’
కర్నూలు: మరో రెండు రోజుల్లో పాఠశాలలో వేడుక ఉంది. అందులో నిర్వహించే డ్యాన్స్ కార్యక్రమంలో అందరినీ అలరించాలని ఆ బాలుడు ఎంతో ఎదురు చూశాడు. ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. ‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’ అని ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమారుడు విగత జీవిగా తిరిగొచ్చాడు. తండ్రి కళ్లేదుటే ఆ కుమారుడు లారీ చక్రాల కింద నలిగిపోయాడు. ఈ ఘటన ఆదోని పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని లంగర్‌బావి వీధికి చెందిన గురురాజ, ప్రతిభ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సత్యనారాయణ 9వ తరగతి, ద్వితీయ కుమారుడు ఆదిత్యనారాయణ (10) ఐదో తరగతి చదువుతున్నారు. గురురాజ.. మెడికల్ ఏజెన్సీ వృత్తి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎమ్మిగనూరు రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదిత్యనారాయణ విద్యనభ్యసిస్తున్నాడు. అకాడమీ పూర్తి కావడంతో మంగళవారం ఫెర్వెల్ పార్టీ నిర్వహించాలని పాఠశాల యాజమాన్యం నిర్ణయించింది. ఈ సందర్భంగా విద్యార్థులతో నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం కొందరు విద్యార్థులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఆదిత్యనారాయణ ఉదయం తన తండ్రి గురురాజతో బైక్‌పై పాఠశాలకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఎమ్మిగనూరు రోడ్డులోని శ్రీ కృష్ణదేవాలయం సమీపంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ లారీ ఆదోని వైపు వేగంగా దూసుకువస్తుండగా తప్పించబోయి అదుపు తప్పి కింద పడ్డారు. అయితే గురురాజ ఒకవైపు పడిపోయి సురక్షితంగా ఉన్నాడు. మరోవైపు ఆదిత్యనారాయణ లారీ టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడు మృతిచెందినా లారీని నిలబెట్టకుండా డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లి ప్రమాద స్థలానికి చేరుకుని.. కుమారుడి జ్ఞాపకాలను తలుచుకుని రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. తండ్రి గురురాజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తప్పించుకున్న లారీ డ్రైవర్, లారీని సీసీ కెమెరా ద్వారా పోలీసులు గుర్తించారు. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.అమ్మా.. నేనేం పాపం చేశా! -
గుంటూరు పెదకాకానిలో తీవ్ర విషాదం
గుంటూరు: జిల్లాలోని పెదకాకానిలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ షాక్‌తో నలుగురు దుర్మరణ చెందారు. గోశాల వద్ద సంపులో పూడిక తీస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుది. ఒక రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృతి చెందారు. సంపులో పూడిక తీసివేతకు రైతు.. కూలీలను మాట్లాడుకుని ఆ పని చేస్తుండగా ఈ విషాదం జరిగినట్లు తెలుస్తోంది. -
ఇల్లాలిని, పిల్లనిచ్చిన మామను అతి కిరాతంగా నరికిన భర్త..
కొవ్వూరు(కాకినాడ): కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న ఇల్లాలిని, పిల్లనిచ్చిన మామను ఓ వ్యక్తి అతి దారుణంగా కత్తితో నరికిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, మామ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. కొవ్వూరు ఎస్సై కె.జగన్మోహన్ కథనం ప్రకారం.. కొవ్వూరు మండలం వాడపల్లి బంగారుపేటకు చెందిన అడ్డాల నాగయ్య రెండో కుమార్తె కృష్ణతులసి(33)కి, కృష్ణా జిల్లా తిరువూరు మండలం రాజుగూడేనికి చెందిన మురళీకృష్ణకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతుల మధ్య మనస్పర్థలు రావటంతో కృష్ణతులసి కుమారుడు రాముతో కలసి ఆరు నెలల క్రితం బంగారుపేటలోని తండ్రి నాగయ్య వద్దకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో మురళీకృష్ణ కూడా బంగారుపేటకు వచ్చి కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుంటున్నారు. దంపతులిద్దరూ విడివిడిగా జీవనం సాగిస్తున్నారు. నాగయ్యకు అల్లుడు మురళీకృష్ణ కొంత సొమ్ము ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బులు అడిగేందుకు కృష్ణతులసి గురువారం సాయంత్రం భర్త మురళీకృష్ణ వద్దకు వెళ్లింది. తనను డబ్బులు అడగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మురళీకృష్ణ కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఆమైపె దాడి చేశాడు. అది గమనించిన నాగయ్య అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతడిపై కూడా మురళీకృష్ణ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కృష్ణతులసి అక్కడికక్కడే మృతి చెందగా, నాగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొవ్వూరు డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మురళీకృష్ణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కృష్ణతులసి కుమారుడు రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.జగన్మోహన్ తెలిపారు. -
ప్రేమించకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తా..!
కామవరపుకోట: ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం కామవరపుకోట పంచాయతీ వడ్లపల్లిలో చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వడ్లపల్లి గ్రామానికి చెందిన గంజి నాగ దీప్తి (19) ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. గత కొంతకాలంగా నాగ దీప్తి కాలేజీకి వచ్చి, వెళ్లే సమయాల్లో కామవరపుకోటకు చెందిన ఆకతాయిలు ఆమెను ప్రేమించాలని, లేకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించేవారు. ఈ విషయంపై ఆమె అన్నయ్య అరవింద్ ఆ యువకులను నిలదీశాడు. దీంతో ఇటీవల కామవరపుకోటలో జరిగిన వీరభద్రస్వామి తిరునాళ్లలో అరవింద్‌ను తీవ్రంగా కొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బుధవారం మళ్లీ ఆ యువకులు నాగ దీప్తికి ఫోన్ చేసి తమను ప్రేమించకపోతే మీ అన్నయ్యతో సహా మీ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు. దీంతో మనస్థాపానికి గురైన నాగదీప్తి గురువారం ఇంట్లో ఫ్యాన్‌కు ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసమయంలో తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, రాణి వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వెళ్లగా అన్నయ్య అరవింద్ గదిలో నిద్రపోతున్నాడు. నాగ దీప్తి ఫ్యానుకు వేలాడుతూ ఉండడాన్ని గమనించిన అరవింద్ చుట్టుపక్కల బంధువుల సహాయంతో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నా కుమార్తె మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనపై తడికలపూడి ఎస్సై చెన్నారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కాల్ మెర్జింగ్‌తో కాజేస్తారు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో అమాయకులను మోసం చేసి డబ్బు కొల్లగొడుతున్నారు. తాజాగా కాల్ మెర్జింగ్ స్కాంకు తెరలేపారు. మనకు తెలియకుండానే మన నుంచి ఓటీపీలు తీసుకుని మన బ్యాంకు ఖాతాలను కాజేస్తున్నారు. ఈ తరహా మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కు చెందిన ది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) హెచ్చరించింది. అపరిచితులు ఫోన్ చేసి అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలను చెప్పవద్దని సూచించింది.కాల్ మెర్జింగ్ స్కాం అంటే? ఒక అపరిచితుడు మీ ఫోన్ నంబర్‌ను మీ స్నేహితుడి నుంచి తీసుకున్నానని చెబుతూ కాల్ చేయడంతో ఈ స్కాం ప్రారంభమవుతుంది. మీతో ఫోన్ మాట్లాడుతూనే.. మీ స్నేహితుడు వేరే నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని చెప్పి, రెండు కాల్స్‌ను విలీనం (మెర్జ్) చేయమని స్కామర్ అడుగుతాడు. ఆ ‘స్నేహితుడి’కాల్ నిజంగా మీ మిత్రుడిది కాదు. అది బ్యాంకు ఓటీపీ కాల్. స్కామర్ అడగ్గానే మీరు కాల్ విలీనానికి అనుమతిస్తే సదరు వ్యక్తి వెంటనే బ్యాంకు ధ్రువీకరణకు సంబంధించిన ఓటీపీ కాల్‌తో కనెక్ట్ అవుతాడు. ఇలా బ్యాంకు కాల్ నుంచి వచ్చే ఓటీపీని అవతలి నుంచి వింటున్న సైబర్ మోసగాళ్లు సేకరిస్తారు. అప్పటికే బ్యాంకు వివరాలు తీసుకుని పెట్టుకునే సైబర్ మోసగాళ్లు..ఆ ఓటీపీని ఉపయోగించి మీ బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు కొల్లగొడతారు. ఇదంతా కచ్చితమైన సమయంలోపు పూర్తిచేస్తారు. మీరు బ్యాంకు ఓటీపీ వారికి చెప్పినట్లు కూడా గుర్తించలేరు.కాల్ మెర్జింగ్ స్కాంకు చిక్కకుండా ఉండాలంటే?» అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్ చేసి, మరో నంబర్ నుంచి వస్తున్న కాల్‌ను మెర్జ్ చేయాలని కోరితే అది కచ్చితంగా మోసమని గ్రహించాలి.» మీకు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, లేదా మీకు స్నేహితుడికి స్నేహితుడిని అని చెప్తే నమ్మవద్దు.» అనుమానాస్పద ఫోన్‌కాల్స్‌పై వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్‌ఫ్రీ నంబర్ 1930లో ఫిర్యాదు చేయాలి.» మీరు ఓటీపీ పంచుకున్నట్టు అనుమానం వస్తే వెంటనే మీ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చి డబ్బులు పోకుండా తగిన చర్యలు తీసుకోవాలి. -
విశాఖలో జ్యోతిష్యుడి దారుణ హత్య
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. జ్యోతిష్యుడు దారుణ హత్యకు గురయ్యారు. జ్యోతిష్యుడు అప్పన్న అస్థి పంజరం కాపులుప్పాడలో లభ్యమైంది. మహిళతో అసభ్య ప్రవర్తన నేపథ్యంలో హత్య జరిగినట్టు పోలీసుల అనుమానిస్తున్నారు. ఒక రౌడీ షీటర్, ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసి కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో క్షుద్ర పూజలు ఆనవాళ్లు కనిపించాయి. అస్థి పంజరం వద్ద పూసలు, సగం కాలిన ఫోటో, పంచే లభ్యమయ్యాయి.మరోవైపు, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. కరీంనగర్ శివారు దుర్శేడ్ గ్రామంలోని పాఠశాలలో క్షుద్ర పూజలు చేశారు. పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయుడి గది ముందు పసుపు, కుంకుమ కుద్రపూజల ఆనవాళ్లు చూసి విద్యార్థులు బెంబేలెత్తారు. -
'నా కుమారుడిది ముమ్మాటికీ హత్యే ...
అల్లూరి సీతారామరాజు జిల్లా: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు–హుకుంపేట ప్రధాన రహదారిలో పాటిమామిడి గ్రామం సమీపంలో ద్విచక్రవాహనంపై పాడేరు నుంచి వస్తు డివైడర్‌ను ఢీకొని పాడి శ్రీకాంత్(28) సంఘటన స్థలంలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో డివైడర్‌ను ఢీకొనగా వాహనం అతనిపై పడినట్టు పేర్కొన్నారు. దీనిపై మృతుడు తండ్రి పాడి చంటిబాబు తన కుమారుడు ప్రమాదంలో మృతి చెంది ఉండరని హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదంలో కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేపట్టి యువకుడి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అందించినట్టు ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. అదృశ్యమైన జ్యోతిష్యుడు.. అస్థిపంజరమై! -
గన్ బ్యాక్‌ఫైర్.. జవాన్ మృత్యువాత!
పిట్టలవానిపాలెం (కర్లపాలెం): పంజాబ్‌లోని సూరత్ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం పంచాయతీ గౌడపాలెం గ్రామానికి చెందిన జవాన్ పరిశా మోహన్ వెంకటేష్ (27) గన్‌లోని బుల్లెట్ బ్యాక్‌ఫైర్ అయ్యి రాజస్థాన్‌లో మృత్యువాత పడ్డారు. ఈ మేరకు సైనిక అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో ఆయన భార్య, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పరిశా శ్రీనివాసరావు, శివపార్వతి దంపతులకు కుమారులు మోహన్ వెంకటేష్, గోపీకృష్ణ ఉన్నారు. ఇంటర్ వరకు చదివిన మోహన్ వెంకటేష్ 2019 డిసెంబర్లో ఆర్మీలో చేరారు. రాజస్థాన్‌లో సోమవారం జరిగిన ఆర్మ్డ్ గన్ ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తల్లిదండ్రులతో మోహన్ వెంకటేష్ ఫోన్లో మాట్లాడారు. మధ్యాహ్నం 2 గంటలకు భార్యకు వీడియోకాల్ చేసి ముచ్చటించాక, పాపను కూడా చూశారు. మళ్లీ రాత్రికి ఫోన్ చేస్తానని చెప్పారు. కానీ మధ్యాహ్నం 3.30 గంటలకు గన్ క్లియర్ చేస్తుండగా బ్యాక్ ఫైర్ అయ్యి బుల్లెట్ తలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం ఆయన భౌతికకాయం స్వగ్రామానికి రానుందని సైనికాధికారులు తెలిపారు. -
చంపింది ప్రియురాలి భర్త, మామలే!
నిడమర్రు(పశ్చిమ గోదావరి): బావాయిపాలెంలో సంచలనం రేకెత్తించిన మజ్జి ఏసు హత్య కేసు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణంగా ఉంది. నిందితులు ఏసు ప్రియురాలి భర్త, మామలే.. వారు పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ హత్యకు సహకరించిన ఉండి మండలంకు చెందిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.పోలీసుల విచారణలో...బావాయిపాలెంలో ఏసు రాజు ఇంటి సమీపంలో ఉంటున్న ఒక మహిళతో వివాహేతర సంబంధమే సాగించడమే ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు. హత్య జరిగిన రోజు పోలీసు జాగిలాలు సదరు మహిళ ఇంటి వద్దనే తిరగడంతోపాటు.. ఆ ఇంటికి చెందిన తండ్రి, కొడుకులు (పిల్లి అన్నవరం, పిల్లి ఏసు) ఫోన్లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో పోలీసులు ఆదిశగా విచారణ ప్రారంభించారు. ఈ వివాహేతర సంబంధం తెలిసి ఏడాదిగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పంచాయతీ పెద్దల వరకు గొడవ వెళ్లగా వారు సర్దిచెప్పినట్లు తెలిసింది.పథకం ప్రకారం హత్యనిందుతులుగా భావిస్తున్న తండ్రి కొడుకులు పిల్లి అన్నవరం, పిల్లి ఏసు పథకం ప్రకారం మజ్జి ఏసును హత్య చేసినట్లు తెలిసింది. ఈనెల 15వ తేదీ రాత్రి బావాయిపాలెం గ్రామంలో కాపవరం కాలువ గట్టు వద్దకు ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉండగా తండ్రి, కొడుకులు కలిసి దాడి చేసి పదునైన కత్తితో మృతుడు ఏసురాజు కుడి చెయ్యి నరికేశారు. ఆ తర్వాత పీక నొక్కి చంపేసినట్లు సమాచారం. నరికిన చెయ్యిని కాపవరం కాలువలో విసిరేశారు. ఈ తతంగంలో మూడో వ్యక్తి ఉన్నట్లు తెలిసింది. కనిపించకుండా పోయిన మృతుడి కుడి చెయ్యి భాగాన్ని పోలీసులు కాపవరం కాలువలో గుర్తించి సేకరించారు. అయితే మృతుడు ఏసు రాజు పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులైన తండ్రి, కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని, వీరికి సహకరించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.అత్యంత దారుణంగా హత్య చేసి.. కుడి చేయి తీసుకెళ్లినా హంతకులు -
AP: అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ.. ఇంజనీరింగ్ విద్యార్థులు అరెస్ట్
సాక్షి, గుంటూరు: గుంటూరులో మత్తుమందు సేవిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 10 గ్రాముల ఎండీఎంఏ మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి గుంటూరుకు తీసుకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.గుంటూరులో సాయిక్రిష్టనగర్‌లోని ఒక అపార్ట్మెంట్లో మత్తుమందు సేవిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో ఎండీఎంఏ మత్తు మందును సేవిస్తూ, విక్రయిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులతో సహా డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేసి 10.67 గ్రాముల ఎండీఎంను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బెంగుళూరు నుంచి గుంటూరుకు ఇంజనీరింగ్ విద్యార్థి సాయిక్రిష్ణ డ్రగ్స్ తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.దాడుల సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎండీఎం మత్తుమందును ఒక గ్రామును 1400 రూపాయలకు కొనుగోలు చేసి సాయిక్రిష్ట్ర దాన్ని ఐదు వేలకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో మొత్తం 11 మంది నిందితులు ఉండగా.. వారిలో ఇద్దరు తప్పించుకున్నారు. వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఫొటో షూట్ పేరుతో రాసలీలలు!
నెల్లూరు సిటీ: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నెల్లూరు డీఐజీ కిరణ్‌కుమార్ చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన పలువురు మహిళా ఉద్యోగులను ఫొటోషూట్ల పేరుతో దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి రాసలీలలు సాగించారని సమాచారం. ఆ దుర్మార్గాలను ఫొటోలు తీసుకుని దాచుకునేవాడని తెలుస్తోంది. కిరణ్‌కుమార్ చీకటి జీవితాన్ని వివరిస్తూ ఆయన భార్య అనసూయరాణి బయటపెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. భార్యకు దూరంగా ఉంటూ...గుంటూరు జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్, అనసూయరాణి ప్రేమించుకుని 1998లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నారు. కిరణ్‌కుమార్‌కు 2009లో రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింది. కిరణ్‌కుమార్, అనసూయరాణి మధ్య ఏడాది కిందట విభేదాలు తలెత్తాయి. ఇద్దరూ విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అనసూయరాణి వద్ద కుమారుడు ఉండేలా, వారి బాగోగులను కిరణ్‌కుమార్ చూసుకునేలా పది నెలల కిందట పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా ఒప్పందాలు జరిగాయి. సోమవారం విజయవాడలో ఒక ఫంక్షన్లో కలిసిన కిరణ్‌కుమార్, అనసూయరాణి మధ్య గొడవ జరిగింది. తనతోపాటు తన కుమారుడిపై కిరణ్‌కుమార్ విచక్షణారహితంగా దాడి చేశారని అనసూయరాణి గుంటూరు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వికృత చేష్టలు భరించలేక విడిగా ఉంటున్నానని ఆమె తెలిపారు. కిరణ్‌కుమార్ ఇతర మహిళలతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను తనకు పంపించి మానసిక క్షోభకు గురిచేసేవాడని ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె కొన్ని ఫొటోలను కూడా బయటపెట్టారు. -
దేవుడా.. ఎవరిదీ పాపం?
రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు.. బండపని చేసుకుంటూ పొట్టపోసుకునే బడుగులు.. ఏ పూటకు ఆ పూట కూలి తెచ్చుకుని జీవనం సాగించే నిరుపేదలు.. అష్టకష్టాలు పడుతున్నా తమ నలుగురు పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అందులో ఓ ఆడబిడ్డకు పెళ్లి చేశారు. మరో అమ్మాయిని పదోతరగతి, అబ్బాయిని ఏడోతరగతి, మూడో కుమార్తెను రెండో తరగతి చదివిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేసుకుంటూ సాఫీగానే సంసారం నెట్టుకొస్తున్నారు. ఇంతలో ఆ పేద కుటుంబంపై పిడుగు పడింది. వారి జీవితాలను అల్లకల్లోలం చేసేసింది.పలమనేరు : మండలంలోని టి. వడ్డూరు గ్రామంలో బండపని చేసుకుని బతికే దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్దమ్మాయికి పెళ్లి చేశారు. మిగిలినవారు తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో రెండో బిడ్డకు కడుపు ముందుకొస్తోందని టీచర్లు చెప్పడంతో ఆందోళన చెందారు. కామెర్ల వల్ల అలా జరిగిందేమో అని పట్టించుకోలేదు. తర్వాత బాలికకు కడుపునొప్పి అసలు విషయం తెలిసింది. ఆ బిడ్డ గర్భం దాల్చిందని తెలిసి బంగారుపాళెంలోని సోదరి ఇంటికి పంపేశారు. అక్కడే ఓ ప్రైవేట్ వైద్యుడికి చూపించారు. అయితే ఆ అమ్మాయికి ఫిట్స్ రావడంతో మూడురోజుల క్రితం చిత్తూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిజరేయన్ చేసి శిశువును బయటకి తీశారు. ఉన్నట్టుండి తల్లీబిడ్డల పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్సపొందుతూ ఆ బాలిక మృతిచెందింది. ఆ శిశువు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.కారణం ఆ ముగ్గురే..తన అక్క మృతికి ముగ్గురు యువకులు కారణమని చెల్లెలు వెల్లడించింది. తమ బంధువైన ఓ మహిళ కారణంగా తమ ఇంటికి తల్లిదండ్రులు లేని సమయంలో యువకులు వచ్చేవారని తెలిపింది. తరచూ బిరియానీ, ఇతర తినబండారాలను అక్కకు ఇచ్చేవారని వివరించింది.గ్రామంలో నిరసనలుఇలా ఉండగా తిరుపతి నుంచి బాలిక మృతదేహం ఆంబులెన్స్‌లో రాగానే గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. బాలిక మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ధర్నాకు దిగారు. బాధితులకు న్యాయం చేస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని పలమనేరు సీఐ నరసింహరాజు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.కఠినంగా శిక్షించాలిమైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భం దాల్చేలా చేసి, ఆమె మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. తొమ్మిదినెలలు తన కడుపులో బిడ్డను మోస్తున్నా ఏ డాక్టరైనా ఎందుకు గుర్తించలేదు. ఇది వైద్యులు నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. గతంలోనూ ఈ గ్రామంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. అప్పట్లో నిందితులను కఠినంగా శిక్షించి ఉంటే ఇప్పుడు ఇలాంటివి జరిగేవి కావు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి.– భువనేశ్వరి, ఐద్వా జిల్లా కన్వీనర్ -
హత్య చేసి.. కుడి చేయి తీసుకెళ్లినా హంతకులు
నిడమర్రు (పశ్చిమ గోదావరి): నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామంలో యువకుడి హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన యువకుడు మజ్జి ఏసు(26)ను శనివారం రాత్రి అత్యంత దారుణంగా హత్య చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏసు తండ్రి ప్రసాద్ మరణించగా, తల్లి దుబాయ్‌లో ఉంది. ఏసు దుర్గా శ్రీవల్లిని 2023లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఉండి మండలం కలిగొట్ల గ్రామంలోని ఆక్వా చెరువుల కాపలాదారుడిగా పని చేస్తున్నాడు. భార్య 8వ నెల గర్భవతి కావడంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. మృతుడితోపాటు అమ్మమ్మ మాత్రమే ఉంది. శనివారం అర్ధరాత్రి దాటాక బావాయిపాలెం శివారులో ఉన్న చినకాపవరం పంటకాల్వ వద్ద ఏసును చంపి, శవాన్ని కాలువ రేవు వద్ద పడేశారు. అతని కుడి చేయిని నరికి తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం సమాచారం అందిన వెంటనే నిడమర్రు సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై వీర ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. భార్య శ్రీవల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ శ్రావణ్ కుమార్ కూడా క్లూస్ టీమ్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హంతకులు ఒకరి కన్నా ఎక్కువ మంది ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి ఇంటి పరిసరాల్లోనే డాగ్ స్క్వాడ్ కలియ తిరిగింది. -
గర్భవతిని చేశాడు.. బాలిక ఉసురు తీశాడు!
కాణిపాకం/పలమనేరు : బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడేవాడు. చివరికి ఆమెను గర్భవతిని చేశాడు. దీంతో ఆ బాలిక తీవ్ర రక్తహీనతకు గురైంది. చివరికి ప్రాణాల మీదికొచ్చింది. వైద్యులు సిజేరియన్ చేసి బాలికను బతికించేందుకు విఫలయత్నం చేశారు. బిడ్డకు జన్మనిచ్చిన ఆ చిన్నారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టీ.ఒడ్డూరు గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక పెంగరగుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు నెలల కిందట బాలిక కడుపు పెరగడాన్ని గమనించి టీచర్.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు బాలికను బడికి పంపడం మాన్పించారు. శనివారం ఉన్నట్టుండి ఆ బాలికకు ఫిట్స్ రావడంతో తల్లిదండ్రులు బంగారుపాళ్యం ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల గర్భిణీ అయిన ఆ బాలిక రక్తహీనతతో బాధపడుతోందని వైద్యులు నిర్ధారించి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు పరీక్షించి రక్త హీనత కారణంగా బాలిక ఊపిరితిత్తులకు ఉమ్మనీరు చేరిందని, బిడ్డను బయటకు తీస్తే తప్ప తల్లిని బతికించలేమని తేల్చి చెప్పారు. ఈ మేరకు కలెక్టర్, ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి.. వారి ఆదేశాల మేరకు బాలికకు సిజేరియన్ చేశారు. మగబిడ్డను బయటకు తీశారు. తల్లి పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. వెంటిలేటర్ మీద శనివారం రాత్రి 9.30 గంటలకు చిత్తూరు నుంచి తిరుపతికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక ఆదివారం ప్రాణాలు విడిచింది. బిడ్డ ఐసీయూలో చికిత్స పొందుతోంది. పలమనేరు సీఐ నరసింహరాజు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఓ మాయలేడిని నమ్మి.. ఇదిలా ఉండగా, పాఠశాలకు సెలవు వచ్చినప్పుడల్లా ఓ మాయలేడి ఆ బాలికను ఆవుల మేతకు తీసుకెళ్లేదని, అక్కడ ఓ కామాంధుడి చేతిలో పెట్టేదని తెలిసింది. పూర్తి వివరాలను రెండ్రోజుల్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. -
రూ.5 కోట్ల కట్నం సరిపోలేదట.. బెజవాడలో నవవధువుకు వేధింపులు
సాక్షి, విజయవాడ: రూ.5 కోట్లు కట్నం ఇచ్చారు.. అయినా సరిపోలేదంటూ వివాహం జరిగిన రెండు రోజులకే వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు తాళలేని ఆ వధువు విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త, మామపై ఐపీసీ సెక్షన్ 498A, వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 3,4 ల కింది కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టుకు హాజరుపరిచారు. తండ్రీ కొడుకులకు 14 రోజుల రిమాండ్ విధించి.. నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపించారు. విజయవాడ ఆర్టీసీలో కంట్రోలర్‌గా పని చేస్తున్న చెరుకూరి లక్ష్మణరావు కుమారుడు హేమంత్ అజయ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కర్ణాటక రాయచూర్‌లోకి చెందిన ప్రసన్నకుమార్ కుమార్తె లక్ష్మి కీర్తనకి అజయ్‌తో పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి ముందు నగదు, స్థిరాస్థులు, బంగారం, వెండి మొత్తం కలిపి సుమారు రూ.5 కోట్లు కట్నంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 7న రాయచూర్‌లో కీర్తన, అజయ్ వివాహం ఘనంగా జరిగింది. అయితే, వివాహం జరిగిన రెండు రోజులకే లక్ష్మి కీర్తనకి కట్నం వేధింపులు మొదలయ్యాయి. మరో రూ.50 లక్షలు తేవాలంటూ అజయ్, లక్ష్మణరావు వేధింపులకు గురిచేశారు. కట్నం కోసం నవ వధువును తండ్రి, కొడుకులు బంధించడంతో... టార్చర్ భరించలేక.. భవానీపురం పోలీసు స్టేషన్లో నవవధువు ఫిర్యాదు చేసింది. -
సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బలితీసుకున్న వివాహేతర సంబంధం
విజయనగరం క్రైమ్: తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన ఇంజినీరు కోనారి ప్రసాద్ (28) హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ నెల 10న హత్యకు పాల్పడిన అన్నదమ్ములైన ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేశామన్నారు. హత్య వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, బొబ్బిలి సీఐ నారాయణరావు, తెర్లాం ఎస్ఐ సాగర్‌బాబుతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మృతుడు కోనారి ప్రసాద్‌కు నెమలాం గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్‌లను భర్త అచ్యుతరావు గమనించాడు. విషయాన్ని తమ్ముడు శివకృష్ణకు చెప్పాడు. ఇద్దరూ కలిసి ప్రసాద్‌ను అంతమొందించాలని నిర్ణయించారు. బెంగళూరులో పనిచేస్తున్న ప్రసాద్ గ్రామానికి రావడంతో హత్యపథకం అమలుచేయాలని నిశ్చయానికి వచ్చారు. ఆయనతో ముందురోజు మాట్లాడారు. విజయరాంపురంలోని అమ్మమ్మవారి ఇంటికి వెళ్తున్న విషయం, తిరిగి ఏ సమయానికి వస్తాడన్న విషయం తెలుసుకున్నారు. మాట్లాడదామని నెమలాం సమీపంలోని వారి పొలాల వద్దకు పిలిచారు. ప్రసాద్‌తో శివకృష్ణ మాట్లాడుతుండగా వెనుకనుంచి తలపై కర్రతో అచ్యుతరావు బలంగా మోదాడు. తర్వాత ఇద్దరూ కలిసి కర్రలతో దాడిచేశారు. పారిపోయే ప్రయత్నంలో ప్రసాద్ కాలుజారి పిల్లకాలువలోని రాయిపై పడిపోవడంతో అక్కడకు వెళ్లి మరోసారి దాడిచేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృత దేహాన్ని రోడ్డుపై తెచ్చి పడేశారు. అనంతరం బైక్‌ను కూడా కర్రలతో ధ్వంసం చేసి రోడ్డుపై పడేసి ఇంటికి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు తొలుత ప్రమాదంగా అనుమానించారు. ఘటనా స్థలాన్ని చూసి హత్యగా అనుమానించి దర్యాప్తు చేశారు. సీఐ నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. కేసును వేగవంతంగా ఛేదించిన బొబ్బిలి డీఎస్పీ, సీఐ, తెర్లాం ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. -
పల్నాడు: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు ప్రకాశం జిల్లాలకు చెందినట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం పెదనెమలిపూరి దగ్గర ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళ్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో తల్లి షేక్ నజీమా (50).. ఆమె కుమారులు ఇద్దరు షేక్ నూరుల్లా (26), షేక్ హబీబుల్లా(24) ఉన్నారు. ఇక, వీరిని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. -
మహిళతో వరుస మరిచి టీడీపీ నేత అకృత్యాలు.. ఎట్టకేలకు అరెస్ట్!
సాక్షి, విశాఖ: టీడీపీ నేత కీచకపర్వం చూసి స్థానికులు, కుటుంబ సభ్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. సదరు నేతకు వరుసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె గర్భం దాల్చడం తర్వాత రెండో వివాహం చేయడం.. బంధువులను సైతం షాక్‌కు గురిచేసింది. ఇక, బాధితురాలి ఫిర్యాదుతో తాజాగా కీచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి.. మంత్రి అచ్చెన్నాయుడికి అనుచరుడు కావడం గమనార్హం.వివరాల ప్రకారం.. విశాఖలో దళిత మహిళపై టీడీపీ నేత పెబ్బలి రవి కుమార్ కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. వరసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి చిన్నతనంలోనే తల్లితండ్రులు చనిపోవడంతో చేరదీసిన పిన్ని, బాబాయ్ రవి కుమార్.. ఆమెను చేరదీశారు. అనంతరం, శ్రీకాకుళానికి చెందిన వ్యక్తితో బాధిత మహిళకు వివాహం జరిపించారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య వివాదాలు సృష్టించి ఇద్దరిని విడదీసిన రవికుమార్. ఇక, ఒంటరిగా ఉన్న బాధిత మహిళపై రవికుమార్.. వరుసగా లైంగిక దాడికి తెగబడ్డాడు.లైంగిక దాడి విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో, సదరు మహిళ గర్భం దాల్చడంతో కిడ్నాప్ చేసి మలేషియాకు తరలించాడు. అనంతరం, బాధిత మహిళ కనపడటం లేదని బంధువులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు విషయం బయటకు వస్తుందేమోనని భయపడిన రవికుమార్.. మళ్లీ ఆమెను విజయవాడకు తీసుకొచ్చి రహస్యంగా ప్రసవం చేయించాడు. ఆసుపత్రి ధ్రువపత్రాలపై తానే తండ్రిని అని రవి కుమార్ సంతకం చేశాడు.ఆ తరువాత దగ్గరుండి బాధితురాలికి రెండో వివాహం జరిపించాడు. ఈ సమయంలో బాధితురాలి నుంచి డబ్బు, నగలు.. ఆమెకు ఉన్న ఆస్తిని కాజేసి ఆమెను మరింత క్షోభకు గురి చేశాడు. దీంతో, చేసేదేమీ లేక బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో రవికుమార్ కీచకపర్వం మొత్తం వెలుగులోకి వచ్చింది. అయితే, తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి తప్పించుకు తిరుగుతున్నందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. -
యువతిపై దాడి కేసు.. ప్రేమోన్మాది గణేష్ అరెస్ట్
సాక్షి,అన్నమయ్య జిల్లా: పీలేరులో యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డ ప్రేమోన్మాది గణేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మదనపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ విద్యా సాగర్ నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ‘ఇంటర్,డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి గణేష్ ,గౌతమి ఒకే కాలేజీలో చదువుకున్నారు. గౌతమిని ప్రేమ పేరుతో వేధిస్తుండేవాడు. చదువు పూర్తి అయ్యాక గౌతమి బ్యూటీషియన్‌గా మదనపల్లి బ్యూటీ పార్లర్లో పనిచేసేది. అప్పుడు కూడా గణేష్ ఆమె వెంటపడేవాడు.ఈ విషయాన్ని గౌతమి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు వారి సమీప బంధువు శ్రీకాంత్‌తో వివాహం నిశ్చయించారు. ఏప్రిల్ 29వ తేదీ పెళ్లి జరిపేందుకు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న గణేష్ శుక్రవారం ఉదయం గౌతమి నివాసం ఉంటున్న ప్యారంపల్లిలోని ఆమె ఇంటి వద్దకు వెళ్లి తననే పెళ్లి చేసుకోవాలని గొడవపడ్డాడు. గౌతమి అంగీకరించకపోవడంతో కోపంతో గణేష్ ఆమెను కత్తితో పలుచోట్ల పొడిచాడు, అంతేకాకుండా వెంట తెచ్చుకున్న యాసిడ్ ఆమె నోటిలో పోశాడు.తీవ్రంగా గాయపడిన గౌతమిని కుటుంబీకులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారు. ఈ కేసులో నిందితుడైన గణేష్‌ను శుక్రవారం సాయంత్రమే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. బాలికలు యువతులు మహిళలను ఎవరైనా వేధిస్తే సహించేది లేదు. వేధింపులు ఎక్కువైతే పోలీసుల దృష్టికి తీసుకురావాలి’అని ఎస్పీ కోరారు.