ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ | PM Unveils Sardar Patel's 2900-Crore Statue Of Unity Today | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

Oct 31 2018 11:17 AM | Updated on Mar 21 2024 6:46 PM

ఉక్కు మనిషి, భారత మాజీ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటుచేసిన ‘ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు. అనంతరం పటేల్‌ 143వ జయంతి సందర్భంగా ఈ భారీ విగ్రహం వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. నర్మదా జిల్లాలోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ సమీపంలో ఉన్న సాధు బెట్‌లో ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’  నిర్మించారు. 2013 అక్టోబర్‌ 31 న ప్రధాని మోదీ ఐక్యతా విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement