
జొన్న రైతుకు ‘వ్యయ’ప్రయాస
కష్టాలు అన్నీఇన్నీ కావు
ఈ ఏడాది జొన్న సాగు చేసిన రైతులకు దిగుబడులు అంతంత మాత్రంగానే వచ్చాయి. మార్కెట్‌లో సరైన ధర లేక రైతులు అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంతో కొంత మేరకు ఉపశమనం వచ్చినా కష్టాలు అన్నీఇన్నీ కావు. బాడుగలు భారంగా మారుతున్నాయి.
– ప్రతాపరెడ్డి, ఎం.చింతకుంట్ల,
గోస్పాడు మండలం.
అర్థం కావటం లేదు
నంద్యాల సెంట్రల్ వేర్ హౌస్ వద్ద ఉన్న మమ్మల్ని తిరిగి దీబగుంట్లకు తీసుకెళ్లాలని చెప్పడంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చాక తిరిగి గోపవరం వద్దకు తీసుకెళ్లాలని చెప్పారు. మాకేం అర్థం కావటం లేదు. ఒకసారి కుదుర్చుకున్న బాడుగలకు తిరిగి క్వింటాకు రూ. 50 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
– వలి, పెసరవాయి, గడివేముల మండలం
గోస్పాడు: జొన్నలను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయడం లేదు. ఇందుకు కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రతి రోజూ తికమక పెడుతోంది. దీంతో రైతులకు ఖర్చులు తడిసి మోపెడుతున్నాయి. ముందుగా నంద్యాలలోని సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ వద్దకు జొన్నలను తీసుకెళ్లేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజుకు ట్రాక్టర్‌కు అయితే రూ. 1,300నుంచి రూ. 1,800 వరకు, లారీకి అయితే రూ. 2వేల నుంచి రూ. 2,500 వరకు ఖర్చు చేశారు. జొన్నలు అమ్ముకోవడానికి క్యూలో నిల్చొని నాలుగైదు రోజులు గడిచాక నంద్యాల సెంట్రల్ వేర్‌హౌస్ నుంచి దీబగుంట్ల లోని గోడౌన్‌కు పంపించారు. మంగళవారం దీబగుంట్లకు వచ్చిన తర్వాత గోపవరం సమీపంలోని గోడౌన్‌కు తరలించాలని అధికారులు చెప్పడంతో రైతు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడౌన్ ఖాళీగా ఉన్నా ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించారు. రోజుల తరబడి క్యూలో నిలపాల్సి వస్తోందని, ఖర్చులు మరింత పెరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రైతులు ట్రాక్టర్ల వద్ద నిద్రిస్తూ కనిపించారు. మరికొందరు పొలాల్లో వేచి చూశారు.
మద్దతు ధరతో కొనుగోలు చేయని ప్రభుత్వం
రోజుకొక గోడౌన్‌కు తిరగాల్సిందే!

జొన్న రైతుకు ‘వ్యయ’ప్రయాస

జొన్న రైతుకు ‘వ్యయ’ప్రయాస

జొన్న రైతుకు ‘వ్యయ’ప్రయాస

జొన్న రైతుకు ‘వ్యయ’ప్రయాస

జొన్న రైతుకు ‘వ్యయ’ప్రయాస

జొన్న రైతుకు ‘వ్యయ’ప్రయాస