
తలసేమియాపై అవగాహన ఉండాలి
నస్పూర్: తల సేమియా వ్యాధిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా డిప్యూటీ వైద్యాధికారి సుధాకర్‌నాయక్ అన్నారు. ఈ నెల 8న ప్రపంచ తలసేమియా నివారణ దినం సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నస్పూర్ పీహెచ్‌సీలో ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లకు బుధవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌నాయక్ మాట్లాడుతూ తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులను అరికట్టడానికి ప్రభుత్వం హెచ్‌బీఏ 2 రక్త పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతీ ఒక్కరూ పెళ్లికి ముందు ఈ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతీ నెల నాలుగో గురువారం సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ జిల్లా మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుడు, తలసేమియా సికిల్ సెల్ ట్రాన్స్‌మిషన్ సెంటర్ ఇన్‌చార్జ్ కాసర్ల శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్, జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ కంకమాల భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చందూరి మహేందర్, స్టేట్ ఎంసీ మెంబర్ మధుసూదన్‌రెడ్డి, కోశాధికారి సత్యపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.