crackers accident
-
అనకాపల్లి అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి,సాక్షి: అనకాపల్లి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణా సంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారు. ఈ విషాదంపై వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడడంపై విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు తోడుగా నిలవాలని వైఎస్సార్సీపీ నాయకులను ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు తిరిగి కోలుకునేలా అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. 13-04-2025బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంపై మాజీ సీఎం @ysjagan దిగ్భ్రాంతి బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తివైయస్.జగన్ ఆదేశాల మేరకు ఘటనా స్థలానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనకాపల్లి జిల్లా కోటవురట్లలో ఒక బాణా సంచా తయారీ కేంద్రంలో ప్రమాద ఘటన పట్ల మాజీ…— YSR Congress Party (@YSRCParty) April 13, 2025 -
బాణాసంచా మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని బాణాసంచా మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడు దుకాణాలు కాలి బూడిదయ్యాయి. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పలు వాహనాలు దగ్దమయ్యాయి. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. దీపావళి పండగ వేళ ముందస్తు అనుమతితోనే గోపాల్‌బాగ్ ప్రాంతంలో బాణాసంచా దుకాణాలు వెలిశాయి. పండగ కావడంతో మార్కెట్ జనంతో కిటకిటలాడుతోంది. మొదట ఓ షాప్‌లో మంటలు చెలరేగాయి. అనంతరం పక్కనే ఉన్న ఏడు దుకాణాలకు ఆ మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరగడంతో జనం పరుగులు పెట్టారు. ఈ ఘటనలో దాదాపు తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎలక్ట్రిక్ షాక్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మంటల్లో పలు వాహనాలు కూడా కాలిపోయాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా బాణాసంచా అమ్మకాలు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: ఢిల్లీ వాసులకు అలర్ట్! -
Hyderabad: దీపావళి వేడుకల్లో గాయాలు.. సరోజినీదేవి కంటి ఆస్పత్రికి బాధితుల క్యూ (ఫొటోలు)
-
టపాసుల వేళ అపశ్రుతులు.. మంటలంటుకుని కళ్లకు, ఒంటికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి వేళ బాణసంచా కాలుస్తున్న క్రమంలో నగరంలో కొన్నిచోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. పలువురికి కళ్లకు, ఒంటికి గాయాలయ్యాయి. నగర వ్యాప్తంగా సుమారు 100 మందికి పైగా బాధితులు పలు ఆస్పత్రుల్లో చేరారు. కంటి గాయాలకు గురైనవారిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం. సరోజినీదేవి ఆస్పత్రికి క్యూ.. మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో దీపావళిని ముందు రోజు ముగ్గురు, పండగ రోజు రాత్రి సమయంలో 45 మంది దాకా కంటి గాయాలతో సంప్రదించారు. ఇందులో 21 మంది అవుట్ పేషెంట్ విభాగంలో చూపించుకుని వెళ్లిపోగా 19 మంది అడ్మిట్ అయ్యారు. పండగ తర్వాత రోజు కూడా మరో 2 కేసులు వచ్చాయని వైద్యులు చెప్పారు. వీరిలో అయిదేళ్ల వయసు నుంచి 67 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. మొత్తం బాధితుల్లో అత్యధికులు చిన్నారులే. బాధితుల్లో మల్లెపల్లికి చెందిన అజయ్ సింగ్ (25), విజయ్ ఆనంద్ (61), సి. మహావీర్ (15)ల ఎడమ కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు కుడికన్నుకు గాయమైన హయత్‌నగర్‌కు చెందిన రాజి (37)లకు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. బాధితుల్లో ఒక అబ్బాయి కంటి చూపు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి.. బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రికి పెద్ద సంఖ్యలోనే బాణసంచా బాధితులు నమోదయ్యారు. పండగ ముందురోజున అయిదుగురు, దీపావళి రోజున 21 మంది, మరుసటి రోజున (సాయంత్రం 4గంటల వరకూ) 11 మంది కంటి గాయాలతో ఆస్పత్రికి వచ్చారని వీరిలో 9 మందికి సర్జరీలు చేశామని వైద్యులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో బాణసంచా కారణంగా 7 కాలిన గాయాల కేసులు నమోదయ్యాయి. చందానగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తీవ్రగాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు. పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ బాణసంచా బాధితులు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కాలిన గాయాలతో ఉస్మానియాకు... నగరంలో కంటి గాయాలతో చిన్నారులు ఆస్పత్రుల పాలు కాగా కాలిన గాయాలతో పెద్దలు ఆస్పత్రులకు క్యూ కట్టారు. ఉస్మానియా ఆస్పత్రిలో 18 మందికి కాలిన గాయాల బాధితులు సంప్రదించగా ఇందులో ఒకరు తీవ్ర గాయాలతో అడ్మిట్ అయ్యారు. శరీరం కాలిన ఆ మహిళ (63) పరిస్థితి విషమంగా ఉందని, ఆమె దాదాపు 95 శాతం కాలిన గాయాల బారిన పడడంతో వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పేలిన బాణసంచా.. మహిళ సజీవదహనం
బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామ పంచాయతీలోని ముత్యాలమ్మపేటలో ఉన్న ఓ ఇంట్లో బుధవారం భారీ పేలుడు సంభవించింది. అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులు పేలడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవదహనమవగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన కూర్మ భీమశంకర్ గత పదిహేనేళ్లుగా సారపాకలో తాపీ పనులు చేస్తూ ముత్యాలమ్మపేటలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఏటా దీపావళికి ఆయన భారీగా బాణాసంచా విక్రయాలు చేస్తున్నట్లు తెలిసింది. అక్రమంగా బాణసంచా విక్రయాలు జరిపే ఆయన గతేడాది మిగిలిన టపాసులను ఇంట్లోనే నిల్వ ఉంచాడు. బుధవారం సాయంత్రం ప్రమాదవశాత్తు బాణసంచాకు నిప్పంటుకుని మంటలు ఎగసిపడ్డాయి. ఇంట్లో ఉన్న భీమశంకర్ భార్య కూర్మ భవాని (50) మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైంది. ఆమె కుమారుడు దుర్గాప్రసాద్ శరీరం 70 శాతం కాలిపోయింది. దీంతో ఆయన్ను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ఈ ఘటనలో మూడు అంతస్తుల భవనం పూర్తిగా కాలిపోయింది. దుర్గాప్రసాద్ సారపాక ఐటీసీ పీఎస్‌పీడీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ప్రమాద సమయంలో భీమశంకర్ భద్రాచలంలో ఉన్నట్లు తెలిసింది. ఆయన సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. ప్రమాద వార్త తెలియగానే ఎస్ఐ జితేందర్, భద్రాచలం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. -
ఉత్సవాల్లో పేల్చిన టపాసు తలపై పడి వ్యక్తి మృతి
వెదురుకుప్పం: తలపై టపాసు పేలడంతో తీవ్రగాయాలై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాలుపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామంలో కుంటి గంగమ్మ కుంభాభింక మహోత్సవాల్లో భాగంగా 41వ రోజు మంగళవారం గ్రామస్తులు పొంగళ్లు పెట్టేందుకు సన్నద్ధం అయ్యారు. మధ్యాహ్నం ఈ సంబరాల కోసం గ్రామస్తులు బాణసంచా తీసుకొచ్చారు. గ్రామస్తుడు నారాయణరెడ్డి ఉత్సాహంగా టపాకాయలు పేల్చుతుండగా అతడిపై టపాసు పేలి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన నారాయణరెడ్డిని తిరుపతికి 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో మారేపల్లె వద్ద తుదిశ్వాస విడిచాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సంబరాలు వాయిదా పడ్డాయి. -
కళ్లల్లో వత్తులేసుకుని చూడండి
నవ్వింతల తుళ్లింతల చిన్నారి ఆమె. పదేళ్ల వయసు. కళ్లు చెదిరే అందం. మెటికెలు విరవాలనిపించేంత కళ్ల మెరుపు. ఆ వయసుకు ఉండే చురుకు. దీపావళి సందడిలో అందరు పిల్లల్లాగే ఆమె కూడా నిమగ్నమైంది. పటాసును అంటించేసి పక్కకు తొలిగింది. చురచురమనే మంటకు దూరంగా చురుగ్గా కదిలింది. కానీ ఆమె వెనకాలే కాలుతున్న ప్రమిద. చిదిమి దీపం పెట్టుకునేంత అందానికి ఆ దీపం తగిలింది. వెలుగు మంటయ్యింది. ఒంటిని కాల్చేసింది. అగ్గిపుల్ల అంటితేనే గబుక్కున వేలిని వెనక్కు తీసుకునే మనమందరం ఆమె భరించిన ఉష్ణాన్ని ఊహించవచ్చు. కొన్నాళ్ల పాటు భగభగను భరించింది. ప్లాస్టిక్ సర్జరీల పేరిట ఒలిచేసే చర్మం... కలిచేసే బాధ. ఎన్నో సార్లు చర్మాన్ని తీసి కాలిన చోట అంటించారు. బొబ్బలు మానాక అతికించారు. ఎన్నెన్నో చికిత్సలతో ఎట్టకేలకు ఆ పాపాయి ఇప్పుడు పూర్తిగా మామూలయ్యింది. ఆ చిన్నారి మా ఆఫీస్ కలీగ్ కూతురే. కానీ స్కూలుకు వెళ్లినప్పుడల్లా ఆమెనూ, మేనినీ గమనించి చూస్తారు. గాయాల మచ్చలు ఇంకా ఉన్నాయేమోనని పరిశీలిస్తారు. ఒంటి గాయాలు మానినా మనసుపై మచ్చలు పరుస్తుంటారు. ఇలాంటి కష్టం ఏ పాపకూ రాకూడదు. ఏ చిన్నారికీ ఇలాంటి చేటు కలగకూడదు. పసి మనసులు చెదరకూడదు. అందుకే అందరూ అప్రమత్తం వహించండి. ఈ కొన్ని జాగ్రత్తలు పాటించండి. కళ్లలో ఒత్తులు వేసుకొని పిల్లలను చూసుకోండి... సాధారణ జాగ్రత్తలు ►ఆహ్లాదాన్ని, మానసిక ఉల్లాసాన్ని పంచి ఇచ్చే పండుగ వెనక పరమార్థం కూడా ఉంది. సరిగ్గా వర్షరుతువులోని వానలు తెరిపి ఇచ్చాక వచ్చే పండగ ఇది. వానల తర్వాత ఇళ్లల్లోని చెమ్మకు విరుగుడుగా సున్నంవేస్తారు. ►బాణాసంచా నుంచి వచ్చే పొగల వల్ల ఈ సీజన్లో స్వతహాగా పెరిగే అనేక రకాల హానికారక సూక్ష్మజీవులు నశించిపోయేలా పెద్దలు రూపొందించిన పండగ ఇది. టపాకాయలు కాల్చడం వల్ల వెలువడే గంధకం, పొటాషియం వంటివి కీటకాలను, క్రిములను దూరంగా ఉంచుతాయి. ►ఇదే సీజన్లో విస్తరిల్లే మలేరియా, డెంగ్యూల నుంచి స్వాభావిక రక్షణ కల్పించేలా చేస్తాయి. అంటువ్యాధులను వ్యాపించజేసే అనేక క్రిములను తుదముట్టించి అరికట్టేందుకు బాణాసంచా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవి పాజిటివ్ అంశాలు కాగా... ఇక దీంతో వచ్చే కొన్ని నెగెటివ్ అంశాలివి... ►పండగ అనగానే పిండివంటలు, స్వీట్లతో హైక్యాలరీ ఫుడ్ తినేసే అవకాశాలుంటాయి. క్యాలరీ ఇన్‌టేక్ తగ్గించుకోవాలి. ►ఆహార విషయాల్లో డయటరీ ఇర్రెగ్యులారిటీలు వచ్చే అవకాశం ఉంటుంది. అది డయాబెటిస్, హైపీడీ ఉన్న రోగులను. ప్రభావితం చేసే అవకాశం ఎక్కువ. ఎంత రుచిగా ఉన్నా మితంగా తినడం మంచిది. ►గంధకం వంటి రసాయనాల ప్రభావంతో వాయుకాలుష్యంతోపాటు అది కొన్ని అలర్జీలను మరింత ప్రజ్వరిల్లేలా చేసే అవకాశమూ ఉంది. ►టపాకాయల నుంచి వచ్చే పొగతో ఉబ్బస వ్యాధులు (అలర్జిక్ ఎయిర్‌వే డిసీజెస్) ఉన్నవారికి అకస్మాత్తుగా అటాక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారు పొగకు దూరంగా ఉండాలి. ►దీపావళి అయిన మర్నాడు చూస్తే రోడ్లపై టపాకాయల చుట్టేందుకు ఉపయోగించిన కాగితాలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి. ఇది మరోరకం కాలుష్యం. కళ్లు ►మరీ తీక్షణమైన వెలుగు, దాన్నుంచి వెలువడే వేడిమి, మంట... ఈ మూడింటి వల్ల సాధారణంగా కన్ను ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రత్యక్ష ప్రభావం. ►ఇక పరోక్షంగా కూడా... సల్ఫర్, గన్‌పౌడర్ లాంటి రసాయనాల విషప్రభావం వేళ్ల ద్వారా కంటికి తగలడం వల్ల కళ్ల మంటలు, నీళ్లుకారడం వంటి సమస్యలు రావచ్చు. ► తీక్షణమైన వెలుగును నేరుగా చూడవద్దు. దాని వల్ల కార్నియల్ బర్న్స్ రావచ్చు. అందుకే బాణాసంచా కాలేసమయంలో నేరుగా, తదేకంగా చూడవద్దు. ►కొన్ని రకాల బాణాసంచా నుంచి నిప్పురవ్వల వంటివి కంటికి తాకే అవకాశం ఉన్నందున అలాంటి వాటిని కాల్చే సమయంలో... కాల్చగానే వీలైనంత దూరం పోవాలి. కాలనప్పడు ఆ పదార్థంపై ఒంగి చూడటం మంచిది కాదు. ►బాణాసంచా కాల్చేసమయాల్లో కంటికి రక్షణగా ప్లెయిన్ గాగుల్స్ వాడటం మంచిది. ►వెలుగులు, రవ్వలతో పాటు వేడిమి వల్ల కూడా కన్ను ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బాణాసంచా కాల్చగానే వేడిమి తగలకుండా వీలైనంత దూరంగా వెళ్లడం మంచిది. ► రాకెట్ వంటివి పైకి వెళ్లకుండా కంటిని తాకితే దానికి గాయం (మెకానికల్ ఇంజ్యూరీ) కూడా అయ్యే అవకాశం ఉంది. గాయం వల్ల ఒక్కోసారి కంటి లోపల రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ► డైరెక్ట్ మంట కంటికి తగిలి కన్నుగాని, కనురెప్పలుగానిక తాగే అవకాశం ఉంది. ఫలితంగా కార్నియా దెబ్బతింటే శాశ్వత నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. ► అలాంటిదే జరిగితే కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్ప ఇతర చికిత్సలతో ఫలితం ఉండదు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. ► గాయం ఎలాగైనప్పటికీ ఒక కన్ను మూసి విజన్ పరీక్షించి చూసుకోవాలి. చూపులో ఏమాత్రం తేడా ఉన్నా వీలైనంత త్వరగా కంటి డాక్టర్‌ను కలిసి చూపించుకోవాలి. చర్మం ►దీపావళి బాణాసంచాతో గాయం అయ్యేందుకు చర్మానికే ఎక్కువ అవకాశం. కారణం... చర్మం మానవ శరీరాన్నంతా కప్పి ఉంచే అత్యంత పెద్ద అవయవం కావడమే. ►బాణాసంచా కేవలం లైసెన్స్డ్ షాప్‌లోనే కొనాలి. ►ఇంట్లో ఓ కార్డ్బోర్డ్ బాక్స్ వంటి దాన్లో పెట్టాలి. ►ఆ పెట్టెను మంట తగిలేందుకు అవకాశమున్న కిచెన్, పొయ్యి వంటి వాటికి దూరంగా ఉంచాలి. ►బాణాసంచాను చెల్లాచెదురుగా ఉంచకూడదు. ►సాయంత్రం వాటిని కాల్చే సమయంలోనూ మంటకు దూరంగానే ఉండేలా చూసుకోవాలి. ►బాణాసంచా కాల్చే సమయంలో వదులైన దుస్తులు కాకుండా బిగుతైనవే వేసుకోవాలి. ►వదులైన దుస్తులైతే అవి వేలాడుతుండటం వల్ల మంట అంటుకొని చర్మం కాలే ప్రమాదం ఉంటుంది. ►నిత్యం నీళ్లు ఎక్కువగా తాగడం చర్మానికి ఎంతో మంచిది. అయితే దీపావళి సందర్భంగా ఆ నిబంధనను మరింత శ్రద్ధగా పాటించాలి. ఎందుకంటే... పొరబాటున చర్మం కాలితే ఆ ప్రక్రియలో చర్మం నీటిని కోల్పోతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటే గాయం తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ►బాణాసంచా కాల్చేప్పుడు ఎప్పుడూ ఒకే సమయంలో ఒక టపాకాయను మాత్రమే కాల్చాలి. ఒకేసారి రెండు–మూడు కాల్చడం, పక్క పక్కనే పలురకాల బాణసంచా సామగ్రి పెట్టుకొని వరసగా కాలుస్తూ పోవడం వంటివి చేయకూడదు. ►కాల్చే సమయంలో టపాకాయకు వీలైనంత దూరంగా ఉండాలి. ఫలితంగా మీ చర్మం కూడా దూరంగా ఉంటుంది. దాంతో నేరుగా తాకే మంట, వేడిమి ప్రభావం తగ్గుతుంది. ►కాల్చేప్పుడు టపాకాయ నుంచి మనం దూరంగా ఉండటానికి వీలుగా మోచేతిని వంచకుండా పూర్తిగా సాగదీయాలి. మోచేతిని ఎంతగా వంచితే టపాకాయకు అంత దగ్గరవుతాం. ►టపాసు నుంచి తలను వీలైనంత దూరంగా ఉంచాలి. ►ప్రమాదవశాత్తు చర్మం కాలితే రగ్గు వంటివి కప్పవద్దు. ►నీళ్ల బకెట్‌ను టపాసులు పేల్చే చోట దగ్గరగా, అందుబాటులో ఉంచుకోండి. ►గాయానికి తడి టవల్‌ను చుట్టి డాక్టర్ వద్దకుతీసుకెళ్లాలి. ►వేడి సోకడం వల్ల చర్మానికి అయ్యే గాయాన్ని మూడు విధాల వర్గీకరించవచ్చు. మొదటిది పైపైన (సూపర్ఫీషియల్), ఓమోస్తరు లోతుగాయం (మీడియన్ డెప్త్), మూడో రకం తీవ్రంగా కాలిన గాయాలు (డీప్ బర్న్స్). ►వీటిల్లో మీడియన్ డెప్త్, డీప్ బర్న్ గాయాల వల్ల చర్మంపై మచ్చ (స్కార్) మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ►గాయం అయిన వెంటనే కంగారు పడకుండా దానిపై నీళ్లు ధారగా పడేలా చూడాలి. మంట తగ్గేవరకు అలా కడిగి అప్పుడు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. ►గాయాన్ని కడగడానికి సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీళ్లను మాత్రమే ఉపయోగించాలి. ►ఐస్ వాటర్ ఉపయోగించడం మంచిది కాదు. ►డాక్టర్ దగ్గరికి వెళ్లేవరకు తడిగుడ్డతో గాయాన్ని కప్పి ఉంచవచ్చు. ►కాలిన గాయలు తీవ్రమైతే ఒక్కోసారి శ్వాస సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కంగారు పడకుండా వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ►కాలిన గాయం అయిన సందర్భంలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే... ఎట్టి పరిస్థితుల్లోనూ గాయాన్ని రుద్దకూడదు. ►కాలి, చేతుల వేళ్లకు తీవ్రమైన మంట సోకితే అవి ఒకదానితో ఒకటి అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. ►అలాంటప్పుడు వాటి మధ్య తడిగుడ్డ ఉంచి డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలి. ►బాణాసంచా ఎప్పుడూ ఆరుబయటే కాల్చాలి. ►ఇంటి కారిడార్లలో, టెర్రెస్‌పైన కాల్చకూడదు. మూసేసినట్లుగా ఉండే ప్రదేశాల్లో కాల్చకూడదు. ►టపాకాయలను, బాంబులను డబ్బాలు, పెట్టెలు, ప్లాస్టిక్ బాక్స్‌ల వంటి వాటిల్లో పెట్టి కాల్చడం ఎంతమాత్రమూ తగదు. ►మరింత శబ్దం వస్తుందని కుండల వంటి వాటిల్లో పెట్టి అస్సలు కాల్చకూడదు. టపాకాయతో పాటు కుండ కూడా పేలిపోయి పెంకుల వల్ల గాయపడే ప్రమాదం ఉంది. ►చిన్న పిల్లలను ఎత్తుకొని అస్సలు కాల్చకూడదు. ఈఎన్టీ ►శబ్దం : శబ్దం వల్ల నవజాత శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు ప్రభావితం అయ్యే అవకాశం ఎక్కువ. ►మనకు హాని కలిగించే శబ్దాలను రెండురకాలు విభజించుకోవచ్చు. మొదటిది... అకస్మాత్తగా వినిపించే శబ్దం... దీన్ని ఇంపల్స్ సౌండ్ అంటారు. రెండోది... దీర్ఘకాలం పాటు శబ్దాలకు అలా ఎక్స్పోజ్ అవుతూ ఉండటం. ఈ రెండోరకాన్ని క్రానిక్ అకాస్టిక్ ట్రామా అంటారు. మనం దీపావళి సందర్భంగా ఎదుర్కొనే శబ్దం మొదటిదైన ఇంపల్స్ సౌండ్. అకస్మాత్తుగా ఎక్స్పోజ్ అయ్యే శబ్దం నుంచి హాని ఈ కింద పేర్కొన్న ఏదో విధంగా కనిపించే (మ్యానిఫెస్ట్ అయ్యే) అవకాశం ఉంది. ►అకస్మాత్తుగా చెవి దిబ్బెడ పడినట్లు (ఇయర్ బ్లాక్) కావడం. ►చెవిలో నొప్పి, గుయ్... మంటూ శబ్దం వినిపిస్తూ ఉండవచ్చు. ►లోన ఇయర్ డ్రమ్ (టింపానిక్ పొర) దెబ్బతిని కొన్నిసార్లు కాస్తంత రక్తస్రావం కావడం. ►నరం దెబ్బతిని పూర్తిగా వినిపించకపోవడం వంటి నష్టం కూడా జరగవచ్చు. ►గర్భిణుల్లో 140 డిసిబుల్స్‌కు మించిన పెద్ద శబ్దం వల్ల ఒక్కోసారి నొప్పులు వచ్చి ప్రసూతి అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. లోపలి పిండంపైనా శబ్దం తాలూకు దుష్ప్రభావం ఉంటుంది. ►వయోవృద్ధులు కూడా మానసికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలి: ►మన ఆనందం పొరుగువాళ్లకు (ఆ మాటకొస్తే మనకు కూడా) హానికరం కాకూడదు. కాబట్టి కాస్తంత చైతన్యంతో మరికాస్త సంయమనంతో వ్యవహరించాలి. శబ్దాలతో ప్రభావితమయ్యే గ్రూప్స్‌కు దూరంగా బాణసంచా కాల్చాలి. ►పెద్ద శబ్దాలు వచ్చి పేలిపోయే టపాకాయలకు బదులు శబ్దాలేవీ రాకుండా పూల వర్షం కురిపించే చిచ్చుబుడ్లు, కాకరపూవత్తులు, పెన్సిళ్లు, భూచక్రాలు... వంటివి కాల్చాలి. ►ఒకవేళ శబ్దానికి ఎక్స్పోజ్ అయితే చెవిలో ఎలాంటి ఇయర్ డ్రాప్స్, నీళ్లూ, నూనె వెయ్యకుండా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించాలి. మైక్రోస్కోప్, ఆడియోమెట్రీ పరీక్షలతో చెవికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి చికిత్స చేస్తారు. ►పొగకూ, రసాయనాలకు ఎక్స్పోజ్ అయితే చేతులనూ, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. గొంతులో నీళ్లు పోసుకొని పుక్కిలించాలి. లేదంటే అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఆస్తమాతో పాటు అనేక రకాల సమస్యలు తీసుకురావచ్చు. ►బాణాసంచా కాల్చాక చేతులకూ రసాయనాలు అంటుతాయి కాబట్టి వాటితో ముక్కు, చెవుల వద్ద రుద్దడం వంటివి చేయకూడదు. ►రసాయనాలు అంటిన చేతుల్తో ముక్కు దగ్గర రుద్దితే దాని నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చేతులను ముఖానికి, కళ్లకూ, ముక్కుకూ, చెవులకూ దూరంగా ఉంచండి. మానసిక ప్రభావాలు ►మంచి మ్యూజిక్‌తో ఆహ్లాదం వంటి పాజిటివ్ ఎఫెక్ట్ ఉన్నట్లే పెద్ద శబ్దాలతో నెగెటివ్ ప్రభావాలూ ఉంటాయి. ►బాణాసంచా శబ్దాలతో మానసికంగా కూడా దుష్ప్రభావాలు ఉండే అవకాశాలున్నాయి. ►పెద్ద శబ్దం వల్ల అగ్రెషన్ (ఉద్రేకం, పోట్లాటకు ముందు ఉండే స్థితి) పెరుగుతుంది. ►ఇది గర్భిణులు, వృద్ధులు వంటి వారిలో మరీ ఎక్కువ. ►గర్భంలో ఉన్న పిండంపై కూడా ఈ దుష్ప్రభావాలు ఉంటాయి. కారణం... పిండానికి 20 వారాలప్పుడే దృష్టి కంటే ముందుగా వినికిడి శక్తి ఏర్పడుతుంది. అందుకే వాటిపై దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. ►యాంగై్జటీ, డిప్రెషన్ వంటివి ఉన్నవారు ఈ పెద్ద చప్పుళ్లు భరించలేరు. ►వారిలో ఆందోళన, చికాకు, కోపం, విసుగు మరింత పెరుగతాయి. ►కాలుష్యం వల్ల నేరుగా కాకపోయినా పరోక్షంగా కూడా మానసిక ప్రభావం పడుతుంది. ఇది మానసిక రుగ్మతలకు దారితీసే ప్రమాదమూ లేకపోలేదు. ►మామూలు వాళ్లలో శబ్దాల వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ►అలాంటప్పుడు ఇక హృద్రోగం వంటివి ఉన్నవారిలో ఇది మరెంత పెరుగుతుందో దాని వల్ల హాని ఎంతో ఊహించుకోవచ్చు. ►ఎలాంటి పరిణామాల వల్ల అనటామికల్ సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. ►భావోద్వేగాలకు త్వరగా లోనయ్యే అవకాశలు ఎక్కువ. ►ఈ శబ్దాల తీవ్రత వల్ల కొన్ని భ్రాంతులు (ప్రైమరీ హ్యాలూసినేషన్స్) ఏర్పడే అవకాశం కూడా ఉంది. జంతువుల సంరక్షణకు సూచనలు... ►పెంపుడు జంతువుల్లో కుక్కలు ఎక్కువ. బాణాసంచా మోతలకు అవి బెదిరే ప్రమాదం ఎక్కువ. అప్పుడే పుట్టిన పసికూనలు పటాసుల శబ్దంతో బెదిరిపోతాయి. ►పెద్దగా పేలే శబ్దాలతో కుక్కలకు సౌండ్ ఫోబియా వచ్చి అన్నం తినడం మానేస్తాయి. ఆ తర్వాత చాలా రోజులు దిగులుగా ఉంటాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి పెంపుడు జంతువులను, పేలుళ్లు వినిపించే ప్రాంతం నుంచి శబ్దాలు తక్కువగా వినిపించే గదుల్లోకి తీసుకెళ్లాలి. ►పాడి గేదెలు వాటి పిల్లలపైన లేగదూడలు సైతం శబ్దాల ప్రభావానికి గురవుతాయి. పాడిగేదెలు కట్లు తెంపుకొని పారిపోవచ్చు. ఇలాంటి సమయాల్లో ఒకేసారి కట్లు తెంపుకున్న జంతువులు వీధుల్లోకి వస్తే ప్రమాదమే. ►వీధుల్లో తిరిగే కుక్కలు పిల్లుల వంటి స్ట్రే యానిమల్స్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ►ఒక్కోసారి థౌజెండ్‌వాలా లాంటి టపాసులు చాలా సేపు అదేపనిగా చిటపట మోగుతూనే ఉంటాయి. దాంతో పెంపుడు జంతువులు మాత్రమే గాక... చెట్లపై ఉండే పక్షులూ బెదిరిపోతాయి. అవి బెదిరి ఎగిరే సమయాల్లో ఒక్కోసారి బైక్స్ మీద వెళ్లేవారిని ఢీకొంటే మనుషులకూ ప్రమాదం. ►ఒక్కోసారి పక్షుల గుండె ఆగిపోయి చెట్టు మీది నుంచి నేల మీదికి రాలిపోవచ్చు. ►రాకెట్ల వంటి బాణాసంచాను చెట్లపైకి వదలకూడదు. అవి తాకి వాటి పక్షుల ప్రాణాలు పోవచ్చు. ►బెదిరి చెల్లాచెదురయ్యే వేళల్లో జంతువులో ఫెన్సింగ్‌లలో చిక్కుకుపోవడం, గాయపడటం జరగవచ్చు. ►చెట్ల మీద గూటిలో ఉండే తల్లిపిట్టలు రాలిపోతే గూళ్లలో కళ్లుతెరవని పిట్టపిల్లలకు పేరెంట్స్‌ను దూరం చేసినట్లే. పెద్ద పక్షుల ఉసురు తీసి పిల్లపక్షులను అనాథలను చేసి ఆ ఉసురు మనం పోసుకున్నట్లే! -
బాణాసంచా పేలుడు : ఆరుగురు దుర్మరణం
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. మిరేచి పట్టణంలో ఒక ఇంట్లో నిల్వ చేసిన బాణాసంచా పేలడంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ యజమానితోపాటు మరో ఐదుగురు దుర్మరణం చెందారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోవడంతో శిధిలాల కింద ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులున్నారు. మిరేచి పట్టణంలోని టాకియా ప్రాంతంలో శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మిరేచి పోలీస్ స్టేషన్ పరిధిలో నివించే మున్నీ దేవి (35) ఇంట్లో ఈ పేలుడు సంభవించిందని, అదే ఏరియాలో నివసిస్తున్న ఒక గిరిరాజ్‌తో పాటు ఆమె కూడా ఫ్యాక్టరీకి సహ యజమాని అని పోలీసులు తెలిపారు. ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ సంభవించిన ఈ పేలుడులో దేవితో పాటు అంజలి (8), రాధా (12), ఖుషీ (6), షీటల్ (18), రజనీ (14) మరణించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ సుఖ్లాల్ భారతి తెలిపారు. దేవీ కుమార్తెలు పూజ, మాధురితో మరో 12మంది గాయాలతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో బాణా సంచా తయారీకి దేవి, గిరిరాజ్‌లకు అనుతులున్నప్పటికీ, లెసెన్స్ చాలా పాతదని పేర్కొన్నారు. -
నాడూ నేడూ ఒకే కుటుంబంలో విషాదం
పెందుర్తి: వెలుగుల మాటున మృత్యువు కాటేస్తోంది. సాధారణ ప్రజలకు వినోదాన్ని పంచుతున్న మతబులు, చిచ్చుబుడ్డులు, తారాజువ్వులు, బాంబులు.. వాటిని తయారు చేస్తున్న వారి కుటుంబాల్లో మాత్రం పెను విషాదాన్నే నింపుతున్నాయి. బతకలేకో.. బతకడం కోసమో రోజువారీ సూక్ష్మ ఆదాయం కోసం పెను ప్రమాదంతో సావాసం చేస్తున్న వారి జీవీతాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. ఈ క్రమంలో ఆ నిరుపేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మొత్తానికి బాణసంచాతో సమాజంలో వెలుగులు నింపుతున్న వారి జీవీతాలు ప్రమాదాల రూపంలో ఆరిపోతున్నాయి. సబ్బవరం మండలం గుళ్ళేపల్లిలో సోమవారం జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురితో పాటు మరో కూలీ తీవ్ర గాయాలపాలవడం తీవ్ర విషాదాన్ని నింపింది. వీరిలో నిర్వాహకుడి భార్య, పొట్టకూటి కోసం పనికి వచ్చిన కూలీ ప్రాణాలు పోగొట్టుకోవడం మరింత విషాదం. నాణేనికి రెండోవైపు చూస్తే ఈ ప్రమాదం వెనుక పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందనిపిస్తుంది. అనుమతి లేని బాణసంచా కేంద్రాలపై కొరడా ఝుళిపించాల్సిన ఖాకీలు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో పరిస్థితి అదుపు తప్పుతుంది. ఫలితంగా గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలవగా సోమవారం నాటి దుర్ఘటనలో ఇద్దరు మృత్యు ఒడికి చేరుకున్నారు. మరో ఐదురుగు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. నాడూ నేడూ ఒకే కుటుంబంలో విషాదం గుళ్ళేపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న దాసరి సత్యనారాయణకు బాణసంచా తయారీయే ప్రధాన ఆదాయ వనరు. 2009లో తయారీకి అనుమతి పొందిన సత్యనారాయణ తన కుటుంబ సభ్యులతోనే కేంద్రాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలో 2012లో ఆర్డర్లపై విస్తృతంగా బాణసంచా తయారు చేస్తున్న క్రమంలో ముడి సరుకు భారీ విస్పోటానికి గురైంది. దీంతో అక్కడే ఉన్న దాసరి సింహాచలమ్మ(సత్యనారాయణ మొదటి భార్య), రొంగలి భవాని(సత్యనారాయణ మేనకోడలు), దాసరి నూకరాజు(కూలీ) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదంతో కొన్నాళ్లపాటు బాణాసంచా తయారీ నిలిచిపోయింది. అదే సమయంలో కేంద్రానికి ఉన్న అనుమతి కూడా రద్దయింది. కానీ కొన్నాళ్ల తరువాత ఆదాయం లేకపోవడంతో సత్యనారాయణ మళ్లీ కేంద్రాన్ని అనుమతి లేకుండా ప్రారంభించాడు. దీంతో 2018 సెప్టెంబర్‌లో దీనిపై ఫిర్యాదు అందడంతో సబ్బవరం పోలీసులు కేసు నమోదు చేసి కేంద్రం నిర్వహించకుండా బైండోవర్ కూడా చేశారు. అయితే సత్యనారాయణ తనపని తాను చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మరోసారి అదే తయారీ కేంద్రంలో మందుగుండు విస్పోటం జరిగింది. దీంతో సత్యనారాయణ రెండో భార్య కోటమ్మ(22), కూలీ సింగంపల్లి దుర్గారావు(55) మరణించారు. సత్యనారాయణ తండ్రి దాసరి సత్యం, తల్లి దాసరి గంగమ్మ(49), సోదరుడు దాసరి చిన్న(అలియాస్ అంకుల్)(30) మరో సోదరుడు దాసరి కనకరాజు (29), చిన్న భార్య దాసరి రాములమ్మ(28) తీవ్ర గాయాల పాలయ్యారు. వీరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అదే సమయంలో అనధికారికంగా బాణసంచా కేంద్ర నిర్వహిస్తున్నాడన్న ఆరోపణతో సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు అదీప్‌రాజ్ పరామర్శ గుళ్లేపల్లి బాణసంచా ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధితుడు సత్యనారాయణను ఓదార్చారు. అతడి కుటుంబానికి పార్టీ, తన తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి చింతలపూడి వెంకటరామయ్య బాధిత కుటంబాన్ని పరామర్శించారు. బాధితుల పరిస్థితి విషమం పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): సబ్బవరం మండలం గుల్లేపల్లి గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఏడుగురిని సోమవారం కేజీహెచ్‌కు తరలించారు. వీరి పరిస్థితిని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున సమీక్షించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేజీహెచ్‌కు తీసుకొచ్చిన వారంతా 80 నుంచి 90 శాతం కాలిపోయారని, వీరంతా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిపారు. ఏడుగురు బాధితుల్లో కోటమ్మ (21), ఎస్.దుర్గారావు (58) మరణించారని, మిగిలిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని, వీరిని ఐసీయూలో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఆయనతోపాటు డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కె.ఇందిరాదేవి, అనెస్థీషియా హెడ్ డాక్టర్ ఎ.సత్యనారాయణ, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఆర్ఎంవో డాక్టర్ సీహెచ్.సాధన తదితరులు పాల్గొన్నారు. -
'గౌతమిపుత్ర శాతకర్ణి' వేడుకల్లో అపశ్రుతి
నెల్లూరు: జిల్లాలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' అర్ధశత దినోత్సవ వేడుకల్లో శుక్రవారం అపశ్రుతి చోటు చేసుకుంది. నర్త థియేటర్ వద్ద బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. దీంతో థియేటర్‌కు సమీపంలో ఉన్న ఆయిల్ గోడౌన్, ఆటో మొబైల్స్ షాపులపై బాణసంచా నిప్పురవ్వలు పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. హుటాహుటిన ఘటనాస్ధలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆయిల్ గోడౌన్, ఆటో మొబైల్స్‌లలో రూ. లక్షల్లో నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.