Top Stories
ప్రధాన వార్తలు
![Sakshi Editorial On Chandrababu Andhra Pradesh Politics By Vardhelli Murali](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/EDITCART116-6-24_0.jpg.webp?itok=2f00T_VT)
రెడ్‌బుక్ రాజ్యాంగం చెల్లదు!
ఇండోనేషియాలో లక్షలాదిమందిని ఊచకోత కోసిన సుహార్తో పాలన ఆదర్శంగా కనిపిస్తున్నదా? కాంబోడియాలో నెత్తుటేరులు పారించిన పోల్‌పాట్ మీకు రోల్‌మోడల్‌గా కనిపిస్తున్నాడా? చిలీ ప్రజల ప్రాథమిక హక్కులను తొక్కిపారేసిన ఆగస్టో పినోచెట్ ఉక్కుపాదం మీద మోజుపుట్టిందా? మరెందుకు మీ చేతిలోని ఆ రెడ్ బుక్? ఆ పుస్తకానికి హోర్డింగులెందుకూ... హారతులెందుకు?ఏముందా రెడ్‌బుక్‌లో? మీ విధానాలను బలంగా విరోధించే మీ రాజకీయ ప్రత్యర్థుల పేర్లు, మీ విమర్శకుల పేర్లు, మీ అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించని అధికారుల పేర్లు... అంతేగా! ఎన్నికలకు ముందు లోకేశ్‌బాబు జారీ చేసిన హెచ్చరికల తాత్పర్యం ఇదే కదా! ఒక ప్రమాణపూర్వక ప్రతీకార పొత్తానికి వీరపూజలు చేయడం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతుందా? ఇటువంటి చర్యల వలన రాజ్యాంగబద్ధ పరిపాలనకు ప్రమాదం దాపురించదా? రాజ్యాంగబద్ధమైన పరిపాలన విఫలమైతే ఏం చేయాలనే విరుగుడు మంత్రం కూడా మన రాజ్యాంగంలో ఉన్న సంగతి తమకు తెలియనిదా?బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో షరీఖైన దగ్గర్నుంచీ తెలుగుదేశం శ్రేణులు చెలరేగిపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎన్డీఏ విధేయ ఎన్నికల సంఘం ఆసరాతో పాలనా యంత్రాంగంపై పట్టు బిగించిన ఆ పార్టీ శ్రేణులు యథేచ్ఛగా ప్రవర్తించిన తీరు కూడా తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్ పోలింగ్‌కు ముందు మూడు దశల ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగాయి. అప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి అతి పెద్ద రాష్ట్రాల ప్రజానాడి కూటమి పెద్దలకు అర్థమైపోయింది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి బలమైన బీజేపీ స్థావరాల్లో దాదాపుగా పోలింగ్ ఘట్టం పూర్తయింది. అయినా కనాకష్టంగానే ఎన్డీఏ హాఫ్ మార్క్‌ను దాటగలుగుతున్నదని నేతలకు రూఢీ అయింది.ఫలితాలు కూడా వారి అంచనాలకు తగినట్టుగానే వచ్చాయి. మూడు దశల్లోని 285 స్థానాల్లో ఎన్డీఏ 150 మార్క్‌ను దాటలేదు. మిగిలిన నాలుగు దశలు ఎన్డీఏ దశను మార్చాలి. మిగిలిన దశలు అంతగా అనుకూల ప్రాంతాలు కానప్పటికీ కూటమి గట్టెక్కగలిగింది. కానీ మాయమైపోయిన 20 లక్షల ఈవీఎమ్‌ల గురించి స్పష్టమైన సమాధానం ఇప్పటివరకూ రాలేదు. 140 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఎందుకున్నాయనే సందేహాన్ని తీర్చే నాథుడు కనిపించడం లేదు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కూటమి ఇచ్చిన జాబితా ప్రకారం ఎన్నికల సంఘం అధికారుల బదిలీలు ఎందుకు చేసిందో అర్థం కాలేదు.అధికార యంత్రాంగాన్ని కూటమి గుప్పెట్లోకి తీసుకోవడానికీ, తమ కంచుకోటల్లో సైతం వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడానికీ మధ్యన గల సంబంధం ఏమిటో తేలవలసి ఉన్నది. ఈ అంశంపై లోతైన అధ్యయనం జరగాలి. ఈలోగా రెడ్‌బుక్ స్ఫూర్తితో రాష్ట్రంలో మొదలైన బీభత్స పాలన ఫలితంగా అటువంటి అధ్యయనాలు ఇంకా టేకాఫ్ కాలేదు. కానీ ఆలస్యమైనా అవి జరుగుతాయి. నిజానిజాలను నిగ్గుతేలుస్తాయి. భవిష్యత్తు రాజకీయాలకు పాఠాలను అందజేస్తాయి.ఫలితాలను ప్రకటించి పది రోజులు దాటింది. అయినా రెడ్‌బుక్ బీభత్స పాలన తగ్గుముఖం పట్టలేదు. ఇళ్లపైనా, కార్యాలయాలపైనా దాడులు జరిగినా, ప్రత్యర్థులను చితక్కొట్టినా, అర్ధనగ్నంగా మార్చి కాళ్లు పట్టించుకుంటున్నా పోలీసులు ఫిర్యాదులు స్వీకరించడం లేదు. ఇకముందు కూడా రెడ్‌బుక్ రాజ్యాంగమే అమలు కానుందా అనే అనుమానాలకు సాక్షాత్తూ ఉన్నతస్థాయిలోని వారే ఊతమిస్తున్నారు. 1970వ దశకం నాటి బెంగాల్ రాజకీయ పరిణామాలను నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గుర్తుకు తెస్తున్నాయి.1972లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు బూటకపు ఎన్నికల పేరుతో ప్రచారంలోకి వచ్చాయి. పోలీసుల సహకారంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్ చేసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓటమెరుగని జ్యోతిబసు సైతం ఓడిపోయినట్టు ప్రకటించారు. కేవలం 14 మంది మాత్రమే సీపీఎం నుంచి గెలిచినట్టు లెక్క తేల్చారు. దీంతో ఐదేళ్లపాటు ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించింది. ఈ ఐదేళ్లలో సిద్ధార్థ శంకర్‌రే ప్రభుత్వం ప్రతిపక్షాల అణచివేతకు తెగబడని దాష్టీకం లేదు. ఇప్పటి మాదిరిగా రెడ్‌బుక్‌ను పూజించలేదు కానీ ఇదే తరహా బీభత్స పాలనను ఐదేళ్లూ కొనసాగించారు. పాలక పార్టీ ఫలితాన్ని అనుభవించింది. 1977లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో ఇప్పటి దాకా కోలుకోనేలేదు.హింసాకాండతో, భయోత్పాతాలు సృష్టించడం ద్వారా ప్రత్యర్థులను కట్టడి చేయవచ్చనుకునే పాలకులు ఇటువంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. కానీ అటువంటి లక్షణాలైతే ఈ పది రోజుల్లో కనిపించలేదు. దేశంలోనే సీనియర్ రాజకీయవేత్తల్లో ఒకరైన చంద్రబాబుకు సుదీర్ఘమైన రాజకీయ, పాలనా అనుభవం ఉన్నది. కానీ, గడచిన రెండు మూడు రోజులుగా ఆయన అధికార యంత్రాంగంపై చేస్తున్న వ్యాఖ్యలు, చేపడుతున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారుల మీద, ఉద్యోగుల మీద ఆయన రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.పోలీస్ స్టేషన్లో నేరస్థుల ఫోటోలు పెట్టినట్టుగా శనివారం నాటి ‘ఈనాడు’ పత్రికలో ఓ పదిహేనుమంది డీఎస్పీల ఫోటోలను వేశారు. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధమైన రాతలు రాశారు. ఉద్యోగుల పనితీరును మదింపు చేయవలసింది ఎవరు? ‘ఈనాడు’కు ఈ బాధ్యతను ఎవరు అప్పగించారు? ఇలా ప్రతిరోజూ ‘ఈనాడు’లో ఓ జాబితా రావడం, దానిపై చర్యలకు పూనుకోవడం జరుగుతుందనుకోవాలా? ఈ విధంగా రాజ్యాంగ, రాజ్యాంగేతర వ్యవస్థలు హద్దులు మీరి వ్యవహారాలు నడిపితే పరిపాలన గాడి తప్పదా? ఆదిలోనే గాడి తప్పుతున్న సూచనలు కనిపించడం శుభసంకేతమైతే కాదు.ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న బీజేపీకి గానీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌కు గానీ భారత రాజ్యాంగం పట్ల అంతగా విశ్వాసం లేదన్న అభిప్రాయం ఉన్నది. ముఖ్యంగా రాజ్యాంగ పీఠికలోని ‘సెక్యులర్’, ‘సోషలిస్టు’ పదాలను తొలగించాలన్న తహతహ వారిలో ఉండవచ్చు. మూడింట రెండొంతుల మెజారిటీ కోసం బీజేపీ వెంపర్లాడింది కూడా రాజ్యాంగ సవరణ కోసమేననే వాదన కూడా ఉన్నది. బీజేపీ భావజాలానికి చంద్రబాబు సహజ మిత్రుడని భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ మరణం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడుసార్లూ చంద్రబాబు కాషాయ పార్టీ సహకారంతోనే నెగ్గుకొచ్చారు. బీజేపీ ‘మ్యాజిక్’ తోడవకుండా ఎన్నికల్లో గెలిచిన రికార్డు ఆయనకు లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును పెట్టినప్పుడు కొన్ని శక్తులు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డాయి. ఈ శక్తులకు తోడ్పాటును అందించిన రాజకీయ రూపాలేమిటనేది స్థానిక ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగ రచయిత మీద వీరికి ఉన్న వ్యతిరేకత రాజ్యాంగం మీద ఏమేరకున్నదో తెలియవలసి ఉన్నది. బీజేపీ కోరుకుంటున్నట్టుగా పీఠికలోని సెక్యులర్, సోషలిజం అనే రెండు పదాలను తొలగించినా కూడా మొత్తం రాజ్యాంగ స్వభావంలోంచి వాటి స్ఫూర్తిని తొలగించడం సాధ్యం కాదు. ఎటువంటి వివక్ష లేని స్వేచ్ఛ, సమానత్వాలకు, సమాన అవకాశాలకు రాజ్యాంగం పూచీపడుతున్నది. సమాన అవకాశాలను వినియోగించుకోగలిగే స్థాయికి వెనుకబడిన శ్రేణులను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వాలను రాజ్యాంగం ఆదేశిస్తున్నది.ఈ శతాబ్దంలోని ఆధిపత్య రాజకీయ వ్యవస్థలకూ, మన రాజ్యాంగం స్ఫూర్తికీ మధ్యన సైద్ధాంతిక విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఆధిపత్య రాజకీయపక్షాల్లో ఎక్కువ భాగం ‘ట్రికిల్ డౌన్’ ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నవే. ఈ విధానాలను ఔదలదాల్చడంలో ఛాంపియన్ నెంబర్‌వన్ బీజేపీ, ఛాంపియన్ నెంబర్ టూ టీడీపీ. అందుకే ఇవి రెండూ సహజ మిత్రపక్షాలు. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు, మెగా రిచ్ వ్యక్తుల అనుకూల విధానాలను ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ ప్రోత్సహిస్తుంది. వీరు ఖర్చు చేయడం ద్వారా అంటే పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతో ఇంతో బతుకుతెరువు అడుగు వర్గాలకు కూడా లభిస్తుంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.సంపన్నులు పెట్టుబడులు పెట్టడం కోసం సహజ వనరులను వారి పరం చేయాలి. వారికి శ్రమ శక్తి చౌకగా లభించాలి. వ్యవసాయ రంగం లాభసాటిగా ఉంటే అది సాధ్యం కాదు. విద్య, వైద్య రంగాల్లో కూడా ప్రైవేట్ పెట్టుబడులకే పెద్దపీట వేయాలి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని స్వయంగా చంద్రబాబు చేసిన ప్రకటనలే మన ముందున్నాయి. ప్రైవేట్ విద్యావ్యవస్థలో నాణ్యమైన చదువు సంపన్న శ్రేణికి మాత్రమే లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రకమైన ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే పార్టీలు పేదలకోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తాయి. కానీ, అవి సాధికారతకు బాటలు వేసే చర్యలు మాత్రం కాదు.రాజ్యాంగ లక్ష్యాలను అందుకోవడానికి ఎంపవర్మెంట్ ఎకనామిక్స్ అవసరమవుతాయి. వ్యక్తులను సాధికార శక్తులుగా మలచడంతో పాటు వారిలో ఆత్మగౌరవాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ విధానాలు అవసరం. అయితే సమాజంలోని ఆధిపత్య వర్గాలు ఈ విధానాలను వ్యతిరేకిస్తాయి. వీటిని ప్రబోధించే రాజకీయ శక్తులను నిరోధిస్తాయి. ఏపీలో జరిగిన ఎన్నికలను ఈ నేపథ్యంలోంచి కూడా పరిశీలించాలి. ఈ విధానాల ఘర్షణను ప్రజలకు వివరించి చెప్పడం అంత సులభసాధ్యమేమీ కాదు. అనేక సామాజిక – సాంస్కృతిక సంక్లిష్టతల కారణంగా నిట్టనిలువునా వర్గ విభజన చేయడం కూడా కష్టమైన పని.నెలకు రెండు లక్షలు సంపాదించేవాడూ, నెలకు పదివేలు సంపాదించేవాడూ కూడా మన దగ్గర మధ్యతరగతిగానే చలామణీ కావడానికి ఇష్టపడతారు. పదివేలవాడు పేదవాడిగా ఒప్పుకోడు. పేదరికం అంటే కూటికి లేకపోవడమనే అభిప్రాయం నుంచి మనం ఇంకా బయటపడలేదు. నాణ్యమైన విద్య దొరక్కపోవడం పేదరికం, సమాన అవకాశాలు లభించకపోవడం పేదరికం, హస్తిమశకాంతరం పెరిగిన ఆర్థిక వ్యత్యాసాల్లో అడుగుభాగాన నిలవడం పేదరికం, కోరుకున్న జీవన గమనాన్ని సాధించుకోలేకపోవడం పేదరికమనే స్పృహ మనకింకా రాలేదు.వెనుకబడిన వర్గాలుగా గుర్తింపు పొందిన వారిలోని క్రీమీ లేయర్ కూడా తన సాటి సామాజిక శక్తులతో జతకూడటానికి బదులు సవర్ణ హిందూ సమాజంతో స్నేహం చేయడాన్నే గౌరవంగా భావించుకుంటారు. గ్రామాల్లో పదిహేనెకరాలున్న ఆసామి కూడా జీవన ప్రమాణాల రీత్యా పేదవాడికిందే లెక్క. కానీ, తన సామాజిక స్థానం దృష్ట్యా తనను తాను పెత్తందారుగా భావించుకునే విచిత్ర పరిస్థితి ఉన్నది. ఈ సంక్లిష్టతలను ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయి.కానీ పరిపాలనా ప్రా«ధమ్యాల వల్ల అనుభవ పూర్వకంగా మిత్రుడెవరో శత్రువెవరో జనం తెలుసుకుంటారు. అన్ని కులాలు, మతాల్లోని ప్రజలంతా తాము పోగొట్టుకున్నదేమిటో గ్రహిస్తారు. ఈ గ్రహింపే సాధికారతను కోరుకునే ప్రజలందరినీ ఏకం చేస్తుంది. సిద్ధాంతరీత్యా, విధానాల రీత్యా చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సాధికారతకు వ్యతిరేకం. కనుక సాధికారతా శక్తులు బలపడకుండా అది బలప్రయోగానికి దిగుతూనే ఉంటుంది. రెడ్‌బుక్‌తో బెదిరిస్తూనే ఉంటుంది. కానీ అణచివేతలు, భయోత్పాతాలు అంతిమ విజయాలు సాధించిన దాఖలాలు లేవు. రెడ్‌బుక్ రాజ్యాంగం చెల్లదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com
![Fathers Who Played Key Roles In Indian Star Cricketers Careers](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/team-india-players.jpg.webp?itok=S-JCbrFi)
ఈ టీమిండియా స్టార్ల సక్సెస్ వెనుక హీరోలు తండ్రులే..!
ప్రతి వ్యక్తి జీవితంలో మొదటి హీరో, మొదటి గురువు నాన్నే. రంగం ఏదైనా ఓ వ్యక్తి రాణించాలంటే అందులో కీలకపాత్ర తండ్రిదే. నాన్న పిల్లల చేయి పట్టుకుని ప్రపంచానికి పరిచయం చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. పిల్లల ఉన్నతి కోసం అహర్నిశలూ శ్రమించి సర్వస్వం ధారపోస్తాడు.తాను పడ్డ కష్టాలు, తాను చేసిన త్యాగాలకు ఏనాడూ ప్రతిఫలం ఆశించని నిస్వార్థ వ్యక్తి నాన్న. అలాంటి త్యాగమూర్తికి 'ఫాదర్స్ డే'ను (జూన్ 16) పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేద్దాం.ప్రతి మనిషి సక్సెస్ వెనుక నిజమైన హీరో తండ్రే. రంగం ఏదైనా ఓ వ్యక్తి రాణించాడంటే దాని వెనుక తండ్రిదే ప్రధానపాత్ర. ఫాదర్స్ డే సందర్భంగా క్రీడారంగానికి (క్రికెట్) సంబంధించి బిడ్డల కోసం త్యాగాలు చేసిన తండ్రులపై ఓ ప్రత్యేక కథనం.శుభ్‌మన్ గిల్-లఖ్విందర్ సింగ్: భారత క్రికెట్ జట్టు ప్రిన్స్‌గా పిలువబడే శుభ్‌మన్ గిల్ తండ్రి పేరు లఖ్విందర్ సింగ్. లఖ్విందర్ సింగ్ తన కొడుకు క్రికెట్లో ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో కీలకపాత్ర పోషించాడు. గిల్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో రాణిస్తున్నాడంటే అది తండ్రి లఖ్విందర్ చలువే. గిల్ కెరీర్ కోసం లఖ్విందర్ ఎన్నో త్యాగాలు చేశాడు. ఇండియా-పాకిస్తాన్ బోర్డర్లోని ఫాజిల్కా అనే కుగ్రామానికి చెందిన లఖ్విందర్.. కొడుకు కెరీర్లో కోసం 300 కిమీ దూరంలో ఉన్న మొహాలీ నగరానికి మకాం మార్చాడు. గిల్‌ను క్రికెటర్ చేసేందుకు లఖ్విందర్ 15 సంవత్సరాలు తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకున్నాడు. తిండి పెట్టే వ్యవసాయాన్ని సైతం వదిలి పెట్టి నగరవాసం చేశాడు.గిల్ క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో లఖ్విందర్ తన గ్రామంలో జరిగే ఏ శుభకార్యానికి హాజరుకాలేదు. తాను ఫంక్షన్లకు వెళితే కొడుకు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఏవో కారణాలు చెప్పి హాజరయ్యేవాడు కాదు. గిల్‌కు ఆటపై ఉన్న ఆసక్తిని గమనించిన లఖ్విందర్ ఊరిలో ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు. తానే కోచ్‌గా మారి గిల్‌ను ప్రతి రోజు 500-700 బంతులు ఆడేలా చేసేవాడు. బ్యాట్‌తో ఆడేప్పుడు మిడిల్ చేసేందుకు తోడ్పడుతుందని వికెట్‌తో ప్రాక్టీస్ చేయించేవాడు. గిల్ ప్రస్తుత తరం క్రికెటర్లలో అగ్రగణ్యుడిగా ఉన్నాడంటే దాని వెనుక తండ్రి లఖ్విందర్ చేసిన ఇలాంటి త్యాగాలు ఎన్నో ఉన్నాయి.యువరాజ్ సింగ్-యోగ్రాజ్ సింగ్: టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్, టు టైమ్ వరల్డ్‌కప్ విన్నర్ యువరాజ్ సింగ్ తండ్రి పేరు యోగ్రాజ్ సింగ్. స్వతాహాగా క్రికెటర్ అయిన యోగ్రాజ్ సింగ్.. యువరాజ్ క్రికెట్లో ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో కీలకపాత్ర పోషించాడు. భారత్ తరఫున ఆరు వన్డేలు, ఓ టెస్ట్ మ్యాచ్ ఆడిన యోగ్రాజ్.. క్రికెట్లో తాను సాధించలేని ఉన్నతిని తన కొడుకు ద్వారా సాకారం చేసుకోవాలని కోరుకున్నాడు. ఇందుకోసం తన కొడుకు చాలా కష్టపెట్టాడు. యువరాజ్‌కు చిన్నతనంలో క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. యువరాజ్ స్కేటింగ్‌లో రాణించాలని అనుకున్నాడు. ఇందులో ఓ గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. తన కొడుకు క్రికెటర్‌గానే రాణించాలని భీష్మించుకు కూర్చున్న యోగ్రాజ్.. యువరాజ్ సాధించిన గోల్డ్ మెడల్‌ను విసిరికొట్టి, క్రికెట్‌పై ఏకగ్రాత సాధించేలా చేశాడు. తొలుత అయిష్టంగానే క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన యువరాజ్ నెమ్మదిగా ఆటపై పట్టు సాధించి ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కించుకున్నాడు. యువరాజ్ తండ్రి మాట పెడచెవిన పెట్టి ఉంటే భారత్ క్రికెట్ ఓ గొప్ప యోధుడి సేవలను కోల్పోయి ఉండేది. యువరాజ్ సభ్యుడిగా ఉన్న భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టైటిళ్లను సొంతం చేసుకుంది.సర్ఫరాజ్ ఖాన్-నౌషద్ ఖాన్: టీమిండియా యంగ్ తరంగ్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి పేరు నౌషద్ ఖాన్. సర్ఫరాజ్ అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో (టెస్ట్‌ల్లో) అడుగుపెట్టిన తొలినాళ్లలోనే గుర్తింపు తెచ్చుకున్నాడంటే దాని వెనుక అతని తండ్రి ఊహకందని త్యాగం, కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష ఉన్నాయి. చిన్నతనం నుంచి సర్ఫరాజ్‌ను క్రికెటర్ చేయాలని పరితపించిన నౌషద్ ఖాన్ తన వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కన కొడుకు ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమించాడు. ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు నౌషద్ తన కొడుకును ఎంతో కష్టపెట్టాడు, బాధించాడు. సర్ఫరాజ్‌కు తండ్రే కోచ్‌గా, మెంటార్ వ్యవహరించాడు. సర్ఫరాజ్‌కు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నౌషద్ బిడ్డతో పాటు శ్రమించి తాననుకున్న లక్ష్యాన్ని నేరవేర్చుకున్నాడు. సర్ఫరాజ్ టీమిండియా అరంగేట్రం ప్రతి క్రికెట్ అభిమానిని భావోద్వేగానికి గురి చేసింది. సర్ఫరాజ్ తొలి టెస్ట్‌కు ముందు నౌషద్ మైదానంలో కంటతడి పెట్టిన దృశ్యాలు ప్రతి భారతీయుడి మనసును హత్తుకున్నాయి.
![MK Stalin Dig at modi mention of sweet box by Rahul Gandhi victory rally](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/mks.jpg.webp?itok=2Zj4oFDE)
‘ఒక్క సీట్ బ్యాక్స్‌తో మోదీ ఇమేజ్‌కు రాహుల్ చెక్’
చెన్నై: లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎనిమిదిసార్లు తమిళనాడుకు వచ్చిన సాధించుకున్న ఇమేజ్ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక్క స్వీట్ బాక్స్‌తో ముక్కలు చేశాని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. కోయంబత్తూరులో డీఎంకే పార్టీ ఏర్పాటు చేసిన లోక్‌సభ ఎన్నిక ‘విజయ ర్యాలీ’సభలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానిమోదీపై విమర్శలు గుప్పించారు.‘‘ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నేను చివరిసారి కోయంబత్తూరు వచ్చినప్పడు నా పర్యటన దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. మోదీ తమిళనాడకు 8 సార్లు పర్యటించి పొందిన ఇమేజ్ను కోయంబత్తూరులో రాహుల్ గాంధీ నాకు కేవలం ఒక స్వీట్ బ్యాక్స్ ఇచ్చి ముక్కలు చేశారు. నేను బోయంబత్తూరు ఉన్న సమయంలో రాహుల్ తమిళనాడుకు వచ్చిన రాహుల్ నాకు స్వీట్ బాక్స్ ఇచ్చారు. సోదరుడు రాహుల్ గాంధీ నాపై చూపిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోను’’ అని స్టాలిన్ అన్నారు.నరేంద్ర మోదీ బీజేపీ సొంతబలంతో ప్రధానమంత్రి కాలేదని, భాగస్వామ్య పార్టీల సాయంతో ప్రధాని అయ్యారని ఎద్దేవా చేశారు. భాగస్వామ్య పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మోదీ ఫెయిల్యూర్ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన విజయం సాధారణమే అయినప్పటికి.. మోదీని సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేకుండా చేయటంలో ‘చారిత్రాత్మక విజయం’గా మారిందని అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో మొత్త 40 స్థానాల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి విజయం సాధించిందన్నారు. అయితే బీజేపీ రాజ్యాంగాన్నిమార్చుతామని చెప్పిందని, ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి 41వ విజయం సాధించిందని అన్నారు. ఇదే విజయన్ని 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం రిపీట్ చేస్తామని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.
![Power Struggle Between Tdp Leaders Gandi Babji And Bandaru Satyanarayana Murthy](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/Gandi-Babji.jpg.webp?itok=FmdalWSP)
గండి బాబ్జీ Vs బండారు.. టీడీపీలో మరోసారి ఆధిపత్య పోరు బహిర్గతం
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గండి బాబ్జీ, బండారు సత్యనారాయణ మూర్తి మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. బండారుకి వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా గండి బాబ్జీ మాట్లాడుతున్నారు. గతంలో బండారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనను ఏ కార్యక్రమానికి పిలవలేదని.. పెందుర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తనకు తగిన గౌరవం ఇవ్వాలంటూ గండి బాబ్జీ వ్యాఖ్యానించారు.ఇప్పుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తనకు తెలియకుండా ఏ కార్యక్రమం పెట్టడానికి వీల్లేదన్నారు. గండి బాబ్జీ వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా బండారు తనయుడు అప్పలనాయుడు కౌంటర్ ఇచ్చారు. పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఎలా మెలగాలో నాకు తెలుసు.. గత్యంతరం లేక వేరే పార్టీల నుంచి వచ్చిన వారి నుంచి నేర్చుకోవలసిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.
![Bacteria Spreading in Japan can Kill in 2 Days](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/japan.jpg.webp?itok=p4t0TPNh)
దడ పుట్టిస్తున్న కొత్త బ్యాక్టీరియా.. సోకితే రెండు రోజుల్లో మృతి?
జపాన్‌లో అరుదైన వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియా ప్రాణాంతకమని, దీని బారిన పడిన బాధితులు రెండు రోజుల్లో మృతి చెందే అవకాశం ఉన్నదని జపాన్ వైద్య నిపుణులు చెబుతున్నారు.జపాన్‌లో కరోనా పీరియడ్ ఆంక్షలు సడలించిన అనంతరం ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. వైద్యుల అంచనా ప్రకారం ఈ వ్యాధి మనిషిని 48 గంటల్లో మృత్యు ఒడికి చేరుస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధిని ‘స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్’ (ఎస్టీఎస్ఎస్) అని అంటారు.జపాన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తెలిపిన వివరాల ప్రకారం 2024, జూన్ 2 నాటికి ఈ వ్యాధి కేసులు 977కి చేరుకున్నాయి. గతేడాది 941 కేసులు నమోదయ్యాయి. ఈ ఇన్స్టిట్యూట్ 1999 నుంచి ఈ వ్యాధికి సంబంధించిన రికార్డులను భద్రపరుస్తోంది.ఈ వ్యాధి సోకినప్పుడు గొంతు నొప్పి మొదలవుతుంది. అలాగే శరీరంలోని వివిధ అవయవాల్లో వాపు, నొప్పి జ్వరం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇది శ్వాస సమస్యలు, అవయవ వైఫల్యానికి దారితీసి చివరికి బాధితుడిని మృత్యు ఒడికి చేరుస్తుంది. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం అధికంగా ఉంటున్నదని పలు పరిశోధనల్లో తేలింది.ఈ వ్యాధి గురించి టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన అంటు వ్యాధుల ప్రొఫెసర్ కెన్ కికుచి మాట్లాడుతూ ఈ వ్యాధి సోకినప్పుడు మరణం 48 గంటల్లో సంభవించే అవకాశం ఉన్నదన్నారు. జపాన్‌లో ఈ ఏడాది చివరినాటికి ఈ కేసుల సంఖ్య 2,500కి చేరుకోవచ్చని కికుచి తెలిపారు.
![Anand Mahindra Tweet About Ambassador Scale Model](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/anand-mahindra.jpg.webp?itok=PcM7EZ3o)
ఇలాంటివి మనమెందుకు చేయడం లేదు!.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ పోస్ట్ చేశారు. ఇందులో స్కేల్ మోడల్ అంబాసిడర్ కారు ఉంది.ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ వేదికగా స్కేల్ మోడల్ హిందూస్తాన్ అంబాసిడర్ కార్లను పోస్ట్ చేస్తూ.. నేను ఈ ప్రతాప్ బోస్ నుంచి ఓ గిఫ్ట్ అందుకున్నారు. నా పాతకాలపు జ్ఞాపకాల్లో ఎప్పటికీ అంబాసిడర్ గుర్తుండిపోతుంది.భారతదేశంలో ఈ కారుకు గొప్ప చరిత్ర ఉంది. దేశంలో ఈ కారుకు విడదీయలేని బంధం ఉంది. కాబట్టి ఇది అమరత్వం పొందేదుకు ఖచ్చితంగా అర్హమైనది. మనదేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ స్కేల్ మోడల్‌ను చైనా నుంచి కాకుండా బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్న విశాల్ బింద్రేకి ధన్యవాదాలు. ఇలాంటి నమూనాలను మనం ఎందుకు రూపొందించుకోవడం లేదు అంటూ ప్రశ్నించారు.ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతి తక్కువ సమయంలోనే వేలసంఖ్యలో లైక్స్ పొందిన ఈ ట్వీట్ మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.Received a cool gift today from @BosePratap The Ambassador will never fade from the memories of someone of my vintage. What an old warhorse it was. An inextricable part of the old Indian landscape. So it deserves to be immortalised through such scale models. And kudos to… pic.twitter.com/wkO4gO2lC7— anand mahindra (@anandmahindra) June 15, 2024
![Nayanthara, Kiara Advani, Huma Qureshi To Act In Yash Toxic Movie](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/kiara-advani.jpg.webp?itok=lAnYEKxN)
యశ్ ‘ టాక్సిక్ ’లో ముగ్గురు భామలు.. కరీనా ప్లేస్‌లో నయనతార!
తమిళసినిమా: కేజీఎఫ్ చిత్రం తరువాత ఆ చిత్ర కథానాయకుడు నటించే చిత్రం అంటే ఆ రేంజ్‌కు ఏమాత్రం తగ్గకూడదు. ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మరి. నటుడు యష్ అలాంటి జాగ్రత్తలే తీసుకుంటున్నారనిపిస్తోంది. కేజీఎఫ్ 1, 2 చిత్రాల తరువాత ఈయన టాక్సిక్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందనున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి మహిళా దర్శకురాలు గీతు మోహన్‌దాస్ తెరకెక్కించనున్నారు. దీంతో చిత్రంలో మల్టీ భాషలకు చెందిన ప్రముఖ తారాగణం నటించనున్నారు. ముఖ్యంగా బీబీసీ సీరీస్ పిక్కీ బ్లైండర్స్ తరహాలో తెరకెక్కనున్న ఈ గ్యాంగ్స్టర్స్ కథా చిత్రంలో యష్ సరసన కియారా అద్వానీ నాయకిగా నటించనున్నారు. మరో ప్రధాన పాత్రలో కరీనాకపూర్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆమె పాత్రలో నయనతార వచ్చి చేరినట్లు తెలిసింది. ఇందులో ఈమె యష్‌కు సిస్టర్‌గా నటించనున్నట్లు సమాచారం. అదేవిధంగా మరో బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి కీలక పాత్రను పోషించనున్నారని తెలిసింది. మరో విషయం ఏమిటంటే దర్శకురాలు ఈ చిత్ర షూటింగ్‌ను 200 రోజుల్లో పూర్తిచేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. అందులో 150 రోజులు లండన్ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించనున్నట్లు సమాచారం. అందుకోసం చిత్ర యూనిట్ త్వరలో యూకేకు బయలుదేరనున్నట్లు తెలిసింది. ఇకపోతే ఈ చిత్రాన్ని 2025, ఏప్రిల్ 10వ తేదీన తెరపైకి తీసుకురావాలని నిర్ణయించనట్లు తెలిసింది.
![Complaint by victim Paleti Rajkumar to Human Rights Commission](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/court.jpg.webp?itok=wNfTPDb7)
చినబాబు బ్యాచ్ చిత్రహింసలు!
సాక్షి, అమరావతి: మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేశ్ అనుచరులు ఈ నెల 9వ తేదీన తనను కిడ్నాప్ చేసి రాత్రంతా చిత్ర హింసలకు గురి చేసినట్లు పెదవడ్లపూడికి చెందిన బాధితుడు పాలేటి రాజ్‌కుమార్ సుప్రీం కోర్టు, హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. లోకేశ్ ఫ్లెక్సీ ఎదుట మోకాళ్లపై కూర్చోబెట్టి బెదిరించి క్షమాపణ చెప్పించి చిత్రీకరించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి తన కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నాడు.వీటి ప్రభావంతో పాఠశాలలో చదువుతున్న తన పిల్లలు అవమానభారంతో ఇంటికొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నేతలు పదే పదే బెదిరింపులకు దిగుతున్నారని, తక్షణమే జోక్యం చేసుకుని అరికట్టకుంటే తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని విన్నవించుకున్నాడు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై చట్టప్రకారం పోలీసులతో విచారణ జరిపి వ్యక్తిగత, భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కులను పరిరక్షించాలని కోరాడు. ఫిర్యాదులో ముఖ్యాంశాలు ఇవీ.. ⇒ మంగళగిరి నియోజకవర్గంలో 2019–24 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను మా కుటుంబంతో కలసి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశా. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. నారా లోకేశ్ అండదండలతో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. ⇒ ఈ నెల 9వతేదీన సాయంత్రం 4.30 గంటల సమయంలో నారా లోకేశ్‌కు సన్నిహితుడైన జవ్వాడి కిరణ్‌చంద్ అనుచరులు నరేంద్ర, షేక్ బాజీ, జానీ తదితరులు నేను మా అత్త ఇంట్లో ఉన్న సమయంలో మారణాయుధాలతో దాడి చేశారు. ఫరీ్నచర్‌ను ధ్వంసం చేశారు. ఏపీ 39 జీబీ 3333 వాహనంలో నన్ను కిడ్నాప్ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించి రాత్రంతా చిత్రహింసలకు గురిచేశారు. నా చొక్కా విప్పించి నారా లోకేశ్ ప్లెక్సీ ఎదుట మోకాళ్లపై మోకరిల్లి ముకుళిత హస్తాలతో క్షమాపణ చెప్పాలని బెదిరించి వీడియో చిత్రీకరించారు. ఈనెల 10వతేదీ తెల్లవారు జాము 4 గంటలకు బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై వదిలేసి వైఎస్సార్ సీపీకి మద్దతు పలికితే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ⇒ నాపై దాడి చేసిన వారిపై అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు (ఎఫ్ఐఆర్ నెంబరు 78/2024) చేశా. ఫిర్యాదు వాపసు తీసుకోవాలంటూ టీడీపీ మద్దతుదారులు పదే పదే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు నా ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ⇒ మానవ హక్కులను కాలరాయడంపై తక్షణమే జోక్యం చేసుకుని టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి నాకు, నా కుటుంబానికి రక్షణ కలి్పంచాలి. నా ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణకు ఆదేశించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నా.
![Weekly Horoscope 16 June 2024 To 22 June 2024 In Telugu](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/weekly-horoscope-in-telugu-.jpg.webp?itok=2ferLANi)
ఈ వారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషంఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. పోటీపరీçక్షల్లో అనుకూల ఫలితాలు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లకు అవకాశం. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, ఎరుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.వృషభంపనులు సకాలంలో పూర్తయి ఊపిరిపీల్చుకుంటారు. శ్రమ ఫలించే సమయం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో రాజీపడతారు. చర,స్థిరాస్తుల వృద్ధి. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయ, కళారంగాల వారికి అనుకోని అవకాశాలు. సన్మానయోగం. వారం ప్రారంభంలో శ్రమ వృధా. బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఆందోళన. చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, కనకధారాస్తోత్రాలు పఠించండి.మిథునంవ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. ఇంటి నిర్మాణంలో ఎదురైన ఇబ్బందులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు ఒక హోదా దక్కవచ్చు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఇంటాబయటా ఒత్తిడులు. ఖర్చులు అధికం. గులాబీ, తెలుపు రంగులు, పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి.కర్కాటకందీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు. తండ్రితరఫు వారి నుంచి ధన, వస్తులాభాలు ఉంటాయి. శ్రేయోభిలాషుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార వృద్ధి, కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో దూరప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. తెలుపు, చాక్లెట్‌రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.సింహంపనులలో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు, మీ నిర్ణయాలను బంధువులు వ్యతిరేకిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉండి లాభాలు నామమాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. ధనలబ్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నేరేడు, లేత ఆకుపచ్చరంగులు, హనుమాన్ ఛాలీసా పఠించండి.కన్యఅదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఒక సమాచారంతో ఊరట చెందుతారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి ఊహించని పిలుపు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. ఎరుపు, బంగారురంగులు, శివపంచాక్షరి పఠించండి.తులకొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబసభ్యుల్లో అనుమానాలు నివృత్తి చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా పడతాయి. పసుపు, తెలుపురంగులు, గణేశాష్టకం పఠించండి.వృశ్చికంకొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. రావలసిన బాకీలు అంది ఖర్చులకు ఇబ్బంది ఉండదు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడవచ్చు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయ, కళారంగాలవారికి విదేశీ పర్యటనలు.వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. నేరేడు, లేత ఎరుపు రంగులు, గణేశాష్టకం పఠించండి.ధనుస్సుఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న వ్యవహారాలు పూర్తయ్యే వరకూ విశ్రమించరు. ఆలోచనలు అమలు చేసి అందర్నీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో మీ పాత్ర పెరుగుతుంది. ఇంతకాలం పడిన ఇబ్బందులు, సమస్యలు తీరే సమయం. పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నిరాశ తొలగి అడుగు ముందుకు పడుతుంది. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, తెలుపు రంగులు. రాఘవేంద్రస్వామిని స్మరించండి.మకరంఅనుకున్న వెంటనే పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఏదీ అసంపూర్తిగా విడిచిపెట్టరు. గతాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తారు. స్థిరాస్తులు కొనుగోలుకు ఉన్న అడ్డంకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని ఖర్చులు చేస్తారు. దూరపు బంధువుల ద్వారా శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. ఊహించని ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది. వ్యాపారాలు సమృద్ధిగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఊరట కలుగుతుంది. బాధ్యతల భారం తగ్గవచ్చు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. ప్రయాణాలలో ఆటంకాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.కుంభంసంఘంలో మీరు చెప్పిన విషయాలు అందర్నీ మెప్పిస్తాయి. కుటుంబంలోనూ కీలకంగా మారతారు. వివాహాది ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. రుణబాధల నుండి విముక్తి లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యక్తి ద్వారా అత్యంత కీలక విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు విస్తరణకు సమాయత్తమవుతారు. ఉద్యోగాలలో ఈతిబాధలు, సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహం పెరుగుతుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. చోరభయం. నిర్ణయాలలో మార్పులు. పసుపు, నీలం రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.మీనంఎటువంటి వ్యవహారమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి అధికంగా అందులో గడుపుతారు. విద్యార్థుల యత్నాలు కొలిక్కి వచ్చే వీలుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆర్థిక లావాదేవీలు చాకచక్యంగా నిర్వహించి అప్పులు చేయకుండా గడుపుతారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలుకు వస్తున్న ఆటంకాలు అధిగమిస్తారు. సోదరుల నుండి ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలను మరింత విస్తరిస్తారు. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో సమర్థతను చాటుకుంటారు. రాజకీయవర్గాలకు ఒక ఊహించని పదవి దక్కవచ్చు. గులాబీ, ఎరుపు రంగులు. వారం మ«ధ్యలో ఆరోగ్యభంగం. శ్రమా«ధిక్యం. శివాష్టకం పఠించండి.
![G7 Summit 2024: G7 blames China for enabling Ukraine war](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/1714220907-7478.jpg.webp?itok=pPvVIIiO)
G7 Summit 2024: చైనా అండతోనే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం
రోమ్: 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రెండేళ్లకుపైగా దాడులు కొనసాగించే శక్తి రష్యాకు ఎలా వచి్చంది? అమెరికాతోపాటు పశి్చమ దేశాలు డ్రాగన్ దేశం చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. చైనా అండదండలతోనే ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు చేస్తోందని, సాధారణ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందని జీ7 దేశాలు ఆరోపించాయి. ఇటలీలో సమావేశమైన జీ7 దేశాల అధినేతలు తాజాగా ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అండ చూసుకొని రష్యా రెచి్చపోతోందని ఆరోపించారు. రష్యా యుద్ధ యంత్రానికి చైనానే ఇంధనంగా మారిందని జీ7 దేశాలు మండిపడ్డారు. రష్యాకు మిస్సైళ్లు డ్రోన్లు చైనా నుంచే వస్తున్నాయని ఆక్షేపించారు. జీ7 దేశాలు సాధారణంగా రష్యాను తమ శత్రుదేశంగా పరిగణిస్తుంటాయి. ఈ జాబితాలో ఇప్పుడు చైనా కూడా చేరినట్లు కనిపిస్తోంది. మారణాయుధాలు తయారు చేసుకొనే పరిజ్ఞానాన్ని రష్యాకు డ్రాగన్ అందిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు చైనా నేరుగా ఆయుధాలు ఇవ్వకపోయినా ఆయుధాల తయారీకి అవసరమైన విడిభాగాలు, ముడి సరుకులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేస్తోందని ఆక్షేపించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన ఉక్రెయిన్‌లో మారణహోమం సృష్టించేలా రష్యాకు సహకరిస్తున్న దేశాలపై, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకతప్పదని జీ7 దేశాల అధినేతలు తేలి్చచెప్పారు. ఉక్రెయిన్‌పై చట్టవిరుద్ధమైన యుద్ధానికి మద్దతివ్వడం మానుకోవాలని హితవు పలికాయి. ఉక్రెయిన్‌పై దాడుల తర్వాత రష్యాపై పశి్చమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో తమకు అవసరమైన సరుకులను చైనా నుంచి రష్యా దిగుమతి చేసుకుంటోంది. అలాగే రష్యా నుంచి చైనా చౌకగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇరుదేశాలు పరస్పరం సహరించుకుంటున్నాయి. టిబెట్, షిన్‌జియాంగ్‌తోపాటు హాంకాంగ్‌లో చైనా దూకుడు చర్యలను జీ7 సభ్యదేశాలు తప్పుపట్టాయి. చైనా మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని ఆరోపించాయి. మరోవైపు డ్రాగన్ దేశం అనుసరిస్తున్న వ్యాపార విధానాలను అమెరికాతోపాటు యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు తప్పుపడుతున్నాయి. ఎలక్ట్రికల్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులు, సోలార్ ప్యానెళ్ల తయారీకి చైనా ప్రభుత్వం భారీగా రాయితీలిస్తోంది. దీంతో ఇవి చౌక ధరలకే అందుబాటులో ఉంటూ విదేశీ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా ఆయా దేశాల్లో వీటిని తయారు చేసే కంపెనీలు గిరాకీ లేక మూతపడుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాల్లో కోతపడుతోంది. చైనా దిగుమతులతో పశి్చమ దేశాలు పోటీపడలేకపోతున్నాయి. చైనా ఎత్తుగడలను తిప్పికొట్టడానికి చైనా ఉత్పత్తులపై అమెరికాతోపాటు ఈయూ దేశాలు భారీగా పన్నులు విధిస్తున్నాయి.
తప్పక చదవండి
- ‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి..
- ప్రళయమొచ్చినా..ఈ ఐదూ బతికేస్తాయట!
- ప్రియుడి మోజులో భర్తను చంపించింది
- లోకేశ్ కనకరాజ్‌పై రజనీ ఆగ్రహం?
- గాజాలో భారీ పేలుడు.. 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
- SKY IS THE LIMIT: నాన్న ఇచ్చిన రెక్కలు
- దరి చేర్చని దారి!.. గ్రేటర్లో 80లక్షలు దాటిపోయిన వాహనాల సంఖ్య
- Italian Premier Giorgia Meloni: రష్యా ప్రతిపాదన.. ఓ ఎత్తుగడ
- థాయిలాండ్‌లో అద్భుతం
- గరం గరం యముడయో...
సినిమా
![Father Day Special: father sentiment Upcoming movies in tollywood](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/NTR%20in%20Devara.jpg.webp?itok=7Nij3tE_)
నాన్న... ఓ సూపర్ హీరో
చిన్నప్పుడు చేయి పట్టుకుని నడిపించి, జీవితంలో మెట్టు మెట్టు పైకి ఎక్కించే నాన్నని చాలామంది తమ ‘సూపర్ హీరో’లా భావిస్తారు. అందుకే కొందరు నాన్న ప్రేమను, ఆస్తిని మాత్రమే కాదు పగను కూడా పంచుకుంటారు. నాన్నని కష్టాలపాలు చేసినవారిపై పగ తీర్చుకుంటారు. మొత్తానికి నాన్నతో ఓ ఎమోషనల్ బాండింగ్ పెంచుకుంటారు. రానున్న కొన్ని చిత్రాల్లో తండ్రీ కొడుకుల రివెంజ్, ఎమోషనల్ డ్రామా వంటివి ఉన్నాయి. నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ⇒ ‘సలార్’లో తండ్రీకొడుకుగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత డిసెంబరులో విడుదలైంది. ఈ చిత్రంలో కొడుకు దేవా పాత్రలో ప్రభాస్ కనిపించారు. మలి భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’లో దేవా తండ్రి ధారా పాత్రకు చెందిన విషయాలు ఉంటాయి. తండ్రికి దక్కాల్సిన ఖాన్సార్ సామ్రాజ్యాధికారం, గౌరవాన్ని తాను తిరిగి తెచ్చుకునేందుకు దేవా ఏం చేస్తాడనేది మలి భాగంలో ఉంటుందని భోగట్టా. ఫస్ట్ పార్ట్‌లో కొడుకు పాత్రలో కనిపించిన ప్రభాస్ మలి భాగంలో తండ్రీకొడుకుగా కనిపిస్తారట. ⇒ తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే కొడుకు పాత్రలో ఎన్టీఆర్‌ను ‘దేవర’ చిత్రంలో చూడబోతున్నామట. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న సినిమా ‘దేవర’. భారతదేశంలో విస్మరణకు గురైన తీర్రపాంతాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తండ్రీ కొడుకుగా ఎన్టీఆర్ నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి.. దేవర (తండ్రి పాత్ర)ను ఎవరు మోసం చేశారు? ఎందుకు చేశారు? అనేది థియేటర్స్‌లో చూడాలి. తొలి భాగం సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. తొలి భాగంలో కొడుకు పాత్ర ప్రస్తావన ఎక్కువగా, చివర్లో తండ్రి పాత్ర గురించిన పరిచయం ఉండి, రెండో భాగంలో తండ్రి పాత్ర చుట్టూ ఉన్న డ్రామాను రివీల్ చేయనున్నారట.⇒తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే కొడుకు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారని తెలిసింది. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ రామ్నందన్ పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారని భోగట్టా. రామ్నందన్ తండ్రి పేరు అప్పన్న (ప్రచారంలో ఉన్న పేరు). అప్పన్న రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటాడు. కానీ అతని స్నేహితులు కొందరు మోసం చేస్తారు. ఈ క్రమంలోనే అప్పన్న చనిపోతాడట. ఆ తర్వాత అతని కొడుకు ఐఏఎస్ ఆఫీసర్‌గా ఛార్జ్ తీసుకుని, తన తండ్రికి అన్యాయం చేసినవారికి ఎలా బుద్ధి చెప్పాడు? అన్నదే ‘గేమ్ చేంజర్’ కథ అని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో తండ్రీకొడుకుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.⇒ మా నాన్న సూపర్ హీరో అంటున్నారు సుధీర్‌బాబు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్‌రెడ్డి కంకర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తండ్రీతనయుల మధ్య సాగే అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని యూనిట్ పేర్కొంది.⇒ హాస్యనటుడు ధన్‌రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘రామం రాఘవం’. తండ్రీకొడుకు మధ్య నెలకొన్న బలమైన భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో ధన్‌రాజ్ నటిస్తున్నారు. తనయుడు బాధ్యతగా ఉండాలని తాపత్రయపడే తండ్రిగా సముద్ర ఖని, తనను తన తండ్రి అర్థం చేసుకోవడం లేదని బాధపడే కొడుకుగా ధన్‌రాజ్ కనిపిస్తారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.⇒కరోనా నేపథ్యంతో తండ్రీకొడుకుల ఎమోషన్ ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన సినిమా ‘డియర్ నాన్న’. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో సూర్యకుమార్ భగవాన్ దాస్, కొడుకు పాత్రలో చైతన్యా రావ్ నటించారు. యష్ణ చౌదరి, సంధ్య జనక్, శశాంక్, మధునందన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ‘డియర్ నాన్న’ శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా తండ్రి భావోద్వేగం ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి.
![Upasana Post On 12th Wedding Anniversary And Klin Kaara Latest Pic](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/15/upasana-ram-charan-.jpg.webp?itok=jUgAQ4oJ)
12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్
మెగా కోడలు ఉపాసన మరో క్యూట్ ఫొటోతో వచ్చేసింది. రామ్ చరణ్‌తో పెళ్లి జరిగి 12 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే మెగా జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో వాళ్లందరికీ ధన్యవాదాలు చెబుతూ సింపుల్ అండ్ క్యూట్ పోస్ట్ పెట్టింది. అయితే థ్యాంక్స్ చెప్పడంతో పాటు కూతురు క్లీంకాక లేటెస్ట్ ఫొటోని కూడా ఇందులో జోడించింది. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?)2012లో రామ్ చరణ్, ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. తొలుత ఈ జంట గురించి సోషల్ మీడియాలో రకరకాల మాటలు వినిపించాయి. కానీ రానురాను మెగా ఫ్యామిలీలోనే చరణ్-ఉపాసన.. వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్ అయిపోయారు. వీళ్లకు గతేడాది జూన్‌లో కూతురు పుట్టింది. ఈ బుజ్జాయికి క్లీంకార అని పేరు పెట్టుకున్నారు.పుట్టినప్పటి నుంచి కూతురు ముఖం మాత్రం ఉపాసన బయటపెట్టట్లేదు. ఇప్పుడు కూడా తను, చరణ్.. కూతురిని నడిపిస్తున్నట్లు వెనక నుంచి ఉన్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. అంటే మెగా మనవరాలు బుడిబుడి అడుగులు వేసేస్తుందని ఈ పోస్ట్‌తో ఉపాసన చెప్పకనే చెప్పేసింది.(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)
![Prabhas Kalki And Elysium Movie Comparisoin](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/15/kd.jpg.webp?itok=V6EqvrYQ)
ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?
డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి'. రీసెంట్గా ట్రైలర్ రిలీజైంది. విజువల్స్ చూస్తుంటే హాలీవుడ్ లెవల్లో ఉన్నాయి. హిట్ అయితే గనుక టాలీవుడ్లో వండర్స్ క్రియేట్ అవుతాయి. అలానే ట్రైలర్ బట్టి చూసినా సరే కథ చూచాయిగా అర్థమవుతోంది గానీ పూర్తిస్థాయిలో ఇది స్టోరీ అని చెప్పలేకపోతున్నాం. మరోవైపు 'కల్కి' ట్రైలర్ రిలీజైందో లేదో అప్పుడెప్పుడో వచ్చిన ఓ హాలీవుడ్ మూవీతో పోల్చి చూస్తున్నారు. కొన్ని సీన్లు ఒకేలా అనిపిస్తున్నాయని అంటున్నారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది?(ఇదీ చదవండి: చిక్కుల్లో చిత్ర పరిశ్రమ.. ఎలా ఉండేది ఎలా అయిపోయింది!)'కల్కి' ట్రైలర్ బట్టి చూస్తే.. కొన్నేళ్ల తర్వాత భూమిపై పరిస్థితులు మారిపోతాయి. మనిషి మనుగడే కష్టమైపోతుంది. భూమికి చాలా ఎత్తులో కాంప్లెక్స్ అనే నిర్మాణం ఉంటుంది. అందులో ఉండే సుప్రీం యాష్కిన్ అనే పెద్ద మనిషి ఉంటాడు. అతడు హీరోయిన్ని పట్టుకోమని హీరో అయిన భైరవకి పని అప్పజెబుతాడు. హీరోయిన్ని ఆశ్వథ్ధామ అనే మరో వ్యక్తి కాపాడుతాడు. మరి చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.ఇక 'కల్కి' ట్రైలర్లో ప్రభాస్.. కాంప్లెక్స్‌లోకి వెళ్లాలని అంటుంటాడు. మరోవైపు దీనికి పోలిక అని చెబుతున్న సినిమా పేరు 'ఎలీసియమ్'. ఇందులో హీరో భూమిపై ఉంటాడు. 2154 సంవత్సరం. పేదలందరూ బాగా నాశనమైన భూమిపై ఉంటారు. డబ్బునోళ్లు అందరూ భూమికి దూరంగా అంతరిక్షంలో ఎలీసియమ్ అనే ఒకదాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటారు. ఇలా 'కల్కి'లో కాంప్లెక్స్.. హాలీవుడ్ మూవీలో ఎలీసియమ్ అనేది ఒకేలా అనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)ఈ రెండు సినిమాల్లోనూ హీరోలు.. భూమిపై దారుణమైన పరిస్థితుల్లో బతకడానికి ఇష్టపడరు. అక్కడెక్కడో ఆకాశంలో ఉంటున్న చోటుకి వెళ్లిపోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే చివరకు ఏమైందనేదే రెండు మూవీల్లోని స్టోరీ. హాలీవుడ్ మూవీ అయితే పూర్తిగా సీరియస్ టోన్‌లో ఉంటుంది. 'కల్కి' మాత్రం ఎంటర్టైన్మెంట్, యాక్షన్, డ్రామా, పురాణాల రిఫరెన్సులు బాగానే ఉన్నాయి.ఓవరాల్‌గా చూసుకుంటే స్టోరీ ప్లాట్ పరంగా పైపైన ఒకేలా అనిపిస్తున్నాయేమో అనిపిస్తుంది. 'కల్కి' మూవీ రిలీజైతే ఇది అది ఒకటేనా కాదా అని తెలుస్తుంది. ఇంతకీ 'కల్కి'తో పోలిక అనిపిస్తున్న హాలీవుడ్ మూవీ ఏ ఓటీటీలో ఉందో చెప్పలేదు కదూ! ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఇంగ్లీష్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. పాత సినిమానే అయినప్పటికీ ఎందుకో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి.(ఇదీ చదవండి: 'కన్నప్ప'లో ప్రభాస్ సీన్స్ గురించి మంచు విష్ణు కామెంట్స్)
![Darshan And Pavitra Jayaram Issues In Tollywood Sandalwood](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/15/Movies.jpg.webp?itok=h7lnbDJS)
చిక్కుల్లో చిత్ర పరిశ్రమ.. ఎలా ఉండేది ఎలా అయిపోయింది!
సినిమాలో హీరోహీరోయిన్‌కి కష్టాలు ఉండటం కామన్. కానీ ఇప్పుడు వాళ్లకు రియల్ లైఫ్‌లోనూ ఇబ్బందులు తప్పట్లేదు. కొందరు వీటిని కోరి తెచ్చుకుంటే మరికొందరు మాత్రం ఊహించని విధంగా ప్రమాదాల్లో ఇరుక్కుంటున్నారు. దీంతో ఎన్నడూ లేనిది ఒక్కసారిగా ఇండస్ట్రీలో మూడ్ మారిపోయింది. ఎంతలా అంటే సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్లు కాస్త సెలబ్రిటీలని ఊహించని చోట చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?దర్శన్ కేసుకన్నడ హీరో దర్శన్ అరెస్ట్. ఈ మధ్య కాలంలో దీనంత షాకింగ్ సంఘటన మరొకటి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు గురించి సింపుల్‌గా చెప్పుకొంటే.. దర్శన్‌కి ఇదివరకే విజయ్ లక్ష్మితో పెళ్లయింది. కానీ పవిత్ర గౌడ అనే నటితో గత కొన్నేళ్లుగా రిలేషన్లో ఉన్నాడు. అయితే తన అభిమాన హీరో కుటుంబంలో కలతలకు ఈమెనే కారణమని భావించిన ఓ అభిమాని.. పవిత్రకు అసభ్యకర ఫొటోలు, వీడియోలని పంపించాడు. దీంతో పవిత్ర, ఈ విషయాన్ని దర్శన్‌కి చెప్పగా ఇతడు సదరు వ్యక్తిని దారుణంగా హత్య చేయించాడు. ఇప్పుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు.(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)పవిత్ర-చందు మరణాలుతెలుగు సీరియల్ 'త్రినయని'లో కీలక పాత్ర పోషిస్తున్న నటి పవిత్ర జయరాం.. కొన్నిరోజుల క్రితం సొంతూరి నుంచి హైదరాబాద్‌కి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించింది. అయితే ఈమెని ప్రేమిస్తున్న సహ నటుడు చందు.. ఈమె మరణాన్ని తట్టుకోలేక పవిత్ర చనిపోయిన రెండు మూడు రోజుల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మరణాలు అందరికీ షాకయ్యేలా చేశాయి.డ్రగ్స్ కేసులో హేమ టాలీవుడ్లో డ్రగ్స్, రేవ్ పార్టీ లాంటివి అప్పుడప్పుడు వినిపించే మాటలు. రీసెంట్గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ ఉండటం, ఈ కేసులో ఆమెని అరెస్ట్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆమెకు బెయిల్ కూడా వచ్చింది. అయితే ఎన్నడూ లేనిది ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నట్లు దక్షిణాదిలో పలు షాకింగ్ సంఘటనలు జరుగుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో కొన్ని స్వీయ తప్పిదాలు ఉండగా, మరికొన్ని అనుకోకుండా జరిగినవి. మరి వీటికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఏడేళ్లుగా కనిపించని దర్శన్ మేనేజర్.. కారణం ఏంటి..?)
ఫొటోలు
![Fathers Day 2024: Fatherson Duo Played Cricket World Cups Roger Binny](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/16/Fathers%20Day%202024%20Fatherson%20Duo%20Played%20Cricket%20World%20Cups%20Roger%20Binny%20%287%29.jpg.webp?itok=exwjqD9Y)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/16/Fathers%20Day%202024%20Fatherson%20Duo%20Played%20Cricket%20World%20Cups%20Roger%20Binny%20%287%29.jpg.webp?itok=exwjqD9Y)
Father's Day 2024: బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ- స్టువర్ట్ బిన్నీ అరుదైన రికార్డు (ఫొటోలు)
![Fathers Day Special Selfiee Photo Gallery](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/16/Fathers-Day-Selfiee-Special.jpg.webp?itok=OHF7z5zm)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/16/Fathers-Day-Selfiee-Special.jpg.webp?itok=OHF7z5zm)
నాన్నతో సెల్ఫీ: లవ్యూ డాడీ.. నువ్వే స్ఫూర్తి.. (ఫొటోలు)
![Fathers Day Actress With Their Fathers Beautiful Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/16/111_0.jpg.webp?itok=s4-YXd0d)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/16/111_0.jpg.webp?itok=s4-YXd0d)
నాన్న ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్లు.. క్యూట్ ఉన్నారు కదా! (ఫొటోలు)
![Fathers Day Tollywood Telugu Actors With Their Fathers Beautiful Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/16/Fathers%20Day%20Tollywood%20Telugu%20Actors%20With%20Their%20Fathers%20Beautiful%20Photos%20%2821%29.jpg.webp?itok=2TU-Chxq)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/16/Fathers%20Day%20Tollywood%20Telugu%20Actors%20With%20Their%20Fathers%20Beautiful%20Photos%20%2821%29.jpg.webp?itok=2TU-Chxq)
ఫాదర్స్ డే : నాన్నను మురిపించిన స్టార్స్ (ఫోటోలు)
![Fathers Day 2024 father son daughter leading multi crore business empire](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/15/father.jpg.webp?itok=WbUZhe3V)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/15/father.jpg.webp?itok=WbUZhe3V)
Father’s Day 2024: వ్యాపార సామ్రాజ్యంలో నాన్న తోడుగా.. (ఫొటోలు)
క్రీడలు
![Amit Panghal Life And Success Story In Boxing](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/panghal.jpg.webp?itok=jXESFCME)
పంఘాల్ పంచ్..
అమిత్ పంఘాల్ ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు మాత్రమే. బాక్సింగ్ ఆటపరంగా చూస్తే ఇది ఒక రకంగా ‘పొట్టి’ కిందనే లెక్క. అతని కెరీర్లో పెద్ద సంఖ్యలో తనకంటే ఎంతో ఎత్తయిన బాక్సర్లనే ఎదుర్కోవాల్సి వచ్చింది. సాధారణంగా రింగ్‌లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యంతో పంచ్‌లు విసిరేందుకు ఎత్తు కూడా కీలకంగా పని చేస్తుంది. ఇక్కడే అమిత్‌లో లోపం కనిపించింది. ‘చిన్నప్పటి నుంచి నాకు ఇదే సమస్య. కొన్నిసార్లు నేను పూర్తిగా ఆకాశంలోకి చూస్తూ ప్రత్యర్థితో తలపడుతున్నానేమో అనిపించేది’ అని అమిత్ చెప్పుకున్నాడు కానీ తన పట్టుదలతో అతను దానిని అధిగమించాడు.అసాధారణంగా, మెరుపు వేగంతో పంచ్‌లు విసరడాన్ని సాధన చేసిన అతను అందులో ఆరితేరాడు. ప్రాక్టీస్‌లో కూడా కావాలనే తనకంటే ఎత్తు ఎక్కువ ఉన్న బాక్సర్లతోనే అతను పోటీ పడేవాడు. కెరీర్ ఎదుగుతున్న దశలో అదే అతడి బలంగా మారి అమిత్‌ను పెద్ద బాక్సర్‌ను చేసింది.అన్న అండగా నిలవడంతో...హరియాణాలోని రోహ్టక్ పట్టణానికి సమీపంలో ఉన్న ఊరు ‘మేనా’ అమిత్ స్వస్థలం. రైతు కుటుంబం నుంచి వచ్చాడు. అతని పెద్దన్న అజయ్ పంఘాల్ ముందుగా బాక్సింగ్‌లోకి వచ్చాడు. అతని ద్వారానే అమిత్కూ ఆటపై ఆసక్తి పెరిగింది. ముందుగా ఫిట్నెస్ మెరుగుపరచుకోవడం కోసమనే బాక్సింగ్‌లో చేరినా, ఆ తర్వాత పూర్తి స్థాయిలో బాక్సింగ్‌పై దృష్టి పెట్టాడు. అనిల్ ధన్కర్ అనే రాష్ట్ర స్థాయి కోచ్ రోహ్టక్లో శిక్షణ ఇచ్చేవాడు. ఇద్దరూ అక్కడే కోచింగ్ తీసుకున్నారు.అయితే అజయ్ ఆశించిన రీతిలో పెద్ద స్థాయికి చేరలేకపోయాడు. కానీ జాతీయ స్థాయిలో కొన్ని చక్కటి ప్రదర్శనలతో ఆర్మీలో హవల్దార్‌గా ఉద్యోగం మాత్రం పొందగలిగాడు. మరో వైపు అమిత్ పంచ్‌లు, అతని శైలి మాత్రం కోచ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టేలా చేశాయి. దాంతో అజయ్‌కు మున్ముందు తాను ఏం చేయాలో అర్థమైంది. తను పూర్తిగా ఆట నుంచి తప్పుకొని తమ్ముడిని తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాడు.2018 ఆసియన్ గేమ్స్ స్వర్ణ పతకంతో, తల్లిదండ్రులతో..తన ఉద్యోగం కారణంగా ఆర్థికపరంగా కూడా చేయూత ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ తప్ప మరో ప్రపంచం లేకుండా కష్టపడాలని హితబోధ చేశాడు. దీనిని చిన్న వయసులోనే అర్థం చేసుకున్న అమిత్ 24 గంటలూ బాక్సింగ్‌నే తన భాగస్వామిగా మార్చుకున్నాడు. ఇప్పటికీ, ఏ స్థాయికి చేరినా తన సోదరుడు తన కోసం చేసిన త్యాగాలను అతను గుర్తు చేసుకుంటాడు. ప్రతి మ్యాచ్‌కు ముందు అన్న సూచనలను తీసుకునే అమిత్.. అతడిని బెస్ట్ కోచ్ అంటూ పిలుస్తాడు.జాతీయ స్థాయిలో మెరిసి...అమిత్‌కు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని బరువు 24 కిలోలే! బక్కగా, బలహీనంగా కనిపించేవాడు. కానీ పట్టుదల, పోరాటానికి ఏమాత్రం లోటు లేదు. అందుకే నన్ను చూసి కాదు నా ఆటను చూసి తలపడండి అంటూ బరిలోకి దిగేవాడు. చాలా సందర్భాల్లో తనకంటే ఎక్కువ వయసు ఉన్న ఎంతో బలమైన ఆటగాళ్లను అతను పడగొట్టాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల వయసులోనే జాతీయ సబ్ జూనియర్ చాంపియన్‌గా అమిత్ నిలిచాడు. అన్న అండ, ప్రోత్సాహంతో మరింత దూసుకుపోయిన అమిత్ గుర్గావ్లోని కాంబాట్ బాక్సింగ్ క్లబ్లో చేరాడు. అక్కడి అతని బాక్సింగ్ మరింత పదునెక్కింది.కాంబాట్ క్లబ్లో శిక్షణ తర్వాత జూనియర్ స్థాయిలో వరుసగా విజయాలు వచ్చాయి. ఈ క్రమంలో 2017లో అతడిని కోచ్‌లు సీనియర్ స్థాయికి ప్రమోట్ చేశారు. అతను ఆ స్థాయికి తగినవాడా అనే సందేహాలు వచ్చిన నేపథ్యంలో అమిత్ పట్టుదలగా ఆడి తానేంటో నిరూపించుకున్నాడు. వారు తీసుకున్న నిర్ణయానికి న్యాయం చేస్తూ సీనియర్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.2019 ఆసియన్ చాంపియన్ షిప్ స్వర్ణ పతకంతో, 2024 పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికైన అమిత్..ప్రపంచ వేదికలపై...జాతీయ విజేతగా మారిన తర్వాత అవకాశాలు వరుసగా రావడంతో పాటు మరింత స్థాయికి ఎదిగేందుకు దోహదం చేశాయి. 2017లో ఆసియా చాంపియన్‌షిప్ కాంస్యం గెలుచుకోవడంతో అతని సత్తా ఏమిటో అందరికీ తెలిసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే 22 ఏళ్ల వయసులో అమిత్ తొలిసారి వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొన్నాడు. అక్కడ పతకం గెలవకపోయినా ఆ అనుభవం పెద్ద స్థాయిలో రాటుదేలేందుకు ఎంతో పనికొచ్చింది.క్వార్టర్ ఫైనల్లో తలవంచినా, ఆ మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన హసన్బయ్ దుస్మతోవ్‌ను అతను నిలువరించిన తీరు అందరీ ఆకట్టుకుంది. ఇదే జోరులో 2018 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగే అవకాశం లభించింది. లైట్ ఫ్లయ్‌వెయిట్ కేటగిరీలో వరుస విజయాలతో సత్తా చాటిన అతను ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అయితే బ్రిటిష్ బాక్సర్ గలాల్ యాఫైతో జరిగిన ఫైనల్లో హోరాహోరీగా పోరాడి చివరకు తలవంచాడు. దాంతో ఈ క్రీడల్లో రజతపతకం దక్కింది.అయితే సరిగ్గా నాలుగేళ్ల తర్వాత జరిగిన 2022 కామన్వెల్త్ క్రీడల్లో తన స్థాయిని అమిత్ పెంచుకున్నాడు. ఆ పోటీల్లో అదే విభాగంలో అతను స్వర్ణం సాధించడం విశేషం. అంతకు ముందు 2018లోనే జరిగిన ఆసియా క్రీడల్లో కూడా అమిత్ స్వర్ణపతకంతో మెరిశాడు. దీంతో పాటు ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడుసార్లు అతను పతకంతో తిరిగి రావడం పంఘాల్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 2017లో కాంస్యం, 2019లో స్వర్ణం గెలిచిన అతను.. 2021లో రజత పతకాన్ని అందుకున్నాడు.వరల్డ్ నంబర్‌వన్‌గా...2019లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ అమిత్‌ను అగ్రశ్రేణి బాక్సర్ల జాబితాలో చేర్చింది. ఈ టోర్నీకి కొద్ది రోజుల ముందే ఆసియా చాంపియన్‌షిప్‌లో పసిడి గెలిచిన ఊపులో అమిత్ ఉన్నాడు. అప్పటి వరకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి ఐదుగురు పతకాలు సాధించగా, వీరంతా కాంస్యానికే పరిమితమయ్యారు. కానీ వీరందరినీ అధిగమించి అమిత్ రజతపతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. ఆ సమయంలో అద్భుత ఫామ్‌లో ఉన్న అమిత్ ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ప్రకటించిన వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 52 కేజీల విభాగంలో నంబర్‌వన్‌గా నిలవడంతో అతని కెరీర్ శిఖరానికి చేరింది. ప్రస్తుతం భారత ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా అతను పని చేస్తున్నాడు.2019 ప్రపంచ చాంపియన్ షిప్ రజత పతకంతో.., కామన్ వెల్త్ స్వర్ణ పతకంతో అమిత్ (2022)ప్రతికూల పరిస్థితి దాటి...అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాల తర్వాత బాక్సింగ్ సమాఖ్య అమిత్ పంఘాల్ పేరును ప్రతిష్ఠాత్మక ఖేల్‌రత్న పురస్కారం కోసం సిఫారసు చేసింది. అంతకు ముందు వరుసగా మూడేళ్లు అర్జున అవార్డు కోసం సిఫారసు చేసినా, అతడి పేరును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఒకప్పుడు డోపింగ్‌లో పట్టుబడ్డాడనేది దానికి కారణంగా చెప్పింది. అయితే నిజానికి అమిత్ 2012లో 17 ఏళ్ల వయసులో యూత్ స్థాయిలో ఆడుతున్నప్పుడు ఇది జరిగింది.తాను ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ తీసుకోలేదని, చికెన్ పాక్స్ కోసం చికిత్స చేయిస్తుండగా వాడిన మందుల్లో నిషేధక ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలింది. దీనిపై అతను చాలా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. యూత్ స్థాయిలో చేసిన తప్పులను ఎవరైనా మన్నిస్తారని, అయినా కూడా దానికి తాను తగిన శిక్ష కూడా అనుభవించానని అతను చెప్పాడు. భారత్ తరఫున తన ఘనతలను పరిగణించాలని పంఘాల్ కోరాడు. చివరకు 2022లో కేంద్రం అమిత్‌ను ‘అర్జున’ అవార్డుతో గౌరవించింది.‘ఒలింపిక్ పతకం సాధించిన రోజే బాక్సింగ్‌లో నా ప్రయాణం మొదలైనట్లుగా భావిస్తాను’... అమిత్ చేసిన ఈ వ్యాఖ్య ఒలింపిక్ మెడల్ విలువేంటో చెబుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నా, అనూహ్య రీతిలో అతను విఫలమైన నిష్క్రమించాడు. కానీ ఇప్పుడు మరో ఒలింపిక్స్‌కు అమిత్ సిద్ధమయ్యాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే పట్టుదలతో శ్రమిస్తున్న ఈ బాక్సర్ కల నెరవేరాలని ఆశిద్దాం. – మొహమ్మద్ అబ్దుల్ హాది
![T20 World Cup 2024: England Beat Namibia By 41 Runs Through DLS Method, Stay ALive In Super 8 Race](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/Untitled-1_13.jpg.webp?itok=Xdn7glvy)
T20 World Cup 2024: చెలరేగిన బ్రూక్.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపు
టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8 అవకాశాలను ఇంగ్లండ్ సజీవంగా ఉంచుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్.. నమీబియాను ఓడించింది. వరుణుడు ఆటంకం కలిగించడంతో 10 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్‌ను హ్యారీ బ్రూక్ (20 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (18 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (8 బంతుల్లో 11; 2 ఫోర్లు), మొయిన్ అలీ (6 బంతుల్లో 16; 2 సిక్సర్లు), లివింగ్‌స్టోన్ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. జోస్ బట్లర్ డకౌటయ్యాడు. నమీబియా బౌలర్లలో ట్రంపెల్మన్ 2, డేవిడ్ వీస్, బెర్నాల్డ్ స్కోల్జ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 123 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. ఇంగ్లండ్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.నమీబియా ఇన్నింగ్స్‌లో వాన్ లింగెన్ 33, నికోలాస్ 18 (రిటైర్డ్ హర్ట్), డేవిడ్ వీస్ 27 (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సూపర్-8 అవకాశాలను సజీవంగా ఉంచుకోగా.. నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ సూపర్-8కు చేరాలంటే ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో స్కాట్లాండ్ భారీ తేడాతో ఓడాల్సి ఉంది.
![Indian mens archery team lost in the quarter finals](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/archary_1.jpg.webp?itok=WudUDiOF)
పురుషుల జట్టుకూ నిరాశ
అంటల్యా (టర్కీ): పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ ఆఖరి క్వాలిఫయర్ ఈవెంట్లో భారత పురుషుల జట్టు కూడా మహిళల టీమ్ బాటలోనే పయనించింది. భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. దాంతో పారిస్ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాలంటే జట్టు ర్యాంకింగ్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఈ టోర్నీలో టాప్–3లో నిలిచే జట్లకు నేరుగా ఒలింపిక్స్ అవకాశం దక్కేది. క్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ 2 భారత పురుషుల జట్టు 4–5 (57–56, 57–53, 55–56, 55–58), (26–26) స్కోరుతో మెక్సికో చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. తొలి రెండు సెట్లను గెలిచి ఆధిక్యంలో నిలిచిన భారత్ మూడో సెట్లో సమంగా నిలిచినా సెమీస్ చేరేది. కానీ ఒక పాయింట్ తేడాతో సెట్‌ను కోల్పోయిన జట్టు తర్వాతి సెట్‌ను కూడా మెక్సికోకు అప్పగించింది. అయితే షూటౌట్లో భారత్ మ్యాచ్ కోల్పోయింది. మెక్సికో ఆర్చర్లు ల„ ్యానికి అతి సమీపంగా బాణాలను సంధించి పైచేయి సాధించారు.
![India Final match against Canada cancelled](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/rain.jpg.webp?itok=GYVeGxoc)
భారత్ పోరు వర్షార్పణం
లాడర్‌హిల్: టి20 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్రను వరుణుడు అడ్డుకున్నాడు. గ్రూప్ ‘ఎ’లో భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం కెనడాతో జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. భారత కాలమానం ప్రకారం ముందుగా రాత్రి 7.30 గంటలకు తొలిసారి మైదానాన్ని పరిశీలించారు. మైదానం సిద్ధం కాకపోవడంతో టాస్ ఆలస్యమైంది. అయితే ఆ తర్వాతా పరిస్థితి మెరుగుపడలేదు. చివరి సారిగా రాత్రి 9 గంటలకు పిచ్, అవుట్ ఫీల్డ్‌ను పూర్తి స్థాయిలో సమీక్షించిన ఫీల్డు అంపైర్లు ఇక ఆట జరిగే పరిస్థితి లేదని తేల్చేశారు. మరో సమీక్షకు తావు లేకుండా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లు గెలిచి సంపూర్ణ విజయం సాధించే అవకాశం రాకపోయినా... ఇదివరకే సూపర్–8కు చేరిన భారత్ 7 పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచింది. కెనడా లీగ్ దశలో ఐర్లాండ్‌పై ఏకైక విజయాన్ని అందుకుంది. ఇక ఈ మెగా ఈవెంట్లో భారత ఆటగాళ్ల ప్రదర్శన సంతృప్తికరమనే చెప్పొచ్చు. కోహ్లి (1, 4, 0) మూడు మ్యాచ్‌ల్లోనూ నిరాశపరిచినా... దీన్ని భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. సూపర్–8లో అతను కీలక ఇన్నింగ్స్‌లు ఆడతాడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. కెపె్టన్ రోహిత్ ఒక అర్ధ సెంచరీ బాదగా, రిషభ్ పంత్ వన్‌డౌన్‌లో మెరుగ్గా ఆడాడు. ఐర్లాండ్, పాక్‌లతో విఫలమైన హిట్టర్లు సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేలిద్దరు అమెరికాతో జరిగిన పోరులో టచ్‌లోకి వచ్చారు. ఇక బౌలింగ్‌లో అనుభవజు్ఞడైన బుమ్రా, హార్దిక్, సిరాజ్‌లతో పాటు అర్‡్షదీప్ రాణించాడు. స్పిన్నర్లు ఫర్వాలేదనిపించారు. దీంతో విజయాల జట్టును మార్చకుండానే బరిలోకి దిగింది. సూపర్–8లోనూ ఇదే పంథా కొనసాగించే అవకాశాలే ఉన్నాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి భారత్‌తో పాటు అమెరికా ముందంజ వేయగా, గత రన్నరప్ పాక్ లీగ్ దశతోనే సరిపెట్టుకుంది. టి20 ప్రపంచకప్‌లో నేడుఆ్రస్టేలియా X స్కాట్లాండ్ వేదిక: గ్రాస్ ఐలెట్; ఉ.గం.6.00 నుంచి పాకిస్తాన్ X ఐర్లాండ్ వేదిక: లాడర్‌హిల్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంసూపర్–8లో భారత్ మ్యాచ్లుజూన్ 20 – అఫ్గానిస్తాన్‌తో (బ్రిడ్జ్‌టౌన్) జూన్ 22 – బంగ్లాదేశ్ (లేదా) నెదర్లాండ్స్‌తో (నార్త్‌సౌండ్) జూన్ 24 – ఆ్రస్టేలియాతో (గ్రాస్ ఐలెట్)
బిజినెస్
![TCS has 80000 job vacancies due to skill gap](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/15/tcs.jpg.webp?itok=5Xz2jLTn)
టీసీఎస్‌లో విచిత్ర పరిస్థితి! 80,000 జాబ్స్ ఉన్నాయి.. కానీ..
ఐటీ కంపెనీల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ఓ వైపు లేఆఫ్‌ల పేరుతో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తుండగా మరో వైపు నియామకాలు మందగించాయి. వేలాది మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే భారత్‌కు చెందిన ఐటీ దిగ్గజం టీసీఎస్‌లో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కంపెనీలో 80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరకడం లేదు.స్కిల్స్ గ్యాప్ కారణంగా టీసీఎస్ 80,000 ఖాళీలను భర్తీ చేయడానికి కష్టపడుతోందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఇది ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలు, కొత్త ఉద్యోగాల అవసరాల మధ్య అసమతుల్యతను తెలియజేస్తోంది. ఈ అంతరాలను భర్తీ చేయడానికి కాంట్రాక్టర్లపై ఆధారపడవలసి వస్తోందని టీసీఎస్ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ (ఆర్ఎంజీ) గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ అమర్ షెట్యే టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు.ఓ వైపు ఎంపిక చేసుకున్న ఫ్రెషర్లను ఉద్యోగాలలోకి చేర్చుకోకుండా ఇలా స్కిల్ గ్యాప్ పేరుతో వేలాది ఉద్యోగాలను ఖాళీగా ఉంచడంపై ఉద్యోగార్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. టీసీఎస్ సహా భారత ఐటీ దిగ్గజాలు ఫ్రెషర్స్ ఆన్‌బోర్డింగ్‌లో జాప్యం చేస్తుండటంతో చాలామంది జాయిన్ డేట్లను కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నారు. గత రెండేళ్లలో 10,000 మందికి పైగా ఫ్రెషర్లు ఈ జాప్యం వల్ల ప్రభావితమయ్యారని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) తెలిపింది.
![Tesla Shareholders Vote In Favour Pay For Compensation Package For CEO Elon Musk](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/15/musk_0.jpg.webp?itok=tSDlHg5U)
మస్క్‌కు జాక్‌పాట్ తగలింది.. రూ.4.5 లక్షల కోట్ల వేతనం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్!
న్యూయార్క్: టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ జాక్ పాట్ కొట్టేశారు. రూ.4.5లక్షల కోట్లు (56 బిలియన్ డాలర్లు) పారితోషికం ఇచ్చేందుకు ఆ సంస్థ వాటా దారులు మస్క్‌కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఆనందానికి అవదుల్లేని మస్క్ తన డ్యాన్స్‌తో సందడి చేశారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన టెస్లా వార్షిక సమావేశంలో వాటా దారులు మస్క్‌కు 56 బిలియన్ డాలర్ల భారీ వేతనం ఇవ్వాలా? వద్ద అన్న అంశంపై ఓటింగ్ జరిగింది. ప్రాథమిక ఓట్ల ఫలితాల ఆధారంగా మస్క్‌కు 56 బిలియన్ డాలర్ల పారితోషికం ఇచ్చేలా పెట్టుబడి దారులు మద్దతు ఇచ్చారని కార్పొరేట్ సెక్రటరీ బ్రాండన్ ఎర్హార్ట్ తెలిపారు.ఎలోన్ మస్క్ 2018లో అన్ని రకాల ప్రయోజనాలు కలిపి 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) వార్షిక వేతనం అందుకున్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అత్యధిక పారితోషికం. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. అయితే, మస్క్‌కు అధికంగా చెల్లించారంటూ వాటాదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన డెలావర్ కోర్టు ఈ ఏడాది ప్రారంభంలో టెస్లా సీఈవోకి భారీ వేతనాన్ని రద్దు చేస్తూ తీర్పిచ్చారు. తాజాగా, టెస్లా వాటాదారులు మస్క్‌కు అనుకూలంగా ఓటు వేయడంతో ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈవోల్లో నెంబర్ వన్‌గా కొనసాగుతున్నారు. Elon Musk dance is 🔥. Tesla shareholders have spoken. pic.twitter.com/GiLWOtt8ZI— Tesla Owners Silicon Valley (@teslaownersSV) June 13, 2024
![Joseph Radhik man behind Anant Radhika pre wedding photos](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/15/Joseph-Radhik.jpg.webp?itok=mHr_3-gJ)
ఆ బ్యూటిఫుల్ ఫొటోలు తీసింది ఈయనే.. చార్జ్ ఎంతో తెలుసా?
Anant-Radhika pre wedding: ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ ఇటీవల యూరప్‌లోని విలాసవంతమైన క్రూయిజ్ షిప్లో రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుపుకొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.ఈ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన అప్డేట్లను అంబానీ కుటుంబం నేరుగా తెలియజేయకపోయినప్పటికీ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ తీసిన అద్బుతమైన ఫొటోలు ఆ ఈవెంట్ ఎంత గ్రాండ్‌గా జరిగిందో తెలియజేస్తున్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పంచుకున్న మధుర క్షణాలను ఈ ఫొటోలు మరింత అద్భుతంగా చూపిస్తున్నాయి.జోసెఫ్ రాధిక్ సెలబ్రిటీ వెడ్డింగ్స్ కవరేజ్ చేయడంలో దిట్ట. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల రెండో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు అంబానీ కుటుంబం ఏర్పాటు చేసుకున్న ఫొటో గ్రాఫర్ ఈయనే. ఇంత ఫేమస్ అయిన జోసెఫ్ రాధిక్ ఎప్పుడూ ఫోటోగ్రాఫర్ కావాలనుకోలేదు. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ చదివి మూడేళ్లు కార్పొరేట్ ప్రపంచంలో పనిచేసిన జోసెఫ్ రాధిక్ తనకు ఆనందాన్నిచ్చే ఏకైక విషయం అద్భుతమైన ఫొటోలు తీయడమేనని త్వరలోనే గ్రహించాడు. అందుకే 2010లో అధిక వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి స్థాయి వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో కెరీర్‌ను ఎంచుకున్నాడు.సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పలు సెలబ్రిటీల వెడ్డింగ్ ఫోటోల వెనుక జోసెఫ్ రాధిక్ ఉన్నాడు. కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, కేఎల్ రాహుల్-అతియా శెట్టి జంటలకు ఆయన వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్. ఇంతకీ జోసెఫ్ రాధిక్ ఎంత చార్జ్ చేస్తాడో చెప్పలేదు కదా.. ఆయన ఒక రోజుకు రూ .1,25,000 - రూ .1,50,000 తీసుకుంటాడు. దీనికి పన్నులు, ట్రావెల్, బస ఖర్చులు అధికం.
![SBI hikes Lending Rates By 10 Basis Points Higher EMIs Expected](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/15/sbi_0.jpg.webp?itok=NXwADR1_)
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్: పెరగనున్న ఈఎంఐలు
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఈఎంఐల భారం పెరగనుంది. ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను పెంచింది. దీంతో ఎంసీఎల్ఆర్ ఫ్రేమ్‌వర్క్‌తో ముడిపడి ఉన్న రుణాలకు సంబంధించిన ఈఎంఐలు పెరగనున్నాయి.ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం.. జూన్ 15 నుంచి అన్ని కాలపరిమితులలో ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు (0.1%) పెరిగింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.75 శాతానికి, ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.00 శాతం నుంచి 8.10 శాతానికి, నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.20 శాతం నుంచి 8.30 శాతానికి పెరుగుతాయి. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.55 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.75 శాతం నుంచి 8.85 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.85 శాతం నుంచి 8.95 శాతానికి పెరిగింది.గృహ, వాహన రుణాలతో సహా చాలా రిటైల్ రుణాలు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటుతో ముడిపడి ఉంటాయి. ఆర్బీఐ రెపో రేటు లేదా ట్రెజరీ బిల్ ఈల్డ్ వంటి ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌లతో ముడిపడి ఉన్న రుణాలపై ఎంసీఎల్ఆర్ పెంపు ఎలాంటి ప్రభావం చూపదు.
వీడియోలు
![TDP Leaders Target YSRCP Activists And Followers](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/8.png.webp?itok=9ANB2vk9)
![TDP Leaders Target YSRCP Activists And Followers](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/8.png.webp?itok=9ANB2vk9)
విధ్వంసమే విధానమా..?
![Perfect Analysis On AP TG And Central BJP And Congress Vote Share](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/7.png.webp?itok=yFngvuV7)
![Perfect Analysis On AP TG And Central BJP And Congress Vote Share](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/7.png.webp?itok=yFngvuV7)
Gunshot: ఇదికదా YS జగన్ స్టామినా.. పర్ఫెక్ట్ విశ్లేషణ
![Operation Leopard Success In Tamil Nadu](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/5.png.webp?itok=ecKw1eRH)
![Operation Leopard Success In Tamil Nadu](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/5.png.webp?itok=ecKw1eRH)
ఆపరేషన్ చిరుత సక్సెస్
![Police Have Caught A Thief Who Steals From Airplanes](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/4.png.webp?itok=Y2lJVpI0)
![Police Have Caught A Thief Who Steals From Airplanes](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/4.png.webp?itok=Y2lJVpI0)
హై క్లాస్ దొంగ
![KCR Writes 12 Pages To Justice Narasimha Reddy Commission](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/3.png.webp?itok=sMkNKpy3)
![KCR Writes 12 Pages To Justice Narasimha Reddy Commission](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/3.png.webp?itok=sMkNKpy3)
పవర్ కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై చర్చ
![IPS Officer Salutes His Trainee IAS Daughter Uma Harathi](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/2.png.webp?itok=CHFrt6Wo)
![IPS Officer Salutes His Trainee IAS Daughter Uma Harathi](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/2.png.webp?itok=CHFrt6Wo)
IAS కూతురికి IPS తండ్రి సెల్యూట్
![TDP Goons Attacks On YSRCP Leaders ](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/1.png.webp?itok=gQuxz-Hg)
![TDP Goons Attacks On YSRCP Leaders ](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/1.png.webp?itok=gQuxz-Hg)
రెచ్చిపోతున్న పచ్చ మూకలు
![Top 50 Headlines 6PM 15 June 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/15/top_news_6pm.jpg.webp?itok=VgWG2Sab)
![Top 50 Headlines 6PM 15 June 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/15/top_news_6pm.jpg.webp?itok=VgWG2Sab)
టాప్ 50 హెడ్ లైన్స్@6PM 15 June 2024
![Telangana Asha Workers Demand To Hike Salary](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/15/AshaWorkers.jpg.webp?itok=1_brPxUY)
![Telangana Asha Workers Demand To Hike Salary](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/15/AshaWorkers.jpg.webp?itok=1_brPxUY)
కోఠిలోని డీఎంఈ కార్యలయాన్ని ముట్టడించిన ఆశా వర్కర్లు
![Heavy Traffic Jam Due To Rains In Hyderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/15/Traffic_HYD.jpg.webp?itok=QLUCgsVe)
![Heavy Traffic Jam Due To Rains In Hyderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/15/Traffic_HYD.jpg.webp?itok=QLUCgsVe)
గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షాలకాలంలో ట్రాఫిక్ కష్టాలు
ఫ్యామిలీ
![Mohit Rai Success Story In MR Creation](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/mohit.jpg.webp?itok=N54Aky19)
Mohit Rai: స్టార్స్‌ని వాళ్లు పోషించే పాత్రలకు తగ్గట్టుగా..
స్టార్స్‌ని వాళ్లు పోషించే పాత్రలకు తగ్గట్టుగా.. వాళ్లు అటెండ్ అయ్యే ఈవెంట్లకు అనుగుణంగా తీర్చిదిద్దడమంటే అంత ఆషామాషీ వ్యవహారమేం కాదు! కానీ దాన్ని అవలీలగా చేసేసే స్కిల్ పేరే మోహిత్ రాయ్!‘స్టయిలిస్ట్ బై డే, బ్యాట్మన్ బై నైట్’ అని తనను తాను వర్ణించుకునే మోహిత్ రాయ్ స్వస్థలం ఢిల్లీ. అక్కడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేశాడు. వెంటనే హార్పర్స్ బజార్ ఇండియా మ్యాగజైన్లో ఫ్యాషన్ స్టయిలిస్ట్‌గా ఉద్యోగం దొరికింది. అక్కడ మూడేళ్లు పనిచేశాక ముంబైకి మకాం మార్చాడు. అక్కడైతే అవకాశాలు ఎక్కువుంటాయని. అక్కడ ‘ద వార్డ్‌రోబిస్ట్’లో క్రియేటివ్ డైరెక్టర్‌గా చేరాడు.రెండేళ్లకు ‘హార్పర్స్ బజార్ బ్రైడ్ ఇండియా’లో ఫ్యాషన్ డైరెక్టర్‌గా కొలువు దొరికింది. అప్పుడే.. ‘ఫాలో మీ టు’ ఫొటో సిరీస్‌తో ఫేమస్ అయిన రష్యన్ ఫొటోగ్రాఫర్ మురాద్ ఉస్మాన్ తన భార్య నటాలియాతో ఇండియా వచ్చాడు. ఆ ఇద్దరితో అద్బుతమైన కవర్ షూట్ చేయించాడు హార్పర్స్ బజార్ కోసం. అది వైరల్ అయి మోహిత్‌ని పాపులర్ చేసింది. ఆ ఖ్యాతిని తన అంట్రప్రెన్యూర్షిప్కి పిల్లర్‌గా వేసుకున్నాడు. ‘ఎమ్ఆర్ (మోహిత్ రాయ్) స్టయిల్స్’ను స్థాపించాడు.ఈ సంస్థ స్టార్ స్టయిలింగ్, సెలబ్రిటీ వెడ్డింగ్స్ మీద ఫోకస్ చేస్తుంది. దీని ద్వారానే మోహిత్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అతను మొదట స్టయిలింగ్ చేసింది.. హీరోయిన్ సోనాక్షీ సిన్హాకు. తర్వాత చిత్రాంగదా సింగ్, కరీనా కపూర్, కంగనా రనౌత్, శిల్పా శెట్టిలాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎందరికో స్టయిలిస్ట్‌గా చేశాడు.ఎమ్ఆర్ స్టయిల్స్ బాధ్యతలు చూసుకుంటూనే తన స్నేహితుడు షోహ్న దాస్‌తో కలసి ‘గ్రెయిన్ ఫ్యాషన్ కన్సల్టెన్సీ’నీ ప్రారంభించాడు. పలు ఫ్యాషన్ లేబుల్స్‌కి డిజైన్, స్టయిలింగ్‌లో గైడెన్స్ ఇస్తుందీ సంస్థ.‘స్టార్‌కున్న ఇండివిడ్యువల్ స్టయిల్ అండ్ పర్సనాలిటీని ఎలివేట్ చేయటమే స్టయిలిస్ట్ జాబ్’అని నమ్మే మోహిత్ రాయ్‌ని ‘మీకిష్టమైన సెలబ్రిటీ ఎవరు’ అని అడిగితే ‘సోనాక్షి సిన్హా’ అని చెబుతాడు. ‘ఫ్యాషన్ విషయంలో సోనాక్షీ ఎక్స్పరిమెంటల్ అండ్ ఓపెన్. రెండేళ్లు ఆమెతో కలసి పనిచేశాను. స్టయిలిస్ట్‌ని నమ్ముతుంది. చెప్పేది వింటుంది. డిఫర్ అయితే డిస్కస్ చేస్తుంది. ఆ చర్చలు నాకెంతో ఉపయోగపడ్డాయి. నా పనిని మెరుగుపరచాయి. అందుకే సోనాక్షీ అంటే నాకు చాలా రెస్పెక్ట్’ అంటాడు మోహిత్ రాయ్."నా పనిని చూసుకున్న ప్రతిసారీ .. అరే ఇంతకన్నా బాగా చేసుండాల్సింది అనిపిస్తుంది. అందుకే రోజూ ఆత్మవిమర్శ చేసుకుంటాను. పొరపాట్ల నుంచి పాఠాలు గ్రహిస్తాను. దానివల్ల నా పనితీరు రోజురోజుకి మెరుగవుతుంది. సెలబ్రిటీలకు స్టయిలింగ్ చేస్తున్నప్పుడు మన వర్క్ స్టయిల్ హార్డ్‌వర్క్ అండ్ స్మార్ట్వర్క్ల కాంబినేషన్‌గా ఉండాలి!" – మోహిత్ రాయ్
![Barbarian 'Anagarikudu' Sunday Funday Entertainment And Long Story](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/anagarikudu.jpg.webp?itok=_S-nFcGm)
'అనాగరికుడు'! గేటుతీసుకుని లోపలికొచ్చి..
గేటుతీసుకుని లోపలికొచ్చి వరండాలో స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు పీరయ్య. మాసిన గళ్లచొక్కా, నలిగిన ప్యాంటు, చెదిరిన జుట్టు, పెరిగిన గడ్డం, లోతుకుపోయిన ఎర్రటి కళ్లు, వొంగిన కడ్డీలాంటి గరుకు శరీరం. జైలు నుంచి విడుదలైన సంవత్సరకాలంలో ఇంకా సన్నబడ్డాడు. ఈమధ్య అంతగా రావడంలేదు.‘మనవూర్లోనే వుంటున్నావా?’ అడిగాను న్యూస్ పేపరు పక్కనపెట్టి. ‘వొకవూరని లేదు వాసుబాబూ’ ఉదయపుటెండలో పూల మీద ఎగురుతున్న సీతాకోకచిలుకను చూస్తూ అన్నాడు. ‘యెందుకని?’‘యేడేండ్లలో కాలం మారలేదా? నేను యిడుదలైవొచ్చే లోపల రాజకీయాలూ మారిపోయినాయి. మా పెదలింగయ్య, ఆయన దాయాదీ రాజీపడి ఫ్యాక్చన్ వైరాలు నిలిపేసిరి. వాల్ల పిల్లోళ్లు డాకటర్లు, యింజనీర్లై సిటీలకు, యిదేసాలకు యెళ్లిపోయిరి. యింగ మందీమార్బలంతో, జీపులతో, నా మాదిరి డ్రైవర్లతో పనేముండాది? పెదలింగయ్య బెంగుళూరులో కొడుకు దెగ్గిరికి యెళ్లిపోయినాడు’మార్పువచ్చి ఉపాధి పోయినందుకు అతనిలో నిరాశ కనిపించలేదు. పోరాట వాతావరణంలో ఉండేవాళ్లు ఎలాంటి నష్టానికైనా సిద్ధంగా ఉంటారేమో అనుకున్నా. ‘డ్రైవరు పని లేకపోతే సేద్యం చేసుకోవచ్చు. నీక్కొంచెం చేనుండాలిగదా?’ అన్నా. ‘నేను జైలుకుబోయి, మాయమ్మ కాలమైపోయినాక సేనంతా కంపసెట్లు మొల్చి నా మాదిరే తరంగాకుండా ఐపోయిండాది’ ‘బాగుచేసుకోలేకపోయినావా?’ ‘వూళ్లో వుండలేక పోయినాను. ఫ్యాక్చన్లో యెదుటోణ్ణి సంపితే వోడు యీరుడు. పెండ్లాన్ని సంపిన కేసు మీద యేడేండ్లు జైలుకు పోయొచ్చినోడికి మర్యాదేముంటాది?’ పీరయ్య తన భార్య సంగతి మాట్లాడినప్పుడు గొంతు జీరగా పలుకుతుంది. అందులో దుఖంతోపాటు తను నిర్దోషిననే భావన ఉంటుంది. ‘నువ్వాపని చెయ్యలేదని, అది ప్రమాదం వల్ల జరిగిందని వూళ్లో నమ్మడంలేదా?’‘యెవురు నమ్మినారో యెవురు లేదో. అందురూ నీమాదిరుంటారా? తల్లీ, బార్యా యిద్దురూ పోయినారు. కోర్టు సెప్పిన సిచ్చ ఐపోయినా ప్రెపంచం యేసిన సిచ్చ యింగా నడస్తావుంది. పెదలింగయ్య నీడ గూడా పాయె. జెనం సైలెంటుగా వుండేదానికి నేనేమన్నా డబ్బు, పలుకుబడీవుండే బడాబాబునా? నా గురించి సెప్పినాక యాడా కుదురుగా పని యియ్యడంలేదు, ఆడా యీడా తిరగతావుండా’ ఉదాసీనంగా అన్నాడు.‘తను తప్పు చెయ్యలేదనే భావన ఒక్కటే పీరయ్య జీవితేచ్ఛేను కొనసాగిస్తున్నట్టుంది’ అనుకున్నా.నా శ్రీమతి తెచ్చిపెట్టిన ఉప్మాతిని, కాఫీతాగి ‘సిటీలో నాకేదైనా డ్రైవరుద్యోగం సూపించు వాసుబాబూ. నీలాంటి మంచోడు సెప్తే యిస్తారు’ అని వెళ్లిపోయాడు. పీరయ్య గురించిన ఆలోచనల్లో పడ్డాను.ఆర్థిక నేపథ్యాలు వేరైనా పీరయ్యా నేనూ చిన్నతనంలో స్నేహితులం. తండ్రి అనారోగ్యంతో చనిపోయాక పీరయ్య చదువును ఐదోతరగతిలోనే ఆపేసి తల్లి అంకమ్మతో పొలం పనులకు, యెనుములను మేపడానికి వెళ్లేవాడు. పీరయ్యకు మొదట్నుంచి డ్రైవింగ్ అంటే మోజు. అతనికి పన్నెండేళ్లప్పుడే ఊరి దగ్గర కడుతున్న పెద్దచెరువు పనికోసం వచ్చే టిప్పర్లు, జీపులకు క్లీనరుగా వెళ్తూండేవాడు. పెద్దయ్యాక డ్రైవింగ్ నేర్చుకుని మా పక్కవూర్లోని ఫ్యాక్షన్ లీడర్ పెదలింగయ్య దగ్గర జీపుడ్రైవరుగా స్థిరపడ్డాడు.మా కుటుంబం ఊరొదిలేశాక పీరయ్యను కలవడం తగ్గిపోయింది. ఎప్పుడైనా కలసినప్పుడు తన సాహసంతో, డ్రైవింగ్ ప్రతిభతో పెదలింగయ్యను ప్రత్యర్థుల నుంచి ఎలా రక్షించాడో ఉద్వేగంగా చెప్పేవాడు. పోరాటంలో హింస తప్పుకాదని, ఐతే అది న్యాయం కోసం అయివుండాలి అనేవాడు. నమ్మినవాళ్ల కోసం త్యాగానికి సిద్ధంగా ఉండాలనేవాడు. పైకి అనాగరికంగా, నిర్లక్ష్యంగా, రఫ్‌గా కనపడ్డం, ఫ్యాక్షనిస్టు నాయకుడితో ఉండడంవల్ల లోకం అతన్ని ఒక రౌడీగానే చూసేది. పీరయ్యకూడా తన వృత్తికి ఆ ఇమేజ్ అవసరమని భావించి దాన్నే బహుముఖంగా ప్రదర్శించేవాడు.పీరయ్యకు పెదలింగయ్య పొలాలు చూసే ఓబయ్య కూతురు గౌరితో పెళ్లైంది. గౌరి చక్కగా వుంటుంది. ‘తండ్రికి ఇష్టంలేకపోయినా, తను మోటుగా వున్నా జానపద కథల్లోలా తన నైపుణ్యం, తెగువ చూసి గౌరే పట్టుబట్టి పెళ్లిచేసుకుందని’ నమ్మాడు పీరయ్య. అదే బయట గర్వంగా చెప్పుకుని వ్యతిరేకులను పెంచుకున్నాడు. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉండేవాళ్లు. ఐతే గౌరికి ముక్కు మీద కోపమని, తన తల్లి అంకమ్మతో పడదని వాపోయేవాడు. క్రమంగా అత్తాకోడళ్లకు తగవులు పెరిగిపోయాయి. తగవులైనప్పుడు పీరయ్య నలుగురి ముందు భార్య మీదే కేకలేసి పైకి తన ఆధిక్యతను ప్రదర్శించేవాడు. ఒక్కోరోజు విసుగెత్తి ఇంటికి రాకుండా పెదలింగయ్య బంగళా దగ్గరే ఉండిపోయేవాడు.పెళ్లైన కొన్నేళ్ల తరువాత ఒక తుఫాను రాత్రి పీరయ్య జీవితంలోనే తుఫాను తెచ్చింది. పెద్దవర్షంలో అతను ఆలస్యంగా ఇంటికొచ్చేసరికి కోడలితో పోట్లాట జరిగి అంకమ్మ యెనుముల కొట్టంలో తడుస్తూ చలికి ముడుచుకుపోయి ఏడుస్తూ కనపడింది. పీరయ్య ఆవేశంగా ఇంట్లోకెళ్లి ఒక్కతేవున్న గౌరితో గొడవ పడ్డాడు. పెనుగులాటలో గోడకున్న పెద్దమేకు తలవెనక దిగి, రక్తంకారి గౌరి స్పృహ తప్పి పడిపోయింది.పీరయ్య జీపులో ఆమెను దగ్గర్లోని చిన్నాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టరు సెలవులో ఉండడంతో ఆ వర్షంలో, కిందామీదా పడి పొంగుతున్న వాగులుదాటి, ఆలస్యంగా టౌనుకు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స జరిగింది గాని గౌరి స్పృహలోకి రాలేదు. రెండురోజుల తరువాత చనిపోయింది. పీరయ్య డ్రైవింగ్ నైపుణ్యం తుఫాను చేతిలో ఓడిపోయింది. పీరయ్య షాక్ కి గురై కొన్నాళ్లపాటు అచేతనంగా ఉండిపోయాడు.అల్లుడే తనకూతుర్ని హత్య చేశాడని ఓబయ్య కేసు పెట్టాడు. పీరయ్య వ్యతిరేకులే అతన్నలా ఎగదోశారని కొందరన్నారు. ఓబయ్య కూడా తన మనిషే కాబట్టి పెదలింగయ్య తటస్థంగా ఉండిపోయాడు. పీరయ్య సానుభూతిపరుల సాయం సరిపోలేదు. కేసు రెండేళ్లు నడిచాక పీరయ్యకు రిమాండుతో కలిపి ఎనిమిదేళ్లు శిక్షపడింది.పీరయ్యను జైల్లో కలిసినప్పుడు ‘మంట ఆరిన కాగడాలా’ కనిపించేవాడు. ‘నేను ఫ్యాక్చన్ మనిసిగా వుండడం, రౌడీగా ఔపడ్డం, గౌరితో మనువాసించి బంగపడిన యెదవలు మాపెదలింగయ్య మనుసు యిరిసేయడమే గాక నాకు యెతిరేక సాచ్చమివ్వడం వల్ల సెయ్యని నేరానికి సిచ్చపడింది’ అని వాపోయేవాడు. ‘ఆడికీ ‘కోర్టు సానుభూతిగా సూసి తక్కవలో పోగొట్టిందని’ మా వకీలుసారు సెప్పినాడు’ అని సమాధానపడేవాడు. మళ్లీ అంతలోనే ‘ఐనా నేను గౌరిని సంపడమేంది, నాకీ సిచ్చేంది వాసుబాబూ’ అని ఏడ్చేవాడు.‘ఆరాత్రి ఏం జరిగిందో ఇంకెవరూ చూడలేదు. పీరయ్యకు హింసాప్రవృత్తి లేదని అనుకునే నాలాంటి వాళ్లు కొందరు తప్ప మిగతావాళ్లెవరూ అతని మాటలు నమ్మినట్టు కనపడదు. దానికి చాలావరకూ కారణం అతనే. పీరయ్య ఏ ధర్మాన్ని నమ్ముకున్నాడో అదే అతన్ని దెబ్బతీసింది’ అనుకున్నా.‘గౌరి ప్రెమాదం వల్లే సచ్చిపోయిందని లోకం యేపొద్దుటికైనా తెల్సుకుంటాది. ఐనా గౌరి ఆత్మకు నిజెం తెల్సు, అదేసాలు’ అని శిక్ష చివరి రోజుల్లో గాలిలోకి చూస్తూ అనేవాడు. జైలు జీవితంలో పీరయ్య చూడ్డానికి మరింత గరుకు తేలినా, మొహంలో మునుపటి రౌడీ కవళికలు పోయాయి. మంచి ప్రవర్తన కారణంగా సంవత్సరం ముందే విడుదలయ్యాడు.‘మీ ఆఫీసుకు టైమౌతోంది’ అన్న శ్రీమతి పిలుపుతో వర్తమానంలోకి వచ్చాను.నెలరోజుల తరువాత ఒక సాయంత్రం నేను డాబా మీద కుండీల్లో మొక్కలకు నీళ్లు పోస్తూంటే వచ్చాడు పీరయ్య. మంచి ప్యాంటు షర్టు వేసుకున్నాడు, తల దువ్వుకుని, తేట మొహంతో నీట్‌గా ఉన్నాడు. సూర్యుడు దిగిపోయాడు, గుళ్లోని సుబ్బులక్ష్మి పాటకి చెట్లు తలలూపుతున్నాయి, జమ్మిచెట్టు మీది పక్షులు ముందే గూళ్లు చేరుకుంటున్నాయి. ‘మీ కాలనీలో దేవరాజుసారు దెగ్గిర డ్రైవరుద్యోగం దొరికింది. రెండురోజులాయె. మకాం యింటెనకాల అవుటౌసులోనే’ గట్టు మీద కూర్చుంటూ చెప్పాడు. ‘మా కాలనీ ప్రెసిడెంటు దేవరాజుగారు నీకు తెలుసా?’ అడిగాను ఆశ్చర్యపోయి. ‘మా పెదలింగయ్య కొమారుడు నితీషుబాబూ యీయనా వొకే కాలేజీలో సదూకున్నారంట. ఆయన సిఫార్సు సేసినారు’ ‘దేవరాజుగార్తో నాకంత పరిచయంలేదు గాని ఆయన్నందరూ పెద్దమనిషిగా గౌరవిస్తారు. గుడి ధర్మకర్త కూడా ఆయనే. బాగా డబ్బు, పలుకుబడి వున్నా మృదువుగా మాట్లాడతారు, అన్నదానం లాంటి కార్యాలకు వుదారంగా సాయం చేస్తారు. యెత్తుగా, తెల్లగా, చక్కగా వుంటారు’ ‘ఆయన్ని సూస్తే అట్లాగే అనిపిస్తాది. యెందుకైనా మంచిదని మా నితీషుబాబు దేవరాజుసారుకి నా సంగతంతా సెప్పినాడు. అంతా యిన్నాక గూడా నన్ను డ్రైవరుగా తీసుకున్నాడంటే ఆయన శానా మంచోడనేగదా! అంతేగాదు, నన్ను ఆయన భార్య అనసూయమ్మగారి కారు తోలమన్నాడు, దర్మాత్ముడు. ఆయమ్మది సామనసాయ. ఆయనంత సక్కగా వుండదు. కానీ దయాగునంలో మహాతల్లి’ చేతులు జోడించి కళ్లు సగం మూశాడు పీరయ్య.‘ఆయనకు తగ్గ యిల్లాలని చెప్తారు. కాని ఆమెకు యీమధ్య ఆరోగ్యం అంత బావుండడం లేదని, మనిషి కూడా చిక్కిపోయిందనీ విన్నాను. దాన్ని గురించి ఆయన తిరగని ఆసుపత్రి, వెళ్లని గుడీ లేదంటారు’ గుడిగంట పెద్దగా మోగింది. పక్షులు కలకలంగా లేచి మళ్లీ చెట్లల్లో సర్దుకున్నాయి. ‘ఆయిల్లెట్లుంది బాబూ? యింద్రబొవనమే! యిల్లంతా పాలరాయి, టేకు వొస్తువులే, గోడలకు పేద్ద పటాలు, మూలల్లో సెందనం బొమ్మలు, కనపడని లైట్లు! దీనిముందు మా పెదలింగయ్య బంగళా పాతబడిన మహలే’ ‘మా కాలనీలో వుండాల్సిన యిల్లు కాదంటారు. నీ తిండితిప్పల సంగతేమిటి?’ ‘ఆయమ్మ పనోళ్లనట్లా వొదిలేస్తాదా బాబూ? మూడుపూట్లా తిండి ఆణ్ణే. మాయమ్మగూడా నన్నట్లా సూడలేదు’ తృప్తిగా చెప్పాడు, ‘మరింకేం, వుద్యోగం జాగ్రత్తగా చేసుకో’ ‘సరేగాని బాబూ, పెండ్లాన్ని సంపిన కేసులో నేను యేడేండ్లు జైలుకు బోయి వొచ్చినా యీసారు నాకెట్లా వుద్యోగమిచ్చినాడు?’ అడిగాడు పీరయ్య.‘కాలం మారింది పీరయ్యా, యిప్పుడు పనిలో నైపుణ్యం, విధేయత ఇవే చూస్తారు. అవి నీ దగ్గరున్నాయి. వుద్యోగమిచ్చేవాళ్లకి అంతకుమించి అక్కర్లేదు. నీకవి వున్నన్నాళ్లూ నీ వుద్యోగం నిలుస్తుంది’ అన్నా. అర్థం అయ్యీ కానట్టుగా తలవూపి ‘ఖాలీ దొరికినప్పుడు వొస్తా’ అంటూ వెళ్లిపోయాడు.‘హఠాత్తుగా తనకు పూర్తిగా కొతై ్తన నాగరిక ప్రపంచంలో పడ్డాడు పీరయ్య, యెలా నెట్టుకొస్తాడో’ అనుకున్నా. ఒక ఉదయం నేను బస్టాపులో వెయిట్ చేస్తుంటే పీరయ్య కారాపి ‘యెక్కుబాబూ అఫీసుదెగ్గిర దింపతా’ అని బలవంతం చేసి వెనకసీట్లో ఎక్కించాడు. దారిలో ఒక హోటల్ దగ్గర చెట్టుకింద ఆపి ‘టీ తాగుదాం బాబూ, తలనొప్పిగా ఉండాది’ అని రెండు పేపరు కప్పుల్తో టీ పట్టుకొచ్చాడు. ‘యెలావుంది వుద్యోగం’ అడిగాను టీ తాగుతూ. ‘బాగుంది బాబూ. జీతమంతా మిగులే. వూర్లో సేను బాగసేయించి మా సిన్నాయన కొడుకును దున్నుకోమని సెప్పినా. నేనింగ ఆవూర్లో వుండలేను గాబట్టి యిల్లుగూడా రిపేరు జేయించి బాడుక్కిచ్చేసినా’ అన్నాడు. ‘వొక గాడిలో పడినట్టే’ టీ తాగాక పీరయ్య గొంతు తగ్గించి ‘దేవరాజుసారు ఆస్తి, యాపారాలు మొత్తం అమ్మగారివేనంట బాబూ. యీ అయ్యగారు కాలేజీలో ఆమె యెంటబడి ప్రేమించి ఆమె నాయనకు యిష్టం లేకపొయ్యినా పెండ్లి సేసుకున్నాడంట’ అన్నాడు. ‘అవన్నీ నీకెందుకు?’ అన్నా, ‘గాసిప్ లేకపోతే మనుషులు ఎలా వుండేవారో’ అనుకుంటూ. ‘నాకేమీ కుశాల లేదు, ఆయింట్లో పాత నౌకరొకామె వొద్దన్నా రోజూవొచ్చి అన్నీ సెప్తాది. కొన్ని కండ్లకు కనబడతానే వుండాయి. అమ్మగారు శానా మంచిదా? అంత డబ్బుండాదా? పెద్ద డాకటర్లే సూస్తావున్నారా? బాగవడం లేదెందుకు? అది మనసులో ఖాయిలా గాబట్టి. గుండె, నరాలు వీకైపోయినాయని సెప్తావున్నారంట’ ‘కొన్ని జబ్బులలాగే వుంటాయి’‘మొన్నమొన్నటి దాంకా ఆమె సక్కగా, నవ్వతా తిరగతా వుండేదంట. దేవరాజుసారు అనుకున్నంత మంచోడు కాదు. శాన్నాళ్లుగా ఆతల్లిని లోలోపల బాదపెడతా వుండాడని నాకనిపిస్తా వుండాది’ ‘నువ్వు నీ వుద్యోగానికి విశ్వాసంగా వుండాలి, నీ అభిప్రాయాలు, కోపతాపాలకు కాదు. యిది ఆధునికానంతర ప్రపంచం. పద, యికవెళ్దాం’నా మాటలు అర్థంకానట్టుగా చూసి ‘అమ్మగారు వొక్కోతూరి వొంటరిగా రూములో కూస్సోని యేడ్సేది సూసినా. ఆయమ్మను సూస్తే ‘రగతంకారి పడిపోయిన గౌరి’ గుర్తుకొచ్చి మనసు యికలమైతాది. వుండలేక నీకు సెప్తావున్నా’ అని కారు స్టార్ట్ చేశాడు పీరయ్య. మళ్లీ కొన్నాళ్లు పీరయ్య కనిపించలేదు.తుఫాను మూలంగా ఆరోజు సాయంత్రంనుంచే పెద్దవర్షం మొదలైంది. ఈదురుగాలి, వణికించే చలి. కరెంటు పోయింది. తెల్లవారు ఝామున ఐదవుతూండగా వీధితలుపు కొట్టిన చప్పుడు రావడంతో టార్చిలైటు వేసి తలుపు తెరిచాను. వరండాలో తడిసిన బట్టల్తో చేతిలో బ్యాగుతో నిలబడివున్నాడు పీరయ్య. మొహం గంభీరంగా ఉంది. ఆశ్చర్యపోయి అతన్ని హల్లోకి రమ్మని తువ్వాలు, పంచె ఇచ్చాను. అప్పటికి ఉద్ధృతి తగ్గి సన్నటి వర్షపుధార మిగిలింది.కాఫీచేసి ఇచ్చాను. పీరయ్య పొడిబట్టలు కట్టుకుని మౌనంగా తాగాడు. ‘అర్జెంటుగా యెక్కడికన్నా వెళ్తున్నావా?’ నిదానంగా అడిగాను.‘నేనుద్యోగం సాలించి వూరికి యెళ్లిపోతావుండా. సెప్పిపోదామని వచ్చినా’ అన్నాడు పీరయ్య బొంగురు గొంతుతో. ‘యేమైంది? మనవూరికిక వెళ్లనన్నావు గదా?’పీరయ్య తటపటాయించాడు ‘దేవరాజుసారు మంచోడు కాదు బాబూ. నేను సెప్తావచ్చిందే నిజం. అమ్మగారిని శానా బాధపెడతా వున్నాడు. ఆమె యెక్కవ రోజులు బతకదు. బైట యెంత ఫ్యాక్చనిస్టైనా పెదలింగయ్యగారే మేలు, యేదున్నా పైక్కనపడతాడు, యింట్లో అమ్మయ్యదే పెత్తనం. యీసారు యేరే మనిసి’‘అందుకని రాకరాక వచ్చిన మంచి వుద్యోగం మానేసి వెళ్తున్నావా?’ ‘నా తల్లట్లాటి అమ్మగారికి అంత సెడు జరగతావుంటే సూస్తా ఆయింట్లో వుండలేను. యేమైండాదో విను. నిన్న అయ్యగారి డ్రైవరు లేడు, కారు నన్ను తోలమన్నాడు. మాటేల వొర్సం మొదులయ్యేతలికి మేం యాభైమైళ్ల దూరంలోవున్న వూరేదో యెళ్లినాం. వూరిబైట తోటలో గెస్టౌసు, అయ్యగార్దే అనుకుంటా. అప్పుటికే ఆడ రెండు పెద్దకార్లొచ్చి వుండాయి’‘వుంటే?’ ‘నేను రాత్రి తొమ్మిదైనాక మంచినీళ్ల కోసమని యింటి యెనకపక్కకు యెళ్లా, వొరండాలో అయ్యగారు, యిద్దురు దోస్తులు కూస్సోని మందు తాగతావుండారు. వోళ్ల మాటలు యినబడినాయి. ‘ఆమెకు ఖాయిలా అనీ, యింగేయో సాకులు సూపి అమ్మగార్ని వొప్పించేదానికి సూస్తావుండానని, తొందర్లోనే యెట్లైనా యేదోవొకటి సేసి సంతకాలు పెట్టిస్తానని, ఆనక వోళ్లనుకున్న యాపారాల్లో యెంత డబ్బైనా పెడ్తానని అయ్యగారు సెప్తావున్నాడు’‘అవునా?’ ‘నాకు కోపం తన్నుకోనొచ్చింది. ‘అర్జెంటు పనుండాదని’ అయ్యగార్ని పక్క రూంలేకి తీసకపోయి ‘నువ్విట్లా సేస్తావుండేది శానా తప్పయ్యగారూ, దేవతట్లాటి అమ్మగార్ని పోగొట్టుకోవద్దు’ అని యినయంగానే సెప్పినా. ఆయన నన్ను తిట్టినాడు, బెదిరిచ్చినాడు, నేను బైపడలేదు. జీతం పెంచుతానని అశ పెట్టినాడు’ అని చీకట్లోకి చూస్తూ ఆగాడు. నేను ఏమనాలో తెలియక అలాగే చూస్తూండిపోయాను.పీరయ్యే మళ్లీ ‘నాకు యిరక్తొచ్చింది. కారు బీగంచెవులు ఆయనముందు యిసిరేసి బైటికొచ్చేసినా. వానలో రెండుమైళ్లు నడిసి, రోడ్డుమీదికొచ్చి పాలయాను, లారీ యెక్కి వూర్లేకొచ్చి యింటికి సేరినాను. టైము నాలుగుదాటింది. అమ్మగారు అప్పుడే లేచినారు. యేదైతే అదైందని అమెకు జెరిగిందంతా సెప్పి వచ్చేసినా‘ అని అలసినట్టుగా గోడకు తలానించి కళ్లు మూసుకున్నాడు.హింసను ఒక మార్గంగా ఒప్పుకుని, భార్యను చంపినవాడిగా శిక్షను అనుభవించి, అనాగరికుడని ముద్రపడ్డ పీరయ్య నాగరిక సమాజంలోని పరోక్ష గృహహింసను చూసి తట్టుకోలేకపోవడం నాకు ఆశ్చర్యమనిపించింది. వర్షం ఆగింది, చీకటి ఇంకా విడలేదు. ‘మనపల్లెలోనే యెట్నో బతుకుతా. యెప్పుడైనా వొచ్చి నిన్ను సూసిపోతుంటా. వస్తా బాబూ’ అని బ్యాగు బుజానికి తగిలించుకుని బయటికి వెళ్లిపోయాడు పీరయ్య. – డా.కె.వి. రమణరావు
![Mutual Curses Of Brahma Narada Sunday Devotional Story](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/brahma-narada.jpg.webp?itok=06FGWx1o)
బ్రహ్మ నారదుల పరస్పర శాపాలు..
శ్రీమన్నారాయణుడి నాభి కమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు నారాయణుడి ఆజ్ఞ మేరకు సకల చరాచర జగత్తును సృష్టించే పని ప్రారంభించాడు. బ్రహ్మదేవుడి వెనుక భాగం నుంచి అధర్ముడు, వామ భాగం నుంచి అలక్ష్మి అనే దారిద్య్రదేవత, నాభి నుంచి విశ్వకర్మ, ఆ తర్వాత అష్టవసువులు ఉద్భవించారు.బ్రహ్మ మనసు నుంచి సనక, సనందన, సనాతన, సనత్కుమారులనే నలుగురు పుత్రులు ఉదయించారు. ‘మీరంతా భూమ్మీదకు వెళ్లి సృష్టి చేయండి’ అని వారిని ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు.తమకు సంసార వ్యామోహం లేదని చెప్పి, ఆ నలుగురు మానస పుత్రులూ తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయారు. బ్రహ్మ ముఖం నంచి స్వాయంభువ మనువు, అతడి భార్య శతరూప ఆవిర్భవించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి భృకుటి నుంచి కాలాగ్ని, మహాన్, మహాత్మ, మతిమాన్, భీషణ, భయంకర, రుతుధ్వజ, ఊర్ధ్వకేశ, పింగళాక్ష, రుచి, శుచి అనే ఏకాదశ రుద్రులు ఉద్భవించారు. వీరిలో కాలాగ్ని రుద్రుడు ప్రళయకాలంలో సృష్టిని సంహరిస్తాడు.ఏకాదశ రుద్రుల ఆవిర్భావం తర్వాత బ్రహ్మదేవుడి కర్ణేంద్రియాల నుంచి పులస్త్యుడు, పులహుడు, కుడికంటి నుంచి అత్రి, ఎడమకంటి నుంచి క్రతు, నాసిక నుంచి అరణి, ముఖం నుంచి అంగిరస, ఎడమభాగం నుంచి భృగువు, కుడిభాగం నుంచి దక్షుడు, ఆయన నీడ నుంచి దక్షుడు, కంఠభాగం నుంచి నారదుడు, స్కంధభాగం నుంచి మరీచి, గొంతు నుంచి అపాంతరతమ, నాలుక నుంచి వశిష్ఠ, పెదవుల నుంచి హంస మహర్షి, కుడి పార్శ్వం నుంచి యతి తదితర మహర్షులు ఉద్భవించారు.బ్రహ్మదేవుడు వారందరినీ పిలిచి, ‘మీరంతా నేటి నుంచి సృష్టికార్యం చేయండి’ అని ఆజ్ఞాపించాడు. నారదుడికి బ్రహ్మదేవుడి ఆజ్ఞ రుచించలేదు. ‘తండ్రీ! మాకంటే ముందుగా పుట్టిన మా సోదరులు సనక సనందాదులకు ముందుగా వివాహం చేసి, వారిని సృష్టికార్యానికి వినియోగించు. ఆ తర్వాత మమ్మల్ని గురించి ఆలోచించవచ్చు. వారేమో తపస్సు చేయడానికని వెళ్లిపోయారు. వారినేమీ అనకుండా, మమ్మల్ని సంసార నరకకూపంలోకి తోసేయాలని అనుకోవడం ఏమి న్యాయం? సంసారకూపంలో చిక్కుకున్నవాళ్లు ఎంతటివారైనా దాని నుంచి బయట పడలేరు కదా! మాకు కూడా సంసారం చేసి, సృష్టికార్యాన్ని కొనసాగించాలనే ఇచ్ఛ లేదు. తపోవృత్తిని ఆశ్రయించి జీవించాలనేదే మా కోరిక’ అన్నాడు నారదుడు. నారదుడి నిష్ఠురానికి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది.‘నన్ను ధిక్కరించడమే కాకుండా, ఎదురు సమాధానం చెబుతావా? అందుకే నిన్ను శపిస్తున్నాను. నేటి నుంచి నీ జ్ఞానం అంతరిస్తుంది. త్వరలోనే నువ్వు గంధర్వుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో నువ్వు స్త్రీలోలుడివి అవుతావు. ఎందరో స్త్రీలతో విషయ భోగాలను అనుభవిస్తావు. ఆ జన్మ చాలించిన తర్వాత ఒక దాసికి పుత్రుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో విష్ణుకథలను వినడం వల్ల, విష్ణుభక్తులను సేవించడం వల్ల తర్వాత జన్మలో తిరిగి నా పుత్రుడిగా జన్మిస్తావు. నువ్వు చేసిన అపరాధానికి ఇదే తగిన శిక్ష’ అని కఠినంగా పలికాడు.బ్రహ్మ శాపంతో నారదుడికి దుఃఖం ముంచుకొచ్చింది. ‘తండ్రీ! నా మీద కోపాన్ని ఉపసంహరించుకో! ఎందరినో సృష్టించే నీకు కోపం తగదు. అయినా, నేనేం తప్పు చేశానని? నేను చెడుమార్గంలో సంచరిస్తూ ఉంటే నన్ను దండించవచ్చు గాని, నేను తపస్సు చేసుకుంటానంటే అకారణంగా శపించావే! ఇదేమైనా న్యాయమా? భావ్యమా? శపిస్తే శపించావు గాని, ఎన్ని జన్మలు ఎత్తినా హరిభక్తి విడవకుండా ఉండేలా నన్ను అనుగ్రహించు. బ్రహ్మపుత్రుడైనా సరే హరిభక్తి లేనివాడు సూకరంతో సమానుడు’ అన్నాడు నారదుడు.అప్పటికి కాస్త శాంతించిన బ్రహ్మ ‘అన్ని జన్మలలోనూ నువ్వు హరిభక్తుడిగానే ఉంటావు’ అన్నాడు.‘తండ్రీ! ఏ యజమాని అయినా తన భార్యకు, సంతానానికి, బంధువులకు, సేవకులకు సన్మార్గాన్ని చూపిస్తే అతడు ఉత్తమ గతులు పొందుతాడు. అలా కాకుండా, చెడుమార్గాన్ని చూపిన వాడు నరకానికి పోతాడు. శ్రీహరి మీద భక్తిప్రపత్తులను పెంచుకున్నవాడిని తిరస్కరిస్తే, అతడు గురువైనా, తండ్రి అయినా, కొడుకు అయినా, యజమాని అయినా దుర్మార్గుడే అవుతాడు. అందువల్ల తండ్రీ! నా తప్పు లేకపోయినా నువ్వు నన్ను శపించావు. కాబట్టి నువ్వు కూడా శాపానికి అర్హుడివే!సకల సృష్టికీ కారకుడివి అయినప్పటికీ నీకు మంత్రం, స్తోత్రం, పూజ అనేవి లోకంలో లేకుండా పోతాయి. నీకు భూమ్మీద ఆలయాలు కూడా ఉండవు. నిన్ను ప్రత్యేకంగా ఆరాధించే భక్తులెవరూ ఉండరు. నా శాప ప్రభావం మూడు కల్పాల వరకు ఉంటుంది. మూడు కల్పాలు గడచిన తర్వాత మాత్రమే నీకు ఇతర దేవతలతో సమానమైన పూజలు అందుతాయి’ అని శపించాడు నారదుడు. నారదుడి శాపం కారణంగానే బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయాలు లేవు. బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన మంత్ర స్తోత్రాలేవీ లేవు. – సాంఖ్యాయన
![Nikhil's Success Story As Top Ten Richest Social Media Influencers Of India](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/nikhil.jpg.webp?itok=neNa3Pdr)
Nikhil Anil Brijlal Kumar Sharma: ముంబైకర్ నిఖిల్..
నిఖిల్ అనిల్ బ్రిజ్‌లాల్ కుమార్ శర్మ aka నిఖిల్ ముంబైకర్.. మోటో వ్లాగర్, బిజినెస్‌మన్. టాప్ టెన్ రిచెస్ట్సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ర్స్ ఆఫ్ ఇండియాలో ఒకడు. హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసిన ఈ ముంబై వాసి కొన్నాళ్లు ఖతార్ ఎయిర్వేస్లో ఫ్లయిట్ అటెండెంట్‌గా పనిచేశాడు.చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీదున్న ఇంట్రెస్ట్ ఆ ఎయిర్వేస్ కొలువులో కుదురుగా ఉండనివ్వలేదు. దాంతో ముంబైకి తిరిగొచ్చి.. నటనలో లక్‌ని పరీక్షించుకున్నాడు. అట్టే అవకాశాలు రాలేదు. వీడియోగ్రఫీ అంటే కూడా ఆసక్తి ఉండటంతో మైండ్‌ని అటువైపు మోల్డ్ చేసుకున్నాడు. యూట్యూబ్‌ని వేదికగా మలచుకున్నాడు. మోటర్ బైక్ మీద తను వెళ్లిన ప్రదేశాలను షూట్ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేయసాగాడు. అలా అతని లద్దాఖ్ మోటో ట్రిప్ వ్లాగ్ తన చానెల్ సబ్‌స్క్రైబర్స్‌ని అమాంతం పెంచేసింది. పాపులారిటీని తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్‌ని కలవడానికి నిఖిల్ ఓ2ఓ (కన్యాకుమారి టు కశ్మీర్) బైక్ రైడ్ చేశాడు. ‘ముంబైకర్ నిఖిల్’ పేరుతోనే కీ చైన్స్, బెల్ట్‌ల బ్రాండ్‌ని స్థాపించాడు. ఇవి ఎక్స్క్లుజివ్గా అమెజాన్లోనే దొరుకుతాయి.ఇవి చదవండి: Revathi Pillai: తానొక.. డిజిటల్ స్టార్.. అండ్ ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్..
న్యూస్ పాడ్‌కాస్ట్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
మీ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదు, ‘విద్యుత్’ కమిషన్ నుంచి వైదొలగండి.. జస్టిస్ నరసింహారెడ్డికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేద్దాం... వైఎస్సార్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రజాప్రతినిధులకు బిగుస్తున్న ఉచ్చు... ఏసీబీతో పాటు రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం... 24 మందితో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు.. విద్యుత్ రంగ నిర్ణయాల్లో పాత్రపై జారీ చేసినట్లు జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ప్రధాని కార్యాలయం మోదీ పీఎంవో కాదు, అది ప్రజా పీఎంవో అని మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం... 72 మందితో కొలువుదీరిన నూతన మంత్రివర్గం, ఆంధ్రప్రదేశ్‌కు 3, తెలంగాణకు 2 పదవులు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ప్రధానమంత్రిగా నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గం కూర్పుపై కొనసాగుతున్న కసరత్తుతి.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ప్రధానమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ... నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
![Shops and houses of YSRCP leaders were destroyed](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/attack_1.jpg.webp?itok=d-Zuwq4z)
వైఎస్సార్సీపీ నేతల దుకాణాలు, ఇళ్లు ధ్వంసం
సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరుల ఇళ్లు, వాహనాలు, కార్యాలయాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. అజిత్‌సింగ్‌నగర్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్త జహీర్‌బాషాకు చెందిన టైలరింగ్ దుకాణాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కుట్టుమెషిన్లు, ఎల్ఈడీ టీవీ, ఇతర ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెద్దిరెడ్డి శివారెడ్డి కారు అద్దాలను పగులగొట్టారు. ఇంటిపై రాళ్లు రువ్వు శివారెడ్డిని దుర్భాషలాడారు. ఇటీవల వైఎస్సార్సీపీలో చేరి ఎన్నికల్లో పనిచేసిన నగర మాజీ డెప్యూటీ మేయర్ గోగుల రమణ కారు అద్ధాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిపై ఏకంగా దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లలో సామగ్రి దహనంవెల్దుర్తి: వైఎస్సార్సీపీ నాయకులకు చెందిన రెండు గృహాలపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడి ఇళ్లల్లోని సామగ్రిని దహనం చేసిన ఘటన పల్నాడు జిల్లా గొట్టిపాళ్లలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిన్నెబోయిన బాలగురవయ్య యాదవ్, పల్లపాటి వీరనారాయణ యాదవ్ గృహాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుంపులుగా వచ్చి దాడి చేశారు. ఆ రెండు గృహాల్లో ఉన్న విలువైన సామగ్రి, పత్రాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. టీడీపీ శ్రేణులు దాడులు చేస్తారనే భయంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఊరు వదిలి వెళ్లిపోగా.. మహిళలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే అదనుగా భావించిన టీడీపీ శ్రేణులు ఆ రెండు ఇళ్లపై దాడులకు పాల్పడి మొత్తం సామగ్రిని దహనం చేశారు. రూ.10 లక్షల విలువైన వస్తువులు కాలిపోయినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ నేత ఇల్లు కూల్చివేతఆక్రమణల నెపంతో విజయవాడలో టౌన్‌ప్లానింగ్ అధికారుల హడావుడిపాయకాపురం (విజయవాడ రూరల్): విజయవాడ ప్రకాష్‌నగర్‌లోని వైఎస్సార్సీపీకి చెందిన కోఆప్షన్ సభ్యుడు నందెపు జగదీశ్‌కు చెందిన భవనాన్ని వీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం కూల్చి వేశారు. 12 ఏళ్ల క్రితం మంజూరు చేసిన ప్లాన్ ప్రకారం సర్వే నంబర్ 89లో జగదీశ్ 3 పోర్షన్ల భవనాన్ని నిర్మించారు. ప్లానింగ్ అధికారులు శుక్రవారం భవన యజమానులకు సమాచారం ఇవ్వకుండా కొలతలు తీసి భవనానికి నోటీసులు అంటించారు. శనివారం కూల్చివేత చేపట్టారు. జగదీశ్ భార్య సౌభాగ్యలక్ష్మి భవనం కూల్చివేస్తున్నారని తెలుసుకొని భవనం దగ్గరకు వచ్చి ఎందుకు కూల్చి వేస్తున్నారని అధికారులను అడుగుతున్నా ఎలాంటి సమాధానం చెప్పకుండా భవనం వెనుకవైపు కూల్చి వేశారు. భవనం పక్కనే ఉన్న రేకుల షెడ్డును కూడా ఆక్రమణలో ఉందని, వీఎంసీ స్థలంలో నిర్మించినట్లుగా గుర్తించామని చెబుతూ కొంత కూల్చివేశారు. దీనిపై కోర్టు స్టే ఉండ టంతో అధికారులు కూల్చివేతను నిలిపివేశారు.రాజకీయ కక్షలే కారణం.. రాజకీయ కక్షలతోనే భవనం కూల్చివేత జరిగిందని సౌభాగ్యలక్ష్మి పేర్కొన్నారు. హరిబాబు అనే వ్యక్తి నుంచి 214 గజాల స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. 12 ఏళ్ల క్రితం విజయవాడ కార్పొరేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు తీసుకొని భవనం నిర్మించామని, భవనం నిర్మాణంలోని ఆక్రమణలను అధికారులు ఇప్పుడే గుర్తించడం ఏమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో అధికారులు భవనం కూల్చివేత చేపట్టగా..ఆ విషయం తెలుసుకుని వచ్చిన వైఎస్సార్సీపీ నగర ప్రధాన కార్యదర్శి విజయకుమార్ ఆకస్మికంగా ఎందుకు కూల్చుతున్నారని ప్లానింగ్ అధికారి కృష్ణను ప్రశ్నించారు. ఫిర్యాదు ఇప్పుడే అందింది కాబట్టి కూల్చివేస్తున్నామని అధికారులు సమాధానమిచ్చారు.
![Women killed her husband](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/1_12.jpg.webp?itok=8Vvu4lYe)
ప్రియుడి మోజులో భర్తను చంపించింది
నార్నూర్: ప్రియుడిపై మోజులో ఓ మహిళ భర్తను కిరాతకంగా హత్య చేయించింది. పథకం ప్రకారం ఆమె తన ప్రియుడు, మరో ఇద్దరితో కలిసి భర్తను దారుణంగా కొట్టి చంపించింది. తర్వాత తనకేమీ తెలియనట్టు భర్తను ఎవరో చంపారని నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం అర్జునికొలాంగూడ గ్రామ శివారులో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ (40) హత్య కేసు మిస్టరీని 24 గంటల్లో ఛేదించారు. మృతుని భార్య విజయలక్ష్మి, ఆమె ప్రియుడు రాథోడ్ మహేశ్, మరో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, నార్నూర్ సీఐ రహీంపాషా శనివారం డీఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. నార్నూర్ మండలం నాగల్కొండ గ్రామానికి చెందిన గజేందర్ జైనథ్ మండలం మేడిగూడ కే జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో తెలుగు పండిత్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు గాదిగూడ మండలం ఖాండోరాంపూర్ గ్రామానికి చెందిన విజయలక్ష్మితో 2017లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు (7) ఉన్నాడు.విజయలక్ష్మి నిజామాబాద్‌లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన రాథోడ్ మహేశ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గజేందర్ స్వల్పంగా దివ్యాంగుడు కావడంతో ఇష్టపడని ఆమె.. మహేశ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి ఆమెకు నచ్చజెప్పారు. క్షమాపణ చెప్పి ఇక నుంచి ప్రియుడికి దూరంగా ఉంటానని నమ్మించింది. కానీ ఆమె మారకుండా ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఆదిలాబాద్‌లో ఉంటూ విధులకు వెళుతున్న గజేందర్ సొంత మండలానికి బదిలీ చేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా డు. వేసవి సెలవులు కావడంతో భార్య, కుమారుడితో స్వగ్రామం నాగల్‌కొండలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడే ఉంటే సంబంధం కొనసాగించడం కష్టమని భావించి మహేశ్‌తో కలిసి గజేందర్‌ను చంపాలని విజయలక్ష్మి పథకం పన్నింది. సుపారీ ఇస్తామని.. బేల గ్రామానికి చెందిన బండే సుశీల్, ఉర్వేత కృష్ణలతో కలిసి చెరో రూ.3 లక్షలు సుపారీ ఇస్తామని గజేందర్ హత్యకు విజయలక్ష్మి, మహేశ్ ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 11న విజయలక్ష్మి మ హేశ్‌కు ఫోన్ చేసి భర్త హత్యకు ప్రణాళిక రచించింది. 12న పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో స్వగ్రామం నుంచి గజేందర్ ఉదయం 7.30 గంటలకు స్కూల్‌కు బయల్దేరాడు. ఈ విషయాన్ని విజయలక్ష్మి మహేశ్‌కు ఫోన్ చేసి చెప్పింది. పథకం ప్రకారం అర్జునికొలాంగూడ గ్రామ శివారు వద్ద ముగ్గురూ కాపు కాశారు. గజేందర్‌ను మొదట వె నుక నుంచి బైక్‌తో ఢీకొట్టడంతో అతను కింద పడి పోయాడు. అతడిని కొద్ది దూరం లాక్కెళ్లి బండల తో తల, ఇతర శరీర భాగాలపై కొట్టి హత్య చేశా రు. ఈ విషయం ప్రియుడి ద్వారా తెలుసుకున్న విజయలక్ష్మి ఉదయం గజేందర్ బీపీ మందులు వేసుకోలేదని, ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుందని ఇంట్లో చెప్పి తన బావ కొడుకు అంకిత్‌ను వెంటబెట్టు కుని హుటాహుటిన ద్విచక్ర వాహనంపై హత్య జరిగిన స్థలానికి వెళ్లింది. మహేశ్, మిగతా ఇద్దరు నిందితులు అక్కడే ఉండడం చూసి వెళ్లిపోవాలని సైగ చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం తన మామకు ఫోన్ చేసి భర్తను ఎవరో చంపేశారని సమాచారం ఇచ్చింది. మృతుడి తండ్రి జాదవ్ భిక్కు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు. విజయలక్ష్మి, మహేశ్, సుశీల్, కృష్ణలను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
![Murder of parents for money](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/old%20couplce.jpg.webp?itok=4VBaGJfB)
డబ్బుల కోసం తల్లిదండ్రుల హత్య
నర్సాపూర్: డబ్బుల కోసం తల్లిదండ్రులను హత్య చేశాడో కిరాతకుడు. వారు నిద్రిస్తున్న సమయంలో గొంతునులిమి చంపి.. అనంతరం మృతదేహాలను పెట్రోల్‌పోసి తగులబెట్టాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్‌కు చెందిన చాకలి కిష్టయ్య (75), నర్సమ్మ (70) దంపతులు. గ్రామంలో ఉన్న భూమిని అమ్మగా వచ్చిన డబ్బును పిల్లలకు సమానంగా ఇచ్చారు. తన వాటా కింద వచ్చిన రూ.4 లక్షలను చిన్న కుమారుడు లక్ష్మణ్ ఫైనాన్స్‌లో కారు రుణం కోసం చెల్లించాడు. అయినా రుణం తీరలేదు. ఫైనాన్స్ వాయిదాలు చెల్లించేందుకు అతను పలుమార్లు తల్లిదండ్రులను డబ్బు కావాలని ఒత్తిడి చేయగా.. కొంత డబ్బు ఇచ్చారు. ఈ క్రమంలో గత నెలలో మళ్లీ డబ్బుల కోసం ఒత్తిడి చేయగా తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఎలాగైనా వారిని హతమార్చి వారి వద్ద ఉన్న బంగారు నగలు తీసుకోవాలన్న దురాశతో హత్యకు పథకం రచించాడు.గుమ్మడిదల మండలం బొంతపల్లిలో నివాసం ఉంటున్న లక్ష్మణ్.. గత నెల 17న సాదుల్లానగర్‌కు వెళ్లి తల్లిదండ్రులను మరుసటి రోజు తనతో పాటు కారులో తాను నివాసం ఉంటున్న బొంతపల్లికి తీసుకెళ్లాడు. మర్నాడు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను మరోసారి అడిగినా వారు నిరాకరించడంతో కోపంతో లక్ష్మణ్ అదేరోజు రాత్రి నిద్రిస్తున్న తల్లిదండ్రులను గొంతు నులిమి చంపాడు. తల్లి వద్ద ఉన్న 3 తులాల నగలు తీసుకున్నాడు. అనంతరం మృతదేహాలను కారులో తీసుకుని నర్సాపూర్ చెరువు వద్దకు తెచ్చి శవాలపై పెట్రోల్ పోసి తగలపెట్టి వెళ్లిపోయాడు. వాట్సాప్ గ్రూపుల్లో పోలీసుల ప్రచారం: గుర్తు తెలియని జంట శవాలు దొరికిన విషయాన్ని వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా తమ సిబ్బంది ప్రచారం చేశారని డీఎస్పీ వెంకట్‌రెడ్డి చెప్పారు. రెండు శవాలు దొరికిన విషయం సాదుల్లానగర్ గ్రామస్తులకు తెలియడంతో వారు అనుమానంతో లక్ష్మణ్‌ను నిలదీయగా అసలు విషయం బయటకు వచి్చందని డీఎస్పీ వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
![Young Man Brutally Murdered In Hyderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/15/55_1.jpg.webp?itok=TcLY1EhO)
వివాహేతర సంబంధం వద్దన్నందుకు..
పహాడీషరీఫ్: ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట హఫీజ్‌బాబానగర్‌కు చెందిన సయ్యద్ మునీర్ కుమారుడు సయ్యద్ సమీర్(19), సోహెల్, సోఫియన్ స్నేహితులు. వీరిలో ఒకరైన సోహెల్ ఇదే కాలనీలలో ఉండే ఓ వివాహితతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సమీర్.. అందరం ఒకే కాలనీలో ఉంటున్నాం.. నాకు కూడా అక్కాచెల్లెళ్లు ఉన్నారు.. ఇలా చేయడం తప్పు అని సోహెల్‌కు సూచించాడు. ఇది జీరి్ణంచుకోలేని అతను సమీర్ తనపై దు్రష్పచారం చేస్తున్నాడని భావించాడు. ఎలాగైనా అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే గురువారం రాత్రి తన మరో స్నేహితుడు సోఫియన్‌తో కలిసి ముందస్తు పథకంలో భాగంగా.. సమీర్‌ను తీసుకుని బాలాపూర్ ఠాణా పరిధిలోని గుర్రం చెరువు ప్రాంతానికి వెళ్లారు. అనంతరం వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో సోహెల్ దాడికి పాల్పడ్డాడు. సమీర్ ఛాతి, వీపు భాగాల్లో ఐదుసార్లు బలంగా పొడిచాడు. ఈ సమయంలో విరిగిపోయిన కత్తి మృతుడి కడుపులోనే ఉండిపోవడం గమనార్హం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.