వైరల్: లోయలో పడిన ఏనుగు.. క్రేన్‌తో ఇలా..!
సాక్షి, బెంగళూరు: ఓ లోయలో పడిపోయిన ఏనుగును అటవీ శాఖ అధికారులు రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్రేన్ సాయంతో ఆ ఏనుగును కాపాడిన సంఘటన కర్ణాటకలోని వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆటవీ అధికారి ఏడుకొండలు తన ట్విటర్‌లో బుధవారం షేర్ చేశారు. దీనికి ‘ఆర్కానహల్లా లోయలో వద్ద ఆకస్మాత్తుగా ఏనుగు పడిపోయినట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడికి చేరుకుని దానిని రక్షించారు. ఇందుకు అటవీ ఫ్రంట్‌లైన్ సిబ్బంది, అగ్నిమాపక విభాగంలో పనిచేసే సిబ్బంది చాలా సహాయపడ్డారు’ అంటూ అధికారి ట్వీట్ చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి