దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. తొలుత సఫారీలను కుమ్మేసిన టీమిండియా.. అటు బౌలింగ్‌లో కూడా రాణించి అద్బుతమైన విజయాన్ని అందుకుంది. భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 28 పరుగుల తేడాతో టీమిండియా శుభారంభం చేసింది. భారత్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సఫారీలు 29 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయారు. ఓపెనర్ స్మట్స్(14) మొదటి వికెట్‌గా అవుటయ్యాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ జేపీ డుమినీ(3), డేవిడ్ మిల్లర్(9) కూడా నిరాశపరచడంతో దక్షిణాఫ్రికా 48 పరుగులకే మూడు కీలక వికెట్లను నష్టపోయింది.
Feb 19 2018 10:20 AM | Updated on Mar 22 2024 10:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement