భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులే కాదు యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, రాజకీయ కారణాలు ఈ జట్ల మధ్య ధ్వైపాక్షిక సిరీస్‌లు లేకుండా చేశాయి. కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే తలపడుతున్నాయి. దీంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా ప్రత్యేకంగా నిలుస్తోంది. నేడు విశ్వవేదికపై దాయాదులు పోరుకు సిద్దం కాగా.. అభిమానులు, ఆయాదేశాల క్రికెటర్లు వారి జట్లకు మద్దతు పలుకుతున్నారు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్‌గేల్ మాత్రం ఇరు జట్లు తనకిష్టమే అన్నట్లుగా ప్రత్యేకమైన డ్రెస్‌తో సిద్ధమయ్యాడు. ఒక వైపు భారత పతాకం రంగులు, మరో వైపు పాక్ జెండా రంగులతో ఉన్న డ్రెస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. తన బర్త్‌డే(సెప్టెంబర్ 20)కు కూడా ఇదే డ్రెస్ ధరిస్తానంటూ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.
క్రిస్‌గేల్‌కు భారత్ పాక్ మ్యాచ్ ఫీవర్!
Jun 16 2019 3:22 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement