ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌కు ఊరట! | Ben Stokes Added To England Team For Third Test Against India | Sakshi
Sakshi News home page

Aug 14 2018 9:26 PM | Updated on Mar 21 2024 8:58 PM

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌కు ఊరట కలిగించే వార్త. టీమిండియాతో జరగబోయే మూడో టెస్టుకు అతను అందుబాటులో ఉంటున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో నైట్‌క్లబ్‌ వెలుపల తప్పతాగి ఒక వ్యక్తిని చితక బాదిన కేసును బ్రిస్టల్‌ క్రౌన్‌ కోర్టు విచారణ జరిపి తుది తీర్పునిచ్చింది. 12 మందితో కూడిన ధర్మాసనం స్టోక్స్‌ ఆత్మరక్షణ కోసమే దాడి చేశాడన్న వాదనను నమ్ముతూ నిర్దోషిగా తేల్చింది. దీంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఈ ఆల్‌రౌండర్‌కు జట్టులో చోటు కల్పించింది.

Advertisement
 
Advertisement
Advertisement