Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

Credit Cards Use Pay For Utility Bills Banks Extra 1 Percent Charges From May 1st
మారిన క్రెడిట్‌ కార్డ్‌ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..

క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.ఇటీవల ఎస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లు మే 1 నుంచి తమ క్రెడిట్‌ కార్డ్‌ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రసిటీ బిల్‌, వాటర్‌ బిల్‌, గ్యాస్‌ బిల్‌ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.దీంతో మీరు ఎస్‌బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి నెలవారీ కరెంట్‌ బిల్లు రూ.1500 చెల్లిస్తుంటే అదనంగా రూ.15 చెల్లించాల్సి ఉంటుంది.అయితే, వినియోగదారులు ఎస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై రూ.15,000, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై రూ. 20,000 ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. లిమిట్‌ దాటితే పైన పేర్కొన్న వన్‌ (ఒకశాతం) పర్సెంట్‌ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 18 శాతం జీఎస్టీని సైతం చెల్లించాల్సి ఉంటుంది.    

LIVE AP CM YS Jagan Public Meeting at Ponnur
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ పొన్నూరు (గుంటూరు జిల్లా)

Watch Live:  సీఎం జగన్ బహిరంగ సభ పొన్నూరు (గుంటూరు జిల్లా)

pothina mahesh fires on chandrababu and pawan kalyan
‘కాపులను పవన్ కల్యాణ్‌ ఎదగనీయటం లేదు’

సాక్షి, తాడేపల్లి: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పుకోలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌ అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో  మాట్లాడారు.‘‘చెప్పింది చేసి చూపించిన  గొప్ప వ్యక్తి సీఎం జగన్. హామీలు నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్న వ్యక్తి సీఎం జగన్‌. సీఎం జగన్‌.. అక్కా చెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చారు. ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేశారు. పేద ప్రజల నమ్మకం సీఎం జగన్‌. పేదల పట్ల సీఎం జగన్‌కు ప్రేమ ఉంది. కూటమి వల్ల ప్రజలకు ఉపయోగం​ లేదు.  పారిశ్రామికవేత్తలకు దోచిపెట్డడానికే బాబుకు అధికారం కావాలి...14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ మేలూ చేయని వ్యక్తి చంద్రబాబు. చేసిన పనులు చెప్పుకుని ఓటెయ్యమని అడుగుతున్న నేత జగన్.  ఓటమి భయంతో చంద్రబాబుకు ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నారు. అందుకే జగన్‌పై దాడి చేయమంటున్నారు. సీఎం జగన్‌.. ప్రభుత్వ స్కూళ్లను సమూల మార్పులు చేసి, పేదలకు ఇంగ్లీషు మీడియం చదివిస్తున్నారు.  చంద్రబాబు, పవన్ ఒకరిపై ఒకరు గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఏం చేస్తారో ఎందుకు చెప్పటం లేదు?. సీఎం జగన్ ఎంతో మేలు చేస్తున్నందునే ఆయన ఫోటో ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది....నిరుద్యోగం, ఉద్యోగాల కల్పనలపై చర్చకు మేము సిద్ధం. దీనిపై చర్చించేందుకు టీడీపీ కూటమికి ధైర్యం ఉందా?.  అంబేద్కర్ భావాజాలాన్ని వాస్తవరూపంలోకి తెచ్చిన నేత సీఎం జగన్.  అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారు. కాపులకు మేలు చేసినదే వైఎస్ జగన్. కాపులను పసుపు సైన్యంగా మార్చే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. చంద్రబాబు మీద అంతటి విశ్వాసం చూపడానికి పవన్ ఎంత ప్యాకేజీ తీసుకున్నారు?...చంద్రబాబు గురించి భజన చేయటం, బాకా ఊదటం తప్ప ఇంకేం చేశారు?. పవన్ కళ్యాణ్ కాపులను ఎదగనీయటం లేదు. కాపుల ఆత్మగౌరవం దెబ్బ తింటోంది. ముద్రగడ కుటుంబంపై చంద్రబాబు దాడి చేయిస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదు? హరిరామజోగయ్య రాసిన లేఖలకు ఎందుకు సమాధానం చెప్పలేదు?.  పవన్ కళ్యాణ్ జీవితంలో ఏదీ పర్మినెంట్‌గా ఉండదు. అన్నీ తాత్కాలిక వ్యవహారాలే...2019 తర్వాత జనసేన నుంచి కాపులు మాత్రమే ఎందుకు వైదొలిగారు?. వారందరినీ చంద్రబాబు ఆదేశాలతో బయటకు పంపారా?. లేక చంద్రబాబు బ్రోకర్ నాదెండ్ల మనోహర్ వలన బయటకు వెళ్లారో పవన్ సమాధానం చెప్పాలి. పవన్‌కు ఎప్పుడూ సేవలు చేసిన అంజిబాబు ఎందుకు బయటకు వెళ్లాడో చెప్పాలి?’’ అని పోతిన మహేష్‌  ధ్వజమెత్తారు. 

Pm Modi Taking Inspiration From Goebbels Says Jai Ram Ramesh
గోబెల్స్‌ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం

ప్రధాని నరేంద్ర మోదీ జర్మన్‌ నియంత హిట్లర్‌ మంత్రి జోసెఫ్ గోబెల్స్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు.లోక్‌సభ ఎన్నికలపై ఓ ఛానల్‌ ఇంటర్వ్యూ జైరాం రమేష్‌ మాట్లాడూత.. రాజకీయ శాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన మోదీ ప్రచార విలువల గురించి  జోసెఫ్ గోబెల్స్ గురించి చదివి, ఆయన నుండి ప్రేరణ పొంది ఉండి ఉంటారని ఎద్దేవా చేశారు.‘మీరు ఒక అబద్ధాన్ని పదే పదే  చెప్పి, దానిని పునరావృతం చేస్తూ ఉంటే, చివరికి ప్రజలు దానిని విశ్వసిస్తారు’ అని గోబెల్స్ పేర్కొన్నారని జైరాం గుర్తు చేశారు.ప్రైవేటు ఆస్తులను సర్వే చేసి, స్వాధీనం చేసుకుంటామని కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో బెదిరిస్తున్నదని మోదీ చేసిన వ్యాఖ్యలపై జైరాం మాట్లాడుతూ..  మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఆయన అసత్యాలు ప్రచారం చేసినంత కాలం సత్యం నశించి పోతుందని అన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ న్యాయ పత్రంలో వారసత్వపు పన్ను గురించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ప్రస్తావన లేదు. కానీ బీజేపీ మాత్రం వారసత్వపు పన్ను గురించి మరోలా ప్రచారం చేస్తోందని జైరాం రమేష్‌ ధ్వజమెత్తారు.

Delhi Police Notices To Cm Revanth Reddy Over Amit Shah Fake Video
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు

న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా డీప్‌ఫేక్‌ వీడియో కేసులో మే 1న విచారణకు రావాలని ఆదేశించింది. తన వెంట గ్యాడ్జెట్స్‌ తీసుకురావాలని తెలిపింది.కాగా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను కాంగ్రెస్‌ వైరల్‌ చేసింది. దీనిపై బీజేపీ, హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయగా.. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపైన స్పెషల్ సెల్  ఇంటెలిజెన్స్(IFSO) దర్యాప్తు చేస్తోంది.అయితే  తెలంగాణ పీసీసీ అధికారిక ట్విటర్‌ హ్యాండీలో అమిత్‌ షా వీడియో పోస్టు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఎంతోపాటు తెలంగాణ డీజీపీ, సీఎస్‌కు కూడా ఢిల్లీ నోటీసులు జారీ అయ్యాయి.కాగా దేవంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా కామెంట్స్‌ చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్‌ షా మాట్లాడినట్టుగా ఉంది. అయితే, అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్టు బీజేపీ స్పష్టం చేసింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఏమీ మాట్లాడలేదని బీజేపీ తెలిపింది

Karnataka MLA HD Revanna rలeacts on prajwal revanna controversy
అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్‌డీ రేవణ్ణ

బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్‌ అగ్రనేత దేవెగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణతోపాటు ఆయన మనవడు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణలపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు హోళెనరసిపుర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించినవిగా వైరల్‌ అవుతున్న అసభ్యకరమైన వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది.  ఈ నేపథ్యంలో ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ తం‍డ్రి ఎమ్మెల్యే హెడ్‌డీ రేవణ్ణ స్పందించారు. అసభ్యకరమైన వీడియోల వ్యవహారం.. పక్కా ప్రణాళిక ప్రకారం  చేసిన కుట్ర. ఇక ఆ వీడియో​లు నాలుగైదేళ్ల కిందటివని అ‍న్నారు.‘ఇలాంటిది ఒక కుట్ర జరుగుతుందని నాకు ముందే తెలుసు. నేను వాటికి భయపడి పారిపోయేవాడిని కాదు. మాకు వ్యతిరేకంగా విడుదల చేసిన వీడియోలు నాలుగైదేళ్ల కిందటివి. ప్రజ్వల్‌ విదేశానికి వెళ్లాడు. అతనికి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ గురించి  తెలియదు’ అని హెచ్‌డీ  రేవణ్ణ తెలిపారు. ఈ కేసులో చట్టపరంగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలో గత 40 ఏళ్లుగా సీఐడీ, సిట్‌ వంటి అనేక విచారణలు తాము  ధైర్యంగా  ఎదుర్కొన్నామని తెలిపారు.ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్వల్‌ భారత్‌ వదిలి జర్మనీ వెళ్లారు. దీంతో ఈ కేసుపై సిట్‌ బృందం విచారణ వేగవంతం చేసింది.

FM Sitharaman Says India GDP Must Expand To Cater To The Demands Of The People Further
అభివృద్ధి చెందే రంగాలు ఇవే.. నిర్మలా సీతారామన్

ఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. వికసిత భారత్ సాధ్యమవుతుందని, ఇండియా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని 'నరేంద్ర మోదీ' గతంలో చాలా సార్లు చెబుతూనే వచ్చారు. ఈ విషయం మీద కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు.ఎవరు ప్రధానమంత్రి అయినా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని చిదంబరం అన్నారు. ఈ మాటలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా విమర్శించారు. 2004 - 2014 మధ్య జీడీపీ కేవలం రెండు ర్యాంకులు మాత్రమే పెరిగిందని సోమవారం ఉదయం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన విక్షిత్ భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్ సభలో వెల్లడించారు.2004 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వం పదేళ్లలో కేవలం రెండు ర్యాంకులు జీడీపీ పెంచింది. ఆ తరువాత పదేళ్ల మోదీ పాలనలో జీడీపీ ఐదు ర్యాంకులకు ఎగబాకింది. రాబోయే రోజుల్లో మళ్ళీ మోదీ ప్రభుత్వం వస్తే.. తప్పకుండా జేడీపీ మరింత పెరుగుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు.ఆర్ధిక వ్యవస్థ 2014కు ముందు బాగా తగ్గింది. చెడు విధానాలు, భారీ అవినీతి కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినింది. ప్రస్తుతం భారతదేశ జీడీపీ అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తరువాత ఐదో స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో ఇది మూడో స్థానానికి చేరుతుంది. అది మోదీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని సీతారామన్ అన్నారు.భారతదేశంలో ఇన్నోవేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఎలా ఉందనే విషయాలను నిర్మల సీతారామన్ వివరించారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో  పునరుత్పాదక వస్తువులు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆగ్రో-ప్రాసెసింగ్ రంగాలు మరింత అభివృద్ధి మార్గంలో నడుస్తాయని స్పష్టం చేశారు.

NEET aspirant hangs self in Rajasthan's Kota 9th suicide this year
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో తొమ్మిదో ఘటన

దేశంలోనే ‘కోచింగ్‌ హబ్‌’గా ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువు ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నీట్‌పరీక్షకు సిద్ధమవుతున్న మరో విద్యార్థి తాజాగా తనువు చాలించాడు.హర్యానా రోహ్‌తక్‌కు చెందిన సుమిత్‌ అనే 20 ఏళ్ల విద్యార్థి నీట్‌ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. ఏడాదిగా కోటాలోని కున్హాడి ల్యాండ్‌మార్క్‌ సిటీలో ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతను తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఆదివారం  సుమిత్‌కు అతడి తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. అనుమానం వచ్చి వారు హాస్టల్‌ వార్డెన్‌కు ఫోన్‌ చేశారు. సిబ్బంది సుమిత్‌ గది వద్దకు వెళ్లి చూడగా.. డోర్‌ లాక్‌ చేసుకొని రూమ్‌లో ఉరేసుకొని కనిపించాడు. దీంతో హాస్టల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.కాగాా కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు కలకలం రేపుతున్నాయి.  తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్ధులు ప్రాణాలు విడిచారు.

UK Woman Diagnosed With Breast Cancer After She Dreams About It
కలే నిజమైంది.. ప్రాణాలు కాపాడింది!

మనలో చాలా మందికి పీడకలలు వస్తుంటాయి. ఉలిక్కిపడి లేచి హమ్మయ్య నిజం కాదు గదా అని ఊపిరి పీల్చుకుంటాం. అయితే తమ కలలు చాలావరకు నిజం అవుతూ ఉంటాయని కొంతమంది చెబుతారు. యూకేలోని మహిళకు ఇలాగే జరిగిందట.  తన కలే తన జీవితాన్ని కాపాడింది అంటోంది.. వివరాలు తెలియాలంటే ఈ కథనం  చదవాల్సిందే.మెట్రో నివేదిక ప్రకారం యూకేకు చెందిన వ్యాపారవేత్త 46 ఏళ్ల షార్లెట్ వ్రోకి  ఒక విచిత్రమైన కల(2021లో ) వచ్చింది. తనకు రొమ్ములో ఒక గడ్డ ఉన్నట్టు, డాక్టరు మాట్లాడుతున్నట్టు కల వచ్చింది. అంతేకాదు ఆ వైద్యుడు బ్రెస్ట్‌ కేన్సర్‌ అని చెప్పినట్టుగా కూడా చాలా స్పష్టంగా వినిపించింది. దీంతో చటుక్కున మెలకువ వచ్చింది. అప్పటికి సమయం తెల్లవారుజామున 4 గంటలు అయింది.లేచి  భయంతోనే రొమ్ములను చెక్‌ చేసుకుంది. నిజంగానే కలలో కనిపించిన ప్రదేశంలోనే చేతికి ఒక ముద్దలాగా తగిలింది. ఇది కలా? నిజమా అనుకుంటూనే  వెంటనే వైద్యులను సంప్రదించింది.  స్కానింగ్‌లు, పరీక్షల తరువాత ఆమెకు ట్రిపుల్‌ నెగెటివ్‌ కేన్సర్‌  ఉన్నట్టు నిర్ధారణ అయింది.  భర్త, పిల్లల సహకారంతో  కేన్సర్‌ చిక్సితను మొదలు పెట్టింది. కీమోథెరపీ చేయించుకుంది. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు మాస్టెక్టమీ, రేడియోథెరపీ ,మళ్లీ కీమోథెరపీలు జరిగాయి. చివరికి 2023  మార్చి నాటికి ఆమెకు కేన్సర్‌  నయమైంది.''నా కలలు..సినిమా చూస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఉంటాయి. నిజంగా ఆకలవల్లే భయంకరమైన కేన్సర్‌ను తొందరగార్తించి  జయించగలిగాను లేదంటే పరిస్థితి ఏంటో ఊహించడానికి కూడా భయంగా ఉంది. కొంతమంది ఇది యాదృచ్ఛికం అన్నారు. కానీ విశ్వం లేదా మరెవరో ముందస్తుగా నన్ను ఇలా హెచ్చరించి ఉంటారనే కచ్చితంగా నమ్ముతున్నాను. ఎప్పటికీ కృతజ్ఞురాలిని’’కాగాభవిష్యత్తు గురించి సమాచారం అందించే, లేదా హెచ్చరించే కలలను ''ప్రికోగ్నిటివ్ డ్రీమ్స్'' అంటారట. 900 మందిపై జరిపిన ఒక అమెరికన్ అధ్యయనంలో 33 శాతం మంది పాల్గొనేవారు ఒక కలను గుర్తుకు  తెచ్చుకోవడం, ఆ కల నిజం కావడం సంభవించిందట. 

12 Hospitalised After Eating Chicken Shawarma In Mumbai
చికెన్‌ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత

ముంబై: చికెన్‌ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌ జరిగి రెండు  ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్‌ ప్రాంతంలోని సంతోష్‌ నగర్‌లో శాటిలైట్‌ టవర్‌ వద్ద చికెన్‌ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు.  వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.  వీరిలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగానే వీరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.

తప్పక చదవండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement