Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

అనంతపురం జిల్లా కురువల్లిలో గ్రామ సచివాలయాన్ని ధ్వంసం చేస్తున్న టీడీపీ కార్యకర్తలు
పరాకాష్టకు 'విధ్వంసకాండ'

టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి గొడవలు కొనసాగిస్తున్నారు. దాడులు చేయడం తమ జన్మ హక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికారం దక్కింది దౌర్జన్యం చేయడానికే అని చాటి చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల తీరు విస్తుగొలుపుతోంది. పట్టపగలు కర్రలు, రాళ్లు, రాడ్లతో వీరంగం వేస్తున్నారు. ఊరూరా విగ్రహాలను, శిలా ఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీలో ఎవరూ ఉండకూడదన్నట్లు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ పార్టీకి ఓట్లేసిన వారిని దుర్భాషలాడుతున్నారు. ఓట్లు వేయించిన వారు ఊరు వదిలి వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. ఇది అన్యాయం కదా.. అని ప్రశి్నస్తే దుస్తులు విప్పి కొడుతున్నారు. ఏ తప్పూ చేయకపోయినా, వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పిస్తున్నారు. యూనివర్సిటీ వీసీలపై దౌర్జన్యం చేస్తున్నారు. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇదివరకు ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతోంది? టీడీపీ నేతలు, కార్యకర్తలు నేరుగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విధ్వంసం సృష్టిస్తుంటే.. ప్రభుత్వ ఆస్తులను పాడు చేస్తుంటే.. స్పందించాల్సిన పోలీసులు ఎందుకు చేష్టలుడిగి చూస్తున్నారు? నిజంగా ఈ పరిణామం ఖాకీ డ్రస్సుకే అవమానం. దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ లేని రీతిలో గత ఐదేళ్లలో గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల భవనాలు వెలిశాయి. ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌లు, సచివాలయాలు, కొత్త రూపు రంగరించుకున్న స్కూళ్లు.. ఇలా ఎన్నెన్నో ప్రభుత్వ బిల్డింగ్‌లు నిర్మాణమయ్యాయి. ఒక్కో గ్రామానికి కోట్లాది రూపాయల విలువైన ఆస్తి సమకూరింది. ఇదంతా ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. భద్రంగా కాపాడుకోవాలి. అలాంటిది పని గట్టుకుని ఊరూరా టీడీపీ సేన గునపాలు చేత పట్టుకుని ధ్వంసం చేస్తుండటాన్ని ఏమనాలి? రౌడీయిజం, దౌర్జన్యం, ఉన్మాదం.. ఇలా ఈ పదాలన్నీ తక్కువే. ఎవర్ని చూసుకుని ఇలా పేట్రేగిపోతున్నారు? చంద్రబాబు, లోకేశ్‌లను చూసుకునే కదా! బాపట్ల జిల్లాలో పిండ ప్రదానం చేస్తుంటే అడ్డుకోవడం.. మంగళగిరిలో వైఎస్సార్‌సీపీ అభిమాని ఇంటిని జేసీబీతో కూల్చేయడం.. ఏకంగా నెల్లూరు మేయర్‌ దంపతులనే బెదిరించడం.. ఇదే జిల్లా దత్తులూరు మండలంలో జగనన్న లే అవుట్‌లోని ఇళ్లను ధ్వంసం చేయడం.. కొండాపురం మండలం గానుగపెంటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటి ప్రహరీ, మెట్లు కూల్చేయడం.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేయడం.. ఇకపై పోస్టులు ఆపేస్తామని వారితో ప్రకటనలు ఇప్పించడం.. తప్పుడు కేసులు పెట్టడం.. ఇలా ఒక్కో ఊళ్లో ఒక్కో అరాచకం కళ్లెదుటే కనిపిస్తోంది ఒక్క పోలీసులకు తప్ప అందరికీ. రేషన్‌ పంపిణీ వాహనంపై దాడివైఎస్‌ జగన్‌ ఫొటో చింపేసి.. టైర్లు కోసేసిన వైనం.. శ్రీకాకుళం జిల్లాలో ఘటనకాశీబుగ్గ: ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పటి నుంచి అనేకరకాలుగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులకు తెగబడు­తు­న్నారు. ప్రభుత్వ ఆస్తులపైనా దాడులు చేస్తూ ప్రజలకు అందుతున్న సేవలను నిలిపివేయాలని కుట్రలకు పాల్ప­డుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గురుదాసుపురం సచివాలయం పరిధిలో ఉన్న సున్నాదేవి గ్రామంలో రేషన్‌ వాహనాన్ని ధ్వంసం చేశారు. గ్రామంలో ఆదివారం రాత్రి రేషన్‌ పంపిణీ చేసి చీకటి పడ్డాక వాహనాన్ని నిలిపి ఉంచారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు వాహనం వద్దకు వచ్చి దానిపైన ఉన్న వైఎస్‌ జగన్‌ చిత్రపటాన్ని చించేశారు. వాహనం ఎడమ టైరును కోసేశారు. అక్కడితో ఆగకుండా వాహనానికి చుట్టూరా గీతలు గీసి రాళ్లతో కొట్టారు. వాహనం ఆపరేటర్‌ కిరణ్‌కుమార్‌ యాదవ్‌ వాహనం వద్దకు వెళ్లి చూసేసరికి టైర్లు కోసి బండి పాడైపోయి కనిపించింది. దీంతో అక్కడ రేషన్‌ పంపిణీ ఆగిపోయింది. ఉద్దానం ప్రాంతంలో ఉన్న మరో మూడు గ్రామాలకు సోమవారం బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు.

Modi 3.0: Nda Govt To Hold Its First Cabinet Meeting Today
మోదీ 3.0 : కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

సాక్షి, ఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ప్రధాన మంత్రి కేంద్రమంత్రులకు శాఖలను కేటాయించారు. ఆవాస్‌ యోజన పథకం కింద గ్రామీణ, పట్టణాల్లో 3కోట్ల గృహాలు నిర్మించేలా కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇక కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయిఅమిత్ షా : కేంద్ర హోం శాఖనిర్మల సీతారామన్ : ఆర్థిక శాఖజయశంకర్ - విదేశాంగ శాఖరాజ్ నాథ్ సింగ్ :రక్షణ శాఖమనోహర్ లాల్‌ కట్టర్‌ : పట్టణ అభివృద్ధి శాఖశివరాజ్ సింగ్ చౌహన్ : వ్యవసాయ శాఖ మంత్రి , పంచాయతీరాజ్ శాఖసీఆర్‌ పాటిల్ : జలశక్తిపీయూష్ గోయల్ : వాణిజ్య శాఖ మంత్రిఅశ్విని వైష్ణవ్ : సమాచార శాఖ మంత్రిధర్మేంద్ర ప్రధాన్ : మానవ వనరులు అభివృద్ది శాఖగజేంద్ర సింగ్ శేకావత్ : టూరిజం, సాంస్కృతిక శాఖ జేపీ నడ్డా : వైద్య ఆరోగ్య శాఖ మంత్రిజితిన్ రాం మాంజీ : సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమల శాఖ మంత్రిఅన్నపూర్ణ దేవి : మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిభూపేంద్ర యాదవ్ : అటవీ, పర్యావరణ శాఖకిరణ్ రిజిజు : పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిచిరాగ్ పాశ్వాన్: క్రీడా శాఖ మంత్రికుమారస్వామి : భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ : షిప్పింగ్ శాఖ మంత్రిజ్యోతి ఆదిత్య సింధియా: టెలికాం, ఈశాన్య రాష్ట్రాల శాఖప్రహ్లాద జోషి : రెన్యూవబుల్ ఎనర్జీరవణీత్ సింగ్ బిట్టు : మైనార్టీ శాఖ సహాయ మంత్రిహర్ష మల్హోత్ర - రోడ్లు జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రిసురేష్‌ గోపి : టూరిజం సహాయ శాఖ మంత్రితెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవేకిషన్ రెడ్డి : కేంద్ర గనుల శాఖ మంత్రిబండి సంజయ్‌ : హోంశాఖ సహాయ మంత్రిరామ్మోహన్ నాయుడు : కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రిశ్రీనివాస్‌ వర్మ : ఉక్కు, భారీ పరిశ్రమలు శాఖ సహాయ మంత్రిపెమ్మసాని చంద్రశేఖర్‌ : గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్‌ సహాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రులు వీరే.. ఇక్కడ క్లిక్‌ చేయండిమరికొద్ది సేపట్లో కేంద్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. అయితే ఈ మంత్రి వర్గం సమావేశం లోపే నేతలకు శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులకు ఎవరికి ఏయే శాఖ కేటాయిస్తారని అంశంపై ఉత్కంఠ కొనసాగుతుండగా..సీనియర్ మంత్రులను అదే శాఖల్లో కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదివారం కొలువుదీరిన మోదీ 3.0 కేబినెట్‌లో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు చేరారు. వారికి కీలక శాఖలు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. హోం,రక్షణ శాఖ, ఆర్ధిక శాఖ వంటి కీలక పదవులు బీజేపీ నేతలకేననే ప్రచారమూ కొనసాగుతుంది.ప్రాధన్యాత కలిగిన శాఖపై కిషన్‌ రెడ్డి పట్టుమరోవైపు తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతున్నాయనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఏపీ, తెలంగాణలకు రెండు కేబినెట్‌, మూడు సహాయమంత్రి పదవులు దక్కనున్నాయి. అయితే తెలంగాణ నుంచి గతంలో కిషన్ రెడ్డికి ప్రధాని మోదీ టూరిజం శాఖ అప్పగించాగా.. ఈ సారి మాత్రం ఈసారి ప్రాధాన్యత కలిగిన శాఖను కిషన్‌ రెడ్డి ఆశిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలపైనా ఇక క్యాబినెట్ సమావేశంలో పార్లమెంటు సమావేశాల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈనెల 15 నుంచి 22 వరకు పార్లమెంట్ సమావేశాలను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం కానుందని, 15 నుంచి మూడు రోజులపాటు ఎంపీల ప్రమాణస్వీకారం, ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉండనుంది. అనంతరం ఈనెల 22న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.

Sakshi Editorial On BJP Narendra Modi Coalition Govt
సరికొత్త సంకీర్ణ విన్యాసం

ఆహూతులైన వివిధ దేశాల ప్రభుత్వాధినేతలు, అనేక రంగాల ప్రముఖులు, వేలాది జనం సాక్షిగా, రాష్ట్రపతి భవన్‌ వేదికగా ఆదివారం రాత్రి నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. భారత ప్రధాని స్వర్గీయ నెహ్రూ తర్వాత మళ్ళీ వరుసగా మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టిన మరో వ్యక్తిగా మోదీ చరిత్ర సృష్టించారు. ప్రధాన మంత్రి కిసాన్‌ నిధి నుంచి 17వ విడతగా 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ. 20 వేల కోట్లు పంపిణీ చేసే ఫైలుపై తొలి సంతకంతో సోమవారం ఉదయమే మోదీ పనిలోకి దిగిపోయారు. మొదటి రెండు పర్యాయాలు బీజేపీ సొంత బలంతో ‘మోదీ సర్కార్‌’గానే పాలన చేసిన కమలనాథులు ఈ మూడోసారి మాత్రం చాలినంత సంఖ్యాబలం లేక, మిత్రపక్షాల అండతో అచ్చమైన ‘ఎన్డీఏ సర్కార్‌’గా పని చేయాల్సి రావడం కొత్త పాలనలోని పెద్ద మార్పు. గతంలో గుజరాత్‌ సీఎంగా కానీ, ఆ తరువాత గడచిన పదేళ్ళుగా ప్రధానిగా కానీ తన మాటే శాసనంగా చలామణీ అయిన మోదీ ఇప్పుడు వివిధ ప్రాంతాలు, పార్టీలు, ఆశలు, ఆకాంక్షలకు చెవి ఒగ్గి, ఏకాభిప్రాయసాధనలో ఏ మేరకు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జనరల్‌ (24), ఓబీసీ (27), ఎస్సీ (10), ఎస్టీ (5), మైనారిటీలు (5)... ఇలా వివిధ వర్ణ శోభితమైన హరివిల్లుగా మొత్తం 71 మంది సహచరులతో మోదీ సారథ్యంలో కొత్త మంత్రి మండలి ఏర్పాటైంది. మొత్తం 81 మంది మంత్రి పదవులకు అవకాశం ఉండగా ఏకంగా 71 మందిని తొలి విడతలోనే తీసుకున్న మోదీ 24 రాష్ట్రాలకు కేంద్రంలో ప్రాతినిధ్యం కల్పించినట్టయింది. అయితే, ప్రమాణ స్వీకారం జరిగిన అనేక గంటల తర్వాత సోమవారం రాత్రికి గాని మంత్రిత్వ శాఖల కేటాయింపు ప్రకటన వెలువడలేదు. ఏకపక్ష నిర్ణయాలు అలవాటైన ప్రభుత్వ పెద్దలు సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని పక్షాలకూ సంతృప్తి కలిగేలా వ్యవహరించడంలోని ఇబ్బందిని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నట్టుంది. ఆ మాటకొస్తే ప్రమాణ స్వీకారానికి ముందు, ఆ తరువాత కూడా సంకీర్ణ పక్షాలలో కొన్ని బాహాటంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఒక మంత్రి పదవి... అదీ సహాయ మంత్రి పదవే ఇవ్వడం, అందులోనూ గతంలో క్యాబినెట్‌ హోదాలో పనిచేసిన ప్రఫుల్‌ పటేల్‌కు ఆ స్థాయి తక్కువ పదవి ఇవ్వడం పట్ల అజిత్‌ పవార్‌ సారథ్యంలోని జాతీయవాద కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) ప్రమాణ స్వీకారం కన్నా ముందు ఆదివారమే అభ్యంతరం చెప్పింది. మంత్రి పదవిని తిరస్కరించింది. గెలిచిన అనురాగ్‌ ఠాకూర్‌ నుంచి, ఓడిపోయిన స్మృతీ ఇరానీ దాకా పలు పాత ముఖాలకు కొత్త సర్కారులో మోదీ మొండిచేయి చూపారు. అదే సమయంలో 33 మందిని మొదటిసారి మంత్రుల్ని చేశారు. ఏపీ నుంచి ముగ్గురికి, తెలంగాణ నుంచి ఇద్దరికీ మంత్రులుగా బెర్తులిచ్చారు. ఆ లెక్కలెలా ఉన్నా, సోమవారం సాయంత్రం తొలిసారిగా కేంద్ర క్యాబినెట్‌ భేటీ జరిగే లోగా... సంకీర్ణ సర్కారు నుంచి మరిన్ని గొంతులు పైకి లేచాయి. ఏడుగురు ఎంపీలున్న తమ కన్నా తక్కువ సంఖ్యాబలం గల పార్టీలకు క్యాబినెట్‌ హోదా మంత్రి పదవిచ్చి, తమకు మాత్రం స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రి పదవితోనే సరిపుచ్చారంటూ ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన అసమ్మతి వ్యక్తం చేసింది. సొంత గూటిలోనూ బీజేపీకి సణుగుళ్ళు తప్పట్లేదు. కేరళలో తొలిసారిగా ఖాతా తెరిచిన కమలం పార్టీ త్రిస్సూర్‌ నుంచి గెలిచిన సినీ నటుడు సురేశ్‌ గోపికి మంత్రిమండలిలో స్థానం కల్పించింది. అయితే, సహాయ మంత్రి హోదా ఇచ్చినందుకు కినిసి ఆయన పక్కకు తప్పుకోవడానికి సిద్ధమైనట్టు వార్తలు రావడం, రచ్చ రేగేసరికి ఆఖరుకు ట్విట్టర్‌లో అలాంటిదేమీ లేదని ఖండించడం చకచకా జరిగాయి. వీటిని బట్టి సంకీర్ణ సర్కార్‌ నడపడంలోని సవాళ్ళు మోదీకి ఆదిలోనే అర్థమై ఉండాలి. మరోపక్క మరికొద్ది నెలల్లోనే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న బీజేపీ అక్కడ మళ్ళీ బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తుంది. అలాగే, దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ క్యాబినెట్‌లో ప్రాతినిధ్యమూ కమలనాథుల ‘మిషన్‌ సౌత్‌’ వ్యూహంలో భాగమే. ఇక, వివిధ రాష్ట్రాలకు గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఆరుగురు ఇప్పుడు మోదీ క్యాబినెట్‌లో ఉన్నారు. స్వయంగా మోదీని సైతం కలుపుకొంటే ఆ సంఖ్య ఏడుకు చేరుతుంది. అంటే పాలనలో అనుభవానికి కొరత లేదు. కాకపోతే, వ్యక్తిగతంగా అధికారంలో శిఖరాలను చూసినవారు కలసికట్టుగా ముందడుగు వేయడంలో అహంభావాలకు తావు లేకుండా చూసుకోగలరా అని విశ్లేషకుల అనుమానం. అయితే, రక్షణ, ఆర్థిక, హోమ్, విదేశీ వ్యవహారాల వంటి కీలక శాఖలను గత ప్రభుత్వంలోని మంత్రులకే కట్టబెట్టారు. ఇది కొత్త సీసాలో పాత సారాగా తోచినా, విధానాల కొనసాగింపు, సుస్థిరత్వానికి పెద్దపీట వేశారనుకోవాలి. వెరసి మోదీ ప్రజల కొత్త తీర్పుతో ఇప్పుడు కొత్త పిచ్‌ మీద ఆట మొదలుపెట్టారు. ఒకప్పటి వాజ్‌పేయి సంకీర్ణ సర్కార్‌లా సక్సెస్‌ కావాలంటే సహనం, సహానుభూతి పెంచుకోక తప్పదు. సంకీర్ణ సర్కారుకు తోడు బలమైన ప్రతిపక్షమూ ఉన్నందున పించ్‌ హిట్టింగ్‌కు అవకాశం లేదు. తిరుగులేని మెజారిటీ ఉన్న గతంలోలా ఇప్పుడు ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పెద్ద నోట్ల రద్దు, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ లాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేయలేరు. వివాదాస్పదమైన ఒకే దేశం – ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌరస్మృతి లాంటి సొంత అజెండాను కాషాయధ్వజులు కొన్నాళ్ళు పక్కనపెట్టక తప్పదు. ఆటలో దూకుడుకు అవకాశం లేనప్పుడు అవుటవకుండా ఆత్మరక్షణ ధోరణిలో ఆడక తప్పదు. పదేళ్ళుగా ప్రాంతీయ పార్టీలను సామ దాన భేద దండోపాయాలతో ఆడిస్తున్న పెద్దలకు కచ్చితంగా ఈ సంకీర్ణపు ఆట సరికొత్తదే! అలాగే పెరిగిన బలంతో ఊపిరి పీల్చుకున్న ప్రతిపక్షం సైతం 18వ లోక్‌సభలో కూటమిగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తేనే ప్రజలకు మేలు.

House Cat Not Leopard Seen At Rashtrapati Bhavan
‘‘రాష్ట్రపతి భవన్‌లోకి వచ్చింది పులి కాదు.. పిల్లి’’

న్యూఢిల్లీ: మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమంలోకి వచ్చిన జంతువు చిరుతపులి కాదని కేవలం పిల్లి అని తేలింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సోమవారం(జూన్‌10) క్లారిటీ ఇచ్చారు.మంత్రుల ప్రమాణస్వీకారం సందర్భంగా వెనుకాల కారిడార్‌లో నడుస్తూ లైవ్‌ కెమెరాలకు చిక్కింది ఇళ్లలో తిరిగే పిల్లి అని పోలీసులు స్పష్టం చేశారు. ప్రమాణస్వీకారం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లోకి చిరుత పులి వచ్చిందని సోషల్‌ మీడియాలో వీడియో చక్కర్లు కొట్టింది.ఇది భద్రతా వైఫల్యమేనని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే ఇవేవీ నిజం కావని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాంటి రూమర్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

Punjab Cm Bagavanthman Responded On Slap On Kangana
‘కంగన’కు చెంపదెబ్బపై పంజాబ్‌ సీఎం కీలక కామెంట్స్‌

చండీగఢ్‌: బాలీవుడ్‌ సీనియర్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ చెంప దెబ్బ కొట్టిన ఘటనపై పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ స్పందించారు. పంజాబ్‌ రైతుల పోరాటంపై కంగన చేసిన వ్యాఖ్యల వల్లే ఆమెను కానిస్టేబుల్‌ కొట్టిందని చెప్పారు.#WATCH | On Kangana Ranaut-CISF constable incident, Punjab CM Bhagwant Mann says, "That was anger. She (Kangana Ranaut) had said things earlier and there was anger for it in the heart of the girl (CISF constable). This should not have happened. But in reply to it, despite being a… pic.twitter.com/cFhWBw5fxb— ANI (@ANI) June 10, 2024‘అది కోపం. కంగన గతంలో మాట్లాడిన మాటలే కానిస్టేబుల్‌ను ఆగ్రహానికి గురి చేశాయి. ఇది జరగకుండా ఉండాల్సింది. ఆమె అలా మాట్లాడటం తప్పు’భగవంత్‌మాన్‌ మీడియాతో చెప్పారు. జూన్‌6వ తేదీన కంగన చండీగఢ్‌ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెక్‌కు వెళ్లినపుడు అక్కడున్న కానిస్టేబుల్‌ కుల్విందర్‌‌ కౌర్‌ ఆమెను చెంపపై కొట్టింది. రైతుల పోరాటంలో తన తల్లి పాల్గొందని, ఆ పోరాటాన్ని కంగన కించపరిచినందుకే కొట్టానని తెలిపింది.

YSRCP Leaders Meet YS Jagan Mohan Reddy
వైఎస్‌ జగన్‌ను కలిసిన పార్టీ నేతలు

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పార్టీ నేతలు సమావేశమయ్యారు. సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌తో పలువురు పార్టీ నేతలు భేటీ అయ్యారు.వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌, పుష్ప శ్రీవాణితో పాటు వంగా గీత, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, ఎంపీ మోపీదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే డా. సుధ తదితరులు ఉన్నారు. ఎన్నికలు ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణతో పాటు పలు అంశాలపై చర్చించారు.

T20 World Cup 2024: South Africa eye Super Eight stage with four-run win over Bangladesh
T20 World Cup 2024: ‘సూపర్‌–8’కు దక్షిణాఫ్రికా

న్యూయార్క్‌: దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్‌ టి20ల్లో ఏనాడూ గెలవలేదు. కానీ ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ కు విజయం సాధించే అవకాశం వచి్చంది. బంగ్లాదేశ్‌ నెగ్గడానికి ఆఖరి 6 బంతుల్లో 11 పరుగులు చేయాలి. ఒక వైడ్‌ రావడం, మహ్ముదుల్లా (27 బంతుల్లో 20; 2 ఫోర్లు) క్రీజులో ఉండటంతో బంగ్లా కోటి ఆశలతో ఉంది. కేశవ్‌ మహరాజ్‌ తొలి 4 బంతుల్లో వికెట్‌ తీసి 5 పరులిచ్చాడు. ఇక 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సి ఉండగా మహ్ముదుల్లా భారీషాట్‌ బాదాడు. కానీ సిక్సర్‌గా వెళ్లే బంతిని దక్షిణాఫ్రికా కెపె్టన్‌ మార్క్‌రమ్‌ తనను తాను బ్యాలెన్స్‌ చేసుకొని బౌండరీ లైన్‌ వద్ద చక్కని క్యాచ్‌ అందుకోవడంతోనే బంగ్లా ఓటమి ఖాయమైంది. చివరి బంతికి సిక్స్‌ కొడితే స్కోరు సమమయ్యే స్థితిలో బంగ్లాదేశ్‌ ఒక్క పరుగే తీసింది. దాంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో గెలిచి వరుసగా మూడో విజయంతో ‘సూపర్‌–8’ దశకు అర్హత సాధించింది. టాస్‌ నెగ్గిన దక్షిణాఫ్రికా ముందుగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హెన్రిచ్‌ క్లాసెన్‌ (44 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), డేవిడ్‌ మిల్లర్‌ (38 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో తంజిమ్‌ హసన్‌ సకిబ్‌ 3, టస్కిన్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమై ఓడింది. తౌహిద్‌ హృదయ్‌ (34 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుగ్గా ఆడాడు. కేశవ్‌ మహరాజ్‌ 3, రబడ, నోర్జే చెరో 2 వికెట్లు తీశారు. సఫారీ విలవిల బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై పరుగులు క్లిష్టంగా, వికెట్లు సులభంగా వచ్చాయి. ముందుగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ హెండ్రిక్స్‌ (0) డకౌటయ్యాడు. డికాక్‌ (18; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడు మూడో ఓవర్‌ ముగియకముందే ముగిసింది. ఇద్దర్ని తంజిమ్‌ పెవిలియన్‌ చేర్చగా, మార్క్‌రమ్‌ (4)ను టస్కిన్‌ క్లీన్‌»ౌల్డ్‌ చేశాడు. స్టబ్స్‌ (0)ను కూడా తంజిమ్‌ ఖాతా తెరువనివ్వలేదు. దీంతో 4.2 ఓవర్లలోనే కీలకమైన 4 వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఈ దశలో క్లాసెన్, మిల్లర్‌ ఇన్నింగ్స్‌ను నడిపించి జట్టు స్కోరు ను 100 దాటించారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు అవుట్‌ కావడంతో డెత్‌ ఓవర్లలో ఆశించినన్ని పరుగులు రాలేదు. లక్ష్యం సులువుగానే ఉంది. ఇన్నింగ్స్‌ మొదలయ్యాక... 8 ఓవర్లు ముగియక ముందే ఓపెనర్‌ తంజిద్‌ (9), లిటన్‌ దాస్‌ (9), షకీబుల్‌ హసన్‌ (3) వికెట్లను కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 37/3. పదో ఓవర్లో 50 పరుగులకు చేరగానే నజు్మల్‌ (14) కూడా వికెట్‌ పారేసుకున్నాడు. తౌహిద్‌ హృదయ్‌ చేసిన ఆ కాస్త పోరాటంతో జట్టు వంద పరుగులకు సమీపించింది. కానీ 94 పరుగుల స్కోరు వద్ద తౌహిద్‌ వికెట్‌ పడటంతో బంగ్లా విజయానికి దూరమైంది. టి20 ప్రపంచకప్‌లో నేడుపాకిస్తాన్‌ X కెనడావేదిక: న్యూయార్క్‌; రాత్రి గం. 8 నుంచిస్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Rebal Star Prabhsa Kalki 2898 AD Trailer Out Now
వెయిటింగ్‌ ఇజ్ ఓవర్.. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ వచ్చేసింది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌, బుజ్జి టీజర్‌ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇటీవలే భారీస్థాయిలో ఈవెంట్‌ నిర్వహించిన మేకర్స్‌.. బుజ్జిని ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. అయితే ఈ మూవీ ట్రైలర్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడా అని రెబల్ ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తోన్న కల్కి 2898ఏడీ ట్రైలర్‌ రానే వచ్చింది. ఇవాళ కల్కి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌ చూస్తే యంగ్‌ రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. మీరు కూడా కల్కి ట్రైలర్‌ను చూసేయండి. కాగా.. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. 3 నిమిషాల నిడివితో ఉన్న కల్కి ట్రైలర్‌ రెబల్‌ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ట్రైలర్‌లో బ్యాగ్‌గ్రౌండ్‌ మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్‌ ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100కు పైగా థియేటర్స్‌లో కల్కి ట్రైలర్ ప్రదర్శించారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, తిరువనంతపురం, నార్త్ ఇండియా మెయిన్ సిటీస్‌లోని థియేటర్స్‌లో కల్కి ట్రైలర్‌ను ప్రదర్శించారు.

Famous Businessmans First Jobs From Ratan Tata To Ardeshir Godrej
మీకు తెలుసా? ప్రముఖ వ్యాపారవేత్తల ఫస్ట్ జాబ్స్ ఇవే..

భారతదేశంలో అత్యంత సంపన్నులైన గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఇంద్రా నూయీ, అర్దేషిర్ గోద్రెజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే వీరందరూ ప్రారంభంలో ఎలాంటి ఉద్యోగాలు చేశారనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను వివరంగా తెలుసుకుందాం.రతన్ టాటాప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా.. భారతదేశంలో విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. దేశం కోసం ఎంతో కృషి చేసిన ఈయన 1961లో టాటా స్టీల్ కంపెనీలో చేరారు. ఇదే ఆయన మొదటి ఉద్యోగం. ఆ తరువాత క్రమంగా ఎదిగి టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.గౌతమ్ అదానీభారతదేశంలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ 1978లో మహేంద్ర బ్రదర్స్ అనే వజ్రాల దుకాణంలో పనిచేసినట్లు సమాచారం. ఇదే అదానీ మొదటి ఉద్యోగం. అక్కడే మూడు సంవత్సరాలు పనిచేసి ముంబయిలోని సొంతంగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించి నేడు బిలినీయర్ల జాబితాలోకి చేరారు.ఇంద్రా నూయీ1955లో జన్మించిన ఇంద్రా నూయీ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలలో ఒకటైన పెప్సికోకు 12 ఏళ్లపాటు సీఈఓగా పనిచేశారు. ఈమె 18 సంవత్సరాల వయసులో ఓ బ్రిటీష్ టెక్స్​టైల్ కంపెనీలో పనిచేసినట్లు సమాచారం. ఆ తరువాత ముంబయిలోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేశారు.అర్దేషిర్ గోద్రెజ్గోద్రెజ్ గ్రూప్ సంస్థల అధినేత అర్దేషిర్ గోద్రెజ్ మొదట్లో ఓ కెమిస్ట్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తరువాత ఓ చిన్న షెడ్​లో తాళాలు తయారు చేసే వ్యాపారం ప్రారంభించి క్రమంగా ఎదిగారు. ప్రస్తుతం దిగ్గజ వ్యాపారసంస్థల సరసన గోద్రెజ్ గ్రూప్​ నిలిచింది.

Savitri Thakur Minister Of State In Modi Led Government
ఎవరీ సావిత్రి ఠాకూర్‌? ఏకంగా కేంద్ర మంత్రి వర్గంలో..!

దేశ ప్రధానిగా నరేంద్రమోదీ జూన్‌ 09న మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌ వేదికగా ఆదివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. మోదీ కొత్త ప్రభుత్వంలని కేంద్ర మంత్రి వర్గంలో చోటు పొందడం అంటే ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు లెక్క. చెప్పాలంటే దేశం అంతటని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి గొప్ప అవకాశాన్ని ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని గిరిజన నాయకురాలు సావిత్ర ఠాకూర్‌కి దక్కింది. ఇంతకీ ఎవరీమె..? ఆమెకు ఈ అవకాశం ఎలా దక్కిందంటే..నరేంద్ర మోదీ జూన్‌ 09న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన తోపాటు 72 మంత్రలు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ప్రభుత్వంలోని మంత్రి వర్గంలో మధ్యప్రదేశ్‌లోని ధార్‌కు చెందిన 46 ఏళ్ల సావిత్రి ఠాకూర్‌ అనే గిరిజన నాయకురాలు చోటు దక్కించుకుంది. రాష్ట్రపతి భవన్‌ వేదిక జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఠాకూర్‌ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె మధ్యప్రదేశ్‌లో దీదీ ఠాకూర్‌గా పేరుగాంచింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె గులాబీ రంగు చీర తోపాటు సంప్రదాయ గంచాను ధరించి వచ్చారు.ఆమె ఎవరంటే..దీదీ ఠాకూర్‌గా పేరుగాంచిన సావిత్రి ఠాకూర్‌కి రాజకీయ నేపథ్యం లేదు. ఆమె తండ్రి రిటైర్డ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కాగా, భర్త రైతు. పురుషాధిక ప్రపంచంలో అంచెలంచెలుగా పైకొచ్చింది. ఆమె సామాజికి కార్యకర్తలా మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌, ధార్‌ వంటి ప్రాంతాల్లోని గిరిజన మహిళలు, పేద మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. వారిని స్వయం సమృద్ధిగా మార్చడానికి రుణలు సేకరించడంలో తన వంతుగా సహాయసహకారాలు అందించింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి.. 2003లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరడం జరిగింది. అలా ఆమె జిల్లా పంచాయతీ మెంబర్‌గా ఎన్నికై.. అక్కడ నుంచి అంచెలంచెలుగా ప్రెసిడెంట్‌ స్థాయికి చేరుకున్నారు. ఆమె షెడ్యూల్డ్‌ తెగ(ఎస్టీ) రిజర్వడ్‌ సీటుపై ధార్‌ నుంచి పోటీ చేసి బీజేపీకి మహళా గిరిజన నాయకురాలయ్యింది. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే 2019లో బీజేపీ టిక్కెట్‌ నిరాకరించడంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ పార్టీ పదవులను నిర్వహించింది. తదనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 2.18 లక్ష మెజార్టీ ఓట్లతో కాంగ్రెస్‌ అభ్యర్థి రాధేశ్యామ్‌పై విజయం సాధించారు. గతంలో ఠాకూర్‌ బీజేపీలో జిల్లా ఉపాధ్యాక్షుడిగా ఉన్నారు. 2013లో ఆమె కృషి ఉపాజ్ మండి ధమ్నోద్ డైరెక్టర్‌గా, ఆదివాసీ మహిళా వికాస్ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా పలు ఉన్నత పదవులును అలంకరించారు. గిరిజన నాయకురాలిగా ఆమె ప్రజలకు చేసిన సేవలకు గానూ బీజేపీ ఇలా కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఇచ్చి మరీ గౌరవించింది. కాగా, కేంద్ర మంత్రి మండలిలోని కొత్త మంత్రులు..కేంద్ర మాజీ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ఎంపీలు అన్నపూర్ణా దేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకూర్, నిముబెన్ బంభానియా, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ తదితరులు. అయితే వారిలో సీతారామన్‌, దేవిలకు క్యాబినేట్‌లో చోటు దక్కగా, మిగిలిన వారు రాష్ట్ర మంతులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 18వ లోక్‌సభలో కొత్తమంత్రి మండలిలో కేబినేట్‌ పాత్రలో ఇద్దరు తోసహా ఏడుగురు మహిళలు చేరారు. అయితే గతంలో జూన్‌ 05న రద్దయిన మంత్రిమండలిలో మాత్రం దాదాపు 10 మంది దాక మహిళా మంత్రులు ఉండటం విశేషం. Savitri Thakur takes Oath of Office and Secrecy as Union Minister of State during the #SwearingInCeremony #OathCeremony #ShapathGrahan pic.twitter.com/E9NKSqQPET— PIB India (@PIB_India) June 9, 2024 (చదవండి: మోదీ ప్రమాణా స్వీకారోత్సవంలో పాల్గొననున్న మహిళా లోకో పైలట్‌లు వీరే..!)

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement