‘‘రాష్ట్రపతి భవన్‌లోకి వచ్చింది పులి కాదు.. పిల్లి’’ | House Cat Not Leopard Seen At Rashtrapati Bhavan | Sakshi
Sakshi News home page

మోదీ3.0 ప్రమాణస్వీకారం.. రాష్ట్రపతి భవన్‌లోకి వచ్చింది పిల్లి

Jun 10 2024 9:53 PM | Updated on Jun 11 2024 4:09 PM

House Cat Not Leopard Seen At Rashtrapati Bhavan

న్యూఢిల్లీ: మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమంలోకి వచ్చిన జంతువు చిరుతపులి కాదని కేవలం పిల్లి అని తేలింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సోమవారం(జూన్‌10) క్లారిటీ ఇచ్చారు.

మంత్రుల ప్రమాణస్వీకారం సందర్భంగా వెనుకాల కారిడార్‌లో నడుస్తూ లైవ్‌ కెమెరాలకు చిక్కింది ఇళ్లలో తిరిగే పిల్లి అని పోలీసులు స్పష్టం చేశారు. ప్రమాణస్వీకారం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లోకి చిరుత పులి వచ్చిందని సోషల్‌ మీడియాలో వీడియో చక్కర్లు కొట్టింది.

ఇది భద్రతా వైఫల్యమేనని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే ఇవేవీ నిజం కావని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాంటి రూమర్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement