మార్షల్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని మంత్రి కన్నబాబు డిమాండ్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది మాట్లాడితే కుదరని.. సభా సంప్రదాయాలు అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద‍్రబాబు ఎంత దారుణంగా ప్రవర్తించడం సరికాదని తప్పుబట్టారు. సాధారణ ఉద్యోగులపై అనుచిత భాష వాడారని, ఉద్యోగుల పట్ల ఎంత చులకన భావంతో ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని పేర్కొన్నారు. తన కేటాయించిన గేటులోంచి కాకుండా మరో గేటులోంచి ఎందుకు రావాల్సి వచ్చిందని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. మార్షల్ అడ్డుకుంటే ఉదయం 9.15 గంటలకు సభలోకి ఎలా రాగలిగారు అని నిలదీశారు.