అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 327వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. రాజన్న తనయుడు శుక్రవారం ఉదయం టెక్కని నియోజకవర్గం సంతబొమ్మళి మండలం దండుగోపాలపురం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కాశీపురం మీదుగా దామోదరపురం క్రాస్ వరకు ప్రజాసంకల్ప యాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.