‘నా పేరు రాహుల్ గాంధీ. రాహుల్ సావర్కర్ కాదు. నేను నిజమే మాట్లాడాను. చావనైనా చస్తాను కానీ క్షమాపణ మాత్రం చెప్పను’అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై పలు హిందూ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూవులు దైవంతో సమానంగా పూజించే సావార్కర్‌ను కించపరిచే విధంగా రాహుల్ వ్యాఖ్యానించారని మండిపడుతున్నారు. దీనిపై తాజాగా వీర్ సావార్కర్ మనవడు రంజిత్ సావార్కర్ స్పందించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తానని ఆయన తెలిపారు. అలాగే దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో కూడా చర్చిస్తానని ఆయన పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలను ఖండించాలని ఠాక్రేను కోరనున్నట్లు ఆయన ప్రకటించారు.