వృద్ధుడి కోసం కారు దిగిన కేసీఆర్‌.. | Watch, KCR Stops Convoy And Helps Old Man In Tolichowki | Sakshi
Sakshi News home page

వృద్ధుడి కోసం కారు దిగిన కేసీఆర్‌..

Feb 27 2020 9:18 PM | Updated on Mar 21 2024 8:24 PM

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. గురువారం టోలిచౌక్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై తిరిగివస్తున్నకేసీఆర్‌కు.. ఓ వికలాంగుడైన వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. దీంతో చలించిపోయిన పోయిన కేసీఆర్‌ కాన్వాయ్‌ను ఆపి.. ఆ వృద్ధుడి వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. దీంతో తనను సీఎంకు పరిచయం చేసుకున్న సలీమ్..  గతంలో డ్రైవర్‌గా పనిచేశానని.. తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని తన సమస్యను కేసీఆర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన కేసీఆర్‌ సలీమ్‌ సమస్యను వెంటనే పరిష్కారించాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేత మహంతిని ఆదేశించారు. 

సీఎం ఆదేశాలతో టోలిచౌక్‌లోని సలీమ్‌ ఇంటికి వెళ్లిన కలెక్టర్‌ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జియాగూడలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు మంజూరు చేశారు. అలాగే సలీమ్‌కు సదరం సర్టిఫికెట్‌ ఉండటంతో వికలాంగుల పెన్షన్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే సలీమ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి.. చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement