సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఫిషింగ్ హార్బర్ ఔటర్ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లి తిరిగొస్తున్న ఓ బోటు అగ్నిప్రమాదానికి గురైంది. అయితే, బోటులో మంటల్ని గ్రహించిన అందులోని ఐదుగురు మత్స్యకారులు వెంటనే తేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలు.. కొందరు మత్స్యకారులు శనివారం ఉదయం ఐదు గంటలకు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారు వేట ముగించుకుని తిరిగి వస్తుండగా బోటులో అగ్ని ప్రమాదం సంభవించింది. బోటులో మటలు చెలరేగగానే వారు పోర్టు ట్రస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మంటల్ని తమను తాము కాపాడుకునేందుకు నీటిలో దూకారు. అంతలోనే స్థానిక యువకులు అక్కడకు చేరుకుని వారిని రక్షించారు. పోర్టు సిబ్బంది ప్రమాదం బారినపడ్డ బోటు వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. దానిని ఒడ్డుకు చేర్చారు. దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని మత్స్యకారులు వాపోయారు. బోటు ఇంజన్ ద్వారా మంటలు వ్యాపించి ఉండొచ్చని తెలిపారు.
మంటల్లో చేపల బోటు, తప్పిన ప్రమాదం
Aug 8 2020 5:25 PM | Updated on Mar 22 2024 10:50 AM
Advertisement
Advertisement
Advertisement
