ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా దగ్ధమైన జవాబు పత్రాలకు సంబంధించిన సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని వర్సిటీ పాలక వ ర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. బీఎస్సీ సెకండ్ ఇయర్ జువాలజీ, మ్యాథమెటిక్స్ సహా మరో 2 సబ్జెక్టుల జవాబు పత్రాలు దగ్ధమైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు ప్రొ.శివరాజ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన బృందం బుధవారం షార్ట్‌సర్క్యూట్ జరిగిన గదిని పరిశీలించింది.
అగ్నికి దగ్ధమైన పేపర్ల, ఫైర్ ఇంజన్ వదిలిన నీటి ద్వారానే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు గుర్తించింది. కాలిపోయిన వాటిలో బీఎస్సీ సెకండియర్ సెమిస్టర్ జవాబు పత్రాలే ఉండటం అధికారులకు ఊరట కలిగించే అంశమే అయినా.. ఇప్పటికే ఒకసారి పరీక్ష రాసినవారు మరోసారి రాయాల్సి రావడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఆరా తీసి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
జవాబు పత్రాల దగ్ధంపై విద్యార్థుల్లో ఆందోళన
Jun 7 2018 10:03 AM | Updated on Mar 20 2024 3:38 PM
Advertisement
Advertisement
Advertisement
