ఇటీవల వివాదాలను రేపిన గాడ్ సెక్స్ ట్రూత్ (జీఎస్టీ) అనే వెబ్ సిరీస్ విషయంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శనివారం సీసీఎస్ పోలీసుల విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దాదాపు ముడుగంటలపాటు వర్మను పోలీసులు విచారించారు. 25 నుంచి 30 ప్రశ్నలు అడిగారు. ఆయన ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.