ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన బైరెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడారు. విభజన సమయంలో ప్రత్యేక హోదాపై ఆనాటి ప్రధాని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే మొదటగా ప్రత్యేక హోదా హామీని నెరవేరుస్తామని స్పష్టంచేశారు.