తన సోదరి ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించి, కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ బాధ్యతలు అప్పగించడాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు. కేంద్రం, యూపీలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రియాంక సమర్థురాలని ఆయన కితాబిచ్చారు. ‘ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా శక్తివంతులైన నాయకులు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి యువ నాయకత్వం అవసరమని భావించి వీరిద్దరికీ యూపీ బాధ్యతలు అప్పగించామ’ని రాహుల్ తెలిపారు