రసాయన శాస్త్రంలో విశేష సేవలందించిన ముగ్గురికి నోబెల్ బహుమతి వరించింది. 2019 ఏడాదికిగానూ గత రెండురోజుల్లో వైద్య, భౌతికశాస్త్రాల్లో నోబెల్ విజేతలను ప్రకటించిన పురస్కార కమిటీ.. తాజాగా రసాయన శాస్త్రంలో గ్రహీతల పేర్లను వెల్లడించింది. జాన్ బి.గూడెనఫ్, స్టాన్లీ విట్టింగమ్, అకిరా యోషినోకు ఈ అవార్డ్‌ను సంయుక్తంగా అందజేయనున్నట్లు ప్రకటించింది.