కవితకు చేదు అనుభవం | Nizamabad Voters Questioned Kavitha | Sakshi
Sakshi News home page

కవితకు చేదు అనుభవం

Apr 11 2019 1:17 PM | Updated on Mar 22 2024 11:16 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కవితకు చేదు అనుభవం ఎదురైంది. నవిపేట్ మండలం పోతంగల్‌లో ఓటు వేసేందుకు వచ్చిన ఆమెను స్థానిక మహిళలు నిలదీశారు. ఐదేళ్లలో తమకు ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందలేవని వాపోయారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు రాలేదని చెప్పారు. కవిత వారికి సద్దిచెప్పి ఓటు హక్కు వినియోగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement