అతి త్వరలోనే సైరాను చూస్తా | Megastar Chiranjeevi Meets AP CM YS Jagan | Sakshi
Sakshi News home page

అతి త్వరలోనే సైరాను చూస్తా

Oct 15 2019 7:50 AM | Updated on Mar 21 2024 8:31 PM

సినిమా పరిశ్రమ రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చెందాలని, ఎంతో మందికి ఉపాధిని కలి్పంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. సినీ పరిశ్రమ రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని ఆయన చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. సినీ పరిశ్రమకు ఏది కావాలన్నా తానెప్పుడూ ముందుంటానని వైఎస్‌ జగన్‌ చెప్పారన్నారు. ఏది కావాలన్నా అడగడానికి ఏ మాత్రం సంకోచించవద్దని అన్నారన్నారు. ఆయన సహాయం చేసే గుణానికి తనకు చాలా సంతోషమేసిందన్నారు. కుటుంబ సభ్యులతో గడిపిన అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. సైరాను త్వరలోనే తప్పకుండా చూస్తానని చెప్పారని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీపై చిరంజీవి ఏమన్నారంటే..

Advertisement
 
Advertisement
Advertisement