కమలాపురం వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు | kamalapuram TDP leaders join YSRCP | Sakshi
Sakshi News home page

కమలాపురం వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు

Aug 6 2018 10:43 AM | Updated on Mar 21 2024 6:45 PM

ముస్లింల అభివృద్ధి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ఆ పార్టీ మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. ముస్లిం యూత్‌ నాయకుడు కరీముల్లా ఆధ్వర్యంలో 40 కుటుంబాలు ఆదివారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారు ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మాజీ ఎంపీ, ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఏ ఒక్క ముస్లింకు మంత్రి పదవి లేదన్నారు. దీన్నిబట్టి చూస్తే టీడీపీకి ముస్లింల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement