చతుర్భుజ కూటమి ఏర్పాటు.. అదే సమయంలో ’ఇండో-పసిఫిక్‘ అనే పదాన్ని డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించడం అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్రంప్ కీలక వ్యాఖ్యల నేపథ్యంలో పలు దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఇప్పటికే భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాలు చైనాకు పోటీగా చతుర్భుజ కూటమిగా ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్‌తో బంధాలను మరింత ధృఢపరచుకునే దిశగా ఫ్రాన్స్ అడుగులు వేస్తోంది. అదే సమయంలో ఇండియన్ ఓషియన్ రీజియన్ (ఐఓఆర్)లో భాగంగా భారత్‌తో ఉన్నత స్థాయి చర్చలకు ఫ్రాన్స్ సిద్ధమవుతోంది. మనీలా జరిగిన ఇండియా-ఏసియన్ సదస్సులో చతుర్భుజ కూటమి చర్చల అనంతరం భారత్ బంధంపై ఫ్రాన్స్ మరింత ఆసక్తి చూపుతోంది. ఇదే విషయాన్ని భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగేల్మర్ వివరించారు.
చైనాను ఢీకొట్టే శక్తి.. భారత్ మాత్రమే
Nov 15 2017 7:53 PM | Updated on Mar 20 2024 1:57 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement